ఆయుషునిచ్చే సొర
2. సొరకాయ తింటే జలుబు చేస్తుందా?
* సొరకాయ లేదా ఆనపకాయని కలబాష్, బాటిల్ గోర్డ్, లాంగ్ మెలాన్
పేర్లతో పిలుస్తారు. అడవి కాయల్ని తినే కూరగాయలుగా పెంపుడు చేసుకున్న
తొలి కాయగూరల్లో సొరకాయ ఒకటి.
లేత సొరకాయ, లేత సొర ఆకులు కూడా ఇంచుమించు సమాన గుణాలు కలి
గినవే! తోటకూర లాంటి రుచిని కలిగి ఉంటాయి. తోటకూర మాదిరిగానే అన్ని
వంటకాలూ చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే, కాయలో కన్నా సొర ఆకుల్లోనే విట
మిన్లు, ఖనిజాలూ ఎక్కువగా ఉన్నాయి. కామెర్ల వ్యాధిలో సౌరాకులు ఔషధంలా
పనిచేస్తాయి. వేసవి కాలంలో సొరకాయని తరచూ తింటే వడ కొట్టకుండా
ఉంtundi.
100 గ్రాములకు 14 కేలరీలు మాత్రమే ఉన్న సొరని తినటమే ఒక
యోగం. లివరు వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, పేగుపూత,
అమీబియాసిన్, మలబద్ధత లాంటి జీర్ణకోశ వ్యాధుల్లో ఇవి మేలు
చేస్తాయి. చలవనిస్తాయి. సొరకాయలో అధిక శాతం నీరు ఉంది
కాబట్టి జలుబు చేస్తుందనేది ఒక అపోహ! ఇది తియ్య కూర కాబట్టి
దీన్ని వండటానికి ఎక్కువ ఉప్పూకారాల అవసరం ఉండదు. కానీ,
అలా తియ్యగూరగా వండితే పథ్యం కూర అని ఈసడిస్తారు.
చింతపండుతోనో, శనగపిండితోనో వండితే ఎక్కువమంది
ఇష్టంగా తింటారు. వాటి వలన జలుబు చేస్తుంది. తినేదేమో
పులుసునీ, తిట్టేదేమో సొరకాయనీ అవుతుంది. ఎలాంటి అనారోగ్యంలోనయినా
సొరకాయనీ సొర ఆకుల్ని వండుకుని తినవచ్చు. పులుపు కలిపి వండటానికి
ప్రాధాన్యత తగ్గిస్తే సొరకాయ ఆయుర్దాయాన్నిస్తుంది.
గర్భవతులు సొరకాయను తరచూ తింటూ ఉంటే కడుపులో ఎదిగే బిడ్డ నాడీ
వ్యవస్థ బలంగా రూపొందు
తుంది. లేత సొరకాయ జ్యూస్
తీసుకుని అందులో పావు
చెంచా మంచి పసుపు, తగి
నంత నిమ్మరసం, మిరియాల
పొడి కలుపుకుని రోజూ ఉద
యాన్నే ఖాళీ కడుపున ఒక
గ్లాను చొప్పున తాగుతూ ఉంటే
'ని' విటమిన్ సమృద్ధిగా అందు
తుంది. కేన్సర్ పెరుగుదలను
అరికట్టేందుకు ఈ పానీయం తోడ్పడుతుంది. ఇందులో ఆహార సంబంధమైన
పీచుపదార్థం ఎక్కువగా ఉన్నందువలన ఇది షుగరునీ, కొవ్వునీ రక్తంలో ఎక్కు
వగా చేరకుండా నిరోధిస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి, కీళ్ళవాతం, ఇతర
వాతవ్యాధుల్లో సొరకాయ ఆ విధంగా ఔషధంలా మేలు చేస్తుంది. మంచి నిద్రపడు
తుంది. మెదడు సంబంధమైన వ్యాధుల్లోనూ, మూర్చల అబ్బులోనూ సార
పానీయం బాగా మేలు చేస్తుంది. శరీరానికి, మనసుకు ప్రశాంతతనిస్తుంది. విష
దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఈ పానీయం తాగితే జుట్టు నల్ల
గానూ, ఏపుగానూ పెరుగుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. సొరగుజ్జుని,
ఆవనూనెతో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.