27, నవంబర్ 2015, శుక్రవారం

SWARNAPRASANA / BANGARAM - AYURVEDAM

స్వర్ణప్రాశన

బంగారాన్ని తినవచ్చా ? ఉంటే లాభం ఏముందు

- ఔషధాలు కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని పరోక్షంగానూ
పనిచేస్తాయి. కానీ, బంగారం ఈ రెండింటికీ భిన్నంగా, వివిధ
మైన కసాయన చర్యలోనూ పాల్గొనకుండా స్పర్శా మాత్రంగానే
ఔషధ ప్రయోజనాలనిస్తుంది. ఆధునిక పరిభాషలో దీన్ని కెటలిస్టు (ఉత్తే
తకం) అంటారు. మేలిమి బంగారానికే ఈ గుణం ఉంటుంది. అది చంటి
పెద్దల నుండి వయోవృద్ధుల దాకా అందరికీ ఇప్పదగిన ఔషధమే!
బంగారం కంచంలో భోజనం చేయటం, బంగారు గిన్నెలో పాయసం
తాగటం, బంగారు నగలు ధరించటం ఇవన్నీ ఆ స్వర్ణ స్పర్శాభాగ్యం
పొందడానికి, మధ్య తరగతి వారు బంగారు పాత్రలు కొనలేక వెండి
కంచంలో బంగారు పువ్వునో, చుక్కనో పెట్టించుకుంటారు.
బంగారు ఉంగరం వేళ్లతో అన్నం తినేదీ, బారసాల సమయం 
లోనూ, అన్నప్రాశన సమయంలోనూ బంగారు ఉంగరంతో
పొలనో, పరమాన్నాన్నో పట్టుకుని బిడ్డకు నాకించేది అందుకే! బంగారం రేకు తయా
రుచేయడానికి స్వచ్ఛమైన బంగారం కావాలి. తోలు అట్టల మధ్య మేలిమి బంగారం
ఉంచి, చెక్క సుత్తితో కొట్టి పల్చని రేకులా సాగదీసి స్వర్ణపత్రాలు తయారుచేస్తారు.
అంగుళం అంత స్వర్ణపత్రాన్ని ఒక ముద్ద వేడి అన్నం మీద ఉంచితే ఆ వేడికి అది కరి
గిపోతుంది. ఆ అన్నాన్ని నెయ్యి వేసుకుని తింటారు. పెద్దవాళ్లు బంగారం అన్నం తినే
తేనె, నెయ్యి వేసి రంగరించి వేలికొచ్చినంత భాగాన్ని చంటి బిడ్డలకు నాలుక మీద
రాసి వాకిస్తారు. ఇదే స్వర్ణప్రాశన ప్రక్రియ. బిడ్డ పుట్టిన నాలుగో రోజే బంగారపు
రేకుని ఇలా తినిపించాలన్నాడు వాగ్భ
టుడు. మూడో నెలలోనో, ఆరో నెలలోనో
చేస్తే మంచిదని మరికొందరి అభిప్రాయం.
పుష్యమీ నక్షత్రం రోజున బంగారంలో వైద్య
గుణాలు వృద్ధిలో ఉంటాయి. కాబట్టి, ఆ
రోజున విరేచనాలు, జ్వరం లేకుండా
చూసి ప్రొద్దున పూట స్వర్ణప్రాశన చేయా
అని ఈ గ్రంథం సూచించింది..
బంగారపు రేకుని కొద్దిగా నెయ్యి, తేనెలతో రంగరించి తినిపిస్తే పిల్లల జ్ఞాపకశక్తి,
వికసంథాగ్రాహ్యత, ఉర్ణశక్తి పెరుగి, శరీరం బలసంపన్నం అవుతుంది. ఆయుష్టు
పెరుగుతుంది. పోలియో లాంటి జబ్బులకు వాక్సినేషన్లో పనిచేస్తుంది. అలాగని
ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా నాకించ కూడదు. మంచి ఆయుర్వేద వైద్యుని
సలహా మీద ఈ విధంగా చంటిబిడ్డలకు స్వర్ణప్రాశన చేయించవచ్చు. ఆధునిక వైద్య
శాస్త్రం బంగారాన్ని biologically inert metal" అంటుంది. ఆయుర్వేద శాస్త్రం
ఇది స్పర్మామాత్రంగా, దీర్ఘకాలం పాటు శరీరం మీద పనిచేస్తుందని చెప్తోంది. బంగా
కపు రేకుని గానీ, స్వర్ణభస్మాన్ని గానీ తీసుకున్న 24 గంటలలోపు జీర్ణకోశం లోంచి
పూర్తిగా బయటకు విసర్జించబడుతుందని రెండు వైద్య శాస్త్రాలు చెప్తున్నాయి. ఒక
రోజు పాటు అది మన శరీరంలో ఉన్నంత మాత్రానికే అది జీవితానికి సరిపడా శక్తిని
స్తుందన్నమాట.

SHASTHROKTHA / SHADRASOPETHA BHOJANAM - AYURVEDAM

మొదటి ముద్దగా అల్లం

భములో ఏది ముందు ఏం వెనుక తినాలో ఏవైనా నియమాలు
చెప్పారా? రాత్రంగా భజన చేయబారి ఏమంటారు?

* అల్లాన్ని తగినంత సైంధవ
లవణం (దొరక్కపోతే మామూలు
ఉప్పు) కలిపి నూరిన ముద్ద ఒక
చెంచాడు తీసుకుని కొద్దిగా అన్నంలో
కలుపుకుని మొదటి ముద్దగా తినాలట..
భోజనంలో కూరల్లాంటి ఘన పదార్థా
లను ముందుగానూ, మృదువైన పప్పు,
పచ్చడి లాంటివి మధ్యలోనూ, చారూ
పులుసూ లాంటి ద్రవపదార్ధాలను చివరగానూ, ఆఖరున పెరుగు లేదా మజ్జిగతో
ముగించాలి. పాలతో తయారయిన స్వీట్లను భోజనం మధ్యలో పులుసన్నం, పెరుగా
న్నంకన్నా ముందే తినేయాలి. లడ్డూ లాంటి పాలు కలవని స్వీట్లను భోజనం ఆఖరు -
తీసుకోవచ్చు. భోజనం చివర తీపి తినాలని చెప్పారు.
వడ్డించేప్పుడు తీపితో మొదలుపెడతారు. తినేప్పుడు కూర, పప్పు, పచ్చడి
పులుసు, పెరుగు వరుసలో తినటమే మంచిది. ఆయుర్వేద శాస్త్రం సూచించిన ఈ వి.
మైన భోజన విధానాన్ని దేశంలో ఒక్క తెలుగువారు మాత్రమే పాటిస్తున్నారు. తీ-
పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ తగు పాళ్లలో ఉండేలా సు
తుల్యంగా ఆహారం ఉంటే దాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటారు. వగరూ చేయి
పదార్థాలను కూడా రోజూ తినటం అవసరం.


RUDRA JADA / SABJA GINJALU - AYURVEDAM

చలవ చేసే సజ్జాగింజలు

సజ్జాగింజలు నానబెట్టి షుగరు రోగులు తీసుకోవచ్చా? లాభాలేమిటి? 

? - రుద్రజడ దీని అసలు పేరు. సబ్దా అనేది అరబ్బీ పదం. వేడి ఎక్కువగా ఉన్నవా
రికి ఈ గింజల్ని పది నిమిషాల సేపు నీళ్లలో నానించి ఇస్తే వెంటనే చలవ
చేస్తుంది. షుగరు వ్యాధిలో అరికాళ్ల మంటలు, పోట్లు ఉన్నవారికి ఈ గింజల్ని రోజూ
తాగిస్తే మంటలు ఉపశమిస్తాయి. మూత్రంలో మంట, కడుపులో మంట, అరికాళ్లు
చేతుల్లో మంట, కళ్లు మంటలు, నాలుక మీద మంట, విరేచనంలో మంట ఇలా
మంటగా ఉండటమే వేడి అంటే! సజ్జాగింజలు ఈ వేడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పి
మీద కూడా పనిచేస్తాయి. పంచదార కలపకుండా షుగరు రోగులకూ, స్థూలకాయు
లకూ ఇవ్వొచ్చు. మజ్జిగలో కూడా నానబెట్టుకుని తాగవచ్చు. పాలలో వేసి ఉడికించి
టీలాగా కాచుకుని తాగవచ్చు. కిరాణా కొట్లలో ఇవి తేలికగా దొరికేవే!

PALLEELU / VERUSENAGA PAPPU ALLERGY - AYURVEDAM

పల్లీల ఎలెర్జీ?

2 వేరుశనగ పప్పులు వాడితే మంచిదేనా?

* వేరుశనగ గుళ్ళు, పల్లీలు, వేరు గుళ్ళు పేరుతో మన ప్రాంతాల్లో దొరికే వేరుశనగ
గుళ్ళు మనకి మధ్య యుగాల
మలిదశలో విదేశీయులు దిగు
మతి చేసిన నూనె గింజలే. నూనె
సంగతి అలా ఉంచితే వేరుశన
గలు శనగల్లాగే పైత్యం చేసే
స్వభావం కలిగి ఉంటాయి.
యాసిడ్ని పెంచి ఆకలి చంపు
తాయి.
వేరుశనగ పప్పుల్ని కొద్దిగా
నెయ్యి వేసి దోరగా వేయించుకుని
బెల్లంముక్కతో కలిపి తింటే, అజీర్తిబాధలు, కడుపునొప్పి, గ్యాసురాకుండా ఉంటా
యని మన పెద్దవాళ్ళు వేయించిన శనగగుళ్ళను తీపితో కలిపి పెడతారు. గాంధీగారు
వేరుశనగ పప్పు, బెల్లం ముక్కతోపాటు మేకపాలు కూడా తీసుకునేవారని ప్రతీతి.
ఏమైనా వేరుశనగ గుళ్ళు మనం అనుకున్నంత ఆరోగ్యకరమైనవి కావు. అలాగని
నిషేధించాల్సినవి కూడా కావు. సరదాగా అప్పుడప్పుడు వేయించిగాని, ఉడకబెట్టుకు
నిగాని, తంపట పెట్టుకునిగానీ తీసుకోవచ్చు. కొందరిలో ముఖ్యంగా పిల్లల్లో
ఉబ్బసం వ్యాధికి ఇవి కారణం అవుతాయని ఇటీవల అమెరికన్ పరిశోధకులు
గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఒక ఊపిరితిత్తుల ఆసుపత్రిలో పిల్లల మీద జరి
పిన పరిశోధనలో ఈ హెచ్చరిక చేశారు. వేరుశనగపప్పు తిన్న కొంత
మందిలో ఎలెర్జీని నియంత్రించే ఇమ్యునోగ్లోబులిన్-ఇ అసాధారణంగా
పెరగడాన్ని గమనించారు. ఆ వ్యక్తులకు వేరుశనగ సరిపడదని దాని
అర్ధం. సరిపడనివారు తప్ప తక్కినవారికి వేరుశనగ విరోధం లేదు.
అయినా అవి నూనెగింజలు కాబట్టి స్థూలకాయులకు జాగ్రత్త తప్పదు.


CHILAKADA DUMPA LABHALU - AYURVEDAM

వార్ణచందు చిలకడ దుంపలు

చిలకడ దుంపల వలన లాభాలు? 

 ఆలూ దుంపల్లాగానే చిలకడ దుంపలు కూడా 17వ శతాబ్దిలో అమెరికా
నుంచి విదేశీ వ్యాపారుల ద్వారా మనకు చేరాయి. వాతం చేస్తాయని, షుగరు
పెంచుతాయనీ, మలబద్ధతని తెస్తా
యని చాలామంది వీటిని తినరు.
కానీ, జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి
ఇవి మేలే చేస్తాయి. పైగా జీర్ణశక్తిని
పెంచుతాయి కూడా! ఆ విషయంలో
ఆలూ కన్నా ఇవే మెరుగు.
ఎర్రగా ఉండే చిలకడదుంపల్ని
పిల్లలకు తరచూ వండి పెడుతూ
ఉంటే చీటికీ మాటికీ విరేచనాలయ్యే
వ్యాధిని తగ్గిస్తుందని ఒక తాజా పరిశోధన చెప్తోంది. చిలకడదుంపల్లో ఉండే ఎ విట
మిన్ (బీటా కెరొటీన్) పేగుల లోపలి గోడల్ని బలసంపన్నం చేస్తుందని నిర్ధారించారు.
అందువలన పేగుల్లో ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాల్నీ, బాక్టీరియా దోషాలున్న
ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు పిల్లల్లో విరేచనాలు అవకుండా ఇవి పేగుల్ని కాపా
డతాయని నిర్ధారించారు.
చిలకడదుంపల్ని ఉడికించి, తాలింపు పెట్టి పిల్లలకు సాయంకాలం పూట స్కూలు
నుంచి రాగానే పెట్టడానికి వీలుగా ఉంటాయి. క్యారట్, చిలకడదుంపలు సమానశక్తి
కలిగిన ద్రవ్యాలు, వాటిని ఎ విటమిన్ లోపం ఉన్న పిల్లలకు తగుపాళ్ళలో అందించవ
లసి ఉంది. శనగపిండి స్వీట్లు, హాట్లు పేగుల్ని పాడుచేస్తాయి. చిలకడ దుంప స్వీట్లు
పేగుల్ని బాగుచేస్తాయి.


JUNK FOOD - NOLLALO VELLALU

నోళ్ళలో వెల్లలు

జంక్ ఫుడ్స్ గురించి చెప్పండి!

చిన్నపిల్లల్లో స్థూలకాయం, ఈడు రాకుండానే రజస్వలలు
కావటం, బాల్యంలో షుగరు, బీవీ వ్యాధులు, అనేక మానసిక
ప్రవర్తనా వ్యాధులు కలగడానికి జంక్ ఫుడ్స్ తప్పకుండా కారణం
అవుతున్నాయి.
వెల్ల అంటే తెల్లరంగు. ఏరంగూ లేని తెల్లని స్వీటు కూడా ఈ వెల్ల (తెల్ల
రంగు) కలిపి తయారుచేసిందేనని స్వీట్ షాపువాళ్ళు చెప్తున్నారు. రంగుక
లిసిన ఆహారవిషాలు మాకు వద్దనవలసింది ప్రజలే. స్థూలకాయం వస్తుం
దీని ఇంట్లో పిల్లలకు నెయ్యి, నూనె, జీడిపప్పుల్లాంటివి పెట్టటం మానేసి,
రోడ్డుపక్కన ఆంక్ విషాహారాలు కొనిపెట్టడం ఒక రివాజు అయ్యింది.
సమోసాలు, మైనం లామినేషన్ చేసిన కరకరలు, రంగు
నీళ్ళు, చవకబారు బిస్కట్లు, కోక్ ఎక్కువగా కలిసిన చాక్లెట్లు,
రంగులద్దిన కేకులు, నీలిరంగు బూందీ, ఆకుపచ్చ కారప్పూన
ఇలాంటివి విషాలకిందకు తీసుకురావలసిన అవసరం ఉంది.
ఏవి జంక్ ఫుడో నిర్వచించి, అవి
విషపదార్థాలని ప్రభుత్వం స్పష్టం
చేయాలి. హానికారక జంక్ ఫుడ్స్న
విద్యాలయాల దగ్గర్లో అమ్మకుండా
నిషేధించే ఆలోచన ప్రభుత్వం
చేస్తున్నట్టు 2015 ఆగష్టు నెలాఖ
రులో ఒక ప్రకటన వెలువడింది.
స్కూలు యూనిఫారంలో ఉన్న
పిల్లలకు జంక్ ఫుడ్స్ అమ్మకూ
డదు, పెద్దలకు మాత్రమే అనే
నియమం పెడతారట. ఈ నియమం ఎంత అమలౌతుందో తెలీదు. తల్లిదండ్రులే జంక్
ఫుడ్స్ కొని, పిల్లలకిచ్చి సూళ్ళకు పంపుతున్నారు. తమ పిల్లలు వాటి బారినపడకుండా
నియంత్రించుకోవలసింది కన్నవారే కదా!


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...