Wednesday, 23 March 2016

CHIMMILI THINAVACHA?

చిమ్మిలి తినవచ్చా...!?

చిమ్మిలి తింటే బీపీ పెరుగుతుందనీ, బ్లీడింగ్ అవు
తుందనీ, కడుపు యాసిడ్ పెరుగుతుందని అంటున్నారు
నిజమా? అపోహా?

* పొట్టు తీసిన తెల్లనువ్వులు (నువ్వుపప్పు), తగినంత బెల్లం కలిపి
దంచిన 'ముద్ద' లేదా 'ఉండని చిమ్మిలి అంటారు. దీనికి తెల్ల
ర్ణచందు నువ్వులకున్న గుణాలన్నీ ఉంటాయి. ఇది విరేచనం ఫ్రీగా
అయ్యేలా చేస్తుంది. బాగా వేడిచేసే స్వభావం కలిగింది కాబట్టి,
వాతాన్ని, నొప్పుల్ని, వాపుల్ని తగ్గిస్తుంది. కానీ, కఫ దోషాన్నీ, పైత్యాన్ని పెంచు
తుంది. ఎసిడిటీ, పేగుపూత ఉన్న వాళ్లకు ఇది మంచిది కాదు. ఇందులో కొవ్వు ఎక్కు
వగా ఉంటుంది. స్థూలకాయులకు ఇబ్బందే కలిగిస్తుంది. దంతాలకు మేలు చేస్తుంది.
విరేచనాన్ని బంధిస్తుంది. ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కునేలా చేస్తుంది.


రక్తస్రావాన్ని ఆపుతుంది.
కానీ, ఋతురక్తం పెరిగేలా
చేస్తుంది. అందుకని గర్భా
శయం మీద మాత్రం రక్త
స్రావం అయ్యేలా చేసే
గుణం దీనికుంది. వేడి శరీర
తత్వం ఉన్న వాళ్లకు
మాత్రమే అధికంగా బ్లీడింగ్
అయ్యేలా చేస్తుంది. బాలింత
లకు మంచిది. తల్లిపాలు
పెరిగేలా చేస్తుంది. చర్మవ్యాధుల్లో మేలు చేస్తుంది. మెదడు వ్యాధుల్లో నరాల బలానికి
ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం వ్యాధుల్లో సరిపడుతుందో లేదో
చూసుకుని తినాలి. ఋతుస్రావం సరిగా కాని వాళ్లకు, నెలసరి సక్రమంగా రాని
వాళ్లకూ చిమ్మిలి మేలు చేస్తుంది. అతిగా మూత్రం అవుతున్న మూత్ర వ్యాధుల్లో
చిమ్మిలి మూత్రాన్ని బంధించి బాగా తక్కువగా అయ్యేలా చేస్తుంది. అందుకని
కొందరు రాత్రి పూట పక్క తడిపే పిల్లలకు చిమ్మిలి పెట్టడం మంచిదని చెప్తారు. పిల్ల
లకు బలకరం కూడా! కానీ, శరీర తత్వాలను బట్టి కొద్ది మోతాదుల్లోనే దీన్ని
ఇవ్వాలి. జాగ్రత్తగా తీసుకుంటే చిమ్మిలి మంచిదే!