ముల్లంగి ఆకులతో కూర
ముల్లంగి ఆకులు తినదగినవేనా? ముల్లంగిని
ఉబ్బనం, శరీరానికి నీరు పట్టటం లాంటి జబ్బుల్లో
తినకూడదంటారు నిజమేనా?
* ముల్లంగి రెండు రకాలుగా దొరుకుతుంది. మనకు దొరికేది
చిన్న రకం తెల్ల ముల్లంగి, ఏనుగుదంతంలాగా బాగా తెల్లగా పెద్దదిగా
ఉండేది మనకు తక్కువ. జపాన్ వాళ్లు దీన్ని దాయికాన్ అంటారు. ఈ
పెద్ద ముల్లంగి దుంపలు (బడీ మూలీ) మన చిన్న ముల్లంగిలా చలవ
చేయవు. వేడి చేస్తాయి. కష్టంగా అరుగుతాయి. అన్ని దోషాలను
పెంచుతాయని భావప్రకాశ వైద్య గ్రంథంలో ఉంది. దాదాపు 20 అంగు
కాల వైశాల్యం కలిగి 45 కిలోల బరువు ఉండే సకురాజిమా
అనే పెద్ద ముల్లంగి జపాన్లో బాగా పెరుగుతుంది. మనకు 14
అంగుళాల వరకూ ఉండే చిన్న ముల్లంగి దుంపలే దొరుకు
తాయి.
చిన్న ముల్లంగిని మూలీ అంటారు. దీనికి కొద్దిగా కారపు రుచి ఉంటుంది. శరీ
రంలో వేడిని పుట్టిస్తూనే చలవని
స్తుంది. తేలికగా అరుగుతుంది.
దీనితో పాటుగా తిన్న ఇతర ఆహార
పదార్థాలు కూడా తేలికగా అరిగేలా
చేస్తుంది. వ్యాధులన్నిటిలోనూ తినద
గినదిగా ఉంటుంది. గొంతును
శ్రావ్యంగా చేస్తుంది. జ్వరం వదల
కుండా వస్తున్నప్పుడు ముల్లంగితో
ఏదైనా ఆహార ద్రవ్యం చేసి ఇస్తే ఔష
ధంలా పనిచేస్తుంది.
ముల్లంగి, క్యారెట్ లేదా బీట్
రూట్ ఒక్కొక్క దుంప, ఒక యాపిల్
లేదా జామపండు ఈ మూడింటి జ్యూసు తీసుకుని కొద్దిగా జీలకర్ర/వాము లేదా
మిరియాల పొడి వేసి ఒక గ్లాసు మోతాదులో తాగితే జ్వరం, దగ్గు, జలుబు,
ఆయాసం తగ్గుతాయి. రోజూ తాగితే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో విష
దోషాలు పోతాయి. క్షీణింప చేసే వ్యాధుల్లో ఇది మేలు చేసే మంచి ఫార్ములా!
మూత్రం ఎక్కువ అయ్యేలా చేస్తుంది. అందువలన నీరు పట్టిన వ్యాధుల్లో (ఎడీమా)
ఇది మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం లాంటివి ఎక్కువగా
ఉంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన వ్యాధులు మాత్రమే ముల్లంగిని వద్దం
బారు మనుషులందరూ ముల్లంగిని తినాలి.
ముల్లంగి ఆకుల్ని రాడిష్ గ్రీన్ అంటారు. వీటితో తోటకూర మాదిరిగా పొడి
కూర వగైరాలన్నీ చేసుకోవచ్చు. ఫ్రెంచి వాళ్లు ఉదయం ఉపాహారంగా తింటారు.
అమెరికన్లు ముల్లంగి దుంపల్ని, ఆకుల్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి వేపుడు
కూరగా వండుకుంటారు. పెట్రో, సూపుల్లాంటి వంటకాలను కూడా చేస్తారు. వీటికి
కొద్దిగా చేదు రుచి ఉంటుంది. అందుకని ఇతర ద్రవ్యాలతో కొద్దిగా కలిపి వండుకో
వాలి. లేత ఆకుల్ని మాత్రమే ఎంచుకోవాలి. ముల్లంగి దుంపలను సాధారణంగా
ఆకులతో సహా అమ్ముతారు కాబట్టి వాటిని కూడా సద్వినియోగపరచుకోవచ్చనీ,
ముల్లంగితో సమానంగా మేలు చేస్తాయనీ దీని భావం. భావప్రకాశ వైద్య గ్రంథంలో
ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని పెంచుతాయనీ, తేలికగా అరుగుతాయనీ, రుచిగా
ఉంటాయనీ, కొద్దిగా నెయ్యి లేదా మంచినూనె వేసి వేయించితే అన్ని దోషాలనూ
పోగొడతాయనీ ఉంది. అలా వేయించకుండా తినటం వలన పైత్యం చేస్తుందనీ,
కఫాన్ని పెంచుతుందనీ ఆ గ్రంథం చెప్తోంది.