ఈ శనగపిండికి బదులుగా వాడుకోదగినదేమైనా
ఉన్నదా?
• శనగపిండి చాలా మృదువుగా ఉంటుంది. కానీ కడుపు
లోకి వెళ్లాక రూక్షంగా (రఫీగా పనిచేస్తుంది. జీర్ణశక్తిని, పేగుల్ని,
శరీర సమతుల్యతనీ దెబ్బ తీస్తుంది. దీనివలన వాతం పెరుగుతుంది. ఎసి
ఇదీ పెరుగుతుంది. జీరం ఆరోగ్యం చెడుతుంది. పోషక విలువలు,
ప్రొటీన్లు వగైరా ఉన్నాయి కదా అనడగవచ్చు. పోషకాలు మనకు
ఎలాంటి ఇబ్బంది కలిగించనివిగా ఉండాలి కదా! వాత, కఫ పైత్యా
లను పెంచే ద్రవ్యాలు ఎంత పోషకాలు అయినా అందరూ దీన్ని తినండి
అని చెప్పడానికి వీలైనవి కావు. శష్కలీ అంటే శనగపిండి. ఇది మలబద్ధ
తను కలిగిస్తుంది. కంటికి చెడు చేస్తుంది.
గోధుమ పిండి,
జొన్న పిండి, రాగి పిండి, సజ్జపిండి లాంటి
డా.జి.వి.
వాటితో వంటకాలు శనగపిండి, మినప్పిండి, పెసరపిండి కన్నా
మెరుగ్గానూ, రుచికరంగా కూడా ఉంటాయి. శనగపిండితో చేసుకునే వంటకాలన్నిం
ఉనీ వీటితో కూడా చేసుకోవచ్చు. రాగి పిండితో పకోడీలు, జొన్నపిండితో జంతికలు,
సజ్జపిండితో అప్పాలు (సజ్జ
ప్పాలు) ఒకప్పుడు మన
పూర్పులు ఇష్టంగా తిన్నవే! ఆ
రోజుల్లో అంటే 40-50 యేళ్ల
క్రితం వరకూ శనగపిండి
వాడకం బాగా తక్కువ. ఆరో
గ్యానికి అంతగా మంచిది
కాడని ఎప్పుడో ఒకసారి సర
దాగా తినేవారు. బూందీ, కార
ప్పూన, చక్రాలు వగైరా వంట
కాలను గోధుమపిండి, జొన్నపిండి కలిపి తయారు చేసుకునే వాళ్లు, గారెలు, బూరెలు,
అరిశలు, గవ్వలు, చెక్కలు, ఇలాంటి వాటిని ఇప్పటికీ మనం శనగపిండి లేకుండానే
వండుకుంటున్నాం కదా! లడ్డు, మిరాయి, లావు కారప్పూనలాంటివి కూడా గోధుమ
పిండితోనే తయారయ్యేవి.
శనగపిండిలోనే రుచి ఉన్నదనుకోవటం ఒక అపోహ. వేటి రుచి వాటిది. సజ్జ
ప్పాలు సజ్జపిండితో చేస్తేనే రుచి గానీ, మైదా పిండితో చేస్తే అసలు రుచి ఎలా తెలు
స్తుంది...? పకోడీకి ఆ రుచిని ఉల్లిపాయ ఇస్తోంది. అనవసరంగా శనగపిండి జోలికి
వెళ్లకుండా ప్రత్యామ్నాయాలను ప్రయత్నించి చూడండి. తప్పదనుకుంటేనే శనగపిండి
వాడండి. శనగలను మరపట్టుకున్న పిండిని నమ్మినట్టు, బజార్లో దొరికే శనగపిండిని
నమ్మలేం కదా! అది గుండ్రటి శనగల (బరాణీ శనగలు, బొంబాయి శనగలు) పిండి
కావచ్చు. గుండ్రటి శనగలు ఆరోగ్యానికి మరింత హానికరం.