ఎగ్జిమాలో ఆహారం
చాలా సంవత్సరాలుగా నాకు కార్ల మీదా ఎగ్జిమా ఉంది. ఏం తినకూ
డదో చెప్పగలరు.
* సరిపడనిది తగిలినప్పుడు ఎగ్జిమా మచ్చల మీద దురద పెరుగుతుంది. గోకటం
వలన పుండు రేగుతుంది. ఆ స్థితిలో దాన్ని 'వీపింగ్ ఎగ్జిమా' అని పిలుస్తుంటారు.
ఇలా మాటిమాటికీ రని కారటం తిరగబెడుతూ చివరికి ఆ భాగం అంతా నల్లగా
మారిపోతుంది. ఎగ్జిమా మందులు వేసి తగ్గించేయగలిగే వ్యాధి కాదు. శరీరానికి సరి
పడని వాటికి దూరంగా ఉంచడమే అసలు చికిత్స.
సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, యాంటీ సెప్టిక్ సొల్యూషన్లు, ఇంటి దుమ్ములో
ఉండే ఫంగస్ తదితర సూక్ష్మ జీవులు, పెంపుడు జంతువులు, చుండ్రు, కొన్ని రకాల
బాక్టీరియా, వైరలు, అమిత వేడి, అతి చల్లని వాతావరణ పరిస్థితులు, పాలు, గుడ్లు,
జీడిపప్పు, బాదాం, సోయా ఉత్పత్తులు, గోధుమలు, హార్మోన్ల స్థాయిలో
మార్పులు ఇవన్నీ ఎగ్జిమాని పెంచేందుకు అవకాశం ఉంది.
చింతపండు, శనగపిండి, మైదా, నూనెలతో వండిన పదార్థాలు కఫ
దోషాల సమస్థితిని దెబ్బతీస్తాయి. వాటిని ఎంత పరిమితంగా వాడితే
ఆరోగ్యం అంత పదిలంగా ఉంటుంది. చేదు, రుచి కలిగిన కాకర, ఆగా
కర, మెంతులు, వేపపూవు తరచూ వాడుకోవటం మంచిది. వేపపూ
లను కొద్దిగా వాము పొడినీ నెయ్యి వేసి దోరగా వేయించి మిక్సీ పట్టు
కుని కారప్పొడిలా రోజూ అన్నంలో తినటం వలన ఈ వ్యాధి తీవ్రత తగ్గు
తుంది. ధనియాలు లేదా జీలకర్ర లేదా దాల్చిన చెక్కలను వేర్వే
ర్ణచందు రుగా మిక్సీ పట్టుకుని సీసాలో భద్రపరచుకోండి. వీటిలో
ఏదైనా ఒకదాని పొడిని గ్లాసు నీళ్లలో అరచెంచా చొప్పున వేసి
మరిగించి వడగట్టుకుని ఈ నీటిని మంచినీటికి బదులుగా రోజూ తాగుతూ ఉంటే శరీ
రంలో విషదోషాలు తగ్గుతాయి.