Monday, 7 March 2016

GOOD MORNING FOOD

గుడ్ మార్నింగ్' ఫుడ్

ప్రొద్దున పూట ఏది ఎలా తింటే ఆరోగ్యదాయకమో చెబుతారా?

ప్రొద్దునపూట రెండు మూడు జీడిపప్పులు లేదా బాదంపప్పులు, కూరగాయ
ముక్కలు, తరిగిన ఆకుకూర, కొద్దిగా జొన్న రాగి/సజ్జ వీటిలో ఏదైనా ఒకదాని పిండి
వీటిని కలిపి గట్టి ముద్దలా చేసి పెనం మీద రొట్టిగానీ, చపాతీ/పుల్కా గానీ తయారు
చేసుకుని ఉదయంపూట తింటే ఆరోగ్యవంతులకైనా అనారోగ్యవంతులకైనా గొప్ప
ఉపవాస ఉపసంహారం (బ్రేకింగ్ ద ఫాస్ట్) అవుతుంది. రెండు లేక మూడు రొట్టెలు
అని, ఒక క్యారెట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ జామ పండు వీటి జ్యూస్
తాగితే సమగ్రమైన ఆహారం అవుతుంది. The Academy of
Nutrition and Dietetics అంతర్జాతీయ సంస్థ ప్రమాణాలకు తగ్గ
ట్టుగా భారతీయులు తీసుకోదగిన మంచి breakfast ఇది. మరీ
చిక్కగా లేని కాఫీ/టీ రోజుకు ఒకటి లేక రెండుసార్లు అరకప్పు మోతా
దులో తాగవచ్చు.
ఉపొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, అల్లం, తులసాకులు,
పుదీనా ఆకులు మూడు లేదా నాలుగు చొప్పున వేసి పాలు పోయకుండా
కాచిన టీ ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉంటుంది. కావాలను
వార్ణచందు కుంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా కాచిన దీని
అన్నం తిన్న వెంటనే కూడా తాగవచ్చు. భుక్తాయాసం కలగ
కుండా చూస్తుంది. స్థూలకాయం, షుగర్ వ్యాధి లాంటివి ఉన్న వారు ఆఫీసు నుంచి
లంచి కోసం ఇంటికి రావటం కన్నా క్యారియర్ తీసుకు వెళ్లటం వలన రెండు లాభా
లున్నాయి. మొదటిది పరిమితంగా ఆహారం తీసుకోగలుగుతారు. రెండు భోజనం
చేయగానే పడుకుని నిద్ర
పోయే అలవాటు మానగలు
గుతారు. ప్రొద్దున పూట,
రాత్రిపూట టిఫిన్లను సాధ్యమై
సంతవరకూ మీరేవండుకోవ
డానికి ప్రయత్నించండి.
బయటవి తినటం వలన
ఆహార నియంత్రణ లేకుండా
పోతుంది.
కూరగాయలను, ఆకు
కూరలను ఎక్కువగానూ, వరి అన్నం తక్కువగానూ తినే విధంగా ఆహార పదార్థాల
తయారీ ఉండేలా కొత్త ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ప్రొద్దునపూట
ఆహారంలోనైనా కూరగాయలకు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఇప్పుడు
మనం తింటున్న ఆహారపదార్థాల్లో ఈ కాలపు జీవన విధానానికి మేలు చేసేవి తక్కు
వగా ఉన్నాయి. సాంప్రదాయకమైన కూర, పప్పు, పచ్చడి, పులుసు వగైరా వంటకా
లలో అతిగా చింతపండు, అంతకంటే అతిగా అల్లం, వెల్లుల్లి. అమితంగా నూనెలు
చేరటం వలన మన సాంప్రదాయ వంటకాలు శక్తిహీనంగా మారాయి. ఆధునికమైన
పిజ్జాలు, బట్టర్ నాన్లూ, మిక్స్ వెజిటబుల్ కర్రీలు మరీ హానికరమైనవిగా ఉన్నాయి.
మార్చవలసింది హోటల్ని కాదు. మారాల్సింది మనం.