29, మార్చి 2016, మంగళవారం

గ్లూటెన్ లేని ఆహారం..


గ్లూటెన్ లేనిఆహారంమనకుసరిపడదని,బలవంతంగాతింటే ఎండుకుపోతారట గ్లూటెనేని ఆహార పదార్థాలుఉన్నాయా?



గోదుమల్లోనూ ఇంకా చాలా ధాన్యాల్లోనూ గ్లూటెన్..

* గ్లూటెన్ అనేది ఒక ప్రొటీన్ పదార్థం. అది మనుషుల్లో 
సంక్' వ్యాధి అంటారు. అది పేగుల్లో ఏర్పడే వ్యాధి. దానివలన తిన్నది.వంటబట్టదు. గ్లూటెన్ సరిపడని వారికి మాత్రమే ఇలా జరుగుతుంది.వంకాయ, గోంగూర లాంటివి కొందరికి సరిపడనట్లే గ్లూటెన్ కలిగినధాన్యం కూడా కొందరికి సరిపడకపోవచ్చు. ఏ ఆహార ద్రవ్యం అయినా
ఎవరికైనా పడకపోవచ్చు. ఏవి పడుతున్నాయో, ఏవి పడవోగుర్తించి తగిన జాగ్రత్త తీసుకోగలగాలి! అందరూ అన్నీ మానాల్సిన అవసరం లేదు..

గ్లూటిన్ తో సంబంధం లేని ఆహార పదార్థాలు అనేకం
ఉన్నాయి. గోధుమ పిండి, మైదా పిండి,బార్లీలో తప్ప తక్కిన ధాన్యంలో దేనిలోనూగ్లూటెన్ ఉండదు. పండ్లు, కాయలు, కూరగాయలు, కోడిగుడ్లు, తాజా మాంసం,
చేపలు, జీడిపప్పు, బాదాం,పిస్తాల్లోనూ పాలు, పెరుగు
వీటిల్లో గ్లూటెన్ ఉండదు.గోధుమ, బార్లీ లాంటిధాన్యంతో తయారైన బ్రెడ్లు,బీరు, స్వీట్లు, బిస్కట్లు, కేకులు,పాష్టాలు, బజార్లో అమ్మేమాంసాహారాలు, సూపులువీటిలో గ్లూటెన్ చేరే అవకాశం ఉంది. అవి సరిపడని వారికి సీలిక్ వ్యాధి రావచ్చు. గోధుమలు సరిపడట్లేదనితేలితే ఈ పదార్థాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలన్నమాట.
ఏది సరిపడటం లేదో నిర్ధారణ శాస్త్రీయంగా జరగాలి. వ్యాధి లక్షణాలు పూర్తిగాతగ్గిన తరువాత పడని దాన్ని చాలా స్వల్ప మోతాదులో తీసుకోవటం మొదలు పెట్టి,
క్రమేణా కొద్దికొద్దిగా మోతాదు పెంచుకుంటూ వెడితే పడనివి పడే అవకాశం ఉంది.దీన్ని హైపో సెన్సిటజేషన్ లేదా 'డీ - సెన్సిటైజేషన్ అంటారు. గ్లూటెన్ అనేది అంత
గొప్పగా అవసరమైన ప్రొటీనేమీ కాదు. అది లేనంత మాత్రాన కలిగే నష్టమేమీ లేదనిఅమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ పేర్కొంది.

Featured post

గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...