కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం.
కరక్కాయ పోడి - 100 గ్రా.
ఎండు ద్రాక్ష పండ్లు - 100 గ్రా.
పటిక బెల్లం పొడి - 100 గ్రా.
పై అన్నింటిని కలిపి ముద్దలాగా దంచుకొని నిలువచేసుకోవాలి.రోజూ రెండు పూటలా 10 గ్రా. ముద్దను బుగ్గన పెట్టుకొని తింటుంటే ఆరోగ్యం కలుగుతుంది.
2. చల్ల బడ్డ అన్నం,కొత్త బియ్యపు అన్నం తినవద్దు.బియ్యాన్ని ఒక రాత్రి నానబెట్టి ,ఒక పగలు ఎండించి దోరగా వేయించి రవ్వ చేసుకొని ,తగినంత రవ్వ నీటిలో వేసి వండుతూ అందులో అల్లం 1 గ్రా.ముక్క,చిటికెడు మిరియాల పొడి ,చిటికెడు జిలకర పొడి,తగినంత సైంధవ లవణం,కొద్ది కొద్దిగా కొత్తి మీర,పుదీనా ,కరివేపాకులు వేసి వండుతూ అందులో వంటాముదం ,నెయ్యి లేదా వెన్నలతో తిరగమాత పెట్టి ఈ ఆహారాన్ని ఆకుకూరలతో కలిపి సేవిస్తుంటే ఆ ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.పై సమస్యలన్నీ తగ్గిపోతాయి.
No comments:
Post a Comment