రక్తశుద్ధిలేక చర్మవ్యాధులొస్తున్న - సమస్య
నా వయస్సు 48 సం.లు. నాకు
తరచుగా శరీరం మీద దురదలు, పుండ్లు, గడ్డలు వస్తున్నయ్. చర్మం అక్కడక్కడ
నల్లబారుతుంది. డాక్టర్లకు చూపిస్తే రక్తశుద్ధి లేదని మందులు వ్రాసించ్చారు. అవి
వాడటం ఇష్టంలేక మీ సలహా కోసం వ్రాస్తున్నాను. దయతో మార్గం చెప్పండి.
:- పరిశుభ్రంగా ఉన్న కుంకుడుకాయలు తీసు
కొచ్చి పగలగొట్టి విత్తనాలు తీసివేయండి. పై బెరడును చిన్న ముక్కలుగా కత్తిరించి
ఎండబెట్టి దంచి జల్లించండి. ఆ పొడితో సమంగా సుగంధపాలవేళ్ళపొడి కలిపి ఆ
మొత్తం చూర్ణంలో కొద్దిగా తేనె వేసి నూరి బఠాణిగింజంత గోలీలు కట్టి విలవజేసు
కోండి. రోజూ ఉదయంపూట ఒక గోలీని సగం చిలికిన అరకప్పు పెరుగుతోను,
రాత్రి
ఒక గోలీని మంచినీటితోను సేవిస్తుంటే క్రమంగా రక్తశుద్ధి జరిగి చర్మసమస్యలు తగ్గిపోతయ్. వంకాయ, గోంగూర,
ఆవకాయ, మాంసం, చేపలు, గుడ్లు, శనగపిండివంటి పడని పదార్థాలు నిషేధించండి. శుభం.
No comments:
Post a Comment