Sunday, 25 October 2015

GASA GASALU - LABHA NASHTALU

గసగసాలు విషాలే

మసాలా ద్రవ్యాల్లో గసగసాల వలన లాభనష్టాలు చెప్తారా?

మసాలాలకు అలవాటుపడి
పోయి అవి లేకపోతే జీవించలేని పరి
స్థితిని గసగసాలు తెస్తాయన్నమాట.
ఎన్ని సుగుణాలున్నా మనల్ని బాని
సగా మార్చేది విషపదార్ధమే. గసాలు
రుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి.
కానీ కఠినంగా అరుగుతాయి. విరేచ
నాన్ని బంధిస్తాయి. అందుకని నీళ్ళవిరేచనాలు అవుతున్నప్పుడు గసాలను నూరి రసం తాగిస్తారు. కానీ, రోజూ
తినేవాళ్ళలో మలబద్ధత కలిగిస్తాయి, కఫ రోగాలు, జలుబు, కళ్ళెపడటంలాంటి
వ్యాధుల్లో కఫాన్ని అదుపుచేస్తాయి. ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సుఖ
నిద్ర పట్టిస్తాయి. ఎందుకంటే గసాలలో నల్లమందు ఉంటుంది కాబట్టి,
గసాలనేవి పోస్తుకాయల లోపలి గింజలు. ఈ మొక్క కాండం,
ఆకులు, కాయల్లోంచి పాలుస్రవిస్తాయి. ఆ పాలను ఆరపెడితే అదే నల్ల
మందు. గసాలలో కూడా కొద్దిశాతం నల్లమందు (ఓపియం) ఉంటుంది.
మార్ఫిన్, హిరాయిన్ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను ఇందులోంచే
తీస్తారు. గసాలను ఎవరుపడితే వాళ్ళు పండించటంపై
కార్ణచందు నిషేధం పెట్టిన ప్రభుత్వం వాటి వాడకం మీద దృష్టి పెట్ట
లేకపోయింది. ప్రజలే చైతన్యవంతులు కావాలి.

No comments:

Post a Comment