నిత్యం జలుబు, పడిశం, రొంప, దగ్గు సమస్యకు - ద్రాక్షగుటికలు
-: నా వయస్సు 35 సం.లు, నాకు ఋతువుతో సంబంధం లేకుండా
ఎల్లప్పుడూ జలుబు పీడిస్తూనే వుంటుంది. దాంతోపాటు దగ్గుకూడా హింసిస్తుంది. ఎప్పుడూ సరిగా ఊపిరాడదు. ఈ సమ
స్యతో క్షణంక్షణం నరకయాతన పడుతున్నాను. దయతో మంచి మార్గం చెప్పండి.
! 1) నీ సమస్యకు చక్కని ఆహారౌషధమార్గం నీ ఇంట్లోనే వుంది. విశ్వాసంతో ఆచ
రించి విజయం సాధించు, గింజలున్న ఎండుద్రాక్ష 30 గ్రా, దోరగా వేయించిన మిరియాలపొడి 30గ్రా, అతిమధురంపాడి
| 30 గ్రా, పటికబెల్లంపాడి 30గ్రా, తీసుకొని అన్నింటినీ కలిపి మెత్తగా ముద్దలాగా అయ్యేటట్లు దంచి ఆ ముద్దను 10గ్రా,
తూకంగా గోలీలు చేసి నిలవజేసుకో. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండులేక మూడుసార్లు ఒకగోలీని బుగ్గన పెట్టుకొని
నిదానంగా చప్పరించి తింటుంటే దగ్గు, రొంప తగ్గిపోతయ్. 2) ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, తెల్లబియ్యం, కొత్త
బియ్యం, సారకాయ, బీరకాయ,
దోసకాయ, ఆకుకూరలు, ఇంకా చల్లబడిన అన్నంకూరలు, ఫ్రిట్లోని పదార్థాలు పూర్తిగా
నిషేధించు 3) రోజూ సాయంత్రం గోరువెచ్చని ఆవనూనె చెవుల్లో, ముక్కుల్లో మూడుమూడు చుక్కలు వేసుకొని, గొంతుకు
ముఖానికి మెడకు వీపుకు ఛాతీకి పాదాలకు మిగిలిన నూనెను మర్దనచేసి ఒకగంటాగి స్నానంచేస్తుండు. ఈ మార్గాలతో
నీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. శుభం.
No comments:
Post a Comment