భరించలేని తిమ్మిర్ల-సమస్య
శ్రీమతి కె. అనసూయ, ఒంగోలు : ఆచార్యా! నా వయస్సు
143 సం.లు. నేను కాళ్ళచేతుల తిమ్మిర్ల సమస్యతో బాధపడుతున్నారు.
మాటిమాటికి వేళ్ళు కొంగరులు పోతున్నాయి. కష్టపడి పనిచేయలేను.
చిన్నపని కూడా చేయలేక బాధపడుతున్నాను. దయచేసి సమస్య
తగే మంచి మార్గం చెప్పండి..
ఏల్చూరి : ప్రియభారతపుత్రీ! మీ ఇంటిచుట్టూ, మీ
ఊరిచుట్టూ మీ సమస్యకు లక్షలాది పరిష్కారాలు ఉన్నాయి. అవి
తెలుసుకోలేక ఇంతకాలంగా బాధపడుతున్నావు. 1) వావిలి చెట్టు
చిగుర్లు పది తీసుకొని నలగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి ఒకకప్పు కషాయం మిగిలేటట్లు మరగబెట్టి వడపోసి అది గోరువెచ్చగా
అయిన తరువాత ఒకచెంచా తేనె కలిపి పరగడపున తాగుతుండు. 2) ఇదే వావిలాకులు వేసి కాచిన నీటితో రెండుపూటలా
స్నానం చేస్తుండండి. 3) సాంరి 50 గ్రా, వేయించి దంచి పొడిచేయి. ఆ పొడిలో 100 గ్రా, బెల్లం కలిపి మెత్తగారంచి నిలువ
చేసుకో. రోజూ రెండుపూటలా భోజనం కాగానే 10 గ్రా, ముద్ద దవడన పెట్టుకొని చప్పరించి రసం మింగుతూ ఉండు.
క్రమంగా నీ వాత సమస్యలన్నీ మాయమైపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. శుభం.
తలలో పులిపిర్లు వచ్చిన సమస్య
శ్రీమతి లక్ష్మి, ఇమ్మం : ఆచార్యా! మా అబ్బాయి వయస్సు 11 సం.లు. వాడికి తలలో పులిపిర్లు వస్తున్నాయి.
కొన్ని మందులు వాడినా ఊడిపోయి మళ్ళీ వస్తున్నాయి. దయచేసి ఈ సమస్య తగ్గే మంచి మార్గం చెప్పండి.
ఏల్చూరి : ప్రియభారతపుత్రీ! మీ అబ్బాయికి వచ్చినవి పులిపిర్లు కాదు. వాటిని సురెడికాయలు అంటారు. రోజూ
-టిమీద మంచి ప్రశస్తమైన వేపనూనె రాస్తుండు. అలాగే మంచి పసుపు 50 గ్రా, బెల్లం 100 గ్రా, కలిపి దంచి రెండుపూటలా ,మోతాదుగా తినిపించి ఒక గ్లాసు మజ్జిగ తాగించు. ఆ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది
ధనియాల కషాయం మూడుపూటలా
పుక్కిలిస్తుంటే నోటిపుండ్లు మాయమౌతాయి.
No comments:
Post a Comment