28, జనవరి 2016, గురువారం

ATTU - AYURVEDAM


| రోజువారీ టిఫిన్లకు పెసరట్టు మంచిదా? మినపట్టు
మంచిదా? ఆరోగ్యానికి ఈ రెండింటిలో దేనికి ప్రాధా
అర్థచందు
న్యతనివ్వాలో చెప్పండి!

* అట్టు అనే వంటకం (దోసెలు, రొట్టెలు, అప్పచ్చులు) ఏ పిండితో చేసిందైనా
సరే, మిగిలిన పిండివంటల మాదిరే పండగకో పబ్బానికో తినవలసిందేగానీ, రోజూ
తప్పనిసరిగా తినేవి కావు. ఉదయం పూట సాంప్రదాయ పద్ధతిలో చద్దన్నం (చల్లన్నం
లేదా పెరుగన్నం) తినటం మానేసి, రోజూ అట్లు, పూరీలు, బజ్జీలు, పునుగులూ
తినటం ఉర్ణాశయానికి మేలు చేసే
అలవాటు కాదు. అది పెసరట్టినా,
మినపట్టినా, ఇదే సూత్రం. ఆ
రెండింటికీ గుణాల రీత్యా పెద్ద
వ్యత్యాసం లేదు. ఆరోగ్యవంతులు
కూడా పిండిపదార్థాల వాడకం తగ్గి
స్తేనే మంచిది.
ఏ కారణం చేతనో మనవాళ్ళు
ప్రొద్దున పూట మెతుకు తగలకూడ
దనే అపోహని బలంగా పెంచుకున్నారు. నిజానికి, ఇడ్లీలో గానీ, అట్టులోగానీ అధిక
శాతం బియ్యమే కదా! అయినా అన్నం మెతుకు సెంటిమెంట్ దేనికో అర్ధం కాదు.
నాగరికత పేరుతో మనకు మనమే సృష్టించుకునే ఇలాంటి కొన్ని అవరోధాల్లోంచి
బయటపడితే ఆరోగ్యానికి మేలు.
అట్టు మాత్రమే తినాలనుకుంటే తక్కువ కేలరీలు కలిగిన రాగులు, జొన్నలు,
సజ్జలు, గోధుమలు, ఉలవలు ఇలాంటి వాటిని రుబ్బి అట్లు వేసుకోవచ్చు. పెనరట్టు
గానీ, మినపట్టుగానీ సరదాగా అప్పుడప్పుడూ తినండి. మధ్య మధ్య కమ్మగా తాలింపు
పెట్టిన దధ్యోదనం (దధోజనం) కరైన్ లాంటివి కూడా తింటూ ఉండండి. రాగిపిం
డితోనూ, జొన్నపిండితోనూ, గోధుమపిండితో కూడా బజ్జీలు, పునుగులూ, పకోడీలు
వేసుకోవచ్చు. అన్ని రుచులను ఆస్వాదించడమే మంచిది.

KOBBARI PALU - KOBBARI NEELLU

కొబ్బరిపాలు కొబ్బరినీళ్ళు

కొబ్బరి తినటం మంచిదేనా? ఉపకారాలు, అవకా
రాలు వివరించగలరు

* కూరగాయల్ని ఎలా లేతగా ఉన్నప్పుడే తినాలో అలానే లేత
కొబ్బరినీ తినాలి. లేతగా ఉండే కొబ్బరికాయలు మార్కెట్లో దొరకటం
అపురూపం అవుతోంది. ముదిరిన కొబ్బరి, కొబ్బరినీళ్ళు కూడా వాత
వ్యాధులకు దారితీస్తాయి. దగ్గు, ఉబ్బసం, పైత్యరోగాలు వస్తాయి. లేత
కొబ్బరిని అతిగా తిన్నా ముదురు కొబ్బరిని కొద్దిగా తిన్నా రెండూ అప
ఇతర నూనెలతో పోల్చినప్పుడు కొబ్బరి నూనెలో 87 శాతం కొవ్వు
ఉంది. మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ మిశ్రమంగా ఉండే ఈ నూనె
గుండెకు అవకారం చేసేదని కొందరు, మేలుచేసేదని కొందరు
భావిస్తున్నారు. స్థూలకాయం తగ్గాలంటే కొబ్బరి తినటం మంచి
దంటారు ఇంకొందరు.
కొబ్బరిని ఇష్టంగా తినబోయే
ముందు, దానిలోని కొవ్వుని
దృష్టిలో పెట్టుకోవాలి. లేత కొబ్బరి
కోరును కొద్దిగా కొబ్బరి నీళ్ళుపోసి
పిండితే వచ్చే తెల్లని నీటిని కొబ్బరి
పాలు అంటారు. ముదిరిన కొబ్బరి
కన్నా లేత కొబ్బరిలో కొవ్వు శాతం
తక్కువగా ఉంటుంది. కొబ్బరిపా
లుగా తీసుకున్నప్పుడు మరింత
తక్కువగా ఉంటుంది. దీన్ని ఆహార పదార్థాల్లో వాడుకోవటం మంచిది. కొబ్బరి
నీళ్ళనీ, కొబ్బరిపాలనూ ఆహార పదార్థాలుగా తయారుచేసుకోవటం మంచిది. తగి
నంత పొదాషియం కోసం వీటి వాడకం అవసరం కూడా!
సాధారణంగా తెలుగువారి ఆహారంలో పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా
ఉంటాయి. అధిక ఉప్పు తినేవారికి తగినంత పొటాషియం ఉన్న కొబ్బరి పదార్థాలు
తీసుకోవటం అవసరం. అలాగే కూర అరటికాయ, అరటిపళ్లను కూడా తీసుకోవటం
మంచిది. ముఖ్యంగా వేసవి కాలంలో వడకొట్టి శోష కలగకుండా లవణ సమతుల్యత
(ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్) కోసం ఈ రెండింటినీ వాడుకుంటూ ఉండాలి.

NOONE VIKARAM

ఆ నూనె పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు సైడ్ ఎఫెక్టులు రాకుండా
ఏమైనా ఉపాయాలున్నాయా?
* అతిగా నూనె పదార్థాలు తిన్నప్పుడు దాహంగానూ, కడుపులో తిక్కతిక్కగానూ
ఉంటుంది. ఇది తగ్గడానికి మజ్జిగలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగితే
కొంత సుఖంగా ఉంటుంది.
ధనియాలు, జీలకర్ర, శొంది
మూడింటినీ దంచిన పొడిని మజ్జి
గలో కలుపుకుని తగినంత ఉప్పు,
పంచదార కలుపుకుని తాగితే
నూనె వలన కలిగిన వికారం తగ్గు
తుంది.
తేలికగా అరిగే ఆహార పదా


17, జనవరి 2016, ఆదివారం

BACKING SODA

'* తినేసోడా ఉప్పుని బేకీంగ్‌ సోడా అనీ, బ్రైడ్‌ సోడా అనీ కుకింగ్‌ సోదా అనీ, లై కార్పొనేట్‌ ఆఫ్‌ సోడా అనీ పిలుస్తారు. రొట్టెలు బాగా పొంగడం కోనం, పాలు విర క్కుండా ఉండటం కోనం దీన్ని వంటింట్లోకి తెచ్చారు మనవాళ్లు. నీళ్లలో వేస్తే దీనిలోని కర్భన వరమాణువులు గ్యాన్‌ రూపాన బుడగలుగా వియటకు వస్తాయి. కాబట్టి, దీన్ని సోడా ఉప్పు అనీ, “సాల్ట్‌ ఎయిరేటన్‌' అనీ పిలుస్తారు. 12 [1003 దీని శాస్త్రీయ నామం. 

ఉప్పు ఏవిధంగా మంచీ చెడూ మిశ్రమ ఫలితాలనిన్తుందో అలాగ తినేసోడా ఉప్పు కూడా ఇన్తుంది. ఉప్పు ఎవరెవరికి నిషేధమో వారందరికీ తినే సోడా ఉప్పు కూడా నిషే ధమే! అలాగే కాల్షియం లాంటి క్షారాలను వాడుతున్న వారు కూడా తినే సోడా ఉప్పు వాడకూడదు. రెండూ క్షూరాలే కాబట్టి శరీరంలో క్షారగుణాలు పెరిగిపోయి కొత్త నమ న్యలొస్తాయి. ఎంత సోడా లైకార్చ్‌ తీనుకున్నారో అంత మేర మామూలు ఉప్పుని తగ్గించి వాడుకుంటే ఉప్పు నమన్య తీరుతుంది. గ్యాన్‌ వగైరా బాధలకు సోడా బైకార్స్‌ వాడవచ్చా అని అడిగారు. కానీ గ్యాన్‌ బాధని తెచ్చి పెట్టే ఆహార విహారాలను మూర్పు చేనుకోవడం ఒక రసాయనం వాడటం కన్నా మంచిది కదా! 

RAGI AMBALI - AYURVEDAM



అన్నం తినబుద్ధి కాకపోవడం / అజీర్ణం ,నోటికి రుచి తెలియకపోవడం జరిగినప్పుడు ఏం చేయాలి? / అల్లం - అజీర్ణం - ఆయుర్వేదం / ALLAM - AJEERNAM - AYURVEDAM


దీనిని అరుచి అంటారు.అజీర్త్ కారణంగానైన, లేదా ఇతర కారణాలవల్లనైన ఇది కలగవచ్చు. కారణం ఏదైనా ముందు జీర్ణ వ్యవస్థ బలకరం కావాలి.

ప్రతి రోజూ అల్లనికి తగినంత ఉప్పు వేసుకుని దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తినాలి.నాలుక మీద జిగురు తగ్గి ,అన్న హితవు కలుగుతుంది.అన్నంలో మొదటి ముద్దగా అల్లం, ఉప్పు ( వీలైతే సైంధవ లవణం ) మిశ్రమాన్ని తినాలి.అరోగ్యవంతులు కూడా దీనిని పాటిస్తే భుక్తాయాసం కలుగదు.అహారం తేలికగా జీర్ణం అవుతుంది.అన్నం తినాలనే కోరిక కలుగుతుంది.ఉసిరికాయ తొక్కుడు పచ్చది లేద నల్ల పచ్చడిని ఈ అల్లం మిశ్రమానికి కలిపి తింటే మరీ మంచిది.భోజనంలో మొదటి పదార్థంగా దీనిని తీసుకోవాలి.
పచారీ కొట్లలో దొరికే పిప్పళ్ళను దోరగా వేయించి మెత్తగా దంచాలి.ఈ చూర్ణానికి ఆరు రెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరుచు కోవాలి.జీర్ణవ్యవస్థ బలంగా లేని వాళ్ళు వీటిని ఉదయం , రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటూ వుంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది.శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...