18, ఫిబ్రవరి 2024, ఆదివారం

ఉల్లి వలన మనకు కలిగే లాభాలు ఏమిటి

 ఉల్లి లేకుంటే వంటకు రుచి ఉండదు ఉల్లివలన మనకు కలిగే లాభాలు ఏమిటి? తెల్ల ఉల్లి పోషకాలు ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే

ఉల్లిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు సల్ఫర్ కాంపౌండ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి 100 గ్రాముల ఉల్లిపాయల్లో కేవలం 40 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఉల్లి బరువులో 90% నీళ్ళే వీటిలో ఉండే ప్రూక్ డాన్స్ అనే ఓ రకమైన పీచు పదార్థాల వలన రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు పెద్ద పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి ఉపయోగపడతాయి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి ఇదే ప్రూఫ్ తాండ్ల వలన కొంతమందికి ఉల్లి తీసుకుంటే గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ సి పచ్చివిల్లిలో అధికం వండినప్పుడు విటమిన్ సి కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి కానీ విటమిన్ b6 పొటాషియం మాత్ర మాత్రం పచ్చిఉల్లిలోనూ వండిన ఉల్లిలో కూడా ఒకే విధంగా ఉంటాయి తెల్లటి ఉల్లిలో కంటే గులాబీ రంగు ఉలిలో పాళీ పెనాల్స్ కొంచెం అధికం


16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఆహార నియమాలు ఏమిటి

 మన ఆహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్లో తేడాలు ఉంటాయి తాగబెట్టిన నూనెలు అధికంగా వాడటం తరచూ వేపుళ్ళు తినడం మటన్ లాంటివి అతిగా తీసుకోవడం ఒకే రకమైన నూనెలు ఎక్కువ కాలం వాడటం లాంటివి దీనికి కారణం కావచ్చు చైనీస్ వంటకాలనీ కొందరు ఇష్టంగా తింటారు అవన్నీ పూర్తిగా మైదాతోనే చేస్తారు ఇది చాలా ప్రమాదకరం కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాలను వదిలించుకోవాలంటే మైదా ప్రాసెస్ ఆహార పదార్థాలను దూరం పెట్టాలి డీప్ ఫ్రైలు మాంసాహారం తగ్గించుకోవాలి పొగ ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయాలి రోజుకు నాలుగైదు సార్లు పండ్లు కూరగాయలు తీసుకోవాలి దీని వల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగి అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోము అలాగే రోజుకు ఒక కప్పు ఓట్స్ బ్రౌన్ రైస్ లాంటి ధాన్యాలు తీసుకోవాలి. అదనంగా ఒక కప్పు పప్పు దినుసులు కూడా జోడించాలి ఆరోగ్యకర కొవ్వుల్ని అందించే బాదం వాల్ నట్స్ తో పాటు ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ కోసం అవి గుమ్మడి గింజలు లాంటివి తినాలి ఒమేగాత్రి ఫ్యాటీ ఆసిడ్స్ సప్లిమెంట్లు కూడా దొరుకుతాయి చెడు కొవ్వుల్ని దూరం చేయడంలో అల్లం వెల్లుల్లి సైతం సాయపడతాయి అలాగే నీళ్లు ఎక్కువగా తాగాలి రోజు ఓ గంట వ్యాయామం చేయాలి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది

13, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఫంక్షనల్ ఫుడ్ తో డయాబెటిస్ కు కళ్లెం

 ఫంక్షనల్ ఆహారంతో డయాబెటిక్ వల్ల వచ్చే కంటి సమస్యలను నియంత్రించడానికి ఆస్కారం ఉన్నదని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంతో తేలింది ఫంక్షనల్ ఫుడ్ ఆహార పదార్థాల మిశ్రమం గా పిలిచే ఆహారంతో డయాబెటిస్ సోకిన ఎలుకల కంటిచూపు మెరుగుపడిందని పరిశోధనల్లో వెళ్లడైంది మిడికేసన్ ఆఫ్ లెన్స్ ఒప్పోసిఫికేషన్ బై ఫంక్షనల్ ఫుడ్ ఇన్ డయాబెటిక్ రోడెన్ట్ మోడల్ పేరిట సైన్స్ డైరెక్ట్ జర్నల్లో పరిశోధన ఫలితాలను ప్రచురించారు ఎన్ఐఎన్ పరిశోధకుల బృందం సీనియర్ సైంటిస్ట్ భాను ప్రకాశ్ రెడ్డి సారథ్యంలో జరిగిన అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఉసిరి పసుపు బ్లాక్ పెప్పర్ దాల్చిన అల్లం మెంతులతో చేసిన ఫంక్షనల్ ఫుడ్ ను ఆహారంగా 20 వారాలపాటు ఎలుకలకు అందించగా డయాబెటిస్ ప్రభావం తగ్గినట్లుగా పరిశోధకులు గుర్తించారు ఫంక్షన్ హాల్ ఫుడ్ తీసుకున్న ఎలుకల్లో కంటి శుక్లాల సమస్య పెరగడం ఆగిపోయినట్టు గుర్తించారు 20045 నాటికి మధుమేహుల సంఖ్య 783 మిలియన్లకు చేరుతుందని అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ గణాంకాలు చెబుతుండగా ఆహార నియమాలతోనే డయాబెటిస్కు కళ్ళెం వేయచ్చని ఈ పరిశోధనలో తేలింది

11, ఫిబ్రవరి 2024, ఆదివారం

హెల్త్ బిట్స్ 11-2-2024

దవాఖానాలో దంత ధావనం

నోట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది దీనికి ఇన్ఫెక్షన్ కలిగించే గుణం ఉండటం వల్ల నిమోనియా వస్తుంది. దీంతో హాస్పిటల్ లో చేరిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి అంత నిమోనియా ముప్పు ఉన్నట్లే అయితే దవాఖానాలో ఉన్నన్ని రోజులు క్రమం తప్పక బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు జామ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ వివరాలను వెల్లడించింది హాస్పిటల్ వాతావరణం వల్ల నోటిలో పేర్కొనే బ్యాక్టీరియా రోజు బ్రష్ చేసుకోవడం వల్ల దూరం అవుతుంది నిమోనియా ముప్పు కూడా తగ్గిపోతుంది రోగి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే సమయాన్ని మెకానికల్ వెంటిలేటర్ మీద గడపాల్సిన సమయాన్ని కూడా ఇది తగ్గిస్తుందని తెలిపింది 

మంచి మూడ్ కావాలంటే యోగర్ట్ తినండి..

యోగర్ట్ పొట్ట ఆరోగ్యాన్ని కాదు మన మూడును కూడా మెరుగుపరుస్తుంది. యోగర్ట్ లో ఉండే లాక్టో బాసిల్లస్ మన శరీరం ఒత్తిడిని ఎదుర్కొనేలా సహాయపడుతుంది కొంగుబాటు ఆందోళనను కూడా నివారిస్తుంది దీనికి సంబంధించిన అధ్యయనం బ్రెయిన్ బిహేవియర్ అండ్ ఇమ్యూనిటీ అనే జర్నల్లో ప్రచురితమైంది ఈ ఫలితాలు ఆందోళన కుంగు బాటు ఇతర మానసిక ఆరోగ్య సమస్యల చికిత్సకు కొత్తదారులను తెరుస్తాయి అంటున్నారు పరిశోధకులు..

చిక్కుడుకాయల కథ

 చిక్కుడు పూసే చిక్కుడు కాసే తీగె నాగో ఉయ్యాలో చిక్కుడు దింప ఎవరూ లేరు తీగె నాగో ఉయ్యాలో చిక్కుడు తెంప రామయ్య లేడా తీగె నాగో ఉయ్యాలో

పై జానపద గీతం లో చిక్కుడు పూసింది అంటే అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని చిక్కుడు తెంపుటకు ఎవరు అంటే పెళ్లాడే వాళ్ళు ఎవరని రామయ్య లాంటి భర్త కావాలని అంతరార్థం డాక్టర్ కి బుక్ నుద్దీన్ జానపద సాహిత్యంలో అలంకార విధానము గ్రంథంలో ఈ వివరణ ఇచ్చారు చిక్కుడు పువ్వులు పూసేటివేల చిప్పలతో గంధాలు తీసేటివేల అనే జానపద గీతం కూడా వివాహ సందర్భాన్ని సూచిస్తుందని దీన్నిబట్టి అనుకోవచ్చు చిక్కుడు మన ప్రాచీన సంస్కృతిలో ఒక భాగం భాగం మాసం నాటికి నా మహిమ చూసుకో అని చిక్కుడు అంటుందని రైతు సామెత అప్పటికి చిక్కుడుకాయలు దండిగా పండుతాయి రథసప్తమి నాడు చిక్కుడుకాయలతో రథం చేసి పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదన పెడతారు ఇలాగే సెయింట్ జోసెఫ్ పండగ రోజున చిక్కుళ్ళను వండే ఆచారం కూడా కొన్ని విదేశాల్లో ఉంది పైథాగరస్ క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దికి చెందినవాడు బుద్ధుడికి ఇంచుమించు సమకాలికుడు ఆత్మకు పునర్జన్మ లేదని బుద్ధుడు ప్రకటిస్తే ఈ పైథాగరస్ ఆత్మ నశించదని మరొక జీవిగా అవతరిస్తుందని పేర్కొన్నాడు ఈ పునర్జన్మ ప్రక్రియకు చిక్కుడు అవరోధమని తినకూడని దాని నిషేధించాడు చిక్కుడు పువ్వుల్లోంచి విడుదలయ్యే పరాగ రేణువులు గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి రక్త క్షీణత కలిగిస్తాయని భావనతో పైథాగరస్ ఈ భావ బీన్స్ నిషేధం ప్రకటించాడని ఒక వాదం ఉంది సావిజం అంటారు దీనిని చిక్కుడు గింజల్ని ఉడికించి పైపురని తీసేసి తింటే సాగిజం రాదని ఓ మినహాయింపు ఇచ్చారు. ఇవన్నీ అపోహలేనని చిక్కుడుకాయలు రక్త వృద్ధి చేస్తాయని తర్వాతి పరిశోధకులు కనుగొన్నారు ఈ గింజలు కూడా ఇనుప తుప్పు వాసన కలిగి ఉంటాయి కూడా చిక్కుళ్ళు అధికంగా మాంసకృత్తులు అందిస్తాయి క్యాన్సర్ వ్యాధిలో క్యాన్సర్ కణాలని ఎదుర్కోగల సమర్థత వీటికి ఉంది పెద్ద ప్రేమల్లో వచ్చే క్యాన్సర్ పైన పని చేస్తాయని కనుగొన్నారు బాలింతలకు పాలు పెంచుతాయి గుండెకు మేలు చేస్తాయి పురుషుల్లో జీవకణాలను పెంచుతాయి పార్కిన్ సోనిజం అనే వణుకు వ్యాధిని తగ్గిస్తాయి చిక్కుడు గింజలు సోయా గింజలు కలిపి నానబెట్టి రుబ్బిన పిండిలో ఉల్లి మిరప ముక్కలు వేసి చేసిన వడల్ని చైనా వాళ్లు దౌబాంజియాంగ్ అంటారు డిఎం చిక్కుడు ముక్కలు కలిపి వండిన కిచిడీని పర్షియన్లు బగాలి పోలో అంటారు చిక్కుడు గింజల్ని సాతాలించి ఫుల్ మెడమ్స్ అనే వంటకాన్ని ఈజిప్షన్లు రొట్టెతోపాటు నంజుకుంటూ తింటారట ఇథియోపియాలో చిక్కుడు గింజల్ని నానబెట్టి రుబ్బిన పిండితో ఇంజీరా అనే దోసెలు పోసుకుంటారు అనప చిక్కుడుకాయ చిక్కుడు బియ్యపు చిక్కుడు ఎర్ర చిక్కుడు తెల్లచిక్కుడు నల్లచిక్కుడు వెట్టి చిక్కుడు మొక్క చిక్కుడు తీగ చిక్కుడు లలో చాలా రకాలు ఉన్నాయి అన్నింటి గుణాలు ఇంచుమించు సమానమే రాజ్మా సోయా లాంటివి కూడా చిక్కుళ్ళ మాదిరే లైంగిక శక్తిని ద్విగుణం బహుళకం చేస్తాయి కఫాన్ని పెంచుతాయి ధనియాలు జీలకర్ర సొంటి మూడింటి పొడిని మజ్జిగలో కలిపి తాగితే వీటిని తిన్నందువలన కడుపుబ్బరం కలగకుండా ఉంటుంది బలకరమైన ఆహార ఔషధాలు ఇవి కాబట్టి తరచూ తింటూ ఉంటే మంచిది. ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా పెట్టాలి ఇవి తేలికగా వంట పట్టాలంటే లేత కాయల్ని ఎంచుకొని తొక్కలతో కలిపి కూర పప్పు పచ్చడి నిలవ పచ్చడి పులుసు పులుసు కూర అన్ని వండుకోవచ్చు



దంతాల ఆరోగ్యానికి నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి

 దంతాల శుభ్రత సరిగా లేనప్పుడు నోటి దుర్వాసన వస్తుంది మనం తినే ఆహారం ఆరోగ్య పరిరక్షణకు ఎంత ఉపయోగపడుతుందో దంతాల ఆరోగ్యానికి అంతే ఉపయోగపడుతుంది పిండి పదార్థాలు లేదా తీయటి ఆహారాన్ని తినేటప్పుడు తాగినప్పుడు నోటిలో దంతక్షయం చిగుళ్ళ వ్యాధికి కారణమయ్యే సూక్ష్మ క్రిములకు కూడా ఆహారం ఇస్తున్నట్టు ఇటువంటి ఆహారం తీసుకున్నప్పుడు నోటిలో ఆమ్లాలు ఏర్పడతాయి ఈ ఆమ్లాలు ఆహారం తినడం పూర్తయిన 20 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు దంతాలపై దాడి చేసి దంతాల ఉపరితలంపై ఉండే ఎనామిల్ను విచ్ఛిన్నం చేస్తాయి ఇది దంతా క్షయానికి దారితీస్తుంది పీచు పదార్థం ఎక్కువగా ఉండే కూరగాయలు ఆకుకూరలు పండ్లు మన దంతాలను శుభ్రం చేసేందుకు ఉపయోగపడతాయి పాలు పెరుగు లాంటిది ఎనామిల్ ను నాశనం చేసే ఆమ్లాల తయారీని తగ్గిస్తాయి పాలిపినాల్స్ అధికంగా ఉండే గ్రీన్ టీ కూడా దంత సంరక్షణకు మంచిది. తీపి పదార్థాలు బాగా వేడి బాగా చల్లటి పదార్థాలు తగ్గించడంతోపాటు ఆహారం తిన్న వెంటనే నోరు నీటితో పుక్కిలించడం తరచూ నీళ్లు తాగడం రోజుకు రెండుసార్లు దంత దావనం చేసుకోవడం మొదలైన ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటే దంతాలను సంరక్షించుకోవచ్చు నోటి దుర్వాసనను నియంత్రించవచ్చు



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...