Sunday, 25 October 2015

PALA VIRUGUDU / VIRIGINA PALU - LABHA NASHTALU

పాలవిరుగుడు తినవచ్చా?

విరిగిన పాలు ఆరోగ్యానికి మంచివేనా? పాలవిరుగుడుతో చేసిన
స్వీట్లు తినవచ్చా?

* పాలు విరగడం అంటే పాలలో
పాలకు సంబంధించిన పదార్థాలను,
నీటినీ విడగొట్టటం అని అర్థం.
పాలలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం,
ఫాస్పరస్, కొవ్వు ఇవి గట్టిపడి,
ముద్దగా అయి, నీళ్లు వేరవుతాయి.
పాలలో విషదోషాల వలనగానీ,
పాలకు వ్యతిరేకమైన ఉప్పు, కారం, పులుపు వంటివి తగలటం వలన గానీ, పాలు
కుళ్లటం వలన గానీ విరిగితే అవి మంచివి కానట్టే లెక్క! పాలను ఫ్రిజులో భద్రపరచ
కుండానూ, కాయకుండానూ ఉంచేసినందు వలన విరిగే పాలు పులిసిపోయి విరిగి
నట్టు లెక్క. అవి చేదుగానూ, వాసనగానూ ఉన్నప్పుడు అవి నిస్సందేహంగా పారబో
యాల్సినవే! విరిగిన పాలంటే మన పెద్దలకు సదభిప్రాయం లేదు. పాల విరుగుడుతో
వంటకాలు మనకు లేవు. రసగుల్లాలు, రసమలై లాంటి పాల విరుగుడు స్వీట్లను విదేశీ
పద్ధతిలో ఆమ్లాలను కలిపి విరగొట్టి తయారు చేస్తారు. పాలను పద్ధతి ప్రకారం విరగ
కొడితే, అందులో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్ తక్కువగా ఉంటుంది. అదే, జున్నుపాలే
కొవ్వు తక్కువ, ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ జున్నుని వైద్య పరిభాషలో 'కొలో
సమ్' అంటారు. విరిగే పాలని 'సోర్ మిల్క్' అంటారు.

GASA GASALU - LABHA NASHTALU

గసగసాలు విషాలే

మసాలా ద్రవ్యాల్లో గసగసాల వలన లాభనష్టాలు చెప్తారా?

మసాలాలకు అలవాటుపడి
పోయి అవి లేకపోతే జీవించలేని పరి
స్థితిని గసగసాలు తెస్తాయన్నమాట.
ఎన్ని సుగుణాలున్నా మనల్ని బాని
సగా మార్చేది విషపదార్ధమే. గసాలు
రుచిగా ఉంటాయి. చలవ చేస్తాయి.
కానీ కఠినంగా అరుగుతాయి. విరేచ
నాన్ని బంధిస్తాయి. అందుకని నీళ్ళవిరేచనాలు అవుతున్నప్పుడు గసాలను నూరి రసం తాగిస్తారు. కానీ, రోజూ
తినేవాళ్ళలో మలబద్ధత కలిగిస్తాయి, కఫ రోగాలు, జలుబు, కళ్ళెపడటంలాంటి
వ్యాధుల్లో కఫాన్ని అదుపుచేస్తాయి. ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి. సుఖ
నిద్ర పట్టిస్తాయి. ఎందుకంటే గసాలలో నల్లమందు ఉంటుంది కాబట్టి,
గసాలనేవి పోస్తుకాయల లోపలి గింజలు. ఈ మొక్క కాండం,
ఆకులు, కాయల్లోంచి పాలుస్రవిస్తాయి. ఆ పాలను ఆరపెడితే అదే నల్ల
మందు. గసాలలో కూడా కొద్దిశాతం నల్లమందు (ఓపియం) ఉంటుంది.
మార్ఫిన్, హిరాయిన్ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను ఇందులోంచే
తీస్తారు. గసాలను ఎవరుపడితే వాళ్ళు పండించటంపై
కార్ణచందు నిషేధం పెట్టిన ప్రభుత్వం వాటి వాడకం మీద దృష్టి పెట్ట
లేకపోయింది. ప్రజలే చైతన్యవంతులు కావాలి.

AMAEBIOSIS KI MANDHU - AYURVEDIC SOLUTION


అమీబియాసిస్క మందు

అమీబియని తగ్గదా? దానికి నివారణ లేదా?

- అమీబియాసిస్ వ్యాధిని చిరంజీవిని చేస్తున్నది ఆ వ్యాధి
వచ్చినవారే! కొద్దికాలం పాటు పేగులు బలం పుంజుకునే వరకూ
శుద్ధ ఆహారం తీసుకోగలిగితే వ్యాధి తలెత్తకుండా cheyavachu.
కుడిచేతి గోళ్లు పెరిగి, వాటి లోపల నల్లని మట్టి పేరుకొని ఉన్న వ్యక్తి
తప్పనిసరిగా అమీబియాసిస్ రోగి అయి ఉంటాడు. రోడ్డు పక్కన జంగ్
డీలు, బజ్జీలు, పునుగుల బళ్ల దగ్గర, చైనా నూడుల్స్ బళ్ల దగ్గర తారట్లాడే
వాళ్లలోనూ హాస్టళ్లలో, మెస్సుల్లో తింటూ చదువుకునే పిల్లల్లోనూ అమీబి
యాసిస్ బాధితులు చాలామంది ఉంటారు. నాణ్యమైన మంచినీటి సర
పరా లేని ఊర్లలోనూ, చెరువు నీళ్లు, కాలువ నీళ్లను తాగే ఊళ్లలోనూ అమీ
బియాసిస్ పీడితులు ఎక్కువగా ఉంటారు. ఆహారం తయారీలో గానీ వద్ద 
నలో గానీ నిర్లక్ష్యం ఈ వ్యాధికి పెట్టుబడి పెట్తోంది. హోటళ్లకు, విందు
భోజనాలకు వెళ్లినప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది అరుదుగా కని
ఎంచే దృశ్యం అయిపోయింది. చేతుల్లో నీళ్లు పోసుకొని మంత్రజలం చిలకరించినట్టు
విస్తట్లో చల్లి, విస్తరినీ చేతుల్నీ ఒకే
సారి కడిగి అందులో అన్నం తినే
విచిత్ర అలవాటు అమీబియాసిన్ని
చిరంజీవిని చేస్తోంది.
భోజనం చేయగానే విరేచనా
నికి వెళ్లవలసి రావటం, జిగురు
(బంక), రక్తంతో కూడిన విరేచ
నాలు, కడుపులో అసౌకర్యంగా
ఉండటం, నీరసం, అరుగుదల లేక
పోవటం, గ్యాసు, పొట్ట ఉబ్బరం
రాంటి బాధలు తరచూ కలుగుతుంటే అమీబియాసిస్ హెచ్చరికలు ఇచ్చినట్టేననుకో
వాలి. చల్లకవ్వంతో బాగా చిలికిన మజ్జిగ ఈ వ్యాధిలో అసలైన మందు. మజ్జిగలో ఉప
యోగకారక సూక్ష్మజీవులుంటాయి. అవి కడుపులో అపకార కారక సూక్ష్మజీవులను
కట్టడి చేస్తాయి. అందుకని పులిసినవీ, ఫ్రీజులో ఉంచినవీ కాకుండా తియ్యని మజ్జిగని
తాగుతూ ఉంటే అమీబియాసిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. టిఫిన్లకు బదులుగా
ప్రొద్దున్న పూట తోడు అన్నం గానీ, పెరుగన్నం గానీ, మజ్జిగ అన్నం గానీ తినటం
వలన అమీబియాసిస్ వ్యాధి అదుపు సులువవుతుంది. మజ్జిగ మీద తేరుకున్న నీటిని
మంచినీళ్లకు బదులుగా తాగటం వలన శక్తివంతమైన మందులు వాడాల్సిన అగత్యం
తప్పుతుంది.

Friday, 23 October 2015

RAKTHA SHUDDHI THO CHARMAVYADHI NIVARANA - AYURVEDAM

రక్తశుద్ధిలేక చర్మవ్యాధులొస్తున్న - సమస్య

  నా వయస్సు 48 సం.లు. నాకు
తరచుగా శరీరం మీద దురదలు, పుండ్లు, గడ్డలు వస్తున్నయ్. చర్మం అక్కడక్కడ
నల్లబారుతుంది. డాక్టర్లకు చూపిస్తే రక్తశుద్ధి లేదని మందులు వ్రాసించ్చారు. అవి
వాడటం ఇష్టంలేక మీ సలహా కోసం వ్రాస్తున్నాను. దయతో మార్గం చెప్పండి.

:- పరిశుభ్రంగా ఉన్న కుంకుడుకాయలు తీసు
కొచ్చి పగలగొట్టి విత్తనాలు తీసివేయండి. పై బెరడును చిన్న ముక్కలుగా కత్తిరించి
ఎండబెట్టి దంచి జల్లించండి. ఆ పొడితో సమంగా సుగంధపాలవేళ్ళపొడి కలిపి ఆ
మొత్తం చూర్ణంలో కొద్దిగా తేనె వేసి నూరి బఠాణిగింజంత గోలీలు కట్టి విలవజేసు
కోండి. రోజూ ఉదయంపూట ఒక గోలీని సగం చిలికిన అరకప్పు పెరుగుతోను,
రాత్రి
ఒక గోలీని మంచినీటితోను సేవిస్తుంటే క్రమంగా రక్తశుద్ధి జరిగి చర్మసమస్యలు తగ్గిపోతయ్. వంకాయ, గోంగూర,
ఆవకాయ, మాంసం, చేపలు, గుడ్లు, శనగపిండివంటి పడని పదార్థాలు నిషేధించండి. శుభం.

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్య - ఆయుర్వేద పరిష్కారం / యవ్వనవార్ధక్యం /YAVVANA VARDHAKYAM - AYURVEDIC SOLUTION

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

ఉసిరిక పండు పై బెరడు రసం లేదా చూర్ణం - 10 గ్రాములు
దేశవాళీ ఆవు నెయ్యి - 10 గ్రాములు,
చక్కెర - 10 గ్రాములు,
తేనె - 20 గ్రాములు,

పై అన్నింటినీ తీసుకుని బాగా కలిపి ,ఉదయం పర గడుపున తిని అనుపానంగా 1 కప్పు గోరు వెచ్చని పాలలో 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగుతూ ఉండాలి.

ఉదయం స్నానానికి గంట ముందు 6 గంటల వేళ శరీరానికి గోరు వెచ్చగా నువ్వుల నూనె మర్దన చేసి అర గంట పాటు సూర్య నమస్కారాలు,పావు గంట ప్రాణాయామం,పావు గంట ధ్యానం చేయాలి.


ఆకు కూరలు,పాత బియ్యం,కాయ గూరలు,ఇంట్లో వండిన తీపి పదార్థాలు తింటుండాలి.

మధ్య వయసులో వచ్చిన ముసలితనం పోయి తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది.

Sunday, 18 October 2015

నరాల బలహీనత సమస్య - ఆయుర్వేద పరిష్కారం $ ఆహార పరిష్కారం / NARALA BALAHEENATHA SAMASYA - AYURVEDIC $ FOOD SOLUTIONS

1  .  శరీరంలో నరాలన్నీ చచ్చుబడినట్లుగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే 

అతిబల వేళ్ళు -250 గ్రాములు,
అశ్వగంధ దుంపలు - 250 గ్రాములు,
నేలతాడి దుంపలు - 250 గ్రాములు,
అతిమధురం వేళ్ళు - 250 గ్రాములు,

పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా మూడు సార్లు కాని ,ఏడుసార్లుకాని చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

ఈ చూర్ణాన్ని రెండు పూటలా 10 గ్రాముల మొతాదుగా అరగ్లాసు గోరువెచ్చటి ఆవుపాలల్లో వేసి అందులో ఒక చెంచా ఆవు నెయ్యి,రెండు చెంచాల తేనె కలిపి రోజూ సేవిస్తుండాలి.

కసివింద / చెన్నంగి ఆకుల రసం తీసి దానికి సమంగా వెన్న కలిపి ఆ మిశ్రమాన్ని శరీరమంతా మర్దన చేసి గంటాగి స్నానం చేయాలి.కసివింద లభించకపోతే తెల్ల ఆవాల నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి.

తాంబూలంలో 2 గ్రాముల జాపత్రి పెట్టి సేవిస్తుండాలి.

నరాల బలహీనత సమస్య పరిష్కారమౌతుంది.

2  .నరాల బలహీనత కు ఆహార పరిష్కారం.

వరి ప్రధాన ఆహరంగా తీసుకునే వాళ్లు చిట్టూ ,తవుడు కోల్పోతున్నారు .ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఉంది.

.చిట్టూ ,తవుడు లేకపోవడం వలన మనం ప్రధానంగా బి1 విటమిన్ / థయమిన్ లోపానికి గురవుతున్నాము.దీని వలన నరాల బలహీనత / బెరి బెరి జబ్బు ఏర్పడుతుంది.కాయగూరలు,మాంసం బాగా తీసుకోగలిగితే వరి అన్నం మీద ఆధారపడకుండానే శరీరానికి కావాల్సిన థయమిన్ పొందవచ్చు.100 గ్రాముల దంపుడు బియ్యంలో  300 మి.గ్రా.థయమిన్ ఉంటుంది.కానీ 100 గ్రాముల గోధుమల్లో 500 మి.గ్రా. థయమిన్ ఉంటుంది.అంటే ఒక పూట వరి అన్నం ,ఒక పూట గోధుమతో రోటీ లాంటి ఏదైనా వంటకం తినటం మంచిదన్నమాట.ఎండిన బఠాణీ ( 800 ),బంగాళా దుంపలు ( 150 ) కూడా ఆ లోటుని భర్తీ చేస్తాయి.నువ్వులు,వేరు శనగ గుళ్ళు ,పొద్దు తిరుగుడు గింజలు,వీటిలోంచి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిలో బి విటమిన్ ఉంటుంది.దీనిని తెలక పిండి అంటారు.అప్పుడప్పుడు కూరగా చేసుకుని తినవచ్చు.గోధుమ,రాగి,జొన్న,సజ్జలు,వీటిలోంచి చిట్టు,తవుడు తీయకుండానే పూర్తి ధాన్యాన్ని మరాడించి వాడుకుంటున్నము కదా .దంపుడు బియ్యానికన్నా అనేక విధాలుగా ఈ ధాన్యాల్లో విటమినులు ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి థయమిన్ లోపం ఉన్నవాళ్లు దంపుడు బియ్యానికన్నా గోధుమ ,రాగి,జొన్న,సజ్జల మీద ఆధారపడటమే మంచిది.మొలకెత్తిన రాగులు,సజ్జలు,పెసలు,శనగలతో పిండి వంటలు చేసుకుంటే రెట్టింపు థయమిన్ దొరుకుతుంది.అతిగా వేడి మీద వండితే థయమిన్ ఆవిరైపోతుంది.అందుకని బి1 కావాలంటే తేలికగా ఉడికించి వండుకుంటేనే ఫలితం ఉంటుంది.టాబ్లెట్లు మింగటం కన్నా ఆహారం ద్వారా దీనిని పొందటమే మంచిది.

NITHYAM JALUBU PADISHAM ROMPA DAGGU SAMASYAKU DRAKSHA GUTIKALU

నిత్యం జలుబు, పడిశం, రొంప, దగ్గు సమస్యకు - ద్రాక్షగుటికలు

-:  నా వయస్సు 35 సం.లు, నాకు ఋతువుతో సంబంధం లేకుండా
ఎల్లప్పుడూ జలుబు పీడిస్తూనే వుంటుంది. దాంతోపాటు దగ్గుకూడా హింసిస్తుంది. ఎప్పుడూ సరిగా ఊపిరాడదు. ఈ సమ
స్యతో క్షణంక్షణం నరకయాతన పడుతున్నాను. దయతో మంచి మార్గం చెప్పండి.

! 1) నీ సమస్యకు చక్కని ఆహారౌషధమార్గం నీ ఇంట్లోనే వుంది. విశ్వాసంతో ఆచ
రించి విజయం సాధించు, గింజలున్న ఎండుద్రాక్ష 30 గ్రా, దోరగా వేయించిన మిరియాలపొడి 30గ్రా, అతిమధురంపాడి
| 30 గ్రా, పటికబెల్లంపాడి 30గ్రా, తీసుకొని అన్నింటినీ కలిపి మెత్తగా ముద్దలాగా అయ్యేటట్లు దంచి ఆ ముద్దను 10గ్రా,
తూకంగా గోలీలు చేసి నిలవజేసుకో. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండులేక మూడుసార్లు ఒకగోలీని బుగ్గన పెట్టుకొని
నిదానంగా చప్పరించి తింటుంటే దగ్గు, రొంప తగ్గిపోతయ్. 2) ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, తెల్లబియ్యం, కొత్త
బియ్యం, సారకాయ, బీరకాయ,
దోసకాయ, ఆకుకూరలు, ఇంకా చల్లబడిన అన్నంకూరలు, ఫ్రిట్లోని పదార్థాలు పూర్తిగా
నిషేధించు 3) రోజూ సాయంత్రం గోరువెచ్చని ఆవనూనె చెవుల్లో, ముక్కుల్లో మూడుమూడు చుక్కలు వేసుకొని, గొంతుకు
ముఖానికి మెడకు వీపుకు ఛాతీకి పాదాలకు మిగిలిన నూనెను మర్దనచేసి ఒకగంటాగి స్నానంచేస్తుండు. ఈ మార్గాలతో
నీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. శుభం.

ముఖం నల్లగా ఉన్న సమస్య UKHAM NALLAGA VUNNA SAMASYAKU KSHEERAHARIDRA LEPANAM

ముఖం నల్లగా ఉన్న సమస్య 

ఒక కప్పు ఆవుపాలు గానీ గేదె పాలు గానీ తీసుకుని వేడి చేసి దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి విరగ్గొట్టి , వడపోసి e r విరుగుడు లో ఒక పావు చెంచా కస్తూరి పసుపు పొడి, పావు చెంచా బార్లీ గింజల పొడి ఒక పావు చెంచా గంధకచ్చూరాలు పొడి కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకోవాలి. అది ఆరడం మొదలుకాగానే గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి అవసరమైతే మోతాదు పెంచుకుని శరీరమంతా కూడా లేపనం చేసుకోవచ్చు దీనివల్ల నలుపుదనం విరిగిపోయి చర్మం రంగు మారుతుంది. మంచి రంగు వస్తుంది.

KEELLANOPPULAKU NIMMAKAYAHALWA - AYURVEDIC SOLUTION


కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం./ ఆయుర్వేద పరిష్కారం. / KADUPULO MANTA PULLANI THRENPULU THALAPOTU - HARITHAKILEHYAM

కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం.

కరక్కాయ పోడి - 100 గ్రా.
ఎండు ద్రాక్ష పండ్లు - 100 గ్రా.
పటిక బెల్లం పొడి - 100 గ్రా.

పై అన్నింటిని కలిపి ముద్దలాగా దంచుకొని నిలువచేసుకోవాలి.రోజూ రెండు పూటలా 10 గ్రా. ముద్దను బుగ్గన పెట్టుకొని తింటుంటే ఆరోగ్యం కలుగుతుంది.

2. చల్ల బడ్డ అన్నం,కొత్త బియ్యపు అన్నం తినవద్దు.బియ్యాన్ని ఒక రాత్రి నానబెట్టి ,ఒక పగలు ఎండించి దోరగా వేయించి రవ్వ చేసుకొని ,తగినంత రవ్వ నీటిలో వేసి వండుతూ అందులో అల్లం 1 గ్రా.ముక్క,చిటికెడు మిరియాల పొడి ,చిటికెడు జిలకర పొడి,తగినంత సైంధవ లవణం,కొద్ది కొద్దిగా కొత్తి మీర,పుదీనా ,కరివేపాకులు వేసి వండుతూ అందులో వంటాముదం ,నెయ్యి లేదా వెన్నలతో తిరగమాత పెట్టి ఈ ఆహారాన్ని ఆకుకూరలతో కలిపి సేవిస్తుంటే ఆ ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.పై సమస్యలన్నీ తగ్గిపోతాయి.

ATHI AKALI SAMASYA KU VUTTHARENI YOGAM - AYURVEDIC SOLUTION


KANTIPORALA SAMASYAKU ADDASARAM KATUKA - AYURVEDIC SOLUTION


NIDRAPATTANI SAMASYA KU NIDRA YOGALU - AYURVEDIC SOLUTION


MOORCHA SAMASYAKU SARASWATHICHURNAM - AYURVEDIC SOLUTION



PILLALA DRUSHTIMANDYA SAMASYA -AYURVEDIC SOLUTION


KATORA GONTHU SAMASYAKU SONTI CHURNAM


DANTHA SAMASYALAKU LAKSHMI MANJAN


NAPUMSAKATHVA SAMASYA KU AMRUTHA CHURNAM - AYURVEDIC SOLUTION



MUKHAM PAI MUDATHALA SAMASYA - AYURVEDIC SOLUTION



KALLA PAGULLA SAMASYA - GUGGILA NAVANEETHAM - AYURVEDIC SOLUTION


PEDIMALA JABBULAKU JAJIKAYA LEPANAM - AYURVEDIC SOLUTION


MOHAM NALLAGA MARINA SAMASYA - AYURVEDIC SOLUTION



CHARMA VYADHI SAMASYA - MANJISHTADHI KASHAYAM - AYURVEDIC SOLUTION


GORU PUNDLA SAMASYA - AYURVEDIC SOLUTION


MANGU SHOBHI MACHALU - HARIDRADILEPANAM - AYURVEDIC SOLUTION


SHAREERA DURGANDHA SAMASYA - AYURVEDIC SOLUTION


LIVER SAMASYA - DHAVANA YOGAM


SHWASA ADAKAPOVADAM - AYURVEDIC SOLUTION


RAKTHA HEENATHA PENCHE PANDUROGAM - AYURVEDIC SOLUTION


KESHA SOUNDARYAM - AYURVEDIC SOLUTION


GARBHINI STHREELA VANTHULU - NIMMARASA BHASMAM- AYURVEDIC SOLUTION


KEELLA NOPPULAKU NIMMARASAM - AYURVEDIC SOLUTION



CHEDIPOYINA VEERYA SAMASYA - AYURVEDIC SOLUTION


SHAREERAM YENDIPOVADAM - AYURVEDIC SOLUTION



SANTHANAM KORAKU LINGA DHONDA YOGAM - AYURVEDIC SOLUTION


Saturday, 17 October 2015

14 YEARS ATHIMOOTHRA VYADHI - AYURVEDIC SOLUTION


THEEVRA ASTHMA SAMASYA - AYURVEDIC SOLUTION


VIRECHANAM KANI SAMASYA - AYURVEDIC SOLUTION



NATTHI SAMASYA - AYURVEDIC ADVICE


PITTASHAYAM LO RALLA SAMASYA - AYURVEDIC SOLUTION


SANTHANA SAMASYA - AYURVEDIC SOLUTION


CHOOPU LENI SAMASYA - AYURVEDIC SOLUTION


HASTHA PRAYOGA SAMASYA - AYURVEDIC SOLUTION


VOOPIRITHITTHULALO NEERU - AYURVEDIC SOLUTION


BHAYAM ROGAM - AYURVEDIC SOLUTION


AMAVATHA SAMASYA - AYURVEDIC SOLUTION


DANTHA SAMASYA - AYURVEDIC SOLUTION


MADYAPANAM,DHOOMAPANAM,GUTKA ALAVATLU - AYURVEDIC SOLUTION