Friday, 28 October 2011

AYURVEDIC FOOD FOR HEALTH ( IN TELUGU )

ఆరోగ్యానికి ఆయుర్వేద ఆహారం

మనం తినే ఆహారం ఎన్ని రకాలు ఆ ఆహారాన్ని ఎలా తీసుకోవాలి
ఆహారం ఆరు విధాలు ఒకటి పేయము అనగా తాగుటకు వీలుగా ఉండునది పాలు..etc..2 చోస్యము పీల్చదగినది చెరకు ములక్కాడ లాంటివి మూడు లేహ్యము నాకి భుజించ దగ్గది పులుసు మజ్జిగ లాంటిది నాలుగు భోజ్యము భుజింపదగినది అన్నం మొదలగునవి ఐదు భక్ష్యము తినదగినవి లడ్డు జిలేబి వంటివి 6 సవ్యమ
 నమలదగినది చెక్కిలంకాడలు వంటివి
మిక్కిలి ఎక్కువ కానీ మరీ తక్కువ కానీ అకాలంలో కానీ ఆహారం తీసుకుంటే విష మాశక మంటారు. కడుపులో మూడు భాగాలు ఆహారం మిగతా భాగం నీరు లాంటి ద్రవ పదార్థాలు కొంచెం ఖాళీ ఉంచి తినడం మంచిది
ఎవరు ఏం తినాలి అంటే.. పెద్దవాళ్లలో కేటపాలిజం ప్రాధాన్యంగా ఉంటుంది కనుక తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.. పాలు తేనె నీళ్లు బార్లీ నీళ్లు మజ్జిగ ఎక్కువగా ఇవ్వాలి గర్భవతులు తేలికైనా బలమైన ఆహారం మాసానుసారం తీసుకోవాలి నవ మాసాలకి తగిన ఆహారం ఆయుర్వేదంలో సూచించబడినది మొదటి మూడు మాసాలలో విటమిన్లు కలిగిన పోషకాహారం ఇవ్వాలి మద్యం మాంసం చేప వంటివి ఇవ్వకూడదు ఆరు నెలల ఎముకలు ఉచారము మేధస్సు పెంచే ఆహారం ఇవ్వాలి సాత్వికాహారం అంటే పూర్తి శాకాహారం రాజసాహారం అంటే మాంసాహారం ఎక్కువ కారం మసాలా ఉన్నది తామసాహారం అంటే నిల్వ ఉన్నది చల్లారినవి వీటిని బట్టి కూడా మన ప్రవర్తన మారుతుంది అన్నిటికీ మించి ఎప్పుడు ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు
లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా పరిగెత్తే యాంత్రిక జీవనంలో చుట్టూ పోగా తోడి రసాయనాలతో కలుషితమైన వాతావరణం లో సగటు మనిషి నుండి మేధావి దాకా మంచి ఆహారాన్ని గుర్తించడం కష్టమవుతున్నది.. రోడ్డుమీద ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల పొట్ట పెరగడం మలి వయస్సులోనే షుగర్ వ్యాధి వంటివి రావటం మినహా మంచి జరగడం లేదు ఒక ప్రాంతాన్ని బట్టి ఒక కాలాన్ని బట్టి కాకుండా విశ్వసనీయతతో ప్రకృతిని పురుష తత్వాన్ని ఆకలింపు చేసుకుని ప్రకృతికి సమీపంగా అనుసంధానం చేసుకొని ఆహారాన్ని ఆహార నిర్మాణాన్ని ఆహార నియమాలని ప్రతిపాదించింది ఆయుర్వేద శాస్త్రం.. అందుకే మనిషి ఎక్కడున్నా ముంబైలో ఉన్న బెంగళూరులో ఉన్న న్యూఢిల్లీలో ఉన్న న్యూయార్క్ లో ఉన్న అమ్మమ్మ దగ్గర ఉన్న ఒంటరిగా ఉన్నా మన శరీరం ప్రకృతిలో నుంచి వచ్చిన వండిన సమగ్రమైన సమతుల్య మైనఆహారాన్ని తీసుకోవాలి.

అన్నం ప్రాణమయం ప్రాణమయం అమ్మ చేసిన సున్ని ఉండలో వీర్య బలవం ఉంది. నువ్వుల ఉండలు లో స్త్రీ హార్మోన్లను క్రమపరిచే శక్తి ఉంది. పాయసంలో తృప్తినిచ్చే గుణం ఉంది పాలు తేనె నెయ్యి మధుర పదార్థాలే కాదు నిత్య జీవ రసాయనాలు అంటే సప్త ధాతువులకు శక్తినిచ్చేవి. అందుకే ప్రపంచ సమగ్ర ఆహార చిత్రంలో ఆయుర్వేద ఆహారం ప్రాముఖ్యత సంతరించుకుంది 
అరటిపండు దోసకాయ తప్ప దానిమ్మ చెరకు వంటివి ఆహారం ముందు తినాలి. నేరేడు కొబ్బరి మామిడిపండు పనస ఉదయమే తీసుకోకూడదు తీపి పిండి వంటలు అటుకులతో చేసినవి భోజనానంతరమే తినాలి ఇది పథ్యం అంటే.. ఆరు రుచులు ఉండాలి ఆహారం కూడా మందు లాంటిదే దానికి రసం అంటే రుచి వీర్యం అంటే బలం వంటివి ఉంటాయి ఈ రుచులు ఆరు తీపి కారం చేదు ఉప్పు వగరు పులుపు. మన ఆహారంలో ఈ ఆరు రుచులు ఉండాలి.తీపి పదార్థాలు మనలో ఓజో శక్తి నీ పెంచుతాయి. కారం,పులుపు జీర్ణ శక్తిని చేదు జ్ఞాపకశక్తిని రక్త శోధనని కలుగచేస్తుంది వగరు కఠిన పదార్థాలను ముక్కలు చేస్తుంది ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది గట్టిగా ఉండే రొట్టెలు చపాతీలు వంటివి అన్నీ కూరలతో ముందుగా తినాలి అన్నం తర్వాత తినాలి పల్చని మధుర పదార్థాలు అన్నం ముందు తినాలి కారం పులుపు పదార్థాలు మధ్యలో తినాలి వగరు చేదు పదార్థాలు చివరన తిని మజ్జిగ పళ్ళ రసాలు ఆఖరున తినాలి అన్ని కూరలు వేసిన పులుసుని అమెరికాలో రిచ్ వెజిటబుల్ సూప్ అంటారు దీన్ని వారానికి ఒక్కసారైనా తీసుకోవడం మంచిది
మిరియాలు ధనియాలు వేసిన చారుని ప్రతిరోజు తీసుకోవడం హితకరం
అన్ని ఆహార పదార్థాలు కలిపి తీసుకోకూడదు అది హాని చేస్తుంది ఇటువంటి ఆహార పదార్థాన్ని విరుద్ధ ఆహారం అంటారు ఉదాహరణకు పెరుగు నెయ్యి కలిపి తీసుకోకూడదు అరటి పండు పాలు ఒకేసారి తీసుకోకూడదు వేడి కాఫీ టీలలో తేనె కలిపి తీసుకోకూడదు వెన్నతో చేపని వండుకోకూడదు
ఋతువులను అనుసరించి పండే పళ్ళను తీసుకోవడం హితకరం అలా కాకుండా తీసుకుంటే ఆమం తయారవుతుంది ఆమం అంటే జీర్ణం కాక నిలువ ఉండిపోయిన విష పదార్థం అన్నమాట అదే మోకాళ్ళ నొప్పుల వంటి వ్యాధులకు కారణం అవుతుంది
ఉదాహరణకి వేసవికాలంలో జీర్ణశక్తి మనలో తక్కువగా ఉంటుంది అందువల్ల తేలికపాటి ఆహారం రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది. రాత్రి పెరుగు వేసుకోకూడదు ఎందుకంటే అది పూర్తిగా జీర్ణం కాక శ్రోతస్సులను
 మూసేస్తుంది
పిల్లలు ఎదిగే వయస్సు కనుక శరీరం మనసు ఎదిగే ఆహారాన్ని ఇవ్వాలి యవ్వనంలో ఉండే వాళ్ళకి మెటబాలిజం  కెటబాలిజం సమానంగా ఉంటాయి కనుక  శక్తిని ఇచ్చే ప్రోటీన్లు విటమిన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాల.


1 comment: