Friday 29 April 2016

TYPHOID LO SWACHA AHARAM

టైఫాయిడ్లో స్వచ్ఛ ఆహారం

 టైఫాయిడ్ జ్వరం తిరగబెడ్తోంది. నివారణ ఎలా?
* టైఫాయిడ్ జ్వరం హాని చేసే సూక్ష్మజీవులతో కలిగిన ఆహారం వలన ప్రధా
నంగా వస్తుంది. టైఫాయిడ్, అమీబియాసిస్, కలరా, కామెర్లు, కొన్ని
రకాల విష జ్వరాలు ఇవన్నీ పర్యావరణ అశుభ్రత లోంచి పుట్టే వ్యాధులు.
జనం స్వచ్ఛందంగా రోడ్లు ఊడవటం మాత్రమే స్వచ్ఛభారతం కాదు.
నదుల్నీ, కాలువల్నీ, ఊరి మురుగుతో కలుషితం చేసి, ఆ నీటినే అర
కొరగా శుభ్రం చేసి మంచినీటిగా సరఫరా చేసే ప్రభుత్వ విధానాల్లో
మార్పు స్వచ్ఛ భారతం అనిపించుకుంటుంది. కడగని నీళ్ళ బ్యాంకు
స్వచ్ఛభారతం పరిధిలోని అంశమే! శవాలను నిలవ బెట్టేందుకు ఉప
యోగించే బసు దిమ్మలతోనూ, అపరిశుభ్రమైన నీటితోనూ
నిర్ణచందు చేసే ఐస్ క్రీములు పిల్లల్లో టైఫాయిడ్ తదితర పర్యావరణ
వ్యాధులకు కారణాలౌతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాట
మాడే ఇలాంటి ఆహార పదార్థాల తయారీ మీద ప్రభుత్వానికి అదుపు ఉండాలి.
ఉడికీ ఉడకని మాంస శాక
పాకాలు, బైట ఆహార పదా
రాలు, కత్తీలు కలిసిన నెయ్యి,
నూనె, రంగులు కలిసిన
పసుపు, కారం, వడియాలు,
స్వీట్లు, హాట్లు, స్నాక్స్, ఆఖ
రికి పాలు, నీళ్ళు కూడా
స్వచ్ఛ ఆహారం మనకు దక్క
కుండా చేస్తున్నవే. మనం
వాటికి దూరంగా ఉండటం టైఫాయిడ్ నివారణకు మొదటి అంశం.
ప్రజ్ఞ చల్లదనం లేని పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే, టైఫాయిడ్
జ్వరంలో పేగులకు రక్షణగా ఉంటాయి. వాముపొడిగానీ, దాల్చిన చెక్కపొడిగానీ,
ధనియాల పొడిగానీ, జీలకర్ర పొడిగాని, ఒక గ్లాసు నీళ్ళలో పావు చెంచా మోతా
దులో కలిపి బాగా మరిగించి మంచినీళ్ళకు బదులుగా తాగించండి. ఈ జీరా
వాటర్ లాంటివి జీర్ణాశయాన్ని బలసంపన్నం చేస్తాయి. పల్చని గోధుమ రొట్టెలు
(పుల్కాలు) ఇంట్లో చేసినవి శ్రేయస్కరం. ఇది వ్యాధిని త్వరగా తగ్గనీయకుండా
చేస్తుంది. పదే పదే టైఫాయిడ్, అమీబియాసిస్ లాంటి వ్యాధులు తిరగబెట్టడానికి
ఆహార పరిశుభ్రత లేకపోవటమే కారణం. టైఫాయిడ్ తగ్గిన తరువాత కూడా
కొన్నాళ్లపాటు తేలికగా అరిగే ఆహార పదార్ధాలిచ్చి, జీర్ణశక్తిని పెంచే జీరావాటర్,
మజ్జిగలాంటివి తాగిస్తూ వుంటే రోగి త్వరగా కోలుకుంటాడు.