Tuesday 12 April 2016

AYURVEDAM CHEERALU / AYURVEDIC SAREES

.• మూలికలు, సుగంధ ద్రవ్యాలతో దారానికి కొత్త వన్నెలు
• సహజ రంగుల వస్త్రాలు ఆరోగ్యానికి నేస్తాలంటున్న వైద్యులు
(ఆంధ్రజ్యోతి-భూదాన్‌పోచంపల్లి)
వస్త్రాల తయారీలో ప్రసిద్ధిగాంచిన నల్లగొండ జిల్లా నేత కార్మికులు కొత్త పంథాలో
ముందుకెళ్తున్నారు. పోచంపల్లి, కొయ్యలగూడెం, పుట్టపాకల్లోని కొందరు చేనేత కళాకా
దులు. ఆయుర్వేదంలో వాడే మూలికలు, సుగంధ ద్రవ్యాల ద్వారా దారాలకు సహజసి
దమైన రంగులద్దుతున్నారు. సహజరంగులు అద్దిన వస్త్రాలను ధరిస్తే అందానికి
అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం అంటున్నారు. ఆయుర్వేద నిపుణులు. వీటివల్ల
శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని చాలా
మంది ఈ వస్త్రాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో
గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వస్త్రాలకు ఆదరణ పెరుగుతోంది.
రంగులన్నీ ప్రకృతి ప్రసాదమే!
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఇండిగో అనే
నీలిరంగు పట్టిల్లు భారతదేశమే. చెట్టు నుంచి లభించే
రంగు ఇది. భోజనం చేసిన తర్వాత సంప్రదాయంగా
తినే తాంబూలంలో వాడే కాచు' ఉపయోగిస్తే బ్రౌన్
రంగు వస్తుంది. ఎర్రచందనం చెక్క పొడి నుంచి
మిరప పండు రంగు వస్తుంది. ఎండిపోయిన బంతి,
కుసుమ, మోదుగు పూల నుంచి పసుపు రంగు గోరిం
టాకు, గుంటకుంట్ల ఆకు నుంచి ఆకుపచ్చ. వేప,
జామ
ఆకుల నుంచి లేత ఆకుపచ్చ. జాఫ్రా, ఎర్రగుంటాకు
నుంచి కాషాయం.. చెట్టు బెరడు చూర్ణం నుంచి కాఫీ
రంగు తంగేడు పువ్వు. మనం నిత్యం వాడే పసుపు
(కొమ్ము)ల నుంచి పసుపు రంగు. ఆయుర్వేద వైద్యంలో
ఔషధాలుగా ఉపయోగించే దానిమ్మ. కరక్కాయ, మారేడు,
మంజిష్ట, మోదుగుపూలు, తుమ్మ, సండ్ర చెట్ల బెరళ్లు
కూడా ప్రత్యేక రంగుల తయారీకి ఉపయోగపడుతు
న్నాయి. ఇనుప ముక్కలు బెల్లం మిశ్రమాన్ని కొన్ని రోజులు
నిల్వచేస్తే నలుపు వర్ణం తయారవుతుంది.
రోజుల తరబడి..
రసాయనాలతో తయారైన రంగులను దారానికి అద్దడం
చాలా సులువు. రసాయనిక పొడితో నలుపురంగు అద్దకం
గంటలోనే పూర్తయితే అదే రంగును సహజరంగుతో అద్దా
లంటే 21 రోజులు పడుతుంది. ఇందుకు దారాన్ని సిద్ధం
చేయడానికే నాలుగు రోజుల ప్రక్రియ ఉంటుంది.
మొదటిరోజు చల్లని క్షారగుణంలేని నీళ్లలో ఉప్పు
కలిపి దారాన్ని 24 గంటలు నానబెట్టాలి
• రెండోరోజు నాన్ డిజటర్జెంట్ సబ్బు, వంటసోడాను
కలిపి ఆ నూలును నాలుగు గంటల సేపు మరిగే
నీళ్లలో వేసి ఉడకబెట్టాలి. మంట తగ్గించి ఒక రోజంతా
తగినంత వేడినీళ్లలో పొయ్యిపైనే ఉంచాలి.
మూడోరోజు ఈ నూలును తాజా నీళ్లతో శుభ్రం చేసి
నీడలో ఆరవేయాలి. ఇలా శుద్ధి చేసిన 'కర
క్కాయ పొడి కలిపిన నీళ్లలో గంట సేపు నానబెట్టాలి
తర్వాత దారాన్ని 'పటికపొడి' కలిపిన వేడి నీళ్లలో నాన
బెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి ఇదే ప్రక్రియ నాలు
గైదు పర్యాయాలు చేసిన తర్వాత ఆ దారానికి సహజ
రంగులు అద్దుతారు. అద్దకం పని పూర్తి కావడానికే
10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది.
• ఔషధగుణాలు పోకుండా అద్దకం ప్రక్రియ పూర్తిచేసి
ఇక్కత్ డిజైన్లతో మగ్గాలపై చీరలు, చున్నీలు, డ్రెస్ మెటీరి
యల్ తయారు చేస్తున్నారు.
వ్యయం.. తేడా..
టై అండ్ డై విధానంలో రూపొందించే చేనేత వస్త్రా
లకు పోచంపల్లి ప్రసిద్ధి. ఈ పద్ధతిలో ఒక వార్పు (7)
చీరల తయారీకి నూలు ధరతోపాటు కెమికల్ రంగులు,
ఇతరత్రా మగ్గం కూలీ, చిటికి, ఆసు తదితర పనుల
నిమిత్తం రూ.30 వేలు అవుతుంది. అదటై అండ్ డై
వెరైటీలో ఇక్కత్ డిజైన్లతో సహజ రంగులతో వార్పు (7)
చీరల తయారీకి రూ.50 వేలకు పైగా ఖర్చు అవుతుంది.
సహజ రంగుల ధరలు మామూలు కెమికల్ రంగుల ధర
లకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. 10 గ్రాముల కెమికల్
రంగుకు
సహజరంగుల
రూ.100 దాకా ఖర్చ
అద్దకం
యితే.. 10
10 గ్రాముల
సహజ రంగుకు రూ.300
నుంచి రూ.400 వరకూ ఖర్చవు
తుంది. సమయం కూడా ఎక్కువే పడు
తుంది. దీంతో చాలా మంది తక్కువ సమ
యంలో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయ వన
రుగా ఉన్న కెమికల్ రంగుతోనే వస్త్రాల తయారీకి
మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతానికి కొందరు
-వ్యాపారులు. దేశ విదేశాలకు చెందిన మార్కెట్లోని ట్రేడర్స్
నుంచి ఆర్డర్ తీసుకున్నాక ఎగుమతి నిమిత్తం మాత్రమే సహజ రంగులతో వస్త్రాలు
తయారు చేస్తున్నారు. క్రమంగా సహజ రంగుల వస్త్రాల పట్ల ప్రజలు మక్కువ చూపు
తుండడంతో ఈ వస్త్రాల తయారీ వైపు చేనేత కార్మికులు దృష్టి సారిస్తున్నారు.

మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే..
సింథటిక్ పాలిషర్ క్లాత్ పై కృత్రిమ రంగుల్లో
అందంగా కంటికింపైన డిజైన్లలో వస్త్రాలు వస్తున్న ఈ
రోజుల్లో సహజరంగుల వస్త్రాలు కొనుగోలు చేసే వారి
సంఖ్య చాలా తక్కువే తయారుచేసేవారి సంఖ్యా
అంతకన్నా తక్కువే!! ఈ మధ్యనే పోచంపల్లి ఇక్కత్ డిజై
న్లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో
అంతర్జాతీయ మార్కెట్ కనుగుణంగా సహజ రంగులతో
వస్త్రాలు తయారు చేయా
ఆలోచన వారికి
వచ్చింది. మార్కెటింగ్
వసతి కల్పిస్తే దీనివల్ల
తమకు మరింత ఉపాధి
లభిస్తుందని వారు
పేర్కొంటున్నారు
ప్రస్తుతానికైతే కొన్ని దేశాల
వ్యాపారుల నుంచి సహజ
రంగుల వస్త్రాలకు వస్తున్న
వీటిని
తయారుచేస్తున్నామని
చేనేత కళాకారులు
అంటున్నారు.

ప్రభుత్వం ప్రోత్సహించాలి
కొయ్యలగూడెంలోని అయిదుగురు చేనేత కార్మికులకు
చేనేత సేవా కేంద్రం (వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా
దస్తకార్ ఆంధ్ర సంస్థ నిపుణులతో సహజరంగుల అద్ద
కంపై 1997లో శిక్షణనిప్పించారు. అందులో శిక్షణ పొందిన
నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి గృహవిజ్ఞాన
కళాశాలలోనూ నెలరోజులు శిక్షణ పొందాను. సహజరంగులతోనే చీరలు, చున్నీలు,
డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్నాను. ప్రైవేటు సంస్థలు వీటిని తయారు చేయి
స్తున్నాయి. కెనడా నుంచి వచ్చి వారు నాకు వస్త్రాలు తయారుచేయడానికి ఆవ
కాశం ఇచ్చారు. ప్రభుత్వం సహజరంగులతో వస్త్రాలు తయారు చేయడానికి, విదే
శాలకు ఎగుమతులు చేయడానికి ప్రణాళికలు రచించాలి. ప్రైవేటు సంస్థలకు
వస్త్రాలు తయారు చేసి, పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం ప్రోత్సహి
స్తేనే మరికొంతమంది సహజరంగుల అద్దకం పనిచేయడానికి ముందుకొస్తారు.
- దుగ్యాల శంకర్, చేనేత కార్మికుడు, కొయ్యలగూడెం