Saturday 30 March 2013

BEAUTY TIPS - DURING PREGNANCY

గర్భధారణలో కనిపించే సౌందర్య సమస్యలు
• మెలస్మా (ప్రెగ్నెన్సీ మాస్క్)
* స్ట్రెచ్ మార్క్స్ (ఉదరం, తొడలు,
చేతులమీద చారికలు)
* మొటిమలు, వేవిళ్లు
* అధిక రక్తపోటు
* వేరికోస్ వీన్స్ (కాళ్లలో సిరలు
తేలటం. మెలికలు తిరిగి
వానపాముల్లాగా ప్రముఖంగా
కనిపించటం)
• కేశాలు జిడ్డుగా తయారై అట్టలు కట్టడం
* నిపుల్స్ చిట్లడం
మెలస్మా మచ్చలు
ఆయుర్వేద ఔషధం 1
• కీరదోసకాయ రసం టేబుల్ స్పూన్
పాల మీగడ టీస్పూన్
• పసుపు టీస్పూన్
శనగపిండి టేబుల్ స్పూన్
• ముల్తాని మట్టి టేబుల్ స్పూన్
వాడాల్సిన పద్ధతి
ఒక పాత్ర తీసుకోండి.
* వీటిని అన్నిటినీ వరుసగా తీసుకోండి
* అన్నిటినీ కలిపి పేస్టులాగా చేయండి -
మంగు మచ్చలమీద పూయండి.
ఆరిన తరువాత దూదితో
తుడిచేసుకోండి.
తరువాత వేడినీళ్లతో కడిగేసుకోండి.
స్ట్రెచ్ మార్క్స్ నివారణ
ఆయుర్వేద ఔషధం 2
బాదం నూనె అరటీస్పూన్
* తేనె పావు టీస్పూన్
అరటి పండు గుజ్జు టీస్పూన్
ఆలివ్ నూనె టీస్పూన్
• యాపిల్ జ్యూస్ టీస్పూన్
* పాలు టీస్పూన్
వాడాల్సిన పద్ధతి
ఒక పాత్రలో వీటిని వరుసగా
తీసుకోండి.
* అన్నిటినీ బాగా కలపండి.
• దీనిని స్ట్రెచ్ మార్క్స్ తయారయ్యే
భాగాల మీద (ఉదరం, పిరుదులు,
రొమ్ముల మీద) ప్రయోగించండి.
స్నాన చూర్ణంతో స్నానం చేయండి.
స్నానం తరువాత వెంటనే బాదం
నూనెను రాసుకోండి.
* రాత్రి పడుకునే ముందు ఆలివ్
ఆయిల్ రాసుకోండి.
ఇలా ప్రతి రోజూ చర్మాన్ని లూబ్రికేట్
చేస్తుంటే ప్రసవం తరువాత స్ట్రెచ్
మా తయారు కాకుండా ఉంటాయి.
గర్భధారణలో మొటిమలు
ఆయుర్వేద ఔషధం 3
సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు
• తేనె టీస్పూన్
చందనం పొడి టీస్పూన్ !
వాడాల్సిన పద్ధతి
ఒక పాత్రలో ఈ రెండు పదార్థాలను
తీసుకోండి.
* రెంటినీ కలపండి.
• పేస్టులాగా చేయండి.
* దీనిని మొటిమల మీద పై పూతగా
వాడండి.
* ఆరిపోయిన తరువాత నీళ్లతో
కడిగేసుకోండి.
దీంతో ర్యాష్ మొటిమలు తగ్గుతాయి.

గర్భధారణలో జాగ్రత్తలు
వేపుడు కూరలు, స్వీట్లు, కొవ్వు
పదార్థాలు తగ్గించండి.
క్యాల్షియం కోసం రోజూ గ్లాసు పాలు
తాగండి.
తాజా గాలి తగిలేట్లు చూసుకోండి.
త్వరగా నిద్రపోండి.
రాత్రి పూట కండరాలు పట్టేయకుండా
ఉండటం కోసం స్నానం తరువాత
కొద్దిగా మసాజ్ చేసుకోండి,
కాళ్లలో సిరలు తేలకుండా, వేరికోస్
వీన్స్ తయారవకుండా పాదాలను
ముడిచి చాచే వ్యాయామాలు
చేయండి.
పడుకునేముందు ఒక పక్కకు తిరిగి,
ఒక కాలు ముడిచి, ఒక చెయ్యిని
దిండు కింద పెట్టుకొని పడుకోండి.
* రాత్రి పూట నిద్రపట్టకపోతే ఒక
గ్లాసు గోరువెచ్చని పాలు తాగండి.
అలాగే రాత్రిపూట గోరువెచ్చని నీళ్లతో
స్నానం చేయండి.

No comments:

Post a Comment