Tuesday 26 March 2013

వయస్సుల వారిగా వచ్చే సౌందర్య సమస్యలు / AGE GROUPS - BEAUTY TIPS - AWARENESS

1. )      20 నుంచి 30 ఏళ్ల వయసులో సౌందర్య సమస్యలు.

ఈ వయసులో హార్మోన్ల ఆధిక్యత ఎక్కువగా ఉండడం వలన మొటిమలు తయారవుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కొవ్వు, కొవ్వు వల్ల ఈస్ట్రోజన్ పెరుగుతాయి. జుట్టు జిడ్డుగా తయారవుతుంది.

A .)  పీరియడ్స్లో అలసిన ముఖానికి ఆయుర్వేద ఔషధం.

కోడిగుడ్డు తెల్లసొన 1 ,
తేనె అర టీ స్పూన్ ,
బాదం నూనె ఒక టీ స్పూన్ ,
పెరుగు ఒక టీ స్పూన్ ,
ఓట్స్ పొడి అర టీ స్పూన్ ,
అరటి పండ గుజ్జు 1 టీ స్పూన్,
 చొప్పున
 తీసుకోండి .వీటినన్నిటిని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖ చర్మం మీద పోసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోండి.  గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. ఒక నేప్ కిన్ వేడి నీళ్ళలో ముంచి ముఖం మీద పరిచి పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి .నీరసం తగ్గి పోయి మొహం ఫ్రెష్ గా మారుతుంది.


 B .).  ఎండ తాకిడికి తయారైనా గోధుమరంగు మచ్చలు పోవడానికి ఆయుర్వేద ఔషధం.

 కావలసిన పదార్థాలు- 

  పసుపుపచ్చని ఆవాలు అర టీ స్పూన్ ,
పసుపు అర టీ స్పూన్ ,
నువ్వులు అర టీ స్పూన్,
 పాలు తగినంత

వాడాల్సిన పద్ధతి - 

ఒక చిన్న గిన్నెలో వీటినన్నింటినీ తీసుకుని పేస్టులగా చేయండి.
  ముఖం మీద గోధుమరంగు మచ్చలు మీద దీనిని పూయండి. ఆరిన తర్వాత కడిగేసుకోవాలి .ఇలా క్రమం తప్పకుండా కొంతకాలం చేయండి .

జాగ్రత్తలు , పథ్యా పథ్యాలు.

ఈ వయసులో  మెటబాలిక్ రేట్ ఎక్కువ గా ఉంటుంది .హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కనుక కండరాలు పెరుగుతాయి.
వ్యాయామాలు ,కొవ్వు తక్కువ ఆహారాల వల్ల ఈ వయసులో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే మరీ ఎక్కువ స్థాయిలో వ్యాయామం చేయడం వల్ల  ఈస్ట్రోజన్ తగ్గిపోయి నెలసరి సమస్యలు వస్తాయి.
ఈ వయసులో సైక్లింగ్ ,జాగింగ్ ,డాన్సింగ్ ,స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల కొవ్వు కరిగిపోయి కండరాలు పరిపుష్టం అవతాయి. కొబ్బరి నీళ్లు తాగండి, లైట్ గా మేకప్ సరిపోతుంది. కాల్షియం కలిగిన ఆహారాలు తీసుకోండి. అనగా పాలు మజ్జిగ లాంటివి .వేపుడు కూరలు తినకూడదు .


 
2.)    30 నుంచి 40 ఏళ్ల వయస్సులో వచ్చే సౌందర్య సమస్యలుు.

 ఈ వయసులో కండరాల్లో పట్టు తగ్గుతుంది .క్రమంగా ఎముకల్లో పుష్టి, గట్టితనం తగ్గుతాయి. కొలెస్టరాల్ నిల్వలు క్రమంగా పెరుగుతాయి .స్థూలకాయం, రక్తహీనత, ఎసిడిటి ,మలబద్ధకం నడుము నొప్పి, కీళ్లనొప్పి, బిపి ,షుగర్, గుండె జబ్బులు ,వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు ఎక్కువ.

హార్మోన్లలో తేడాలు, కుంగుబాటు, నిరాశ నిస్పృహలు ,ప్రాధాన్యాలు మారడం, బాధ్యతలు వంటి కారణాల వల్ల పై సమస్యలు వస్తాయి.

A .)  కంటి కింద వలయాలు తగ్గడానికి ఆయుర్వేద ఔషధం.

  టీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి ఆ పాత్రను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. కొద్దిసేపయ్యాక కిందికి దించి వడపోసుకొనండి.

ఒక దూది ఉండను దీనిలో ముంచి కంటి కింద వలయాలు మీద కాపడం పెట్టుకోండి .మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. ఆందోళన కుంగుబాటు వంటి మనో వ్యాధులను తగ్గించుకోండి.

 B.)  ఒత్తిడి వల్ల వచ్చి పులిపిర్లు తగ్గడానికి ఆయుర్వేద ఔషధం.

కావలసిన పదార్థాలు- 

నిమ్మ పండ్ల మొక్కలు రెండు మూడ,
 ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక కప్పు ,
ఉప్పు పావు టీ స్పూన్ ,వెల్లుల్లి గర్భం 1,
 చొప్పున తీసుకోండి.

వాడాల్సిన పద్ధతి- 

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉప్పు, నిమ్మ పండ్ల ముక్కలను కలిపి ఒక వారం పాటు నానపెట్టండి. తర్వాత ఈ నిమ్మచెక్కతో పులిపిరి మీద రుద్దండి. తర్వాత వెల్లుల్లి గర్భాన్ని సగానికి కోసి పులిపిరి మీద రుద్దాలి.

 C .) వెరికోస్  వెయిన్స్ తగ్గడానికి ఆయుర్వేద ఔషధం.

కావలసిన పదార్థాలు- 

 ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు  ముద్ద, 
ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకోండి .

 వాడవలసిన పద్ధతి- 

గోరింటాకు ముద్దగా నూరి  పేస్ట్ లా చేయండి. దీనికి నిమ్మరసాన్ని కలపండి .ఈ పేస్ట్ ను వెరికోస్ వైన్స్ మీద పూయండి, తర్వాత కడిగేసుకోండి .ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే వెరికోస్ వెయిన్స్ లోని వాల్వులు తిరిగి  గట్టిపడతాయి .ఇది డీప్ వీన్ త్రాంబోసిస్ లోని గడ్డలను కూడా కరిగిస్తుంది.

3.).  నలభై నుండి యాభై ఏళ్ళ వయస్సులో వచ్చే సౌందర్య సమస్యలు.

ఈ వయసులో థైరాయిడ్ సమస్యలు, షుగర్ ,అధిక బరువు ,అధిక రక్తపోటు,రొమ్ములు జారడం ,ముఖం మీద ముడతలు పడడం ,కంటి చూపు తగ్గడం మెనోపాజ్ లక్షణాలు అయిన సెగలు ,పొగలు, చెమటలు పట్టడం, జుట్టు రాలడం వంటి వాటి వలన సమస్యలు వస్తాయి.



 A.)  చర్మం ముడతలు తగ్గడానికి ఆయుర్వేద ఔషధం.

కావలసిన పదార్థాలు-

ఆలీవ్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ,ఆముదం ఒక టేబుల్ స్పూన్, గ్లిజరిన్ పావు టీ స్పూన,ఇన్ఫ్రారెడ్
 ల్యాంప్ ,గాజు క్లాత్ / బ్యాండేజ్ గుడ్డ

వాడవలసిన పద్ధతి-

 ఒక పాత్రలో వీటినన్నిటినీ  తీసుకుని బాగా కలపండి. ఒక గాజు క్లాత్ ను దీనిలో తడపండి, తర్వాత ముఖం మీద  పరవండి. ఇన్ఫ్రారెడ్ లాంప్ ను 24 అంగుళాల దూరం నుంచి 10 నిమిషాలు చూపించండి. తరువాత గాజు క్లాత్ని తీసివేసి బాదం నూనె ను పూసుకొండి. తరువాత వేడి నీళ్ల లో ముంచిన టవల్ తో కాపడం పెట్టుకోండి.

B.)  శరీరం మీద  సన్ బర్న్ తగ్గడానిక
ఆయుర్వేద ఔషధం.

కావలసిన పదార్థాలు-

 టీ డికాక్షన్ ఒక కప్పు ,యాపిల్ సిడర్ వెనిగర్ ఒక కప్పు ,లావెండర్ నూనె ఆరు చుక్కలు ,గోరు వెచ్చని వేడి నీళ్ళు ఒక బకెట్.

వాడవలసిన పద్ధతి.-

ఒక బకెట్ వేడి నీళ్లకు పైన చెప్పిన పదార్థాలన్నింటిని కలపండి. ఈ నీళ్లతో స్నానం చేయండి. లేదా బాత్ టబ్ లో ఈ నీళ్లు పోసి
 శరీరాన్ని కొంచెం సేపు నానబెట్టండి.


C.) గోరుచుట్టు తగ్గడానికి ఆయుర్వేద ఔషధం.

కావలసిన పదార్థాలు-

 ఈసప్ గోల్ ఊక  ఒక టీ స్పూన్ ,వెనిగర్ నాలుగు టీ స్పూన్లు, వేపాకులు 10 గ్రాములు.

వాడాల్సిన పద్ధతి - 

ఒక బౌల్లో నాలుగు టీ స్పూన్ల వెనిగర్ తీసుకొని ఒక టీ స్పూన్ ఈశాప్ గోల్ ను కలపండి.దీనిని వేడి చేసి గోరుచుట్టు మీద  పైపూత ఔషధంగా వాడండి. చీము వెలుపలకు వచ్చేసిన తరువాత వేపాకుల ముద్దను పైపూతగా వాడండి . బ్యాండేజీ కట్టండి.

తీసుకోవలసిన జాగ్రత్తలు -

బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి .తేలికపాటి ఆహారం తీసుకోండి .ఎత్తు తగ్గిపోకుండా వ్యాయామాలు చేస్తూ ఉండండి .  ముడతలు తయారవకుండా ప్రతినిత్యం నూనెలతో మసాజ్ చేసుకోండి. సెక్సువల్ డిస్ఫంక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. జీవితాన్ని నూతనంగా ఉత్సాహపూరిత గా మార్చుకోండి .కంటి చూపు తగ్గకుండా వ్యాయామాలు విటమిన్  ఎ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోండి. షుగర్ రాకుండా ఉండటం కోసం క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉండండి .అధిక రక్తపోటు ని నిరోధించడం కోసం ఉప్పును తగ్గించి వాడండి .రొమ్ముల్లో బిగి తగ్గకుండా కోసం లాన్ కటింగ్ వ్యాయామాలు చేయండి. శతావరి ఔషధాలు వాడండి. ఈస్ట్రోజన్ నిల్వలు తగ్గకుండా ఉండటం కోసం సోయా, మెంతులు, సోంపు వంటివి తీసుకోండి. ఎముకల మీద బరువు పడే వ్యాయామాలు చేయండి.

No comments:

Post a Comment