• 12 గిరిజన గ్రామాల్లో 3,600 మందిపై
ఎన్‌ఐఎన్ పరిశోధన
వీరిలో 1800 మంది ఆహార
అలవాట్లు మార్పించిన శాస్త్రవేత్తలు
తగ్గిన రక్తపోటు, ఇతర వ్యాధులు
మిగిలిన వారిలో వ్యాధులు యథాతథం
అదుపులేని ఆహారపు అలవాట్లు, వేళకు తినకపోవడం,
కనీస వ్యాయామం లేకపోవడం.. నూటికి తొంభై శాతం
జబ్బులకు ఇదే కారణం. వాటిలో మార్పు తేగలిగితే
అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల
బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఆయుష్షును
పెంచుకోవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్)
చెబుతోంది. ఈ అంశాన్ని నిరూపించేందుకు కొంతమంది
గిరిజన కుటుంబాల పాత అలవాట్లను మార్చి ఆరోగ్యప
రమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారిలో రక్తపోటు
(బీపీ), ఇతర వ్యాధులను తగ్గించడంలో సఫలీకృతమ
యింది. రెండేళ్ల కృషి ఫలితంగా దాదాపు 1800 మంది
జీవితాల్లో కొత్త వెలుగులు చూపించబోతోంది. ఈ పరి
శోధన ఫలితాలపై ప్రత్యేక కథనం.
ప్రయోగం ఎలా చేశారంటే..
రెండేళ్ల కిందట ఎన్‌ఐఎన్ ప్రతినిధులు ఆదిలాబాద్
జిల్లాలోని గిరిజన గ్రామాల్లో సర్వే చేసి క్షేత్రస్థాయిలో
పరిస్థితిని అంచనా వేశారు. ఇప్పటికీ
చాలా గిరిజన గ్రామాల్లోని పురుషుల్లో 50 శాతం
మందికి, మహిళల్లో 20 శాతం మందికి మద్యం
తాగే అలవాటుంది. చాలా మంది ఆహారం, ఇత
రత్రా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం
లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఎన్
శాస్త్రవేత్తలు ఉట్నూరు మండలంలోని పన్నెండు
గ్రామాల్లోని గిరిజనులపై ప్రయోగాన్ని చేపట్టారు.
ఈ గ్రామాల్లో 18 ఏళ్లు పైబడిన మొత్తం 3,600
మందిని ఎంపిక చేసి రెండు గ్రూపులు చేశారు.
ఇందులో ఆరు గ్రామాల్లోని 1800 మందిని
మొదటి విభాగంగా చేసి తమ అధ్యయనంలోకి
తీసుకున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో
జిల్లాలోని ఆశ, అంగన్‌వాడీ సిబ్బందికి రెండు
నెలల శిక్షణ ఇచ్చి వారిద్వారా 1800 మంది గిరిజ
నుల ఆహార అలవాట్లలో మార్పునకు శ్రీకారం
చుట్టారు. వందల సంఖ్యలో చైతన్య కార్యక్రమాల
ద్వారా మొదటి గ్రూపులోని గిరిజనులంతా ఆహా
రపు అలవాట్లను మార్చుకుంటున్నారు.
ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు
మాత్రమే వాడాలి. కానీ అక్కడి గిరిజనులు 10
-12 గ్రాముల ఉప్పును వాడుతున్నట్లు తేలింది.
ఒక వ్యక్తి రోజుకు 20 గ్రాములకు మించి వంట
నూనె వాడకూడదు. అది నెలంతా ఒకే రకం
నూనెను వాడకుండా రెండు మూడు రకాల
నూనెలను వాడాలి. గిరిజనులు తక్కువ
నూనెనే వాడుతున్నా పెద్దగా నాణ్యత లేని ఒకే
నూనెను నెలల తరబడి వాడుతున్నారు. ఇది
అనార్యోగానికి కారణమవుతోంది.
రోజుకు 100 గ్రాముల కూరగాయలు తీసుకో
వాలి. అందులో 250 గ్రాముల కూరగాయలు,
150 గ్రాముల పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
గిరిజనులు పళ్లు, కూరగాయల తక్కువగానూ,
మాంసాహారం ఎక్కువగానూ తింటున్నారు.
రోజూ కనీసం అరగంట నుంచి గంటపాటు ఏదో
ఒక వ్యాయామం చేయాలి. గిరిజన గ్రామాల్లో
గతంలో కొండలు ఎక్కి దిగి అటవీ ఉత్పత్తులను
సేకరించేవారు. ఇప్పుడా పరిస్థితి దాదాపుగా
లేదు. ఒకరోజు పనికి వెళ్లి రూ.300-రూ.400
తెచ్చుకుంటే తర్వాత మూడు నాలుగు రోజుల
పాటు ఇంట్లోనే కూర్చోవడం, కొంతమంది మద్యం
తాగుతుండడం వంటివి చేస్తున్నారు. ఇది వారి
ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని తేల్చారు.
ఇది లక్ష్యం
12 గిరిజన గ్రామాల్లో ఎంపిక చేసిన 3,600
మందికి ఆరోగ్య పరీక్షలు చేయించి వీరి వ్యక్తిగత
ఆరోగ్య నివేదికలు తయారు చేయించారు. ఇక్కడి
గిరిజనుల్లో 20 శాతం మంది అధిక రక్తపోటుబాధితులు, రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128
మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కురీ (ఎంఎంహెచ్ఓ)
ఉంది. దీన్ని 120 గ్రాములకు తగ్గిస్తే నాలుగో
వంతు మందిని గుండె సంబంధిత వ్యాధులను
నుంచి దూరం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతు
న్నారు. ఈ దిశగా వీరు ప్రయత్నాలు చేశారు.
ఏం చేశారు?
•ఆరు గ్రామాల్లోని ఎంపిక చేసిన 1800 మంది
గిరిజనుల ఆహారపు అలవాట్లను రెండేళ్లలో
మార్చగలిగారు. ప్రతి రోజూ ఒక్కో మనిషి
ఆరు గ్రాముల ఉప్పే వాడకంతోపాటు, 20
గ్రాముల చొప్పున రెండు మూడు రకాల నూనె
లను వినియోగించేలా చూశారు.
• అందుబాటులో ఉన్న కూరగాయలు, పండ్లు
తినేలా చేస్తున్నారు.
ప్రతి రోజూ వ్యాయామాన్ని అలవాటు చేశారు.
• ధూమపానం, మద్యపానం, అతిగా మాంసాహారం
తినే అలవాట్లను చాలా వరకు మాన్పిస్తున్నారు.
ప్రస్తుతం వీరికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మూడొంతుల మందిలో రక్తపోటుతోపాటు
రక్తంలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ 128ఎంఎంహెజ్
నుంచి 120-123 మిల్లీ గ్రాములకు తగ్గింది.
• మరో ఆరు గ్రామాల్లో ఎంపిక చేసిన 1800
మంది విషయంలో ఇటువంటి జాగ్రత్తలేమీ
తీసుకోలేదు. దీంతో వీరి ఆరోగ్యంలో ఎలాంటి
మార్పు రాలేదని తేలింది. అధిక రక్తపోటుతో
పాటు వివిధ రకాల వ్యాధులతో వీరు బాధప
డుతున్నారని గుర్తించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనుల పై అధ్యయనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజనుల ఆరోగ్యంపై
ఎస్ఎన్ నాలుగేళ్ల కిందట సమగ్ర అధ్యయనం
చేసింది. దీనిలో గుర్తించిన అంశాలివి.
• ప్రీస్కూల్ బాలురలో తక్కువ బరువున్న వారు
59.04 శాతం, బాలికలు 50.3 శాతం ఉన్నారు.పెరుగుదల తక్కువ ఉన్న వారు బాలురలో
57.0 శాతం, బాలికల్లో 52.4 శాతం.
• పెరుగుదల బాగున్నా బరువు తక్కువున్నవారు
బాలురలో 2.7శాతం, బాలికల్లో 20.2 శాతం.
• ఉమ్మడి రాష్ట్రంలో 17 శాతం మంది పురుషులు,
20.8 శాతం మంది మహిళలు అధిక రక్తపో
టుతో బాధపడుతున్నారు.
మరణాల నివారణే లక్ష్యం
దేశంలోని వ్యాధుల వల్ల చనిపో
తున్న రోగుల్లో 50 శాతం మంది
గుండె సంబంధిత వ్యాధులతోనే చనిపో
తున్నారు. ఈ మరణాలను నివారించా
లంటే సరైన ఆహార అలవాట్లు పాటిం
చాలి. దీన్ని తెలియజేసేందుకే రెండేళ్ల
నుంచి పరిశోధన మొదలు పెట్టాం. పూర్తి ఆరోగ్య
విధానాలను పాటించడం ద్వారా ఆరో
గ్యపరంగా అనేక మార్పులు తీసుకురా
వచ్చని నిరూపించగలిగాం. ఈ ప్రయో
గాన్ని మరో ఏడాది కొనసాగించి
No comments:
Post a Comment