7, ఫిబ్రవరి 2024, బుధవారం

సబ్జా ,షియా ఏది ఎక్కువ ఆరోగ్యకరం.. వీటిని ఎలా తీసుకోవాలి

 సబ్జా ,షియా ఈ రెండు ఒకటేనా.. ఏది ఎక్కువ ఆరోగ్యకరం.. వీటిని ఎలా తీసుకోవాలి ..ఇలా ఈ విత్తనాల గురించిన అనుమానాలు ఉన్నాయా.. అయితే వీటి గురించి కొంత అవగాహన పెంచుకుందాం.

 సబ్జా, షియా.. ఈ రెండిట్లో సమాన పోషక విలువలు ఉంటాయి. అధిక బరువు తగ్గాలి అనుకునే వాళ్లకు ఇవి రెండు సూపర్ ఫుడ్స్. ఈ రెండింటిని నీళ్లలో నానబెట్టి తీసుకోవచ్చు. అయితే చూడడానికి ఒకేలా ఉండడంతో రెండు ఒకటేనని పొరపాటు పడుతూ ఉంటాం. అయినా పర్వాలేదు పోషకాల పరంగా రెండు ఉత్తమమైనవి. అయితే నీళ్లలో నానబెట్టే సమయాలు రెండింటికి భిన్నంగా ఉంటాయి. మధ్య దక్షిణ మెక్సికో నుంచి వచ్చిన షియా విత్తనాలలో పీచు, ఒమేగా త్రి ప్రోటీన్లు ఉంటాయి. మన దేశానికి చెందిన తులసి విత్తనాలైన సబ్జా జాతిలో మంట ,శరీరంలోని టాక్సిన్ లను తగ్గించే గుణాలు ఉంటాయి. ఇక షియా విత్తనాలు నాన్నడానికి కనీసం అరగంట సమయమైనా పడుతుంది. సబ్జా విత్తనాలు నీళ్లలో వేసిన క్షణాలలోపే నాని ఉబ్బిపోతాయి .శియా విత్తనాలు నీళ్లలో నాని బరువెక్కి, జెల్ లాగా మారి పాత్ర అడుగుకు చేరుకుంటాయి. నానిన తర్వాత వాటి అసలు బరువుకు పదింతలు పెరుగుతాయి. సబ్జా విత్తనాలు నీళ్లలో క్షణాల్లో నానిపోయి వాటి చుట్టూ పారదర్శక పోర ఏర్పడుతుంది.

ఇలా వాడుకోవాలి..

 చియా విత్తనాలను నానబెట్టి లేదా నానబెట్టకుండా నేరుగా కూడా తినవచ్చు. కానీ సబ్జా విత్తనాలను కచ్చితంగా నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. స్మూతీలు, మిల్క్ షేక్స్లో, షియా ,సబ్జా రెండింటినీ కలుపుకొని తాగవచ్చు. సబ్జా విత్తనాలు లెమనెడ్స్, సలాడ్స్ లో కూడా బాగుంటాయి.

బరువు తగ్గాలంటే ..

షియా లేదా సబ్జా ఈ రెండిట్లో దేనినైనా మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు నీళ్లలో నానబెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కడుపు నిండుగా మారి అతిగా తినే కోరిక తగ్గిపోతుంది.

5, ఫిబ్రవరి 2024, సోమవారం

దేశ దేశాల్లో ఆయుర్వేదం .. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పం

 

విశ్వవ్యాప్తంగా ఎన్నో సంప్రదాయ వైద్య విధానాలు వేల ఏళ్లుగా ప్రజలకు స్వస్థత చేకూరుస్తున్నాయి భారతను ఆయుర్వేదానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది దీనికి ప్రాచుర్యం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 80% ఏదో ఒకరకంగా సంప్రదాయ వైద్య విధానాలను పాటిస్తున్నారు ఇలాంటి వాటిని ప్రధాన చికిత్స పద్ధతుల్లో భాగం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు ప్రాంతీయ కార్యాలయాలు శాస్త్రీయంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం రెండో అత్యంత ఆమోదయోగ్యమైన వైద్య విధానంగా ఉంది ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ జాబితాలో ఆయుర్వేద వైద్య పారిభాషిక పతజాలాన్ని డబ్ల్యూహెచ్వో చేర్చింది దీనికి సంబంధించిన ప్రతిని ఇటీవల ఢిల్లీలో ఆవిష్కరించింది డబ్ల్యూహెచ్వో 2019 22 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను సంప్రదించి భారత ప్రభుత్వం భాగస్వామ్యంతో దీన్ని తయారు చేసింది ఆయుర్వేదంలో దీన్ని కీలకమైలు రాయిగా అభిమానించవచ్చు ఐసిడి జాబితా రూపకల్పనలో భాగంగా డబ్ల్యూహెచ్వో ఆధ్వర్యంలోని ఆయా విభాగాలు 2019లో తొలిసారిగా ఇండియా వ్యాప్తంగా పేరెన్నికదన్న విద్యాసంస్థలు ఆస్పత్రులు ఇతర సంస్థల్లో నిపుణులను సంప్రదించాయి వారి భాగస్వామ్యంతో పలు ఆయుర్వేద గ్రంధాలు వెబ్ పోర్టల్లను విశ్లేషించి ఆయుర్వేద వైద్యంలో సాధారణంగా వాడే పారిభాషిక పదాల జాబితా తయారు చేశారు తొలి ప్రతిలో 5879 ఆయుర్వేద పదబంధాలను కోండికరించారు వీటన్నింటినీ తేలిక గుర్తించేలా క్రమసంఖ్యలను కేటాయించారు గుజరాత్లో 2019 డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆశ్రయ బంగ్లాదేశ్ కెనడా డెన్మార్క్ భారత్ జపాన్ మలేషియా నేపాల్ న్యూజిలాండ్ శ్రీలంక లకు చెందిన వైద్య భాషా నిపుణులు ఈ పద సముదాయాన్ని నిశితంగా పరిశీలించి విశ్లేషించి ఆమోదించారు అనంతరం దీన్ని అంతర్జాతీయంగా మరింత పేరెన్నిక గన్న వైద్య నిపుణుల బృందానికి పంపించారు అర్జెంటీనా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జర్మనీ భారత్ మలేషియా తదితర 18 దేశాల బృందం 26 వర్చువల్ సమావేశాలు నిర్వహించి ఈ పద సముదాయాన్ని పరిశీలించిన కొన్నింటిని తొలగించి మరికొన్నింటిని మెరుగుపరిచి నది.2021 అక్టోబర్లో 35 దేశాల నిపుణుల బృందం మరోసారి దీన్ని సుశీకంగా పరిశీలించి 3876 పారిభాషిక పదాలను ఆమోదించింది సమానార్థం కలిగిన పర్యాయపదాలతో కలిపి ఈ సంఖ్య 4012 కు చేరింది. ఆయుర్వేదంలో చెప్పిన అనేక మూల సూత్రాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వ్యాధికి సంబంధించిన ద్రవ్యాలు ఔషధాలు ఆహార తయారీ విధానాలు చికిత్సలు వ్యాధి నివారణ పద్ధతులు తదితరాలను సమగ్రంగా పరిశీలించి ఈ పారిభాషిక పదజాలని రూపొందించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఢిల్లీలో ఇటీవల ఐసిడి రెండో ప్రతిగా ప్రజలకు వైద్యులకు దీన్ని అందుబాటులోకి తెచ్చారు ఈ పదకోశం ఆంగ్ల మాధ్యమంలో స్పష్టంగా ఎలాంటి సందేహతలకు తావు లేకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు

మన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తం కావడానికి ఈ పారిభాషిక పధ కోసం ఎంతగానో తోడ్పడుతుంది ప్రపంచ సంప్రదాయ వైద్య విధానాలతో ఆయుర్వేదం అనుసంధానం కావడానికి మేలిమి అడుగుక దీన్ని భావించవచ్చు ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తంగా వినియోగించడానికి దానిపై పరిశోధనలు చేయడానికి దీనివల్ల మార్గం సుఖమం అవుతుంది రాబోయే రోజుల్లో మన ఆయుర్వేద ఉత్పత్తులకు దేశ విదేశాల్లో గిరాకీ ఏర్పడటానికి ఈ పారిభాషిక పదజాలం ఉపయోగపడుతుంది ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు నేర్చుకోవడానికి వైద్యమెలకువలు పంచుకోవడానికి ఆస్కారం దక్కుతుంది వైద్య పర్యాటకానికి దీనివల్ల మేలు కలుగుతుంది అనేక ఆయుర్వేద చికిత్సలను ప్రజలకు తక్కువ ధరకు అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది భారతి లోని ఆయుర్వేద విద్యాలయాలకు ఔషధ తయారీ రంగానికి సాంకేతిక నిపుణులకు తరిఫీది ఇచ్చే సంస్థలకు ఈ పారిభాషిక పదజాలం ఎంతగానో తోడ్పడుతుంది పంచకర్మ చికిత్సలకు సంబంధించిన పరికరాల తయారీ పరిశోధనల రంగానికి ప్రయోజనం జరుగుతుంది భారతలోని ఆయుర్వేద విద్యార్థులు అధ్యాపకులు చికిత్స నిపుణులు ఔషధ తయారీదారులు ఆయుర్వేద అభిమానులు ఈ పారిభాషిక పదకోశాన్ని రోజువారి వైద్య విధానంలో విరివిగా వినియోగించాలి దీనివల్ల ఆరోగ్య రక్షణతో పాటు మన ఆయుర్వేదానికి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. తద్వారా మన సాంప్రదాయ వైద్యం విశ్వవ్యాప్తమై దేశానికి ఆర్థికంగా మేలు కలుగుతుంది ప్రపంచానికి ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగం జరుగుతుంది.



4, ఫిబ్రవరి 2024, ఆదివారం

లిప్ బామ్ లో ఏముండాలి

 ఎంత ఖరీదైన లిప్ బాంలు వాడిన పెదాలు తరచూ పొడిబారుతున్నాయి .. ఆయుర్వేదిక్ వి  కొన్న ఇదే పరిస్థితి.. అసలు వీటిల్లో ఏమున్నవి.. తీసుకుంటే ప్రయోజనం ఉంటుందా..

వాతావరణంలోని మార్పుల ప్రభావం మొదటపడేది పెదవులపైనే. అతి చల్లదనమైనా ,వేడిగా ఉన్నా పొడి భారతాయి .పెదాలను తరచూ నాలుకతో తడపడం, అలర్జీలు, థైరాయిడ్, ఐరన్, బి విటమిన్ లోపం, తగినంత నీటిని తాగకపోవడం ఇలా దీనికి బోలెడు కారణాలు. రోజు మొత్తంలో ఒకసారి ,రెండుసార్లు లిప్ బాం రాసి ,సరైన తేమ అందడం లేదు అనడం కూడా సరికాదు. పెదాల పైన చర్మం చాలా పలుచగా ఉంటుంది. పైగా దీనిపై నూనె గ్రందులు ఉండవు ,కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు పోషణ అందించాలి. రోజు మూడు లీటర్ల నీటిని తాగండి. వీలుంటే ఇంట్లో హ్యూమిడిఫైయర్ని ఏర్పాటు చేసుకోండి. వాటితో పాటు పెట్రోలియం జెల్లి, విటమిన్ ఈ, మినరల్ ఆయిల్స్,సెరమైడ్స్, టైటానియం ఆక్సైడ్ , జింక్ ఆక్సైడ్ ఉన్న లిప్ బాములు ఎంచుకుంటే సరి. ఎస్పీఎఫ్ ఉండేలాననూ చూసుకోవాలి. సువాసన బాగుంది, రంగు ఆకర్షిస్తుందని ఫ్రూట్ ఫ్లవర్ ఫ్లేవర్లు ,మెంతాల్ , వ్యాక్స్ ,యూకలిప్టస్ ఉన్న వాటిని వాడొద్దు. ఇవి సమస్యను పెంచుతాయి .కొన్నిసార్లు ,కొన్ని రకాల టూత్ పేస్టులు కూడా పడవు. అదేమైనా కారణమేమో చెక్ చేసుకోండి. తరచూ స్క్రబ్బింగ్, పొట్టు తీయడం, ఆలోచిస్తూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం లాంటివి చేయొద్దు. బయట వాటితోనే సమస్య అనిపిస్తే, స్పూను చొప్పున కొబ్బరి, బాదం నూనెలు, కోవా ,బటర్లను ఒక గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేయాలి. దించాక రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి .ఆరాక చిన్న డబ్బాలోకి తీసుకొని దాన్ని పెదాలకు రాసుకున్న అలర్జీల భయం ఉండదు.


24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ఆనంద ఆహారం ఇదీ..

 మానవ ప్రయాణ  జీవిత అంతిమ లక్ష్యం ఆనందమే. చేసే పనులను బట్టి కాదు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా  ఆనందం లభిస్తుందని పోషకాహార నిపుణుల మాట. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా లభిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి.

డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. దీనినే ఆనంద హార్మోన్ అని అంటారు. డోపమైన్ తో కూడిన ఆహారం శరీరపు బరువును తగ్గించడంలోనూ సహాయ పడుతుంది. పాలు పెరుగు యోగర్ట్ లాంటి పాల ఉత్పత్తులు, శరీరానికి మంచి బాక్టీరియాను అందించే ప్రొబయోటిక్స్ .. ఇవి మన మూడ్ ను ఆహ్లాదపరిచే డోపమైనును చైతన్య పరుస్తాయి. గుడ్లు, అరటి పండ్లు కూడా డోపమైన్ గనులే .వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం అంటేనే అమైనో ఆమ్లాల  ఖజానా అని అర్థం. అమైనో ఆమ్లాల నుండే డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.

మిఠాయిలు అంటే నోరూరే వాళ్ళు , డార్క్ చాక్లట్స్ తింటే సరి. వాటిలోని ట్రైకోసిన్ అనే అమైనో ఆమ్లం నుండి డోపమైన్ ఉత్పత్తి అవుతుంది.పైగా మూడ్ ను నియంత్రించే సెరటోనిన్ ,ఎండార్ఫిన్ హార్మోన్ లు కూడా డార్క్ చాక్లెట్ లో ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ తో పోలిస్తే , పిండి పదార్థాలను/హోల్ గ్రెయిన్ ఆహారంగా తీసుకునే వారిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపించాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పొట్టు తీయని గింజలు , కూర గాయలు, పప్పు ధాన్యాలు, తాజా పండ్లు,బీన్స్,మొలకలు ఆహార పళ్ళెంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆనందం మన సొంతం అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.



14, జులై 2021, బుధవారం

పుండు మచ్చలకు తేనె

 గాయాలు , డోకుడు పుళ్ళు,కాలిన పుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు పుండు మాడిన తర్వాత రోజూ ఆ ప్రాంతం మీద తేనె రాయండి.చర్మం మీద పొరలు త్వరగా వచ్చి చర్మం రంగులో మచ్చలు కలిసిపోతాయి.లేకపోతే తెల్ల మచ్చలు మచలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.

పేగు పూత - చేమంతి పూల మందు.

 గ్యాస్ ట్రబుల్ ,కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలా ప్రారంభమై నెమ్మదిగా పేగు పూత వ్యాధిగా పరిణమించే పెప్టిక్ అల్సర్ జబ్బుకు విమోచనం లేదు .ఎందుకంటే మనం ఈ వ్యాధిని అనునిత్యం ఏదో ఒక విధంగా పెంచి పోషిస్తూ నే ఉంటాం కాబట్టి.  కడుపు మండ ని వారు ,కడుపులో మంట లేనివారు ఈ లోకంలో ఎవరు ఉంటారు చెప్పండి.  అల్సర్ వ్యాధి కి ఇదే కదా కారణం - కడుపుమంట!


చేమంతి పూలను ఎండించి చూర్ణం చేసి మంచి తేనెతో తీసుకుంటే  పేగులకు బలం !అన్నం తినగానే కడుపునొ ప్పి వస్తున్న వారు ,నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే తగ్గిపోతున్న వారు ఇద్దరికీ ఇది మంచి మందు.కడుపులో పాములు కూడా దీంతో చచ్చి పడిపోతాయి.

తలలో పేలు పోవడానికి సీతాఫలం గింజలు

 సీతాఫలం గింజలను సేకరించుకుని శుభ్రంగా  కడిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండిి. వీలైతే వీలైతే సీతాఫలం సీతాఫలం లేత ఆకులను కూడా ఎండించి దంచి ,ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకుని ,కాసింత నీరు పోసి తడిపి తలకి పట్టించండి.ఒక అరగంట తర్వాత తలంటు పోసుకొండి.తలలో పేలు పోతాయి.తలలో పుళ్ళు తగ్గు తాయి.శరీరం మీద పుళ్లకు కూడా ఈ పొడిని రాయవచ్చు.

శ్రావ్యమైన స్వరం కోసం - మామిడి చిగురు

 మావి చిగురు తినగానే కోయిల కూసేనా అని పాట ఉంది, మామిడి చిగురు తిన్నంత మాత్రాన కోయిల కూస్తుందా? కోయిలే కాదు మామిడి చెట్టు లేత చిగుళ్ళు తింటే మనం కూడా శ్రావ్యంగా పాడగలుగుతాం.గొంతు శుద్ధి అవుతుంది.

ఈ లేత చిగుళ్ళు మెత్తగా దంచి ,నీళ్లలో కలిపి బాగా మరిగించి ,చిక్కటి కషాయం తీసి వడగట్టి పంచదార కలుపుకొని తాగితే మంచిది.

ఈ కషాయాన్ని పంచదార వేయకుండా ,నోట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు,నోరు వ్యాధులన్నీ తగ్గి ,గొంతు శుద్ధి అవుతుంది.

13, జులై 2021, మంగళవారం

మానసిక వ్యాధులకు గులాబీల మందు

 గులాబీ పువ్వులు  మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .ఆ పువ్వులను వాసన చూస్తేనే ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రశాంతత ,మానసిక శాంతి కావాలనుకునే వారికి గులాబీ పూలను ఔషధంగా సేవించడం మంచి మందు .

గులాబీ పువ్వులు ఎండించి మెత్తగా దంచి పంచదార కలుపుకుని రోజూ ఉదయం సాయంత్రం 1-2 చెంచాలు తినండి.

విరేచనం సాఫీగా అయ్యేలా చేసే గుణం కూడా ఉంది. కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటే ఒక్క విరేచనంంసాఫీ గా అవుతుందో అంత మోతాదులో ఈ గులాబీ రేకుల పొడిని తీసుకోండి.మానసిక వ్యాధులు అలజడులు మనోవికారాలున్నవారికి ఇది క్విక్ రెమెడీ గా పనిచేస్తుంది.బీపీ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన మందు.

నీరసానికి కిస్మిస్ మందు

 ఎండిన కిస్మిస్ పండ్లు బజార్ లో దొరుకుతాయి.ఈ ద్రాక్ష పండ్లకు సమానంగా పంచదార ,తేనె కలిపి ఒక సీసా లో పోసుకుని రోజూ రెండు చెంచాల మందు ఉదయం,సాయంత్రం తాగండి.కడుపులో వేడి తగ్గుతుంది.అజీర్తి పోతుంది, పైత్యం తగ్గుతుంది. అమీబియాసిస్ వ్యాధి వలన కలిగిన ఉడుకు తగ్గుతుంది.గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది.ప్రయత్నించి చూడండి. మీకు షుగర్ వ్యాది లేకపోతేనే ఈ ప్రయోగం చేయాలి సుమా!

18, మే 2021, మంగళవారం

సహజ వైరస్ సంహారకాలు... / NATURAL VIRUS KILLERS.

 సహజ వైరస్ సంహారకాలు...


1.) తులసి - 

ఇది అద్భుతమైన వైరస్ సంహారిణి. రోజూ ఉదయాన్నే 10,15 తులసి ఆకుల్ని నమిలి తినేయాలి. 


2.) పుట్టగొడుగులు - 

వైరస్ ను సమర్థంగా నిరోధించే గుణం పుట్టగొడుగులకు ఉంటుంది . వీటితో రుచికరమైన సూప్ తయారుచేసుకొని తాగొచ్చు. దీంట్లో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు వేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ సొంతన్ చేసుకొవచ్చు. సూప్ తాగలేము అనుకుంటే హాయిగా కూర వండుకొని తినొచ్చు. 


3.) గ్రీన్ టీ ,బ్లాక్ టీ - 

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఈ పాలీఫినాల్స్ , వైరస్ లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. బ్లాక్ టీ లో అల్లం లేదా దాల్చిన చెక్క వేసుకుని తాగితే మరింత ఫలితం ఉంటుంది.


4.) పెరుగు - 

తాజా పెరుగు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగని పులిసింది వాడకూడదు.


5.) బ్రకోలీ - 

దీనికి ఫ్లూ ను తగ్గించే గుణం ఉంది. ఇందులో విటమిన్ సి, ఇ ,పుష్కలంగా ఉంటాయి. 


6.) శొంఠి - 


అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. టీ లో వేసుకుని లేద కషాయంగా చేసుకుని తాగొచ్చు. ఆల్లం కంటే శొంఠి తీసుకోవడం మంచిది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. దగ్గుని నియంత్రిస్తుంది. దగ్గినప్పుడు కఫం బయటకు వెళ్లేలా లేదా ఆరిపోయేలా చేస్తుంది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను త్రికటుకాలు అంటారు. ఈ మూడింటినీ కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి. 


7.) దాల్చిన చెక్క .- 


శరీరంలో వైరస్ వృద్ధిని నియంత్రిస్తుంది. విరేచనాలు అవ్వకుండా చూస్తుంది. టీలో చేసుకుని తాగితే మంచిది జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


8.) పసుపు - 


వేడిపాలల్లో పసుపు వేసుకుని రాత్రి పడుకునేముందు తాగితే తెల్లారేసరికి ఫలితం కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...