23, అక్టోబర్ 2015, శుక్రవారం

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్య - ఆయుర్వేద పరిష్కారం / యవ్వనవార్ధక్యం /YAVVANA VARDHAKYAM - AYURVEDIC SOLUTION

యవ్వనంలో వచ్చిన ముసలితనపు సమస్యకు ఆయుర్వేద పరిష్కారం

ఉసిరిక పండు పై బెరడు రసం లేదా చూర్ణం - 10 గ్రాములు
దేశవాళీ ఆవు నెయ్యి - 10 గ్రాములు,
చక్కెర - 10 గ్రాములు,
తేనె - 20 గ్రాములు,

పై అన్నింటినీ తీసుకుని బాగా కలిపి ,ఉదయం పర గడుపున తిని అనుపానంగా 1 కప్పు గోరు వెచ్చని పాలలో 1 చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగుతూ ఉండాలి.

ఉదయం స్నానానికి గంట ముందు 6 గంటల వేళ శరీరానికి గోరు వెచ్చగా నువ్వుల నూనె మర్దన చేసి అర గంట పాటు సూర్య నమస్కారాలు,పావు గంట ప్రాణాయామం,పావు గంట ధ్యానం చేయాలి.


ఆకు కూరలు,పాత బియ్యం,కాయ గూరలు,ఇంట్లో వండిన తీపి పదార్థాలు తింటుండాలి.

మధ్య వయసులో వచ్చిన ముసలితనం పోయి తిరిగి యవ్వనం ప్రాప్తిస్తుంది.

18, అక్టోబర్ 2015, ఆదివారం

నరాల బలహీనత సమస్య - ఆయుర్వేద పరిష్కారం $ ఆహార పరిష్కారం / NARALA BALAHEENATHA SAMASYA - AYURVEDIC $ FOOD SOLUTIONS

1  .  శరీరంలో నరాలన్నీ చచ్చుబడినట్లుగా ఉండి,ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకుండా ఉండడం,వంటి బాధలు తొలగాలంటే 

అతిబల వేళ్ళు -250 గ్రాములు,
అశ్వగంధ దుంపలు - 250 గ్రాములు,
నేలతాడి దుంపలు - 250 గ్రాములు,
అతిమధురం వేళ్ళు - 250 గ్రాములు,

పై అన్నింటినీ ముక్కలుగా చేసి శుభ్రమైన మట్టిపాత్రలో అవి మునిగే వరకు దేశవాళీ ఆవుపాలు పోసి చిన్న మంటపైన పాలు ఇగిరే వరకు మరిగించి ఆ ముక్కలను ఎండలో ఆరబోసి రోజంతా ఎండించాలి.మరలా మరుసటి రోజు పాలు పోసి మరిగించి ఎండించాలి.ఈ విధంగా మూడు సార్లు కాని ,ఏడుసార్లుకాని చేసి చివరగా బాగా ఎండించి దంచి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిలువచేసుకోవాలి.

ఈ చూర్ణాన్ని రెండు పూటలా 10 గ్రాముల మొతాదుగా అరగ్లాసు గోరువెచ్చటి ఆవుపాలల్లో వేసి అందులో ఒక చెంచా ఆవు నెయ్యి,రెండు చెంచాల తేనె కలిపి రోజూ సేవిస్తుండాలి.

కసివింద / చెన్నంగి ఆకుల రసం తీసి దానికి సమంగా వెన్న కలిపి ఆ మిశ్రమాన్ని శరీరమంతా మర్దన చేసి గంటాగి స్నానం చేయాలి.కసివింద లభించకపోతే తెల్ల ఆవాల నూనె గోరువెచ్చగా చేసి మర్దన చేయాలి.

తాంబూలంలో 2 గ్రాముల జాపత్రి పెట్టి సేవిస్తుండాలి.

నరాల బలహీనత సమస్య పరిష్కారమౌతుంది.

2  .నరాల బలహీనత కు ఆహార పరిష్కారం.

వరి ప్రధాన ఆహరంగా తీసుకునే వాళ్లు చిట్టూ ,తవుడు కోల్పోతున్నారు .ఐతే దీనికి ప్రత్యామ్నాయం ఉంది.

.చిట్టూ ,తవుడు లేకపోవడం వలన మనం ప్రధానంగా బి1 విటమిన్ / థయమిన్ లోపానికి గురవుతున్నాము.దీని వలన నరాల బలహీనత / బెరి బెరి జబ్బు ఏర్పడుతుంది.కాయగూరలు,మాంసం బాగా తీసుకోగలిగితే వరి అన్నం మీద ఆధారపడకుండానే శరీరానికి కావాల్సిన థయమిన్ పొందవచ్చు.100 గ్రాముల దంపుడు బియ్యంలో  300 మి.గ్రా.థయమిన్ ఉంటుంది.కానీ 100 గ్రాముల గోధుమల్లో 500 మి.గ్రా. థయమిన్ ఉంటుంది.అంటే ఒక పూట వరి అన్నం ,ఒక పూట గోధుమతో రోటీ లాంటి ఏదైనా వంటకం తినటం మంచిదన్నమాట.ఎండిన బఠాణీ ( 800 ),బంగాళా దుంపలు ( 150 ) కూడా ఆ లోటుని భర్తీ చేస్తాయి.నువ్వులు,వేరు శనగ గుళ్ళు ,పొద్దు తిరుగుడు గింజలు,వీటిలోంచి నూనెను తీసేయగా మిగిలిన పిప్పిలో బి విటమిన్ ఉంటుంది.దీనిని తెలక పిండి అంటారు.అప్పుడప్పుడు కూరగా చేసుకుని తినవచ్చు.గోధుమ,రాగి,జొన్న,సజ్జలు,వీటిలోంచి చిట్టు,తవుడు తీయకుండానే పూర్తి ధాన్యాన్ని మరాడించి వాడుకుంటున్నము కదా .దంపుడు బియ్యానికన్నా అనేక విధాలుగా ఈ ధాన్యాల్లో విటమినులు ఎక్కువగా ఉంటున్నాయి.కాబట్టి థయమిన్ లోపం ఉన్నవాళ్లు దంపుడు బియ్యానికన్నా గోధుమ ,రాగి,జొన్న,సజ్జల మీద ఆధారపడటమే మంచిది.మొలకెత్తిన రాగులు,సజ్జలు,పెసలు,శనగలతో పిండి వంటలు చేసుకుంటే రెట్టింపు థయమిన్ దొరుకుతుంది.అతిగా వేడి మీద వండితే థయమిన్ ఆవిరైపోతుంది.అందుకని బి1 కావాలంటే తేలికగా ఉడికించి వండుకుంటేనే ఫలితం ఉంటుంది.టాబ్లెట్లు మింగటం కన్నా ఆహారం ద్వారా దీనిని పొందటమే మంచిది.

NITHYAM JALUBU PADISHAM ROMPA DAGGU SAMASYAKU DRAKSHA GUTIKALU

నిత్యం జలుబు, పడిశం, రొంప, దగ్గు సమస్యకు - ద్రాక్షగుటికలు

-:  నా వయస్సు 35 సం.లు, నాకు ఋతువుతో సంబంధం లేకుండా
ఎల్లప్పుడూ జలుబు పీడిస్తూనే వుంటుంది. దాంతోపాటు దగ్గుకూడా హింసిస్తుంది. ఎప్పుడూ సరిగా ఊపిరాడదు. ఈ సమ
స్యతో క్షణంక్షణం నరకయాతన పడుతున్నాను. దయతో మంచి మార్గం చెప్పండి.

! 1) నీ సమస్యకు చక్కని ఆహారౌషధమార్గం నీ ఇంట్లోనే వుంది. విశ్వాసంతో ఆచ
రించి విజయం సాధించు, గింజలున్న ఎండుద్రాక్ష 30 గ్రా, దోరగా వేయించిన మిరియాలపొడి 30గ్రా, అతిమధురంపాడి
| 30 గ్రా, పటికబెల్లంపాడి 30గ్రా, తీసుకొని అన్నింటినీ కలిపి మెత్తగా ముద్దలాగా అయ్యేటట్లు దంచి ఆ ముద్దను 10గ్రా,
తూకంగా గోలీలు చేసి నిలవజేసుకో. రోజూ సమస్య తీవ్రతను బట్టి రెండులేక మూడుసార్లు ఒకగోలీని బుగ్గన పెట్టుకొని
నిదానంగా చప్పరించి తింటుంటే దగ్గు, రొంప తగ్గిపోతయ్. 2) ఆహారంలో పాలు, పెరుగు, మజ్జిగ, తెల్లబియ్యం, కొత్త
బియ్యం, సారకాయ, బీరకాయ,
దోసకాయ, ఆకుకూరలు, ఇంకా చల్లబడిన అన్నంకూరలు, ఫ్రిట్లోని పదార్థాలు పూర్తిగా
నిషేధించు 3) రోజూ సాయంత్రం గోరువెచ్చని ఆవనూనె చెవుల్లో, ముక్కుల్లో మూడుమూడు చుక్కలు వేసుకొని, గొంతుకు
ముఖానికి మెడకు వీపుకు ఛాతీకి పాదాలకు మిగిలిన నూనెను మర్దనచేసి ఒకగంటాగి స్నానంచేస్తుండు. ఈ మార్గాలతో
నీ సమస్య పూర్తిగా తగ్గుతుంది. శుభం.

ముఖం నల్లగా ఉన్న సమస్య UKHAM NALLAGA VUNNA SAMASYAKU KSHEERAHARIDRA LEPANAM

ముఖం నల్లగా ఉన్న సమస్య 

ఒక కప్పు ఆవుపాలు గానీ గేదె పాలు గానీ తీసుకుని వేడి చేసి దానికి కొద్దిగా నిమ్మరసం కలిపి విరగ్గొట్టి , వడపోసి e r విరుగుడు లో ఒక పావు చెంచా కస్తూరి పసుపు పొడి, పావు చెంచా బార్లీ గింజల పొడి ఒక పావు చెంచా గంధకచ్చూరాలు పొడి కలిపి మెత్తగా నూరి ముఖానికి లేపనం చేసుకోవాలి. అది ఆరడం మొదలుకాగానే గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి అవసరమైతే మోతాదు పెంచుకుని శరీరమంతా కూడా లేపనం చేసుకోవచ్చు దీనివల్ల నలుపుదనం విరిగిపోయి చర్మం రంగు మారుతుంది. మంచి రంగు వస్తుంది.

KEELLANOPPULAKU NIMMAKAYAHALWA - AYURVEDIC SOLUTION


కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం./ ఆయుర్వేద పరిష్కారం. / KADUPULO MANTA PULLANI THRENPULU THALAPOTU - HARITHAKILEHYAM

కడుపులో మంట,పుల్లని త్రేనుపులు,తలపోటు సమస్యలకు - హరీతకి లేహ్యం.

కరక్కాయ పోడి - 100 గ్రా.
ఎండు ద్రాక్ష పండ్లు - 100 గ్రా.
పటిక బెల్లం పొడి - 100 గ్రా.

పై అన్నింటిని కలిపి ముద్దలాగా దంచుకొని నిలువచేసుకోవాలి.రోజూ రెండు పూటలా 10 గ్రా. ముద్దను బుగ్గన పెట్టుకొని తింటుంటే ఆరోగ్యం కలుగుతుంది.

2. చల్ల బడ్డ అన్నం,కొత్త బియ్యపు అన్నం తినవద్దు.బియ్యాన్ని ఒక రాత్రి నానబెట్టి ,ఒక పగలు ఎండించి దోరగా వేయించి రవ్వ చేసుకొని ,తగినంత రవ్వ నీటిలో వేసి వండుతూ అందులో అల్లం 1 గ్రా.ముక్క,చిటికెడు మిరియాల పొడి ,చిటికెడు జిలకర పొడి,తగినంత సైంధవ లవణం,కొద్ది కొద్దిగా కొత్తి మీర,పుదీనా ,కరివేపాకులు వేసి వండుతూ అందులో వంటాముదం ,నెయ్యి లేదా వెన్నలతో తిరగమాత పెట్టి ఈ ఆహారాన్ని ఆకుకూరలతో కలిపి సేవిస్తుంటే ఆ ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.పై సమస్యలన్నీ తగ్గిపోతాయి.

ATHI AKALI SAMASYA KU VUTTHARENI YOGAM - AYURVEDIC SOLUTION


KANTIPORALA SAMASYAKU ADDASARAM KATUKA - AYURVEDIC SOLUTION


NIDRAPATTANI SAMASYA KU NIDRA YOGALU - AYURVEDIC SOLUTION


MOORCHA SAMASYAKU SARASWATHICHURNAM - AYURVEDIC SOLUTION



PILLALA DRUSHTIMANDYA SAMASYA -AYURVEDIC SOLUTION


Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...