ఆపిల్ పండ్లు సాధారణంగా అన్ని కాలాలలో విరివిగా దొరుకుతాయి.దీనిలో మంచి విటమినులు ఉన్నాయి.ఒక ఆపిల్ లో 1 మి.గ్రా ఇనుము ,14 మి.గ్రా ఫాస్ఫరస్ ,10 మి.గ్రా కాల్షియం ,ఏ విటమినులున్నాయి.రోజుకొక ఆపిల్నైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.
1. ఆపిల్ మలబద్ధకాన్ని నివారిస్తుంది.సాఫీగా విరేచనం అవుతుంది,కడుపులో మలాన్ని కరిగిస్తుంది.శరీరానికి బలాన్నిస్తుంది.మలబద్ధకంలోనూ , విరేచనాలలోనూ రెంటిలో ఉపయోగపడతాయి.దోరగా ఉన్న ఆపిల్స్ మలబద్ధకంలోనూ,ఉడికించిన ఆపిల్స్ , బేక్ చేసిన ఆపిల్స్ విరేచనాలలోనూ ఉపయోగపడతాయి.రోజుకు కనీసం 2 ఆపిల్స్ తీసుకుంటే గాని మలబద్ధకంలో ఫలితం కనిపించదు.ఉడికించడం వల్ల ఆపిల్స్ లో ఉండే చెల్యులోజ్ మెత్తబడి మలం హెచ్చు మొత్తాల్లో తయారవుతుంది.
2 . ఇది రక్త క్షీణతను నివారిస్తుంది.రక్తక్షీణత గలవారు కనీసం రోజుకు 3 ఆపిల్స్ అన్నా తింటే మంచిది.దీని జ్యూస్ను తీసిన వెంటనే తాగాలి.ఆపిల్స్ లో ఇనుము ,ఫాస్ఫరస్ ,ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటాయి.కావున రక్త హీనతలో బాగా పని చేస్తుంది.తాజా జ్యూస్ వాడితే ఫలితాలు బాగా ఉంటాయి.రోజుకు కిలో చొప్పున తీసుకోగలిగితే మంచిది.ఆహారానికి అరగంట ముందు గాని ,నిద్రకు ఉపక్రమించబోయేముందు గాని తీసుకుంటే పూర్తిస్థాయిలో ఉపయోగం కలుగుతుంది.
3.చంటి పిల్లలకు విరేచనాలవుతున్నప్పుడు ఒక చెంచా ఆపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరికడతాయి.
4 . ఆపిల్ జ్యూస్ లో యాలకులు ,తేనె కూదా కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట ,పేగుల్లో పూత ,అజీర్తి,గ్యాస్ ట్రబుల్ ,పుల్లని తేనుపులు ,గుండెల్లో మంట నివారిస్తాయి.
5. రక్త ,బంక విరేచనాలు అవుతున్నవారు ఆపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండి పదార్థాలు విరేచనాలలోని నీటి శాతాన్ని తగ్గించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.ఆపిల్ ముక్కలను ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది.
6 . తరచూ ఆపిల్స్ తింటూ ఉంటే తరచూ వచ్చే జ్వరాలు అరికడతాయి.
7 . రోజూ ఆపిల్ జ్యూస్ తాగడం వలన కడుపులో మంట,మూత్రంలో మంట ఉండదు.
8 . ఆపిల్ లో క్యాల్షియం ,పొటాషియం ఎక్కువగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయ వ్యాధులను ,మూత్రపిండాల వ్యాధులను అరికడుతుంది.
9 . పక్షవాతం,నాడీ సంబంధ వ్యాధులు ,మెదడు వ్యాధులు కలవారికి ఆపిల్ చాలా మేలు చేస్తుంది.నరాలలో గల కణజాలాలమధ్య సంబంధాలను కలుగచేసే యాక్టిల్ చోలిన్ ఉత్పత్తి పెంపుదలకు ఈ పండు దోహదం చేస్తుందని తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని,అల్జీమర్స్/మతిమరుపు అవకాశాలు తగ్గుతాయని అధ్యయనవేత్తలు తెలియజేస్తున్నారు.
10 . కామెర్ల వ్యాధిలో వీలైనంత ఆపిల్ రసాన్ని తాగుతుంటే కాలేయాన్ని సం రక్షిస్తుంది.
11 . ఆపిల్ కు కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది.జలుబు,దగ్గు,ఆయాసం వీటిని నివారిస్తుంది.
12 . ఎలాంటి అనారోగ్యాలలోనైనా ఆపిల్ జ్యూస్ తాగవచ్చు.షుగర్ పేషంట్స్ మాత్రం ఈ పండ్లను తినకూడదు.
13 . ఆపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది.అలసటను , నీరసాన్ని తగ్గిస్తుంది.
14 . ఆపిల్ ను ముక్కలుగా కోసి ,ఉడికించి రోజూ తింటుంటే శరీరం మీద బొల్లి మచ్చలు నివారణవుతాయి.శరీరం కాంతివంతంగా ఉంటుంది.
15 . ఆపిల్ చెట్టు వేళ్ళ రసాన్ని తాగుతుంటే కడుపులో ఏలిక పాములు నశిస్తాయి.
కొలెస్టరాల్ ఆధిక్యత తగ్గుదల -
ఆపిల్స్ ను తింటుంటే దానిలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ పదార్థం కొవ్వు పదార్థల గ్రహింపును అడ్డుకుంటుంది.పెక్టిన్ ఒక జెల్ మాదిరి పదార్థంగా తయారై ఆంలాశయం గోడల మీద ,చిన్న పేగు గోడల మీద పేరుకుపోయి కొవ్వు విలీనాన్ని అడ్డుకుంటుంది.
క్యాన్సర్లు తగ్గుటకు -
రోజూ ఆపిల్స్ వాడే వారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్ల ఉనికి తక్కువగా ఉంటుంది.దీనిలోని పెక్టిన్ జీవక్రియకు లోనైనప్పుడు బ్యుటైరేట్ అనె పదార్థం విడుదలవుతుంది.ఇది మలాశయం గోడల మీద రక్షణగా పనిచేసి క్యాన్సర్లబారినుండి శరీరాన్ని కాపాడుతుంది.
తలనొప్పులలో -
అన్ని రకాల తలనొప్పులలో ఆపిల్స్ చక్కగా ఉపయోగపడతాయి.బాగా పండిన ఆపిల్ను పైనా కిందా చెక్కు తొలగించి ,మధ్యలోని గట్టి పదార్థాన్ని కూడా తొలగించి కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత వంటి కారణాలతో ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి.ఆశించిన ఫలితం కనిపించాలంటే దీనిని కనీసం 2,3 వారాలు తీసుకోవాలి.
ఉదర సంబంధ సంస్యలు తగ్గటానికి -
అల్పమైన జీర్ణక్రియా సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆపిల్ ఆహార ఔషధంగా ఉపయోగపడుతుంది.ఆపిల్ ను మెత్తగా తరిగి ముక్కలను మెత్తని గుజ్జుగా చేసి ,దాల్చిన చెక్క పొడిని ,తేనెను చేర్చి తీసుకోవాలి.గింజలు , తొడిమ తప్ప ఆపిల్ ను మొత్తంగా ఉపయోగించవచ్చు.తినబోయేముందు బాగా నమలాలి.ఆహార సమయాలకు మధ్యలో దీనిని తీసుకోవాలి.ఆపిల్ లోని పెక్టిన్ ఆంలాశయపు గోడల మీద సం రక్షణ పొరగా ఏర్పడి మృదుత్వాన్ని కలిగిస్తుంది.ముక్కలుగా తరిగిన ఆపిల్ కు పెద్ద చెంచాడు తేనెను చేర్చి ,కొద్దిగా నువ్వుల పొడిని చిలకరించి తీసుకుంటే జీర్ణావయవాలకు శక్తినిచ్చే టానిక్ గా పని చేస్తుంది.ఆకలిని పెంచుతుంది.ఆహారానికి ముందు దీనిని తీసుకోవాలి.దీని వల్ల జీర్ణ రసాలు ఎక్కువగా తయారవుతాయి.
గుండె జబ్బులలో -
గుండె సమస్యలున్నవారు ఆపిల్ తీసుకోవడం మంచిది.పొటాషియం , ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి.సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి రక్తపోటు పెరగదు.ఆపిల్ ను తేనెతో తీసుకుంటే ఫలితాలు చాలా బాగుంటాయి.ఆపిల్ లోని పొటాషియం వల్ల గుండెకండరాలు సమర్థవంతంగా పని చేస్తాయి.గుండె పోటు అవకాశాలు తగ్గుతాయి.
అధిక రక్తపోటు తగ్గడానికి -
రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది చక్కని ఆహార ఔషధంగా పని చేస్తుంది.పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటం వల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమౌతుంది.అలాగే సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గడానికి కారణమౌతుంది.
వాపులతో కూడిన కీళ్ళనొప్పులు తగ్గడానికి -
గౌట్,రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి వాపులతో కూడిన కీళ్ళనొప్పుల్లో ఆపిల్ మంచి ఆహార ఔషధంగా పని చేస్తుంది.దీనిలోని మేలిక్ యాసిడ్ గౌట్ వ్యాధిలో పెరిగే యూరిక్ యాసిడ్ ను తటస్థపరచి నొప్పులను దూరం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.ఆపిల్స్ ను ఉడికించి ,జెల్లీలాగా చేసి పైన పూసి కొద్దిగా రుద్దితే నొప్పులను లాగేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
పొడి దగ్గు తగ్గటానికి -
ఇది తగ్గటానికి తియ్యటి ఆపిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.రోజుకు పావుకిలో చొప్పున తీసుకుంటే బలహీనత మూలంగా వచ్చే పొడి దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది.
మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యకు -
కిడ్నీలో రాళ్లు ఏర్పడినపుడు ఆపిల్స్ తీసుకుంటే ఉపయోగం కనిపిస్తుంది.కొన్ని దేశాల్లో మనం చింతపండు వాడినంత విరివిగా అసలైన ఆపిల్ సిడార్ వెనిగార్ వాడుతుంటారు.వీరిని శాస్త్రకారులు గమనించినపుడు కిడ్నీళ్ళో రాళ్లు దాదాపు కనిపించలేదు.బాగా పండిన తాజా ఆపిల్ పండ్లలో ఈ గుణం ఎక్కువగా ఉంటుంది.
కంటి సమస్యలలో -
కళ్ల కలకలూ , కంటి ఎరుపులూ ఉన్నప్పుడు ఆపిల్ ను లోపలకూ , బయటకూ వాడవచ్చు.పానీయంగా వాడటానికి కొంత తయారీ అవసరం.ముందుగా ఆపిల్ చెక్కులను ఒక పాత్రలో ఉంచి నీల్లు పోసి నీళ్లు మరిగేటంతవరకూ ఉంచి , దానంతట అదే చల్లబడేలా చేయాలి.తర్వాత వడపోసి ,తేనె కలిపి తీసుకోవాలి.బాగా మిగలపండిన ఆపిల్స్ నుకళ్ళ మీద పట్టు వేయటానికి వాడవచ్చు.కంటి మంటలలో ఇది అద్భుతంగా పని చేస్తుంది.కళ్లను మూసుకుని ఆపిల్ గుజ్జును పైకి పట్టు వేసి కదలకుండా బ్యాండేజీ గుడ్డను చుట్టుకొని ఒకటి రెండు గంటలుంచుకోవాలి.
దంత సమస్యల నివారణకు -
ఆపిల్స్ లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవరసాయనాలున్నాయి.ఆపిల్స్ ను అనునిత్యం తీసుకునేవారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి.ఆహారం తీసుకున్న తర్వాత ఆపిల్స్ ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది.పైగా ఆపిల్స్ లో ఉందే ఆసిడ్స్ వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది.ఏ ఇతర పండులోనూ లేని అద్భుత గుణమిది.
యవ్వన శక్తి పొందుటకు -
అకారణంగా నీరసంగా అనిపించేటప్పుడు ,బడలికగా ఉన్నప్పుడూ ,నిస్త్రాణగా తోచినప్పుడూ ఆపిల్ మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా ఉపయోగపడుతుంది.ఇది అనేకరకాల ఆహారలోపాలను సవరించి శరీరాన్ని పరిపుష్టం చేస్తుంది.ఆపిల్ లో అధిక మొత్తాల్లో ఇనుము , ఫాస్ఫరస్ లు ఉంటాయి.ఇతర పండ్లలో ఇంత మొత్తాల్లో ఈ పదార్థాలు ఉండవు.ఆపిల్ ను అనునిత్యం పాలతో కలిపి తీసుకుంటే చర్మం యవ్వన కాంతిని సంతరించుకుంటుంది.చర్మానికి బిగువు,నిగారింపు వంటివి ఏర్పడతాయి.దీనివల్ల అమితమైన రిలాక్సేషన్ లభిస్తుంది.
జిగట విరేచనాలు తగ్గుటకు -
పిల్లలలో తరచుగా జిగట విరేచనాలు అవుతుంటాయి.ఇలాంటి సందర్భాల్లో ఆపిల్స్ బాగా ఉపయోగపడతాయి.బాగా మిగలపండి,తియ్యటి రుచి కలిగిన ఆపిల్స్ ను మెత్తగా చిదిమి వయసును బట్టి ఒకటి నుంచి నాలుగు పెద్ద చెంచాలు తినిపిస్తే జిగట విరేచనాలు తగ్గుతాయి.
ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా,కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ,సోడియం తక్కువగా,పొటాషియం ఎక్కువగా ఉంటాయి.విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.
శ్వాస సమస్యల నివారణకు -
రోజుకు ఒక ఆపిల్ చొప్పున వారంలో ఐదారు తిన్నట్లైతే ఊపిరితిత్తుల పనివిధానం మెరుగ్గా ఉంటుంది.ఆపిల్ తొక్కలోని క్యురెక్టిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఊపిరితిత్తుల పనివిధానాన్ని మెరుగుపరుస్తుంది.టొమేటోలూ,ఉల్లిపాయలలోనూ ఇలాంటి ఆంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.క్రమం తప్పకుండా ఆపిల్స్ తింటూ ఉంటే శ్వాసకోశ పనివిధానం బాగుంటుంది.పుష్కలంగా ఆపిల్స్ తినే మహిళల్లో ఆస్థ్మా ఉండే అవకాశాలు లేని పిల్లలు జన్మిస్తారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.
No comments:
Post a Comment