AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
Monday, 7 January 2019
ఫిట్స్ / మూర్చ వ్యాధి గురించిన అపోహలు - వాస్తవాలు.
మూర్చ రోగంగా ప్రచారంలో ఉన్న ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ఎపిలెప్సి ,కన్వల్షన్స్,సీజర్స్,ఫిట్స్ అని అంటారు.పూర్వ కాలంలో ఈ వ్యాధిపై ప్రజల్లో చాలా అపోహలు ఉండేవి.శక్తి పూనింది,ఆత్మ ఆవహించింది,దెయ్యం పట్టిందని ప్రజలు నమ్మేవాళ్లు.క్రీ.పూ. 470 లో హిపోక్రెట్స్ అనే వ్యక్తి దీనిని జబ్బుగా గుర్తించడంతో కొద్దిగా భయం తగ్గింది.యూరప్ దేశాల్లో 17,18 వ శతాబ్దంలో ఈ వ్యాధి ఎక్కువ మందికి రావడంతో ఆ దేశ ప్రజలు చాలా ఆందోఅళనకు లోనయ్యారు.ఇండియా ఈ వ్యాధిని ఆత్మ ఆవాహన / ఈవిలి స్పిరిట్ గా భావించి అశాస్త్రీయ పద్ధతుల్లో నివారణకు ప్రయత్నించేవారు.
మొదటి సారి జాన్ హల్గిన్స్ జాన్సన్ 1835-1911 ఈ వ్యాధిపై ఎన్నో పరిశోధనలు చేసి ,ఎందరో రోగులను పరిశీలించి జబ్బు లక్షణాలు కనుగొన్నారు.ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనను ఫాదర్ ఆఫ్ న్యూరాలజీ అంటారు.1857 లో మొదటి మందు పొటాషియం బ్రోమైడ్ ను సర్ చార్లెస్ కనుగొన్నారు.
ఫిట్స్ వచ్చేవారిలో 95 శాతం మందికి ఒకటి,రెండు నిమిషాలలో ఫిట్స్ వచ్చి తగ్గిపోతాయి.5 శాతం మందిలో మాత్రమే ఎక్కువసేపు ఉంటాయి.
ఫిట్స్ వచ్చిన వెంటనే తలపై నీళ్లు పోయడం ,చేతిలో ఇనుప వస్తువులు ఉంచడం ,నోట్లో స్పూన్ లేదా కర్చీఫ్ పెట్టడం ,ముక్కు దగ్గర ఉల్లిపాయ ఉంచడం వంటి పద్ధతులు మంచివి కావు.ఈ చిట్కాలలో రోగికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఫిట్స్ వచ్చినప్పుడు ఒకవైపునకు తిప్పి పడుకోబెట్టాలి.శ్వాస సరిగ్గా తీసుకునేలా మెడను కొద్దిగా వెనక్కి వంచాలి.రోగికి గాలి తగిలేలా కిటికీలు ,తలుపులు తెరిచి ,ఫాన్ వేయాలి.
ఫిట్స్ తగ్గిన అరగంట వరకు ఎలాంటి ఆహారం ఇవ్వవద్దు.అరగంట తర్వాత రోగి పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాత మొదట మంచినీళ్లు ఇవ్వాలి.ఫిట్స్ వచ్చిన సమయంలో నాలుక కట్ అయి ఉంటే వెంటనే దాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి.
మూర్చ రోగ నిర్ధారణకు చేయాల్సిన పరీక్షలు ఇ ఇ జి ,సిటి స్కాన్ బ్రెయిన్,ఎం ఆర్ ఐ బ్రెయిన్ పరీక్షలు చేసి జబ్బును నిర్ధారించుకున్న తర్వాత చికిత్స ప్రారంభించాలి.
90 శాతం మందికి 3 సంవత్సరాలు క్రమంగా మందుల వాడకంతో ఫిట్స్ పూర్తిగా తగ్గిపోతాయి.10 శాతం రోగులకు మాత్రమే పదే పదే వస్తుంది.తగిన పరీక్షలు చేసి సరైన మందులతో తగ్గించవచ్చు.1000 మందిలో ఒకరిద్దరికి మాత్రం ఎన్ని మందులు వాడినా ఫిత్స్ వస్తూనే ఉంటాయి.ఇలాంటి రోగులకు ఎపిలెప్సీ సర్జరీ చేయడంతో వ్యాధిని తగ్గించవచ్చు.100 మంది రోగులలో 90 శాతం మందికి ఒక్క టాబ్లెట్ తోనే పూర్తిగా కంట్రోల్ అవుతుంది.మరో 9 శాతం రోగుల్లో మరో టాబ్లెట్ ( రెండు రకాల మందులతో ) ఇవ్వడంతో తగ్గుతుంది.1 శాతం రోగుల్లో మాత్రమే రెండు కన్నా ఎక్కువ రకాల మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
కారణాలు.- ఎన్నో కారణాలు ఉన్నా ముఖ్యంగా 60 శాతం మందికి ఏ కారణం లేకుండానే వస్తుంది.దీనిని ఇడియోపథిక్ ఎపిలెప్సీ అంటారు.40 శాతం మందిలో రకరకాల కారణాలతో టిభి,వాంస్ కారక ట్యూమర్ వల్ల,మెదడులో ఏర్పడే మచ్చల వల్ల ,రక్తనాళాలలో దోషాలతో ,తలకు దెబ్బ తగలడంతో ,శరీరంలో కొన్ని అవాంచిత మార్పుల కారణంగా ( సోడియం తగ్గినా ,కిడ్నీ,లివర్ ఫెయిల్ అయినా ,కాల్షియం మోతాదు పెరిగినాతగ్గినా,గ్లూకోజ్ తగ్గినా,పెరిగినా ) ఫిట్స్ వస్తాయి.
ఐతే నూటికి 99 శాతం ఫిట్స్ పూర్తిగా నయం అవుతున్నాయి కాబట్టి వీటి గురించి ఆందోళన అవసరం లేదు.ఫిట్స్ కారణంగా ప్రాణహాని,శరీర ఇతర భాగాలపై చెడు ప్రభావం లేదు కాబట్టి దీనిని ప్రమాదకరమైన జబ్బుగా పరిగణించాల్సిన అవసరం లేదు.
ఒక్కసారి వస్తే జీవితాంతం ఉండి ,శరీర భాగాలపై దుష్ప్రభావం చూపే మధుమేహం తో పోలిస్తే ఈ జబ్బు చాలా చిన్నది.
జాగ్రత్తలు -
ఈ వ్యాధి నివారణకు మందులతో పాటు జీవనశైలిలో మార్పు చాలా అవసరం.
సమయానుకూలంగా భోజనం,నిద్ర చాలా ముఖ్యం .ఉపవాసాలు చేయవద్దు.
ఈ వ్యాధి వచ్చిన వారు ఆల్కహాల్ తీసుకోవద్దు.కాఫీ,టీ,స్మోకింగ్ చాలా వరకు తగ్గించాలి.
ఎక్కువగా టెన్షన్ ,మానసిక ఒత్తిడికి గురికావద్దు.డ్రైవింగ్,స్విమ్మింగ్ చేయవద్దు.
మరీ దగ్గరగా టివి ని చూడవద్దు.టివి బ్రైట్నెస్స్ ,కలర్,షార్ప్నెస్స్ ,కాంట్రాస్ట్ చాలా వరకు తగ్గించి చూడాలి.
" నిరక్షరాస్యత కన్నా మూర్చ రోగం పెద్ద జబ్బు కాదు " .
ఆయుర్వేద చికిత్స
1.సర్ప గంధి వేర్ల కషాయము ప్రతిరోజూ తీసుకోవాలి.మూర్చ రాగానే ఉల్లిపాయ రసం కానీ ,కుంకుడు కాయను అరగదీసిన గంధమును కానీ రెండు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే స్పృహలోకొస్తారు.
2.ఒక చెంచా తేనెను ఒక కప్పు నీటిలో కలుపుకొని పూటకొకసారి తాగుతుంటే కొంత కాలమునకు పూర్తిగా వ్యాధి నయమౌతుంది.
3.వసను పొడిగా చేసి సీసాలో భద్రం చేసుకుని ,రోజూ అరచెంచా పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే మూర్చ,ఫిట్స్,నరాలకు సంబంధించిన వ్యాధులు నయమౌతాయి.దీన్ని తీసుకుంటున్నవారు మసాలాలు,పులుపు,కారం లేకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment