Pillalaku ఇంజక్షన్ అంటే భయం ఉన్నట్టే
పెద్దవాళ్ళకు ఆపరేషన్ అనేసరికి అదే మోస్తరు
భయం కలుగుతుంది.
“మీకు ఆపరేషన్ చేయాలి' అని వైద్యుడు చెప్పగానే
ఇంజక్షన్‌కి భయపడిన పిల్లాడిలా వెంటనే బిగ్గరగా ఏడుపు
అందుకోకపోయినా మనసులో అంతకురెట్టింపు భయం,
ఆందోళనలకు గురవుతారు. ఆక్షణంలో కలిగే మాన
సిక ఒత్తిడి అనుభవిస్తేగాని తెలియదు.
మిగిలినవాళ్ళకు ఎంతో ధైర్యం చెప్పినవారు కూడా
తమదాకా వచ్చేసరికి ఆపరేషన్ టేబుల్ మీద ఏమవు
తుందో, తిరిగి ఆరోగ్యంతో బయటకు రాగలుగుతానా,
ఆపరేషన్ ఫెయిల్క్అయితే ఎలా అనేటువంటి అనేక
సందేహాలతో సతమతమవుతారు.
ఎంతో సింపుల్ ఆపరేషన్లని చెప్పేకుటుంబనియం
త్రణ ఆపరేషన్క తాముభయపడి భార్యల్నిముందుకు
-నెట్టిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఇబ్బంది
కర మానసిక పరిస్థితి నుండి బయటపడాలంటే తమ
కున్న ఆరోగ్య పరిస్థితిగురించి, ఆ అనారోగ్యానికి అందు
బాటులో ఉన్న ప్రత్యామ్నాయ చికిత్సల గురించి రోగి
తప్పనిసరిగా వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
»వైద్యులు మారారు
నేటి వైద్యులకు అంతగా తీరిక ఉండడం లేదు.వర
సగా వస్తున్న పేషెంట్లను గబగబా చూసి పంపటంలో
ఒక్కొక్కరోగితో ఎక్కువసేపు మాట్లాడటం లేదు.
కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకుందా
మనుకునే వైద్యులు బహుతక్కువ. ఎక్కువశాతం 'క్లిని
కల్' పరీక్షల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా
అనారోగ్యం అంచనావేసి హడావుడిగా ఆపరేషన్ బల్ల
ఎక్కిస్తున్నారు. తమ ఆసుపత్రిలో ఉన్న సామాగ్రికి
పని కల్పించేందుకు ఆపరేషన్లు చేస్తున్నారో లేక ఆపరే
షన్ల ప్రాక్టీసుకోసం పేషెంట్లను వాడుకుంటున్నారో
అర్థంకాని పరిస్థితి నేడున్నది.
పైగా నిలువుదోపిడీ చేస్తున్న వైద్యులు చాలామంది
ఉన్నారు. ఆ మధ్య జాతీయస్థాయిలో జరిగిన
ఒక సర్వేలో మనదేశంలో హిస్ట్రక్టమీ (గర్భసంచీ
తొలగింపు) ఆపరేషన్ అనవసరంగా చేస్తున్న
వైనం బయటపడింది. గర్భసంచీ తొలగించటం
అవసరమా, ఒకవేళ అది తొలగిస్తే ఏమవు
తుంది అనే విషయం పట్టించుకోకుండా ఆపరే
షన్ చేసి తీసి పారేస్తున్నారు.
ఇటువంటిదే నేడు జరుగుతున్న సిజేరియన్
ఆపరేషన్. అలాగే అవసరం లేకున్నా హడావుడిగా
సిజేరియన్ చేస్తున్నారు. దీనిమీద జాతీయస్థాయిలో
పెద్ద ఆందోళనే జరిగింది. అంతమాత్రంచేత
కాలం పడుతుందో తెలుసుకోవాలి.
కున్న ఇతర చికిత్సా విధానాలగురించి అడగండి.
ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పిన భాగం
ఏది, ఆపరేషన్ ద్వారా ఏదైనా ఒక శరీర భాగం
అలా తొలగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు
ఏమిటి, ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఏమిటి? కోలుకునేందుకు ఎంత
మ: మనదేశంలో వైద్యులు, కార్పోరేట్ ఆసుపత్రులు తమ
ము పద్ధతి మార్చుకుంటాయనలేం,
గి
ఇటీవల ముంబయిలోని ఒక సంస్థ చేసిన పరిశోధ
నలో మనదేశం మొత్తం మీద జరుగుతున్న ఆపరేషన్లలో
సగానికి సగం రోగికి అవసరం లేకుండా జరుగుతున్న
ఆపరేషనేనని తేలింది.
తాజాగా అనవసరపు ఆపరేషన్ల జాబితాలో మోకాలి
చిప్ప రీప్లేస్ మెంట్ చేరింది. అమెరికాలో గత సంవత్సరం
లో
చేసిన మోకాలుచిప్ప రీప్లేస్ మెంట్ ఆపరేషన్లలో
మూడవవంతు మందికి అసలు అటువంటి రీప్లేస్మెంట్
అవసరంలేనే లేదు అని తేలింది. మనదేశంలో పరిస్థితి
అంతకన్నా భిన్నంగా ఉండివుంటుందని అనలేం.
" ఒత్తిడిలో పేషెంట్స్
ఆపరేషన్ నగానే పేషెంట్తోపాటు వారి కుటుం
బం మొత్తం ఒత్తిడికి గురవుతుంది.
ఆపరేషన్ సమయంలో మద్దతుగా నిలబడేవారు
మానసికంగా ధైర్యం చెప్పేవారు లేకపోవటం వల్ల రోగులు
కోలుకోటానికి చాలా ఇబ్బందిపడుతున్నారు.
ఇరుకు ఇళ్ళలో ఆపరేషన్ తర్వాత పేషెంట్ ని ఉంచ
గలిగిన పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి
పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి,
కుటుంబసభ్యులు మానసికంగా ఎన్నో ఇబ్బందులకు
గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఆపరేషన్
చేయాలి అనగానే కంగారుపడటం మానేసి తగినచర్యలు
మొదలు పెట్టాలి. వైద్యుడి దగ్గర దాపరికం అనవసరం.
అనారోగ్యస్థితి గురించి, ఆపరేషన్ ఎందుకు అవసర
మైందో వివరంగా చర్చించాలి.
తీవ్రంగా ప్రశ్నిస్తే తప్పించి వైద్యుల నుండి సరైన
సమాధానాలు రావు. మరో వైద్యుడి నుండి అభిప్రాయం
తీసుకునే హక్కు రోగికి ఉందనే విషయం మరవకండి.
ఆపరేషన్ చెయ్యాలని సర్జన్ చెప్పాడు కాబట్టి ఆ
విషయం మీద మరో సర్జన్ వెళ్ళి కలవటంకన్నా సర్జరీ
విభాగానికి చెందని వైద్యుడిని కలిసి ప్రస్తుత రోగాని
తొలగిస్తారా!
సమాచారం సేకరించాలి
అలాగే గతంలో ఇటువంటి ఆపరేషన్లు ఎన్ని ఆ
డాక్టర్ చేతి మీదుగా జరిగాయి, వారి పరిస్థితి ఎలా ఉంది
అనే అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవాలి.
అందుకు సంబంధించిన ప్రశ్నలు ఆ సర్జన్ కి సంధించేం
దుకు వెనుకాడాల్సిన అవసరం లేదు. వైద్యులు ఆపరేష
” అంతా సవ్యంగా ఉంటుందని చెప్పకపోవచ్చు.
చాలా ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేసే వైద్యులు
అక్కడ పనిచేసేవారు కాదు. నైపుణ్యం కలవారిని ఆప
రేషన్ కోసం పిలిపిస్తారు. తాను ఏ పేషెంట్ ఆపరేషన్
చేస్తున్నది కూడా తెలియకుండా ఆపరేషన్ ముగించి
ఫీజు తీసుకుని వెళ్ళిపోయే సర్జన్స్ ఉన్నారు. అదేవిధంగా
ఆపరేషన్సమయంలో కీలకపాత్ర పోషించేది ఎనస్తీషియా
ఇచ్చేవారు. అతని నైపుణ్యం గురించి కూడా ఆపరేషన్
ముందే తెలుసుకునే హక్కు రోగికి ఉంటుంది.
కాబట్టి ఆపరేషన్ ఎంటేనే ఒక పెద్ద రిస్క్ అయిన
పుడు ఆ రిస్క్ తో కూడిన నిర్ణయం తీసుకునే ముందు
మరెంతో జాగ్రత్తగా ఉండటం అవసరం కదా.
విశ్వాసం తగ్గుతోంది
'ఆపరేషన్
చేయించుకున్నా' కాని నా ఆరోగ్యస్థితిలో
ఏమంత మార్పులేదు' అని కొందరు చెప్పటం మనం
వింటుంటాం. వారు చెపుతున్నదానిలో ఏమాత్రం
అబద్ధం లేదు. కొన్ని రకాల అనారోగ్యాలు ఒక దశ దాటిన
తర్వాత చక్కదిద్దటం కుదరదు.
ఎంతో నైపుణ్యం ఉన్న సీనియర్ సర్జన్ ఆపరేషన్
చేసినా ఆ అనారోగ్యపు ఇబ్బందిలోనుండి బయటపడ
లేరు. అలాంటి స్థాయికి చేరిన దాని గురించి వైద్యులు
ముందుగానే చెప్పరు. ఆపరేషన్ ద్వారా నూటికి నూరు
శాతం తగ్గుతుందా లేక ఆపరేషన్లో పరిష్కారం ఫిఫ్టీ
ఫిథీనా అనేది వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఆపరేషన్తో సక్సెస్ శాతం బాగుంటుందనుకుంటేనే
బల్ల ఎక్కటం మంచిది. వైద్యుడిని దేవుడితో సమానంగా
భావిస్తారు రోగులు. మరే ఇతర వృత్తిలో ఉన్నవారికి
రెండుచేతులు పెట్టి నమస్కారం చెయ్యరు.
కాని తమకు
చికిత్స అందునా ఆపరేషన్ వంటివాటిని చేసే డాక్టర్కి
రెండు చేతులెత్తి నమస్కారం చేస్తారు.
అంతటి పవిత్రమైన, గురుతర బాధ్యత కల్గిన
Yeకైకవృత్తి వైద్య వృత్తి. అయితే సమాజంలోని అన్ని
వృత్తులలోకి వచ్చిచేరిన చెడు నేడు వైద్య వృత్తిలోకి
వచ్చి చేరింది. డబ్బుకు తప్ప మరేదానికి స్పందిం
చని కఠినాత్ములుగా మారారు వైద్యులు.
ఎవరికివారు తమవంతుగా రోగిని ఒక 'రౌండ్
వేసి చూసి వెళ్ళేవారే తప్పించి, నిలుచుని మాట్లాడి,
వివరించి వాస్తవాన్ని రోగి ముందుంచే వైద్యులు
బాగా తగ్గిపోయారు. వైద్యులమీద నమ్మకం తగ్గి ఇంట
ర్నెట్ సమాచారంమీద విశ్వాసము పెరుగుతున్న కాలం
ఇది. రోగం పేరు చెప్పగానే ముందుగా వెళ్ళి ఇంట
ర్నెట్లో గూగుల్ సెర్చ్ చేసుకుంటున్నారు రోగులు.
ప్రాథమిక సమాచారమే కాదు, పలు తాజా అంశా
లను గూగుల్ ద్వారా తెలుసుకుని వైద్యుడి దగ్గరకు
వస్తున్నారు.గతంలోలా వైద్యుడు చెప్పిందే ఫైనల్ అను
కోవటం లేదు రోగులు. రెండవ ఒపీనియన్ ముందుగా
ఇంటర్నెట్లో ఆ పైనే మరో వైద్యుడి దగ్గర.
అందుకే ఇప్పుడు రోగులు వేసే ప్రశ్నలు పెరిగాయి.
ఆ ప్రశ్నలు వైద్యులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఇంట
ర్నెట్, గూగుల్ ని తిట్టని వైద్యులు లేరు.
» ప్రశ్నలు సంధించాలి
అయినా సరే వైద్యుడి ముందు ప్రశ్నలు ఉంచక
తప్పదు. ఆపరేషన్ అనగానే కత్తితో ఏదో ఒక భాగం
కోసి తిరిగి కుట్లు వేస్తారనేది చాలామంది రోగులు
అనుకునేది.
కోసి తెరచి, తిరిగి మూసే మధ్యలో జరి
గేదే ప్రాముఖ్యమైన అంశం.
ఇందులో దెబ్బతిన్న అంగాలు తొలగించవచ్చు,
శరీరంలోపల ఏర్పడినలోపాలను చక్కదిద్దవచ్చు, పేరు
కున్న కొవ్వులను తొలగించవచ్చు లేదా అంగమార్పిడి
జరగవచ్చు. ఇలా ఆపరేషన్లు పలురకాలు.
అయితే ఆపరేషన్ చిట్టచివరిగా ఎంపిక చేసుకునేది
కావాలి. ఆ దశకు చేరి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే
ముందు రోగి లేదా రోగి ఆప్తులెవరైనా వైద్యునికి తప్పని
సరిగా సంధించవలసిన ప్రశ్నలు పది ఉన్నాయి.
• అసలు ఆపరేషన్ ఎందుకనేది తొలి ప్రశ్న అవ్వాలి.
ఈ ఆపరేషన్ కాక ఇతరత్రా మందుల వాడకం లేదా
మరో ప్రత్యామ్నాయంతో రోగం తగ్గించగలరా లేదా
అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి.
• ఒకసారి ఆపరేషన్ తప్పదన్న నిర్ణయానికి వచ్చినతర్వాత మరో వైద్యునిదగ్గర రెండవ అభిప్రాయం
సేకరించుకునే
యత్నం
చేయాలి.
• ఒకరికన్నా ఎక్కువమంది ఆపరేషన్ పరిష్కారమని
స్పష్టం చేసిన ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు. ఆప
రేషన్లో వచ్చే లాభం ఏమిటి? ఆపరేషన్ వల్ల ఏర్పడే
ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?
• ఆపరేషన్ సమయంలో ఇచ్చే మత్తుమందు స్థాయి,
ఆపరేషన్ ఎన్ని గంటలు చేస్తారు? ఎన్ని గంటల
తర్వాత స్పృహలోకి వస్తారు అనే ప్రశ్నలు వేసి సరైన
సమాధానం రాబట్టాలి.
• ఆపరేషన్ కి ముందు నిర్వహించే ప్రశ్నలు, వేసు
కోవాల్సిన మందులు, ఆపరేషన్ కి రెడీ అవటం
ఎలా అనేవి వైద్యుని అడిగి తెలుసుకోవాలి.
ఈ ఆపరేషన్ఏ ఆసుపత్రిలో చేస్తారు? అక్కడ అందు
బాటులో ఉన్న సౌకర్యాలు, అక్కడి నియమనిబంధ
నలు వంటివి కూడా అడగాల్సిన ప్రశ్నలే.
• ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన ఆహార, ఇతరత్రా
శారీరక జాగ్రత్తల గురించి ముందుగానే అవగాహన
ఏర్పరచుకోవాలి. వైద్యుని అనుభవం, గతంలో ఇటు
వంటి ఆపరేషన్లు ఎన్ని చేసింది. వాటిలో ఎన్ని విజయ
వంతమైనది తెలుసుకోవాల్సిన అంశం.
మీకున్న ఆరోగ్య బీమా పాలసీ ఆ పాలసీలో మీ ఆప
రేషన్ కవర్ అయిందో లేదో కూడా తెలుసుకుని
ఉండటం అవసరం. చిన్న పామునైనా పెద్దకర్రతో
కొట్టాలన్నది నానుడి. అలాగే ఆపరేషన్ చిన్నదే అయినా
దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దవే.
తప్పనిసరి అయితేనే
ఆపరేషన్ థియేటర్ వాతావరణం, అక్కడ
ఆపరేషన్ కి ముందు వైద్యుడి మీద నమ్మకం ఉంచి
అనుసరించే పరిశుభ్రత విధానాలు ఆపరేషన్
టంతోపాటు సంపూర్ణ సమాచారం ఇవ్వటం అవసరం. సక్సెస్ లో కీలకం. వైద్యుడి నేర్పుతోపాటుగా
గతంలో తీసుకున్న చికిత్స, వాడిన మందులు, ఇత
ఆయనకు సహాయం అందించే సిబ్బంది పాటించే
రత్రా ఏవైనా ఆపరేషన్లు చేయించుకునివుంటే ఆసమా జాగ్రత్తలు, ఆపరేషన్ కి ముందు, తర్వాత రోగిని
చారం వైద్యునికి ఇవ్వటం ద్వారా శస్త్రచికిత్స సమ
ఉంచే గది వాతావరణం వగైరాలన్నీ పరిగణనలోకి
యంలో వైద్యుడికి ఎంతో సహకరించినవారవుతారు.
తీసుకుని ఆపరేషన్స్ ఎంపిక చేసుకోవాలి.
ఆపరేషన్ తగిన సర్జన్‌తోపాటు మంచి ఆసుపత్రిని ఆపరేషన్ చేస్తుండగా అనుకోని సంఘటనలు
కూడా ఎంచుకోవాలి.
జరగవచ్చు. అటువంటి ఎమర్జన్సీ పరిస్థితులు
చాలా ఆపరేషన్లలో ఇబ్బందులు తలెత్తవు. నిజానికి తలెత్తినపుడు వాటిని ఎదుర్కొనేందుకు ఎంచు
ఆ ఇబ్బందులు ఆపరేషన్ చేసినందువల్ల కాక ఆపరేషన్ కున్న ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి వైద్యు
జరిగిన వాతావరణంబట్టి వస్తాయి.
డిని ముందుగానే అడిగి తెలుసుకోవాలి.