Tuesday, 28 August 2012

EXCELLENT ANCIENT RECIPES FOR COLD AND COUGH

వర్షాకాలం , శీతాకాలాల్లో సాధారణంగా అందరికి జలుబు, దగ్గు, అజీర్ణం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ప్రత్యేకమైన వైద్యచికిత్స అవసరం లేకుండానే మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో వీటిని అద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ తరతరాలుగా మన ఇళ్లలో మన పూర్వీకులు అనుసరిస్తూ వచ్చినవే. 

1.)        రెండు నిమ్మకాయల రసాన్ని,,రెండున్నర కప్పుల మరిగించిన నీటికి కలిపి, తేనెతో కలిపి ప్రతిరోజూ పడుకునేముందు తాగాలి. 

2. )  అంగుళమున్నర సైజులో ఆల్లం ముక్కను కోసి కప్పు నీటిలోవేసి బాగా మరిగించి ,వడకట్టి ,అరచెంచా పంచదార కలిపి కొద్దిగా వేడిగా ఉండగానే తీసుకోవాలి. 

3.)   1 స్పూన్ వాముని పొడిచేసి , బట్టలో కట్టి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే ముక్కు దిబ్బడ వదిలిపోతుంది. చిన్నపిల్లలు పడుకున్నపుడు వారి దిండు దగ్గర వాసన తగిలేలా ఈ వాము మూటను పెడితే తెల్లారేసరికి వారి ముక్కుదిబ్బడ వదిలిపోతుంది .

4.)    జలుబు భారం ఎక్కువగా ఉంటే 1 స్పూన్ మిరియం పొడిని 1 కప్పు పాలలో వేసి బాగా మరిగించి , చల్లార్చి చిటికెదు పసుపును కలిపి వరుసగా 3 రోజులపాటు ప్రతిరోజూ ఒకసారి తీసుకోవాలి.

5.)  ఆరు మిరియాలు గింజలు మెత్తగా నూరి ,1 గ్లాసు వెచ్చని నీటికి కలిపి,కొద్దిగా తీపి పదార్థం కలిపి ప్రతి రోజూ రాత్రిపూట కొద్దిరోజులపాటు తీసుకోవాలి.జలుబు భారం వదులుతుంది. 

6.)  1 స్పూన్ జిలుకరని , 1 గ్లాస్ మరుగుతున్న నీటిలో వేసి మరిగించి , వడకట్టి , కలియపెట్టి చల్లార్చాలి. దీనిని రోజుకి ఒకటి , రెండుసార్లు తీసుకోవాలి. జలుబుకు తోడు గొంతునొప్పి కూడా తోడైతే నీటిలో శొంఠి వేసి మరిగించాలి. 
7. )     జలుబుకు తోడు దగ్గు కళ్ళె కూడా తోడైతే 10 తులసి ఆకుల్ని 1 కప్పు నీటిలో వేయాలి. రెండు వెల్లుల్లి రేకలను, అరంగుళం ఆల్లం ముక్కను , 5 మిరియాలు నూరగా వచ్చిన పొడిని ఈ నీటికి కలిపి ఆ నీరు పావుకప్పు అయ్యే వరకు మరిగించి తెర్లనివ్వాలి. తర్వాత వడకట్టి చల్లార్చి 1 స్పూన్ తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది .

8. )   జీర్ణకోశంలో ఇబ్బంది ఏర్పడినపుడు 15 - 20 తులసి ఆకుల నుంచి తీసిన పసరును , చిటికెడు సైంధవ లవణం తో కలిపి తీసుకుంటే ఇబ్బంది తొలగిపోతుంది. 

9. )   అజీర్ణం కలిగినప్పుడు 5,6 దాల్చినచెక్కముక్కలను, కాస్త మిరియాలపొడుని 1 గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి కషాయం తయారుచేయాలి. దీనికి కాస్త తేనె కలిపి భోజనం చేసాక అరగంటాగి తీసుకుంటే కడుపుబ్బరం తగ్గి అజీర్ణం తొలగిపోతుంది . 


పడిశం పదిరోగాల పెట్టు.

ప్రతి మనిషికీ ఏదో ఒక్కోసారి కాకుండా అప్పుడప్పుడు వస్తూ కనీసం భారం రోజులు , మనస్సునీ, శరీరాన్ని చికాకు పెట్టే వ్యాధి పడిశం. 


ఇది యెలాంటి సూచనలు ఇవ్వకుండా చుట్టం మాదిరిగా హఠాత్తుగా వచ్చి చికాకు పెడుతుంది. మనల్ని బాధ పెడుతుంది. ఇంతవరకూ వచ్చిన గొట్టాలు, మాత్రలు ఏమీ చేయలేవు , తనంత తాను ఒక 4 రొజుల తర్వాత, 7 రోజుల తర్వాత వదిలిపోవాలి తప్ప.

దీనినే ఆధునికులు కోరిజా లేదా common కోల్ద్ అంటుంటారు.

ముక్కు గొంతుకలను ఆవహించే సూక్ష్మక్రిములు ముఖ్యంగా ఎడినో వైరస్ వంటివి ఈ వ్యాధిలి కారణం అంటుంది అధునిక వైద్యం ,పారా ఇంఫ్లుయెంజా వైరస్ కూడా కారణమౌతాయి.

తర్వాత స్థితిలో ఫ్సిరిపొవో బాక్టీరియా కూడా జలుబుకు కారణమౌతుంది.

రద్దీగా ఉండే ప్రదేశాలు,చల్లని ప్రదేశాలు,దుమ్ము ధూళితో నిండిన ఇంటి పరిసరాలు ,హఠాత్తుగా మారే వాతావరణం ,మంచి కురిసే కాలం ,ఉడకపోత ఎక్కువగా ఉండే కాలం ఈ వైరస్ ఆవహించడానికి అనుకూలమౌతస్యి.

అన్నిటికి మించి మనలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లినపుడు ఈ స్థితి తరచుగా వస్తుంటుంది.

ఇంకో విశేషమేంటంటే సైనస్ తో ,మైగ్రేన్ తలనొప్పితో బాధ పదే వారికి ఇది పలుమార్లు వస్తుంది.

ఇది తరచూ వస్తూ ఉంటే మామూలు వాళ్ళకి కూడా సైనస్ రావచ్చు.అలాగే వదిలేస్తే క్రమంగా గొంతుక పూడుకపోవడం,చెవులు సరిగ్గ వినిపించకపోవడం,జ్వరం,ఊపిరితిత్తుల్లో బాధ కలుగ వచ్చు.

అలాగే తరచు జలుబు చేస్తుండడం,ముక్కు చీదడం,నీరు కారడం ఉండి,మిగతా లక్షణాలు లేకపోతే అది ఎల్లర్జీగా గుర్తించండి.

దీనినే ఎలర్జిక్ రినైటిస్ అంటారు.తరచుగా వచ్చి ముక్కు దిబ్బడతో నీరు కరుతూ గాలి తీసుకోవడం ముక్కుతో కష్టమౌతుంటుంది .ఇలాంటివారు కొద్ది కాలం మూసి ఉన్న గదులలోనూ ,శుభ్రంగా ఉండే పరిసరాలలోనూ ఉండడం మంచిది.

ఇతరులకు రాకుండా ఎలా ఉండాలి.

మనంతట మనం అది తగ్గే వరకు ఇతరులకు దూరంగా ఉండడం మంచిది.తరచుగా బస్తూ ఉంటే ముక్కులో పొరలు అడ్డం పడుతున్నాయేమో చూసుకోండి.

కొంతమందిలో కొన్ని వాసన కలిగిన పువ్వులు,చెట్లు,ఒక రకమైన గడ్డి వంటివి ఈ జలుబును ఎక్కువ చేస్తుంటయి.వాటికి దూరంగా ఉండడం మంచిది .

దుమ్ము ,ధూళి,మంచి వాసన కలిగిన సెంట్లు,సౌందర్య సాధనాలు,చల్లటి గాలి,తలకి రాదుకునే సుగంధం కూడిన నూనెలు వంటివి కూడా ఎలర్జీని తీసుకురావచ్చు.

పిల్లలలో తరచు తీసుకుంటే చల్లటి ఐస్క్రీములు ,కూల్డ్రింక్స్,చల్లటి నీళ్లలో ఆడడం, మంచులో తడవడం కూడా ఈ స్థిథి కి కారణమౌతాయి.

సహజవైద్యశాస్త్రమైన ఆయుర్వేదంలో దీనిని ప్రతిశ్యాయమంటారు.

ఎక్కువగా నిద్రపోవడం,తలదగ్గర ఎత్తుపల్లలుగా ఉన్న దిండు పెట్టుకోవడం , ఎదురుగాలి, రకరకాల ప్రదెస్శాలలో వివిధ రకాల నీళ్లు తాగడం,వాంతిని అణచుకోవడం,కన్నీళ్లు ఆపుకోవడం కూడా ఈ స్థిథికి కారణమౌతాయి.

గొంతు ముక్కు బిగపట్టి కొంచెం కొంచెం గా నీరు స్రవిస్తూ గరగరమని శబ్దం వస్తుంటే అది వస్త ప్రతిశ్యాయం అంటారు. 

జలుబు చేసి పచ్చటి స్రవన్ ముక్కునుంచి కారుతుంటే,శ్వాస వేడిగా ఉంటే అది పిత్త ప్రతిశ్యాయం.

ముక్కునుంచి తెల్లని చిక్కని స్రావం స్రవిస్తూ పెదిమలపై దురద ఉంటే అది శ్లేష్మ ప్రతిశ్యాయం అంటారు .


పడిశం నివారణకు సూచనలు.


జీలకర్రని చూర్ణించి పంచదార పుచ్చుకొని రాత్రి పడుకునేముందు కాచిన నీళ్లు పుచ్చుకుంటుంటే జలుబు బాగా తగ్గుతుంది. 

బెల్లం,మిరియాల చూర్ణం కలిపి ఉండగా చేసి పెరుగుతో కాని, వేడి నీళ్లతో కాని పుచ్చుకోవడం హితకరం కాగలదు.

 వాము చూర్ణం 4 భాగాలు, పటిక బెల్లం చూర్ణం 8 భాగాలు కలిపి మెత్తగా నూరి ఉదయం సాయంత్రం 1 చెంచా మందు తీసుకుని వేడి నీళ్లు తాగుతుంటే దగ్గు, ఆయాసం తగ్గుతాయి.

లవంగాల కషాయం కాని ,మిరియాల కషాయం కాని బెల్లం తో కలిపి తాగిస్తే జలుబు తగ్గుతుంది 

వాముని ఒక గరిటెలో బాగా వేయించి పల్చటి బట్టలో మూటగా కట్టి ముక్కుకి రెండువైపులా , నుదుటి పైన , కంటి పై రెప్పలపై కాపు పెట్టుకుంటే శ్లేష్మం పలుచబడి అక్కడ బరువు తగ్గుతుంది .

రెండు చిటికెల పసుపు ,ఒక చిటికెడు మెత్తటి ఉప్పు కలుపుకొని నోట్లో చేసుకుని ఉదయం సాయంత్రం వేడినీళ్లు గాని, వేడి కాఫీ గాని తాగుతుంటే ఎలర్జీ తగ్గుతుంది.

పసుపు కొమ్ములను దోరగా వేయించి చూర్ణం చేసి ప్రతి రోజూ ఉదయం పూట పావు చెంచా పొడిని అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లతో కలిపి తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.

కుంకుమ పువ్వు ,జాజికాయ,ద్రాక్షపళ్లు,వీటిని సమంగా తీసుకుని తేనెతో కలిపి నూరి శనగ గింజంత మాత్ర చేసుకుని వేడిపాలతో తీసుకుంటే పడిశం హాయిగా తగ్గిపోతుంది 

అరగ్లాసు వేడి పాలలో 6 మిరియపు గింజల చూర్ణం చేసి ,బెల్లం కలిపి తాగుతుంటే జలుబు తగ్గిపోతుంది.

జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు , సమంగా తీసుకుని పన్నీరుతో మర్దించి చిన్న చిన్న మాత్రలు చేసుకుని గోరువెచ్చటి నీళ్లతో ఉదయం, సాయంత్రం తీసుకోవడం చాలా మంచిది 

జలుబుగా ఉన్నపుడు తరచుగా తుమ్ములు వస్తుంటాయి.4 గులాబి పూల రేకులు తీసుకుని ఒక అరగంట నువ్వుల నూనెలో వేసి కొద్దిసేపు వేడిచేసి తర్వాత వడపోసి 2 చుక్కలు ముక్కులో వేసుకోండి, తరచుగా వచ్చే తుమ్ములు తగ్గిపోతాయి. 

3 మిరియాల ఈ 1 చెంచా తేనెతో కలిపి మెత్తగా నూరి ఉదయం, సాయంత్రం తీసుకుంటుంటే చిరకాలంగా ఉన్న జలుబు తగ్గుతుంది 

ఇన్ హేలర్ వాడటం కన్నా నల్లజీలకర్ర చూర్ణం ను ఒక బట్టలో మూటగా కట్టి వాసన పీలుస్తుంటే జలుబుతో ఉన్న ముక్కు సాంత్వన పొందుతుంది.

దానిమ్మ పువ్వుల రసాన్ని 5,6 చుక్కలు ముక్కులో వేసుకుంటే ,ముక్కునుంచి వచ్చే స్రావం ఆగుపోతుంది.

జలుబుతో పాటు తలనొప్పి కూడా వస్తుంటే యేలకుల చూర్ణాన్ని ముక్కుతో పీలుస్తుంటే తలనొప్పి తగ్గిపోతుంది.

తరచూ జలుబుతో బాధపడేవారు పాత బియ్యం,పెసలు,ఉలవల చారు,ముల్లంగి,వెల్లుల్లి,వేడి నీళ్లు, తేలిక ఆహారం తీసుకోవడం మంచిది. 

పడిశం  భారానికి వాముతో వైద్యం.

పైడి భారంగా ఉంటే ముక్కు దిబ్బడ వేసి వదలడం  లేకపోతే  గాలి ఆడనట్లు, ఊపిరి అందనట్లు అనిపిస్తుంటే ఒక గరిటె లోకి 2,3 నిప్పు కణికలు తీసుకోండి దానిమీద  వాము కొద్దికొద్దిగా చల్లుతూ ఆ పొగని పిలిస్తే నా సెల్ కంజ్షఈన్ అంటే ముక్కు దిబ్బడ వదిలేస్తుంది. గాలి ఫ్రీగా ఆడుతుంది . ముక్కులో ను ఊపిరితిత్తుల్లో కూడా కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తుంది.
తాంబూలంలో లో వక్కపొడి కి బదులుగా వాము వేసుకొన
 నములుతూ కొద్దికొద్దిగా రసం మింగండి .ఈ లాభాలన్నీ నీ దక్కుతాయి.

జలుబుతో గొంతు పూడుకుపోయి తే రేగు ఆకులు చక్కగా వైద్యానికి ఉపయోగపడతాయి.

దగ్గు, జలుబు, పడిస భారం వలన గొంతు పూడిక పోతే మీ చుట్టుపక్కల ఉన్న రేగు చెట్టు నుంచి ఆకులు కోసుకుని తెచ్చుకొని  నీడలో ఆరబెట్టండి. ఏ రోజుకు ఆ రోజు కాసిని ఆకులు మేత్తగా దంచి నేతిలో వేయించి అందులో తగినంత సైంధవ లవణం కలుపుకొని తీసుకోండి . పూడుకుపోయిన గొంతు రాగాలు పలుకుతుంది .

అతిమధురం అనే మూలిక పచారీ షాపుల్లో దొరుకుతుంది .ఈ చెట్టు యావత్తూ తీపిగా ఉంటుంది. అందుకే దీనిని అతిమధురం అన్నారు. ఈ చెట్టు కాండం లో నుంచి చిన్న ముక్క విరిచి బుగ్గన పెట్టుకొని చప్పరించినా నీ స్వరం రాగాలు పడుతుంది.

అలాగే చన్నీళ్ల స్నానం , కోపం తెచ్చుకోవడం, నేలపై పరుండడం, ఎక్కువ చల్లటి పదార్థాలు తీసుకోవడం జలుబు ఉన్నవారు చేయకూడదు.

ఆరోగ్యం ఆదిత్యాధీనం అంటుంది వేదం,ఉదయపు సూర్య కిరణాలు ఒంటికి సోకుతుండగా నడవడం జీవనానికి హితకరంగా ఉంటుంది.










1. తాంబూలంలో దాల్చినచెక్క దగ్గుని తగ్గిస్తుంది.

దగ్గు వస్తున్నపుడు తాంబూలం వేసుకుని తగ్గించుకునే ఒక మంచి ఉపాయం ఉంది. ఆన్ని కిళ్లీలు తాంబూలాలు కావు, కిళ్లీల్లో మనకి అనారోగ్యకరమైనవి చాలా కలుస్తుంటాయి. తాంబూలం అంటే ఆకు, వక్క, సున్నం మాత్రమే కలిసేది. ఇందులో వక్కకు బదులుగా చిన్న దాల్చినచెక్క ముక్కలను కలుపుకొని తాంబూలం వేసుకోండి.
చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, యే విధంగానూ చెడు చేయదు. నములుతూ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. కడుపులో మంట , నొప్పి, బాధ, అజీర్తి తగ్గుతాయి.వక్కపొడికి ప్రత్యామ్నాయంగాదల్చినచెక్క ఉపయోగపడుతుంది.జర్దా కిళ్లీలను,వక్కపొడిని మానేయాలనుకుంటే ఇది ఒక మంచి ఉపాయం .

2. తెల్లవారు ఝామున తుమ్ములకు తులసి ఆకుల నస్యం.

ముక్కు లోపల అలర్జీ వల్ల తుమ్ముల జబ్బు చేస్తుంది. తుమ్ములు తుమ్మి తుమ్మి అలసి సొమ్మసిల్లిపడిపోతుంటారు చాలామంది. ఆడవారిలో ఈ వ్యాధి ఎక్కువగా కంపిస్తుంది.

తులసి ఆకుల్ని ఎండబెట్టి మెత్తగా దంచి బాగా వస్త్రగాళితం బట్టి చక్కని పొడిని తయరి చేసుకోండి. చిటికెడు పొడిని తీసుకుని ముక్కు పొడుం పీల్చినట్లు పీల్చండి. ఇలా రోజూ రెండు, మూడు సార్లు చేస్తుంటే తుమ్ముల తీవ్రత తగ్గుతుంది. 
మొదట కొద్ది మోతాదులో ప్రారంభించి క్రమేణా పెంచండి. కొందరికి ఈ తులసి ఎలర్జీ ఉంటుంది , అందుకని తక్కువ మోతాదులో ప్రారంభించి క్రమేణా మోతాదు పెంచుకోండి. 

3 .వంటింటి  మసాలా దినుసులతో ఆయాసానికి మందు.

వంటగదిలో దొరికే మసాలా దినుసులతో ఆయాసాన్ని తగ్గించేందుకు మంచి మందు తయారి చేసుకొవచ్చు.
ఏలకులు - 1 భాగం.
దాల్చిన చెక్క - 2 భాగాలు.
బిర్యాని ఆకు - 3 భాగాలు.
నాగకేసరాలు -4 భాగాలు.
మిరియాలు - 5 భాగాలు.
పిప్పళ్ళు - 6 భాగాలు.
శొంఠి - 7 భాగాలు.

ఇలా ఒకదానికొకటి పెంచుకుంటూ ఒక చిన్న మెజర్మెంట్ కప్పుతో గాని , తూకం వేయించుకొని గాని దినుసులను సేకరించుకోండి. వీటిలో నాగకేసరాలు, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి ఈ నాలుగింటిని విడివిడిగా - నేరుగాగాని , నేతిలోగాని వేయించండి. అన్నీ కలిపి దంచడం గాని, మిక్సీ పట్టడం గాని చేసి, ఈ మొత్తనికి సమానంగా చక్కెర కలిపి 1 - 2 చెంచాల పొడిని రోజూ మూడు పూటలా తింటే ఆయాసంలోనే కాదు, చాలా వ్యాధుల్లో పనిచేస్తుంది.
మొలల వ్యాధిలోనూ, అజీర్తిలోనూ, పేగుల్లో వచ్చే వ్యాధుల్లోనూ , గొంతుకు సంబంధించిన ఆన్ని వ్యాధుల్లోనూ, దగ్గు, జలుబు, ఆయాసాలలోనూ, ఆఖరికి గుండెజబ్బులో కూడా ఈ ఫార్ములా అద్భుతంగా పని చేస్తుంది.

మామూలుగా ఆయాసాన్ని తగ్గించేందుకు వాడే మందులన్నీ పైత్యం చేయడం, గ్యాస్ ట్రబుల్ ని తెచ్చిపెట్టడం, గుండెలో దడ, వణుకు వంటి లక్షణాలకు కారణమౌతాయి. అందుకని ఆయాసానికి మీరు వాడుకునె మందులకు తోడుగా ఈ చిన్న చిట్కా ప్రయోగిస్తే మందుల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. క్రమేణా ఆయాసానికి మీరు ఇంగ్లీషు మందులు వాడుకునే అవసరం తప్పుతుంది. 

4.  అల్లం రసంతో ఆయాసం తగ్గించుకోండి.

ఆల్లం రసంలో తేనె కలిపి తాగిస్తే ఆయాసం అప్పటికప్పుడు తగ్గినట్లనిపిద్తుంది. తీవ్రత తగ్గుతుంది, ఫ్రీగా విరేచనమౌతుంది, అందువలన పొట్టలో బరువు, గుండెలో బరువుగా ఉండటం తగ్గుతాయి .
దగ్గు, జలుబు, ఋఒంప, ముక్కుదిబ్బడ, తలనొప్పి, సైనసైటిస్ వీటన్నింటికి కూడా ఇది మంచి నివారణగా ఉపయోగపడుతుంది . 

4. ఆయాసం - బూడిదగుమ్మడి వేళ్ళు - అద్భుత ప్రయోగం

బూడిద గుమ్మడి మొక్క వేళ్ళను శుభ్రంచేసి ఎండబెట్టి మెత్తగా దంచి భద్రపరుచుకోండి. 
మీకు తెలిసినవారిలో ఎవరికైనా ఆయాసం వస్తుంటే - ఈ బూడిదగుమ్మడి వేళ్ళపొడిని గోరువెచ్చటి నీళ్లతో అర చెంచా మోతాదులో తినిపించండి. శీఘ్రం శమయతి శ్వాసం కాసం చైవ సుదారుణం అని వైద్యశాస్త్రం చెబుతోంది. దారుణంగా ఉన్న ఆయాసం, దగ్గు వెంటనే తగ్గుతాయట దీనిని తీసుకుంటే. 

5.దగ్గు తగ్గడానికి శొంఠి, కరక్కాయ మాత్రలు.

శొంఠి, కరక్కాయ పై బెరడు ఈ రెంటిని మెత్తగా దంచి , కాసిని ఎండు ద్రాక్షగాని, ఎండు కిస్మిస్ గాని చేసి బాగా నూరండి, మొత్తం మెత్తటి ఉండలా ఐన తర్వాత కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని, ఒక్కొక్క మాత్ర బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే దగ్గు తగ్గుతుంది. గొంతులో హాయిగా ఉంటుంది, కఫం కరుగుతుంది, కళ్లె తగ్గుతుంది, గొంతులో నస తగ్గుతుంది, జలుబు కూడా తగ్గుతుంది . 

6. బెల్లం, ఆవనూనెలతో ఆయాసం తగ్గించుకోండి.

పాత బెల్లాన్ని మెత్తగా నూరి, అది తడిసి ముద్దయ్యే వరకు ఆవనూనెను అందులో కలిపి బాగా నూరండి.
ఉదయం, సాయంత్రం పెద్ద ఉసిరి కాయంత ఉండలు చేసుకొని రోజూ తినండి. ఇలా మూడు వారాలపాటు చేస్తే ఆయాసం నిస్సందేహంగా తగ్గుతుందని వైద్యశాస్త్రం చెప్తోంది.
ఇవి చెడు కలిగించే మందులు కావు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే అద్భుతాలను సృష్టిస్తుంటాయి ఒక్కోసారి. 


7.)  ఉబ్బసానికి ఇంగువ తో వైద్యం.                         

ఉబ్బసం వ్యాధికి ఎన్ని రకాల మందులు వాడినా మందు మొదలు పెట్టిన కొత్తలో చాలా బాగా పని చేసినట్లు అనిపిస్తూ , పోనూ పోనూ పని చేయక కొత్తమందు కోసం వెతకవలసి వస్తుంటుంది. ఈ కారణం వలన ఉబ్బస రోగులు పదే పదే వైద్యులను మారుస్తుంటారు. నిజానికి ఇలా వైద్యులను మార్చాల్సిన పని లేదు. వైద్యునికి మీరు సహకరించినట్లైతే వైద్యుడే ంఅరో మందును మారుస్తాడు.

ఉబ్బసం తీవ్రతను తగ్గించుకోగలిగితే వైద్యులను, మందులను మార్చాల్సిన అవసరముండదు.
ఇంగువ నల్లగా ముద్దలా ఉండేది మంచిది. దానిని సేకరించండి. దానికి సమానంగా ముద్ద కర్పూరం కలిపి చిన్న శనగ గింజంత మాత్ర చేసుకుని , రోజూ రెండు పూటలా ఒకట్రెండు మాత్రలు వేసుకోండి. ఆయాసం తీవ్రత తగ్గుతుంది. మందులు బాగా పనిచేస్తాయి.
ఆయాసానికి ఇంగ్లీషు మందులు కొñని వాడుతున్నపుదు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దడ ,వణుకు వస్తాయి.ఈ ఇంగువ కర్పూరం మాత్రల వలన ఈ సైద్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి.అరికాళ్ల మంటలు,తిమ్మిర్లు కూడా తగ్గుతాయి.

8. ) ఆయాసానికి మరో వైద్యం.

తీవ్రంగా ఉన్న ఆయాసం తగ్గడానికి సింపుల్ గా తయారయ్యే మందు ఉంది.
బెల్లం ,మిరియాలు ,పసుపు,ఎండు ద్రాక్ష పళ్ళు ,పిప్పళ్ళు వీటిని సమానంగా తీసుకోండి. ఇందులో  పిప్పళ్ళనీ, మిరియాల ని విడివిడిగా నేతిలో వేయించండి. మొత్తాన్ని కలిపి దంచండి. అది ముద్దలా అయ్యేంతవరకు సరిపడేంత నువ్వుల నూనె కలిపి ఉసిరికాయంత సైజు ఉండని నమిలి మింగండి . ఇలా చేస్తే ఆయాసం తగ్గుతుందన
 ఆయుర్వేద గ్రంథం యోగరత్నాకరం చెబుతోంది. ఇందులో  రాస్ నా అనే మరో మూలికలు కూడా కలపాలి .పచారీ కోట్లలో రాస్నా తేలికగానే  దొరుకుతుంది.    దీనిని కూడా కలిపితే ఇంకా మంచిది.

9.) వేడిచేసి వచ్చే పొడి దగ్గు లో చలవ చేసే దగ్గు మందు.
బాగా అలసిపోయి ఉన్నప్పుడు అతిగా ప్రయాణాలు చేసినప్పుడు రాత్రిపూట రోజు ఎక్కువసేపు మేల్కొని వలసి వచ్చినప్పుడు మసాలాలు పచ్చళ్ళు  ఊరగాయలు అధికంగా తిన్నప్పుడు ,  అతి పుల్లనిపదార్థాలు   ఎక్కువగా తీసుకున్నప్పుడు   వేడిచేసి పొడిపొడిగా దగ్గు మొదలై కళ్ల్లే తెగ క ఊపిరాడని య క బాధ పెడుతుంది వేడి చేసి వచ్చింది లెమ్మని డాక్టర్ని సంప్రదించరు    చాలామంది. చుట్టా బీడీ సిగరెట్ లు  అధికంగా కాల్చిన ఇలానే పొడి దగ్గు వస్తుంది.
ఇలాంటప్పుడు మొదట శరీరానికి చలవ కలిగించాలి వేడి తగ్గి పోతే దగ్గు దానికదే అదుపులోకి వస్తుంది    .
ఎండు ఖర్జూరం ,పిప్పళ్ళు ,ఎండు ద్రాక్ష  ,పంచదార, మరమరాలు గాని ,మొక్క జొన్న పేలాలు గాని, జొన్న పేలాలు గాని ఏవి దొరికితే అది వీటన్నింటిని ఒక కొలత ప్రకారం సమానంగా తీసుకోండి మొత్తాన్ని మెత్తగా దంచడం గాన  మిక్సీ పట్టడం గాని చేయండి మెత్తటి పొడి వస్తుంది ఈ పొడిని ఒక చెంచా మోతాదులో మూడు పూటలా తేనెతో కలిపి తీసుకోండి కొద్దిగా నెయ్యి కూడా కలిపితే మరి మంచిది         
పొడి దగ్గు తగ్గుతుంది        

10.).   ఇస్నోఫీలియా కి వేప పువ్వుల వడియాలు 

షడ్రుచుల లో చేదు కూడా ఒకటి చేదు తినకుండా భోజనం చేస్తే మీరు తిన్నది షడ్రసోపేతమైన భోజనం కాదు
ఆహారంలో లో చేదు  తగలాలి అంటే వేప పూలు మెంతులు కాకర ఇవి ముఖ్యంగా మనం తిన్న కలిగినవి.
వేప పువ్వులను సేకరించి అల్లం వగైరా దిట్టంగా వేసి వడియాలు పెట్టుకుని వేయించుకుని తినండి మూర్చ వ్యాధుల నుంచి వాత వ్యాధుల వరకూ అన్ని  రోగాల్లో నూ ఇవి మంచివి బోదకాలు ఇస్నోఫీలియా ఉన్నవారికి మరీ మంచివి.

వేప పువ్వు ని వేప చిగుళ్లు వీటిని ఇలానే చక్కగా ఎండించి నేతిలో వేయించి తగినంత ఉప్పు కారం కలుపుకొని  కారప్పొడి లా చేసుకుని రోజూ ఒకటి రెండు చెంచాలు అన్నంలో తింటే ఇస్నోఫీలియా త్వరగా తగ్గుతుంది దగ్గు జలుబు ఆయాసం ఇతర ఎలర్జీ వ్యాధులు ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది .
బోధవ్యాధి ఉన్నవారైతే దీనిని తప్పనిసరిగా తింటే చాలా చాలా మంచిది.                                                         

No comments:

Post a Comment