Saturday 4 August 2012

కరివేపాకు ఆయుర్వేద ఉపయోగాలు / CURRY LEAF - USES

వేపాకులా ఉండి కాస్త నలుపు రంగును కలిగి ఉన్నందున కరివేపాకు కృష్ణ నింబా అనే పేరుందిి చే వ తెలుపు గనుక శుక్ల సారమని  అంటారు.చేదు వగరు కారం రుచుల కలయికతో అనేక రకాల జబ్బులకు దివ్య ఔషధంగా పని చేయడమే కాకుండా కొన్ని విషయాలకు విరుగుడుగా కూడా పనిచేస్తుంది. అజీర్ణ వ్యాధులకు దురదలు వంటి చర్మ రుగ్మతలకు చక్కని ఔషధంగా పనికి వచ్చే కరివేపాకు మూల వ్యాధులను కూడా నయం చేయగలుగుతుంది. తాప ఉపశమనాన్ని కలిగించే కరివేపాకు లోని చమురు పదార్థం ఉదరానికి ఎంతగానో మేలు చేస్తుంది పాలతో ఉడికించి కట్టు వేస్తే జంతువుల విశేషాలను కూడా హరించగల గే అవకాశాలున్నాయి. గొప్ప పోషకవిలువలు గల కరివేపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఉండి తగినది బియ్యం కడిగిన నీటిని కరివేపాకు మొదట్లో పోస్తే మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి టీ చే సుకున్న తర్వాత మిగిలే పొడిని ఈ చెట్టు మొదట్లో పోస్తే చెట్టు కు బలం చేకూరుతుంది. కలరా తగ్గడానికి కరివేపాకు వైద్యం బాగా ఉపకరిస్తుంది నాలుగు పాళ్ళు ఎండిన కరివేపాకు చూర్ణం లో ఒక పాలు హారతి కర్పూరం ఒక పాలు తుంగముస్తలు చూర్ణం, అంతే మిరియాలు తీసుకుని బాగా నూరి మాత్రలుగా చేసి పెట్టుకుని గంటక ఒకటి చొప్పున తీసుకుంటూ ఉంటే
 కలరా రోగి రుగ్మతలన్నీ మాయమవుతాయి. ఎండుమిరపకాయలు మినప్పప్పు కరివేపాకు నేతిలో వేయించి పొడి కట్టి
 తగినంత ఉప్పు నిమ్మరసం కలిపితే కరివేపాకు కారం తయారు అవుతుంది. ఇది పైత్యాన్ని దూరం చేసి నోటికి రుచిని పుట్టిస్తుంది. కరివేప చిగుళ్ళు, పొట్టుతీసిన మిరియాలు ఉప్పు సమపాళ్లలో తీసుకుని బాగా నూరి మాత్రలుగా చేసుకొని వేసుకుంటూ ఉంటే అజీర్ణం విరేచనాలు తగ్గుతాయి క్రిములు పోతాయి . కరివేప చిగుళ్ళు తింటే విరేచనాలు వాంతులు తగ్గుతాయి. కరివేపాకు ధనియాలు సమపాళ్లలో తీసుకుని చింతపండు ఎండుమిర్చి తగినంత ఉప్పు చేర్చి పొడిగొట్టి పెట్టుకుంటే భోజనంలోకి భలే పసందుగా ఉంటుంది . అన్న హితవుకోల్పోయిన వారికి కూడా ఈ పొడి తో కూడిన భోజనం చాలా ఇష్టంగా ఉంటుంది. కరివేపాకు చెట్లను పెంచితే వాటి చుట్టూ చాలా మొక్కలు పుట్టుకొస్తాయి. వే ర్ల కు కొన్ని గింజలు పడి కొన్ని అలా పుట్టుకొస్తాయి.కరివేపాకు చెట్టు ఆకు ఒక్కటే కాదు దీని వేర్లు మాను చెక్క రసము కషాయం అన్ని ఆరోగ్యాన్ని కాపాడి ఆరోగ్యాన్ని పెంపొందింప చేసేవే. శరీరానికి కాంతి నిచ్చి కఫ రోగాన్ని రక్త గ్రహణి అతిసారాన్ని నిలువరించ గల కరివేపాకు వాతాన్ని హరింప జేస్తుంది. ఇన్ని ఔషధ ఆరోగ్య విలువలు ఉన్నాయి కనుకనే మన వాళ్ళు దీనిని వంటకాల్లో ఒక తప్పనిసరిపదార్థంగా చేశారు. కరివేపాకు కషాయం. రసం గాని కొంచెం వెగటు గా ఘాటైన వాసనతో కూడి ఉండి చలువచేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది దీనిని కలిపి వండిన పదార్థాలకు రుచిని సువాసనను కలిగించి తిన్నవారికి ఉదర శుద్ధిని,ఉదర పుష్టిని కలిగిస్తుంది. జఠరాగ్నిని మందగించక కుండా ఉజ్వలంగా వెలిగిస్తూ ఉంటుంది. శరీరంలోని అధిక వేడిని పోగొట్టి బలం కలిగిస్తుంది కఫ రోగాలు గుల్మ్ఆ రోగాలు , విరేచన వ్యాధులు మొలల రోగాలు దారుణమైన అతిసార వ్యాధులు కరివేపాకుతో నశించిపతాయి
 దీనిలో ప్రధానంగా ఆకలి పుట్టించే గుణం విశేషంగా ఉంది కరివేపాకు చెట్ట్టు కు కాచేే పండ్లు నల్లగా తియ్యగాాా ఉంటాయి. కరివేపాకులోోో ఉండే సుగుణాలన్నీ దీని పండ్లలోోో కూడా ఇది శరీరంలోని అతి పైత్యాన్ని హరించి, రక్త్త్త్త దోషాలను హరించేచేను, సమశీతోష్ణస్థితి ని కలిగిస్తుంది. అయితే ఏ కారణం వల్లనో మన రాష్ట్ర ప్రజలు ఈ పండ్లను తినడానికి అలవాటు ఈ పండ్లలో మలమూత్రాల ను సాఫీగా జారీ చేసే గుణం తో పాటు కాలేయానికి పుష్టినిచ్చే సుగుణం కూడా ఉంటుంది.

విష జంతువుల కాట్లు తగ్గడానికి 

కరివేపాకు చెట్టు బెరడును గాని వేరును గాని మంచి నీటితో అరగదీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తే విష జంతువులు విషం హరించి పోతుంది. అలాగే ఇదే గంధాన్ని చర్మంపైన పోస్తే కురుపులు పండ్లు అనిగిపోతాయి.

వాంతులు విరేచనాలు తగ్గడానికి

కరివేపాకు పచ్చిది గాని లేక నేతిలో వేయించిన ది గాని తగిన మోతాదుగ సేవిస్తుంటే
 రక్త విరేచనాలు వాంతులు పొట్టలో పేరుకున్న విషవాయువులు ఆశ్చర్యకరంగా ఆగపోతాయి.
కరివేపాకు త చేసిన కషాయం కొద్దికొద్దిగా 3,4 సార్లు సేవిస్తుంటే కలరా విరేచనాలు సైతం తగ్గిపోతాయి. అని ఆయుర్వేద మహర్షులు సూచించారు. ఆకు రసం మోతాదు 20 గ్రాములు కషాయం మోతాదు 60 గ్రాములు గా పెద్దలు ఉపయోగించాలి. పిల్లలకు వారి వయసును బట్టి మోతాదు న తగ్గించి ఇవ్వాలి.

స్త్రీ పురుషుల సుఖానికి

సంభోగానికి ముందు పురుషుడు తన అంగానికి కరివేపాకు బెరడును తేనెతో కలిపి అరగదీసిన గంధాన్ని లేపనం చేసుకుని సంభోగంలో పాల్గొంటే ఆ స్త్రీపురుషులకు అమితమైన ఆనందం కలుగుతుంది.

గొంతు పుండు తగ్గడానికి

గొంతులు పుండు పుట్టి బాధపడేవారు కరివేపాకు రసం 20 గ్రాములు మోతాదుగా రెండు పూటలా ఒక చెంచా పంచదార కలిపి నిదానంగా కొద్దికొద్దిగా నోటిలో పోసుకొని మింగుతూ ఉంటే పుండు మానిపోతుంది.

తెల్ల బొల్లి తగ్గడానికి 

నీడలో గాలికి ఆరబెట్టి దంచి నా కరివేపాకు పొడి 50 గ్రాములు సుగంధ పాల వేర్ల పొడి 50 గ్రాములు కండ చక్కెర పొడి 50 గ్రాములు నీడలో ఆరబెట్టి దంచిన గుంటగలగరాకు పొడి 50 గ్రాములు తగినంత తేనె కలిపి బాగా మెత్తగా గుజ్జులాగా నూరి నిల్వచేసుకోవాలి .పూటకు 5 గ్రాముల మోతాదుగా ఆహారానికి అరగంట ముందు లేహ్యాన్ని సేవిస్తూ ఉండాలి .దీనితోపాటు పచ్చి గుంటగలగరాకు రసం మచ్చలపై పట్టించి రెండు మూడు గంటలు ఉంచిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా తెల్ల మచ్చలు తగ్గిపోతాయి.

కడుపు నొప్పులు తగ్గడానికి

 కరివేపాకు మిరియాలు సమభాగాలుగా తీసుకొని రెండింటినీ కచెం నేతిలో దోరగా వేయించి తగినంత పాత బెల్లం కలిపి బాగా దంచాలి ఆ ముద్దను కుంకుడు గింజలంత మాత్రలుగా చేసుకొని నిలువచేసుకోవాలి. పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా చప్పరిస్తూ ఉంటే కడుపు నొప్పులు కనిపించకుండా పోతాయి.

కడుపులో పసరు కు 

తగినన్ని మిరియాలు తీసుకుని సున్నపు తేట నీటిలో రెండున్నర గంటలపాటు నానబెట్టి నీరు తీసివేసి ఆ మిరియాలను బాగా ఎండబెట్టి తరువాత వాటిని పొడి చేయాలి ఆ పొడితో సమానంగా నీడలో ఆరబెట్టి దంచి కరివేపాకు పొడిని కలపాలి ఆ మొత్తం చూర్ణం లో తగినంత నిమ్మరసం కలిపి కాటుకలా గ మెత్తగా నూరి గురిగింజనత ప్రమాణం ల మాత్రలు కట్టి వాటిని నీడలో బాగా ఆరబెట్టి ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. ఈ గోలీలను పూటకు రెండు చొప్పున రెండుపూటలా మంచినీటితో సేవిస్తుంటే కడుపులో పెరిగే సమస్య హరించి పతుంది.



No comments:

Post a Comment