దానిమ్మ లోని అన్ని భాగాలు శరీరానికి మంచి చేసేవే. దానిమ్మ గింజలు అందానికి ఆరోగ్యానికి నిలయాలు. విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, టానిన్, ఇంకా చాలా ఉపయోగాలు కల అల్కలోయిడ్స్ ఉన్నాయి. ఎక్కువగా పొటాషియం,పీచు పదార్థం ఉంటుంది. గింజలు, రసం, తొక్కల నుండి ప్రత్యేక మైన పోలిఫినల్స్ లభిస్తాయి. ఇవి వివిధ రోగాల నుండి రక్షిస్తాయి. ప్రముఖంగా ఎలాజిక్ ఆసిడ్ క్యాన్సర్ లను నివారించడం లో జీర్ణ క్రియ సులభంగా జరగడంలో ఉపయోగ పడుతుంది. ప్రతి రోజూ 6-8 ఔన్సుల దానిమ్మ రసం తాగడం ద్వారా ప్రొస్టేట్, రొమ్ము కాన్సెర్ నివారణ లో ఉపయోగ పడటమే కాకుండా చిన్న పేగుల్లో క్యాన్సర్ కి కారణమయ్యే మంట లక్షణాలను తగ్గిస్తుంది.
No comments:
Post a Comment