5, జనవరి 2019, శనివారం

పచ్చి మిర్చి మంచిదా లేక పండు మిర్చి మంచిదా ?

పచ్చి మిర్చి మంచిదా ,పండు మిర్చి మంచిదా అంటే రెండూ మంచివే.ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో తినడం మంచిదన్నది తెలిసిందే.ఆకుపచ్చని మిర్చి,పసుపు రంగు మిర్చిలతో పోలిస్తే పండు మిర్చిలో విటమిన్ సి,బీటా కెరోటిన్ ల శాతం ఎక్కువ,ఎ,బి,సి విటమినులతో పాటు ఖనిజాలు కూడా ఇందులో పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.క్యాన్సర్ తోనూ పోరాడగలడు.ముఖ్యంగా ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు ఇది సాయపడుతుందట.పొట్టలో హానికర బ్యాక్టీరియాని నివారిస్తుంది.

  పండు మిర్చి రంగు చూస్తేనే నోరూరుతుంది.అంటే ఆకలిని పెంచినట్లే కదా..అలాగే ఇది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది.ముఖ్యంగా రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని సైతం కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.

    జలుబూ,జ్వరాలు గట్రా రాకుండా నిరోధించే గుణాలూ ఇందులో ఎక్కువే.నొప్పులకి కారణమయ్యే ఇంఫ్లమ్మేషన్ ని తగ్గిస్తుంది.దాని ఫలితంగానే ఆర్థ్రైటిస్,సొరియాసిస్,డయాబెటిక్ న్యూరోపతి...వంటి వాటి కారణంగా తలెత్తే నొప్పుల్ని తగ్గించే గుణం పండు మిర్చిలో ఎక్కువ.దీన్ని తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణశక్తినీ,జీవక్రియనీ పెంచడంతో పాటు బరువు పెరగకుండానూ చేస్తుంది.ఇది తిన్నాక పుట్టే వేడి కారణంగా వ్యాయామంలో మాదిరిగా కెలొరీలు కరుగుతాయి.

   ఆస్తమా,సైనస్,జలుబులతో బాధ పడేవాళ్లు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఊపిరితిత్తులు,గొంతు,ముక్కుల్లో శ్లేష్మం,మ్యూకస్ పేరుకోకుండా ఉంటుంది.పండు మిర్చి వాసన తలనొప్పుల్నీ తగ్గిస్తుంది.

* బచ్చలి ఆకుకూరను తరచుగా తింటుంటే పంటి చిగుళ్ళ నొప్పులు తగ్గిపోయి ,చిగుళ్ళను గట్టి పరుస్తుంది. *

30, డిసెంబర్ 2018, ఆదివారం

శరీర దుర్వాసన,నోటి దుర్వాసన రాకుండా ఆహార పరిష్కారం. / SHAREERA DURVAASANA,NOTI DURVASANA RAKUNDA AHARA PARISHKARAM


ఈ దుర్వాసనలు పోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.నోటి దుర్వాసన పోవడానికి రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవడమొక్కటే కాకుండా పీచుపదార్థం ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల పళ్లు శుభ్రంగా ఉండి చెడు బ్యాక్టీరియా ఫాం కాకుండా చేస్తుంది.పీచుపదార్థం అరుగుదలకు ఉపయోగపడుతుంది.మలబద్ధకం నివారిస్తుంది.దీనివల్ల జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుంది.అరుగుదల సవ్యంగా లేనప్పుడు ,ఆలస్యమైనప్పుడు పొట్ట నుంచి నోటిలోకి దుర్వాసన వెలువడుతుంది.అందువల్ల మన ఆహారం పీచుపదార్థంతో పాటు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువ నూనె ఉండే ఆహారపదార్థాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఎప్పుడు కూడా తాజాగా ఉండే ఆహారం భుజించడం ఆరోగ్యానికి మేలు.

శరీర దుర్గంధం అపొక్రైన్ అనే గ్రంధుల ద్వారా వెలువడుతుంది.ఈ గ్రంధులు ప్రత్యేకమైన సెంట్ ను విడుదల చేస్తాయి.చెమటకు బ్యాక్టీరియా తోడై శరీర దుర్గంధం వస్తుంది.సాధారణంగా చెమట వాసన అనేది అందరికీ ఉంటుంది.ఐతే ఇది మన శుభ్రతపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.మనం తీసుకునే ఆహారం కూడా ఈ వాసనలకు కారణం అవుతుంది.అపొక్రైన్ గ్రంధులు కళ్లు,చంకలు,వక్షోజాలు,నాభి,చెవులు,విస్ర్జన భాగాల్లో ఉంటాయి.అందువల్ల శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.అల్లగే తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి.తగినంత పీచుపదార్థం ఉండాలి.రోజుకు కనీసం 8 నుండి 12 గ్లాసుల నీరు తాగాలి.పళ్లు,కూరగాయలు ప్రతి పూటా తీసుకోవాలి.దంత సమస్యలు,చిగుళ్ల సంస్యలున్నవారు దంత వైద్యుడిని సంప్రదించాలి.చూయింగ్ గం నమలడం వల్ల దంతాలు శుభ్రపడతాయి.

29, డిసెంబర్ 2018, శనివారం

డిప్రెషన్ లో 8 కోట్ల మంది భారతీయులు .

డిప్రెషన్ - చిన్న చిన్న పిల్ల నుంచే వేధిస్తున్న సమస్య ఇది.అల్ల డిప్రెషన్ బారిన పడిన దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉండడం ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం.ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.భారత్ తర్వాత చైనా,అమెరికాలున్నాయి.మారుతున్న జీవన విధానాలు కావచ్చు,ఉద్యోగ కుటుంబ బాధ్యతలు కావచ్చు,మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తన నివేదికలో తెలిపింది.మానసిక సమస్యలకు చికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమౌతోందని హెచ్చరించింది.

సగం మంది కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్ బాధితులు - కాలంతో పాటు జీవితం ఉరుకులు పరుగులు పెడుతోంది.డబ్బు సంపాదించాలి,పేరు తెచ్చుకోవాలి,గుర్తింపు పొందాలి,ఎక్కువ మందిలో ఇదే తపన.ఐతే ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో సమయం లేకుండా వారిలో 42.5 శాతం మందికి డిప్రెషన్ ఉంది.గత సంవత్సరం అసోచాం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారిపైనే డిప్రెషన్ ఎక్కువగా దాడి చేస్తోందని తేలింది.తక్కువ జీతంతో ఎక్కువ సేపు పని చేయించుకోవడం వల్ల ,ఉద్యోగుల్లో అలసట చాయలు కనిపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.అదే ఒత్తిడి,ఫ్రస్ట్రేషన్ వరకు వెళుతున్నాయని ,చివరకు డిప్రెషన్ బారిన పడుతున్నారని స్పష్టమైంది.బ్రిటన్ ( 33 గంటలు ),అమెరికా ( 40 గంటలు ) తో పోలిస్తే భారత్ లో సగటు వేతన జీవి ఎక్కువగా పని చేస్తున్నాడు.వారానికి 48 నుంచి 50 గంటలు పని చేయాల్సివస్తోంది.జీతం విషయంలో మాత్రం ఆ దేశాలకన్నా చాలా తక్కువలోనే ఉంది భారత్.లివింగ్ కాస్ట్,ఇండెక్ష్ ప్రైసింగ్ లను తీసేసిన తర్వాత కూడా 6 రెట్లు ఎక్కువగా ఆ దేశాలు జీతాలిస్తున్నాయి.భారత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఫలితంగా మానసిక వత్తిడి పెరిగి పోతోంది.పని ఒత్తిడి ఎక్కువవడంతో నిద్ర కూడా సరిగ్గా పోలేని స్థితి ఉంది.

టీనేజ్ నుంచే ఒత్తిడి - 14 యేళ్ళ ప్రాయం వయసంటే ఆడుతూ పాడుతూ గెంతే వయసు.చదువులు,ఫ్రెండ్స్ తో సరదాలు ఇలా ఉంటూ ఉంటాయి.కానీ ,బలవంతంగా రుద్దుతున్న చదువులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి.పెరిగిన టెక్నాలజీ వారి అలవాట్లను మార్చేస్తోంది.సెల్ ఫోన్ కు బానిసై పోవడం,అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపడం వంటివి పెరుగుతున్నాయి.మందు కొట్టడం,సిగరెట్లు తాగడం,డ్రగ్స్ వాడడం వంటి వాటితో డిప్రెషన్ తాలూకు చాయలు పెరిగిపోతున్నాయి.మానసికంగా సతమతం చేస్తున్నాయి.తల్లి దండ్రులు నిఘా పెట్టకపోవడమూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది.

డిప్రెషన్ లో టాప్ లో ఉన్న దేశాలు -

1. భారత్ - మన జనాభాలో 6.5 శాతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.గ్రామాలు,పట్టణాలు,నగరాలు అన్న తేడా లేకుండా అందరినీ అది వేధిస్తోంది.దానిని నయం చేసేందుకు ప్రభావ వంతమైన పద్ధతులు ,చికితసలున్నా ,చేసేవారే కరువయ్యారని సంస్థ పేర్కొంది.సైకాలజిస్టులు,సైకియాట్రిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.లక్షకు ఒకరు మాత్రమే ఉన్నారని పేర్కొంది.మానసిక సంస్యలతో సగటున ప్రతి లక్షమందిలో 11 మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

2. చైనా - డిప్రెషన్ తో బాధపడేవారిలో 91.8 శాతం మంది దాకా చికిత్సలు చేయించుకోవడం లేదు.చైనాలోనూ భారత్ లాంటి పరిస్థితే ఉంది.మానసిక ఆరోగ్యం పై వాళ్లు బడ్జెట్ లో కెటాయిస్తోంది కేవలం 2.35 శాతం మాత్రమే.

3. అమెరికా - ప్రతి 5 మందిలో ఒకరు మానసిక రోగాల బారిన పడుతున్నారు.అందులో కేవలం 41 శాతం మంది చికిత్స తీసుకుంటున్నారు.అంత అభివృద్ధి చెందిన అమేరికాలోనూ మానసిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువే.చికిత్స లేకుండానే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రజలు చెప్పడం విశేషం.

4. బ్రెజిల్ - లాటిన్ అమెరికాలో డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఎక్కువున్న దేశం బ్రెజిలే.హింస ,వలసలు,నిలువ నీడ లేకపోవడం వంటి కారణాలు డిప్రెషన్ లోకి తోసేస్తున్నాయి.

5. ఇండొనేషియా - జనాభాలో 90 లక్షల మంది ( 3.7 % ) డిప్రెషన్ బారిన పడ్డారు.యాంగ్జైటీ / మానసిక ఆందోళన కలుపుకుంటే మరింత పెరుగుతుంది.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు.

6. రష్యా - ఆ దేశ జనాభాలో 5.5% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.2012 ప్రకారం చూస్తే ప్రపంచ సగటు కన్నా మూడింతలు ఎక్కువగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

27, డిసెంబర్ 2018, గురువారం

పార్శ్వ నొప్పి తగ్గుటకు ఆయుర్వేద పరిష్కారం ./ AYURVEDIC SOLUTION FOR MAIGRAIN.


ఆయుర్వేద మందుల షాపులలో దొరికే మహా చందనాది తైలమును తలకు మర్దనా చేస్తుంటే శరీరానికి చలువ చేస్తుంది,మెదడుకు వేడిని తగ్గిస్తూ,బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.దీనిని తలకు మర్దనా చేయడం వలన హిస్టీరియా,ఫిట్స్,మూర్చ వంటి వ్యాధులు నివారిస్తుంది.తలకు మర్దనా చేసి ,ఉదయం,సాయంత్రం, ముక్కుల్లోనూ,చెవుల్లోనూ కొంచెం చుక్కలు వేస్తుంటే పార్శ్వనొప్పి తగ్గుతుంది.

కొన్ని సాధారణ చెవి రోగములు - ఆయుర్వేద పరిష్కారాలు.


చెవులలో గుబిలి వలన మంట,కురుపులు,దురద,చెవి పోటు,చీము కారుట వంటి అనారోగ్యములు చాలా కలుగవచ్చు.వీటికి ఆయుర్వేడములో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి.

1. పండు జిల్లేడు ఆకును నిప్పు సెగలో వేడి చేసి ,వాటిని బాగా నలిపి ,రసాన్ని పిండాలి.దీనిని బాధ ఉన్న చెవిలో కొచెం వేయాలి.ఇలా 8 గంటలకొకసారి వేయాలి.గంజాయి ఆకుల రసమును చెవిలో పిండినా అన్ని రకముల చెవి వ్యాధులు నయమౌతాయి.

2. గోరు వెచ్చని అల్లపు రసమును లేకపోతే వెల్లుల్లి పాయల రసమును కొంచెం చెవిలో వేయాలి.ఇలా ప్రతి 8 గంటలకొకసారి వేస్తుండాలి.

3. అన్ని రకాల చెవి రోగాలకు నిర్గుండి తైలం చాలా బాగా పని చేస్తుంది.ప్రతి 8 గంటలకొకసారి చెవిలో 4 చుక్కలను వేయాలి.కర్పూర శిలాజిత్తు,అమృతారిష్టము,మృత్యుంజయ రసములలో ఏదైనా వాడవచ్చు.

26, డిసెంబర్ 2018, బుధవారం

సైనసైటిస్ కి నస్య ఔషధం - లవణ ద్రావణ చికిత్స


ఇది సైనసైటిస్,ఎలర్జీలు,ముక్కు కారటం,జలుబు,ఫ్లూ సమస్యలు ఉన్నవారికి అనువైనది.చెవుల సమస్యలు కలిగినవారికి మంచిది కాదు.

సైనస్ లు విడుదల చేసే స్రావాలు ముక్కులోపలకు స్రవించడానికి అడ్డు ఏర్పడడంతో బ్యాక్టీరియా దాడి చేసి సైనసైటిస్ ఇంఫెక్షన్ ను కలిగిస్తాయి.ఇలా సైనస్ లు మూసుకుపోతాయి.
దీనికి లవణ ద్రావణ చికిత్స బాగా ఉపయోగపడుతుంది.ద్రావణం సాంద్రత ఎక్కువ కనుక మ్యూకస్ పొరల్లోని అదనపు ద్రవాంశాన్ని వెలుపలకు లాగేస్తుంది.దీనితోపాటు లోపల స్నిగ్ధత్వం పెరగటమే కాకుండా,శోధ వంటివి తగ్గుతాయి.

లవణ ద్రావణ తయారీ విధానం-

1-2 కప్పుల గోరు వెచ్చటి నీళ్లు తీసుకొని 1/4 నుండి 1/2 టీ స్పూన్ ఉప్పు పలుకులను ( అయోడిన్ కలపని సముద్రపు ఉప్పు ),చిటికెడు వంటసోడా లను కలపాలి.

వాష్బేసిన్ వద్దకు వెళ్లి 45 డిగ్రీల కోణంలో వంగి నిలబడాలి.తలను ఒక పక్కకు వంచాలి.లవణ ద్రావణాన్ని నాసిక లోపలకు పోయలి.
నాజిల్ ను ముక్కు రంధ్రం లోపలకు ఒక అంగులం లోపలకు మాత్రమే చొప్పించాలి.ఈ సమయంలో నోటితో గాలి పీలుస్తుండాలి.ఉప్పునీళ్లు ముక్కు అంతర్భాగం నుండి ,నోటి నుంచి ధారగా కారతాయి.ఈ నీళ్లను మింగకపోవడం మంచిది. రెండవ నాసికతో కూడా ఇదే విధంగా రిపేట్ చేయాలి.ముక్కును శుభ్రం చేసుకొని రెండవ నాసికతో ఇదే క్రమాన్ని తిరిగి చేయాలి.తరువాత మిగిలిన ద్రవాన్ని పారబోసి,సామాగ్రిని ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి.

మండుతున్నా,నొప్పిగా అంపిస్తున్నా ఉప్పు మోతాదును తగ్గించండి,తలను వెనక్కి వంచవద్దు.నోరు తెరచి ఉంచి కేవలం నోటితో మాత్రమే శ్వాస తీసుకోండి.
ఒకటి రెండు సార్లు చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి.చికిత్సను కొనసాగిస్తున్న కొద్దీ ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి.
ఈ చికిత్సను రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే సరిపోతుంది.లక్షణాలన్నీ పూర్తిగా సమసిపోయిన తర్వాత వారానికి మూడుసార్ల చొప్పున తీసుకుంటూ ఉంటే లక్షణాలు తిరగబెట్టకుండా ఉంటాయి.

పండంటి ఆరోగ్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 సూత్రాలు.

పంచ ప్రాణాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 5 సూత్రాలు.

పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ఖచ్చితంగా సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది.ఏ వయసు వారైనా ,ఆహారపరంగా ఈ సూత్రాలను పాటిస్తే జబ్బుల బారిన పడకుండా జీవించటానికి అవకాశం ఉంటుందని తెలిపింది.

1. రక రకాల ఆహార పదార్థాలను తినడం.

2. ఉప్పు తగ్గించడం.

3. కొవ్వులు,నూనెలు తగ్గించడం.

4. తీపి కూడా తగ్గించడం.

5. మద్యం మానుకోవడం / మద్యానికి సురక్షిత స్థాయి లేదు .

22, డిసెంబర్ 2018, శనివారం

పెంపుడు జంతువులతో వచ్చే జబ్బులు - ఆయుర్వేద చికిత్స


ఈ రోజులలో ప్రతి ఇంట్లోనూ పెంపుడు జంతువులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది.ఐతే వీటితో ఎక్కువగా గడపడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.వీటి వల్ల నోరు,కడుపు,పేగులు మండుట వంటివి వచ్చే అవకాశన్మ్ కలదు.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయి.

1. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల తేనెను కలిపి తాగుతుండాలి.

2. 10 చుక్కల వెల్లుల్లి రసమును నీటిలో కలిపి తాగుతూఉండాలి.రోజుకు 2 సార్లు వ్యాధి తగ్గేవరకు తాగాలి.

3. శీతాంశురసము,పైత్యాంతక రసములను కలిపి వాడాలి.

ఎముకలు మెత్తబడుట - ఆయుర్వేద చికిత్స


మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్,సున్నము,డి విటమిన్ లోపించినపుడు ఎముకలు మెత్తబడడం జరుగుతుంది.స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కువగా రావచ్చు.కింది చికిత్సలు రోగాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడగలవు.

1. క్షీర బలా తైలము,సువర్ణము,అమ్ర్తప్రాశ ఘృతము కలిపిన చ్యవన ప్రాశ వాడవచ్చు.

2. ఆక్రోట్ చెట్టు ఆకుల కషాయమును ఉదయం , సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

3. రోజూ పాలను తాగాలి.

4. ప్రతి రోజూ తాంబూలం వేసుకోవాలి.

కండరముల క్షీణత - ఆయుర్వేద చికిత్స



కొన్ని వ్యాధులు బాగా ముదిరినప్పుడు ,ముదిరి తగ్గినపుడూ కండరములు క్షీణించి ,శరీరం ఎండిపోవడం జరుగుతుంది.దీని వల్ల ఎక్కువగా నీరసమూ,మూత్రం స్వాధీనం తప్పుట,శరీరం తూలిపోవుట,జరుగుతుంది.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు బాగా ఉపకరిస్తాయి.

1. చ్యవనప్రాశ,మకరధ్వజము,అశ్వగంధ లేహ్యము,వసంత కుసుమాకరము బాగా పని చేస్తాయి.

2. ఒక కప్పు నీటిలో 3 స్పూన్ ల తేనె ను,ఒక నిమ్మ కాయ రసమును కలుపుకొని ప్రతి రోజూ తాగుతుండాలి.కొంత కాలానికి వ్యాధి తగ్గగలదు.

3. రత్న పురుష ఆకులు,అల్లపు రసము,ఎండు ద్రాక్షలను వాడుతూ ఉండాలి.

19, డిసెంబర్ 2018, బుధవారం

పచ్చి మిరపకాయలు రోజూ తింటే కలిగే లాభాలు.

పచ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు.కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.

1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.

5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.

6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...