3, మార్చి 2014, సోమవారం

ANNUAL HEALTH TESTS / ANNUAL HEALTH CHECK UP - IMPORTANCE


గచ్చ కాయ / GACHA KAYA / NICKERNUTS / CAESALPINIA BONDUC / LATHA KARANJ / KAT KARANJ - ఆయుర్వేద ఉపయోగాలు / AYURVEDA UPAYOGALU


గచ్చకాయ చెట్టు భారతదేశమంతటా వ్యాపించి ఉంది.దీని గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.చిన్నప్పుడు పిల్లలు గచ్చకాయలతో ఆడుకునే వారు.రాయి మీద ఇలా రాసి పెడితే చుర్రుమని మంటపెడుతుంది.అదే గచ్చకాయ ఆకు ప్రారంభ దశలో ఉన్న వరి బీజానికి అమోఘంగా పని చేస్తుంది.ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు కడితే చాలు మూడు పూటల్లో వ్యాధి తగ్గుతుంది.

బంజరు భూములు ,తీరప్రాంతాలు,ఆకులు రాలే చెట్లున్న అడవులలో కూడా ఏదో ఒక చెట్టును పట్టుకుని గచ్చమొక్క పాకుతుంది.ఇది పైకి పాకుడు మొక్క.గట్టి ముళ్ళు,కొక్కేలు కలిగి ఏదొ ఒక చెట్టును ,ఆధారాన్ని ఆలంబనగా చేసుకుని విస్తరిస్తుంది.సిసాల్పినేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం సిసాల్పినియా బొండక్, సన్స్కృతంలో లతా కరంజ్ ,కంటకి కరంజ్, హిందిలో కట్ కరంజ్ అని అంటారు.

గచ్చకాయ గింజల్లో పసుపు పచ్చని చిక్కని ద్రవం ఉంటుంది.ఇది కాకుండా , సిసాల్పిన్,అయోడిన్ , సాపోవిన్,నాన్ గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి.

గచ్చకాయ కఫాన్ని,వాతాన్ని అణచివేస్తుంది.పిత్తాన్ని పెంచుతుంది.రక్త దోషాలను, వాపులను తొలగిస్తుంది.జీర్ణశక్తిని పెంచుతుంది.గింజలు ఉష్ణతత్వం గలవి.చేదుగా ఉంటాయి.రక్త వృద్ధికి తోడ్పడతాయి.మెదడుకు , కళ్ళకు,చర్మకాంతికి గచ్చకాయ వినియోగం మంచిది.దీని గింజల తైలం వాడడం వల్ల గౌట్,కంటి,చర్మ వ్యాధులు తగ్గుతాయి.దగ్గు,పైల్స్,వాతం,కడుపులో పురుగులు,వాపులు పోవడానికి గచ్చ ఆకులు వాడటం మంచిది.కాయలకు,పైల్స్ ను ,మూత్రసమస్యలను నయం చేసే శక్తి ఉంది.

1. బట్టతలపై జుట్టు రావడానికి - గచ్చకాయ తైలాన్ని తల మాడుకు రాసుకోవాలి.లేదా గచ్చమొక్క పూలు 6 నుంచి 12 గ్రాములు మెత్తగా నూరి దాన్ని తలకు పట్టించాలి.ఇలా కొంతకాలం చేస్తే బట్టతలపై జుట్టూ రాబట్టవచ్చు.

2. మైగ్రేన్ , తలనొప్పి తగ్గడానికి - 

ఎ.) 1, 2 గచ్చకాయ గింజలు , దానికి సమంగా ములక్కాయ గింజలు,దాల్చిని,చక్కెర కలిపి మెత్తగా పొడి చేసి నస్యం మాదిరిగా ముక్కుతో పీల్చాలి.దీనివల్ల ఎక్కువగా తుమ్ములు వచ్చి లోపలి నుంచి శ్లేష్మం వచ్చి తలనొప్పి తగ్గిపోతుంది.

బి.) గచ్చకాయ గింజలను నీటితో తడిపి మెత్తగా నూరి దానికి కాస్త బెల్లం కలపాలి.దీన్ని కాస్త వెచ్చచేసి ముక్కురంధ్రంలో వేయాలి.తలనొప్పి కుడివైపున ఉంటే ఎడమ రంధ్రం లో, ఎడమవైపు ఉంటే కుడి రంధ్రం లో వేయాలి.ఒక రంధ్రంలో మందు వేస్తే రెండు గంటల తర్వాత ఇంకో రంధ్రంలో వేయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే తలనొప్పి, మైగ్రేన్ అన్నీ నయమౌతాయి.

3. మూర్చ వ్యాధి తగ్గడానికి - గచ్చ ఆకుల రసం 10 - 12 గ్రాములు రోజూ మూడు పూటలా కొంతకాలం తాగాలి.

4. కంటి జబ్బులు తగ్గడానికి - కళ్ళు ఎర్రబడటం,కళ్ళ చివర వెంట్రుకలు లేకపోవడం జరిగితే గచ్చకాయల గింజలు 1,2 గ్రాములు,తులసి ,మల్లెమొగ్గలు సమంగా తీసుకుని  వాటిని కలిపి మెత్తగా నూరి దానికి 8 రెట్లు నీరు కలిపి మరిగించాలి.నీరు మూడు వంతులు ఆవిరి కాగానే దాన్ని వడగట్టి మళ్ళీ మరిగించాలి.ద్రవం చిక్కబడగానే కాటుకలా తయారవుతుంది.దాన్ని కళ్ళకు రాస్తుండాలి.

5. దంత రోగాలు తగ్గడానికి - పయోరియా ఉంటే గచ్చమొక్క పుల్లతో పళ్ళు తోముకోవాలి.పళ్ళ చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటే 7 గ్రాముల గచ్చ గింజల పప్పుకు 7 గ్రాముల చక్కెర కలిపి తినాలి.దీనివల్ల రక్తం కారడం ఆగిపోతుంది.

6 . దగ్గు తగ్గడానికి - 

ఎ.) 15 మి.గ్రా - 750 మి.గ్రా గచ్చకాయల పొడి ,125 మి.గ్రా వేయించిన బోరాక్స్ పొడి తేనెతో కలిపి తినాలి.ఇలా రోజుకు మూడు,నాలుగు సార్లు తీసుకోవాలి.చిన్నపిల్లలకు గచ్చకాయలను దండగా గుచ్చి మెడలో వేయాలి.ఇలా చేస్తే దగ్గు నాలుగైదు రోజులలో నయమౌతుంది. 

బి. ) 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,250 - 500 మి.గ్రా . మిరియాల పొడి కలిపి రోజూ మూడు పూటలా తాగాలి.ఇలా నాలుగు రోజులు చేస్తే దగ్గు నుంచి విముక్తి లభిస్తుంది.

7 . కోరింత దగ్గు తగ్గడానికి - మెడలో గచ్చకాయ మొక్క పూల దండను వేయాలి.లేదా గచ్చకాయ గింజలను 1 - 2 గ్రాములు మెత్తగా నూరి నీటిలో వేసి మరిగించాలి.తయారైన కషాయాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.

8.. ఆకలి లేమి తగ్గడానికి - 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,అంతే పరిమాణంలో చిత్రమూలం ఆకుల రసం కలిపి దానికి కాస్త మిరియాల పొడి,ఉప్పు కలిపి తాగాలి.ఆకలి లేమి,పొట్టలో గ్యాస్,డయేరియా తగ్గిపోతాయి.అజీర్ణం సమస్య తగ్గుతుంది.

9. పొట్టలో నులి పురుగులు పోవడానికి - కడుపులో పేగులలో పురుగులు నశించడానికి గచ్చ కాయల తైలం 10 - 15 గ్రాముల వరకు 3 రోజులు తాగాలి.

10 - 12 గ్రాముల గచ్చమొక్క ఆకుల రసానికి 125 మి.గ్రా వాయువిడంగాల చూర్ణాన్ని ,కొద్దిగా మిరియాల పొడిని కలిపి రోజూ 2 పూటలా భోజనం తర్వాత తీసుకోవాలి.ఇలా వారం రోజులు తీసుకుంటే ప్రేవులలో పురుగులు నశిస్తాయి.

10. గ్యాస్ వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గడానికి - గచ్చ ఆకులను ఏదైనా యవాగులో మరిగించి అవసరమైన మోతాదులో సేవించాలి.నొప్పి తగ్గి జీర్ణ శక్తి పెరుగుతుంది.

11. ఉదరవ్యాధులు తగ్గడానికి - అధికంగా మలబద్ధకం ఉంటే 1 - 3 గ్రాముల గచ్చ ఆకులను  నేతిలో లేదా నువ్వుల నూనెలో వేయించి దాన్ని సత్తుపిండి / బార్లీ తో కలిపి సేవించాలి.దీనివల్ల పొట్ట ఉబ్బరం కూడా తగ్గుతుంది.

12. పైల్స్ తగ్గడానికి - గచ్చ ఆకులను మెత్తగా నూరి పైల్స్ గడ్డలపై పూయాలి.గచ్చ ఆకులు 1 - 3 గ్రాములు మెత్తగా నూరి పైల్స్ తగ్గే వరకు నీటితో కలిపి సేవించాలి.

గచ్చకాయ మొక్క వేరు పొడి 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు తీసుకుని,దానికి సమంగా చిత్రమూలం పొడి ,సైంధవ లవణం ,కొడిశపాల బెరడు పొడి కలిపి ఈ మిశ్రమం 1 - 3 గ్రాములు రోజూ 2 పూటలా తగ్గేవరకు సేవించాలి.

13. మధుమేహం తగ్గడానికి - గచ్చకాయ మొక్క పూల రసం / చూర్ణం సేవించవచ్చు.దీనివల్ల మూత్ర సమస్యలు కూడా నయమౌతాయి.

14. వాంతులు తగ్గడానికి - వాంతులు , దగ్గు వస్తుంటే గచ్చకాయల గింజల చూర్ణం 2 - 3 గ్రాములు,చక్కెర , తేనె కలిపి రోజూ 2 పూటలా తీసుకోవాలి.

వాంతులు ఆగిపోవడానికి గచ్చకాయల గింజలను వేయించి వాటికి కాస్త చక్కెర కలిపి మెత్తగా నూరి చిన్న మాత్రలుగా చేయాలి.ప్రతీ 10 నిమిషాలకు ఒక మాత్రను మింగాలి.వాంతులు ఆగిపోతాయి.ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 - 2 ముక్కలను ప్రతి పావుగంటకు తినాలి.

15. సిఫిలిస్ / సుఖవ్యాధి తగ్గడానికి - గచ్చకాయ మొక్క వేరు రసం 1 - 3 గ్రాములు తీసి దానికి కొబ్బరి నీరు , నిమ్మ రసం కలిపి రోజూ 2 పూటలా తాగాలి.మూత్రంలో మంట , చీము కారడం తగ్గుతుంది.

16. కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి - గచ్చకాయల గింజల పొడి 1 గ్రాము,3 గ్రాముల తేనె కలిపి మొదటి రోజు తాగాలి.మరునాడు 2 గ్రాముల గచ్చకాయల గింజల పొడి ,తేనె తీసుకోవాలి.ఇలా రోజూ 1 గ్రాము పొడి పరిమాణం పెంచుకుని తినాలి.తర్వాత రోజు 1 గ్రాము పొడి తగ్గించి తినాలి.దీనినే వర్ధమాన యోగం అంటారు.చివరగా 3 గ్రాముల పొడి,తేనె తీసుకోవాలి.దీనితో కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.
17.రక్తం కారే పైల్స్ తగ్గడానికి - గచ్చకాయ మొక్క వేరు బెరడు 2 గ్రాములు , గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి తీసుకోవాలి.3 రోజులపాటు కేవలం మజ్జిగ మాత్రం తాగాలి.ఇంకే ఆహారం తీసుకోరాదు.రక్త పైల్స్ తగ్గిపోతాయి.

18. ఫిస్టులా తగ్గడానికి - 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు గచ్చకాయ మొక్క వేరు రసానికి ఆకు జెముడు రసం కలిపి దాన్ని ఫిస్టులా ఉన్న చోట ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాలి.ఇలా తగ్గే దాకా చేయాలి.

19. ఫిస్టులా అల్సర్లలో ఇంఫెక్షన్ వచ్చి ఉంటే గచ్చ ఆకులను నీటిలో ఉడికించి వాటిని ఫిస్టులా ఉన్నచోట ఉంచి కట్టు కట్టాలి.లేదా గచ్చాకుల రసం,వేపాకుల రసం కలిపి దానిలో దూది ముంచి ఫిస్టులా పై రాస్తుందాలి.

గచ్చ మొక్క ఆకులను , నిర్గుండి లేదా వేప ఆకులతో కలిపి మెత్తగా నూరి దాన్ని ఫిస్టులా వచ్చిన చోట ఉంచి కట్టు కట్టాలి.లేదా ఈ ఆకులకు గంజి కలిపి మెత్తగా చిక్కగా నూరి ఫిస్టులా పై రాయాలి.

20 . చర్మ వ్యాధులు తగ్గడానికి - 10 - 12 గ్రాముల చిత్రమూలం,మిరియాలు,సైంధవ లవణం కలిపి చూర్ణం చేసి దానికి రెట్టింపు పెరుగు కలిపి దాన్ని రోజూ 3 , 4 సార్లు తాగాలి.ఇలా 3,4 నెలల వరకు చికిత్స జరగాలి.దీని వల్ల అన్ని రకాల చర్మ వ్యాధులు,ఇన్ ఫెక్షన్స్ తగ్గిపోతాయి.

1 - 2 గ్రాముల గచ్చ కాయల ఫలాలను లేదా వాటి గింజలను తీసుకుని 1 - 2 గ్రాముల కొడిశపాల గింజలతో కలిపి మెత్తగా నూరి దాని చర్మవ్యాధి ఉన్నచోట రాయాలి.

గచ్చ కాయ మొక్క ఆకులు,వేపాకులు,ఖదిర ఆకులు కలిపి మెత్తగా నూరి చర్మ వ్యాధిపై రాయాలి.ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయం తో స్నానం చేయాలి.ఇలా కొంత కాలం చేస్తే చర్మవ్యాధులు నయమౌతాయి.

1 - 2 గ్రాముల గచ్చకాయ గింజలు ,కాస్త పసుపు,కరక్కాయ,ఆవాలు,కలిపి మెత్తగా నూరి వంటికి రాసుకోవాలి.ఇలా 10 రోజులపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

గచ్చకాయల గింజలను తెల్ల గన్నేరు వేరుతో కలిపి మెత్తగా నూరి వంటికి పూసుకోవాలి.

10 - 20 మి.లీ గచ్చ ఆకుల రసం ,వాటి కషాయంతో చర్మవ్యాధి ఉన్నచోట పూసి కడగాలి.గచ్చకాయల తైలంలో నిమ్మ రసం ,గంధకం కలిపి చర్మవ్యాధి ఉన్నచోట పూయాలి.దీనివల్ల గడ్డలు,కురుపులు,ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు నయమౌతాయి.

గచ్చకాయల తైలంలో నిమ్మ రసం కలిపి ,అది పసుపు రంగులోకి మారగానే చర్మంపై పూయాలి.

4 గ్రాముల యషధ భస్మం,25 గ్రాముల గచ్చగింజల తైలంలో కలిపి చర్మంపై రాయాలి.దీనిని పుండ్లపై,అల్సర్లపైనా రాయవచ్చు.

కాకనాక అనే చర్మవ్యాధి నయం కావడానికి చిత్రమూలం చూర్ణం,సైంధవ లవణం,గచ్చకాయల గింజల తైలంలో కలిపి చర్మంపై రాయాలి.

గచ్చకాయల ఫలాలను మెత్తగా నూరి 1 - 2 గ్రాముల మేర తినడం కూడా మంచిది.దీనివల్ల కూడా చర్మ వ్యాధులు నయమౌతాయి.

21 .గాయాలు తగ్గడానికి - గాయాలను గచ్చకాయల మొక్క వేరు రసంతో కడగాలి.

సమపాళ్ళలో కానుగ ఆకులు , కాడ జెముడు ,రేల ఆకులు ,మల్లెను తీసుకుని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి అల్సర్లు,పుండ్లు,పైల్స్ గడ్డలపైనా పూయాలి.త్వరగా నయమౌతాయి.

 22 . అల్సర్ల వల్ల వాపులు వస్తే గచ్చకాయ మొక్క ఆకులు 1 - 3 గ్రాములు ,అంతే పరిమాణంలో వావిలి ఆకులు కలిపి మెత్తగా నూరి అల్సర్లపై ఉంచి కట్టు కట్టాలి.

23 . బొబ్బలు తగ్గడానికి గచ్చకాయల గింజలు,నువ్వులు ,ఆవాలు కలిపి మెత్తగా నూరి వాటిపై పూయాలి.

24 . కీళ్ళనొప్పులు తగ్గడానికి - సమపాళ్ళలో గచ్చ కాయ గింజలు ,ఉప్పు,అల్లం,ఇంగువ కలిపి మెత్తగా చూర్ణం చేయాలి.దానిని 500 మి.గ్రా నుంచి 1 గ్రాము వరకు చల్లని నీటితో కలిపి తాగాలి.

గచ్చకాయ గింజలను 125 మి.గ్రా తామ్రభస్మంతో కలిపి నూరి ఆవగింజలవలె చిన్న మాత్రలు చేసి వాటిని రోజుకి ఒక మాత్ర చొప్పున మింగాలి.లేదా 10 - 20 గ్రాముల గచ్చకాయ మొక్క ఆకులను నువ్వుల నూనెలో వేయించి తినాలి.

25 . జ్వరం తగ్గడానికి - గచ్చ కాయ గింజలను నీటితో కలిపి నూరి ఆ నీటిని పొట్టపై చుక్కలు చుక్కలుగా వేసి  పూయాలి.లేదా ఈ మొక్క మొగ్గలు 3 , 2 మిరియాలు కలిపి మెత్తగా నూరి పొట్టపై పూయాలి.జ్వరం తగ్గుతుంది.

గచ్చకాయ గింజలు అన్న చోట గింజలోపలి పప్పును తీసుకోవాలి.






27, ఫిబ్రవరి 2014, గురువారం

AYURVEDIC SOLUTIONS FOR ACIDITY



కలబంద జ్యూతో
ఎసిడిటీకి చికిత్స
కలబంద ముదురు ఆకును తుంపి
అడ్డంగా కోసి, ఒక గిన్నెలో నిలువుగా
ఆనించండి. గిన్నె అడుగుకు పసుపు
పచ్చని స్రావం కారుతుంది. దీనిని
పారేయండి.
• ఇప్పుడు ఆకును పైనా, కిందా
తోలును ఒక చాకుతో వీల్ చేసి
గుజ్జును గ్రైండలో వేసి జ్యూస్
తీయండి. తాజాగా తీసిన కలబంద
జ్యూస్ ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ
కడుపుతో సేవించండి.
ఈ ఔషధం మోతాదు 20 నుంచి
30 మి.లీ. (ఒకటి నుంచి రెండు
టేబుల్ స్పూన్లు) ఇవి ఎసిడిటీ
రాకుండా అమోఘంగా నివారిస్తుంది.
అంటేకాకుండా చికిత్సగా కూడా
పనిచేస్తుంది.

ఉసిరికాయల రసంతో
ఎసిడిటీకి చికిత్స
కాజా నే "న 

+ త్రాజా ఉనీరి పండ్లను చాకుతో ముక్కలుగా కోసీ గింజలు తొలగించి, కండభాగాన్ని (గ్రైండర్‌లో వేసి జ్యూస్‌ తీయండి. (అవసరం అయితే నీళ్లు కలపవచ్చు) ఇలా తాజాగా తీసిన ఉసిరి రసాన్ని రెండు నుంచి నాలుగు టీ స్పూన్ల మోతాదుగా ఖాళీ కడుపుతో తీసుకోండి. 

+ ఇలా రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 40 రోజులు తీసుకుంటే ఎసిడిటీ వ్యాధిని నిరోధిన్తుంది. అలానే ఎసిడిటీని పూర్తిగా తగ్గిస్తుంది. 

చందన కషాయంతో 

ఎసిడిటికి చికిత్స 

+ ఒక పాత్రలో నాలుగు కప్పుల వీళ్లు. మరగటం మొదలెట్టిన తరువాతరెండు = టీస్పూన్ల చందనం పేళ్లను వేసి ఒక కప్పు కషాయం మిగిలేంత వరకూ మరిగించండి. దీనిని వడపోసుకొని ఉదయం అర కప్పు కషాయాన్ని సాయంత్రం కొద్దిగా వేది చేసి అరకప్పు కషాయాన్ని తాగండి. ఇలా పది, పదిహేను రోజులు క్రమం తప్పకుండా వాడితే ఎసిడిటీ రాకుండా నిరోధించు కోవచ్చు. అలాగే ఉన్న ఎనిడిటీని 

సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. లేత కొబ్బరి నీళ్లతో " ఎసిడిటీకి చికిత్స 

౨ లేత కొబ్బరి బొండాంని కొద్టించుకొని కొబ్బరి నీళ్లను ఒంపుకొని వెంటనే తాగి, లోపల మిగిలి ఉన్న లేత కొబ్బరి గుజ్జును కూడా తినేయండి. 


+ ఇలా క్రమం తప్పకుండా కొంత కాలం పాటు చేస్తే ఎసిడిటీని సమస్త ఇబ్బంది పెట్టడే. ఇది ఎసిడిటీ ని అమోఘంగా తగ్గించే నివారణ బెషధం. _ 

పాలతో ఎసిడిటీకి చికిత్స 

అప్పుడే పితికిన పాలను వేడి చేయకుందా వతి 6 గంటలకూ ఒక కవ్చ చొప్పున నిదకు ముందు కూడా చల్లని పాలను తాగాలి. దీంతో ఎసిడిటిని నమన్య 

మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 

. నివారణ '_అహారాన్ని తక్కువ మొత్తాల్లో తినాలి ; 

జీర్షకియకు సంబంధించి సమస్యలు చోటుచేనుకున్నవ్వుడు అవోరాన్ని 

_ తక్కువ మొత్తాల్లో, ఎక్కువసార్లు 

తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. అలాగే మసాలా, పులుపు, కొవ్వు ఇతర తీక్షణ పదార్థాలను మానేయాలి. 

ఆల్కహాల్‌ తీసుకునే అలవాటుంటే 

మానేయాలి : 

మద్యం వల్ల ఆమ్హాశయం గోడలు కల్లోలమవటమే కాకుండా అంతర్గత రక్తస్రావం అయ్యే (ప్రమాదం కూడా ఉంటుంది. కనుక మద్యపానం నుంచి దూరంగా ఉండాలి. 

SUPER FOODS FOR GOOD HEALTH

 
డిగలవాడే మనిషోయ్' అన్నాడో మహాకవి. మరి అలాంటి తిండి బలవర్ధకం కాకుండా వుంటే
మనిషి అనారోగ్యం పాలవుతాడు. నిత్యం మనదేశంలో పోషకాహారలేమితో అనేకమంది
ఉల్లాసంగా లేకపోవటం మనం చూస్తూనే వున్నాం. ఐతే ఉన్న వాటిల్లోనే మన ఆదాయ పరిమితికి
లోబడే మనకు అందుబాటులో ఎన్నో సూపర్ ఫుడ్స్ ఉన్నాయి మన కళ్ళముందే,
వాటి సంగతులు తెలుసుకుంటేనే ఆశ్చర్యపోతాము. అలాంటి ఆహారపదార్థాలలో కేటగిరీలు
బోల్డన్ని వుంటాయి. వాటిలో కొన్ని సూపర్ ఫుడ్స్ జాబితాలోకి వస్తాయి. అవి యాంటీ ఆక్సిడెంట్స్ కు ఈ
అత్యవసర పోషకాలకు అద్భుతమైన ఆధారం. అటువంటి కొన్ని ఆహారపదార్థాలు.

..
నిమ్మ : చాలామంది అను
కున్నట్లు నిమ్మ, నిమ్మజాతి
పండ్లు ఎసిడిక్ కాదు. నిజానికి
ఇవి శరీరంలో ఎసిడిటీని,
బ్లోటింగ్ ను తగ్గిస్తాయి. తాజా
నిమ్మపండు రసంతో ప్రతి
రోజూ ఉదయాన్నే ఆహారాన్ని ప్రారంభిస్తే చాలా ప్రయో
జనాలు దక్కుతాయి. శరీరంలోని విషతుల్యాలి -
తొలగించి, అంతర్గత ఎసిడిటీని తగ్గిస్తాయి.
విటమిన్ సి కి నిమ్మ అద్భుత ఆధారం.
ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు శిరోజాలు, ఎము
కలు,
జాయింట్స్, పళ్ళకు అవసరం.
నిమ్మరసానికి ఆస్టియో ఆర్థరైటిస్, డయాబెటిస్టు
రాకుండా అడ్డుకోవడమే కాకుండా లివర్ ఫంక్షన్ సక్ర
మంగా సాగేందుకు సహకరిస్తుంది.
అరటిపండ్లు : సగటు
మానవుడి ఆహారంగా పేరొం
దింది. ఆరోగ్యానికి అవసరం
మయిన ప్రతి పోషకం ఇంచు
మించు అరటిపండులో లభి
స్తుంది. పొటాషియంకు మంచి
ఆధారం. రక్తపోటును తగ్గించడంలో ఇది సహకరి
స్తుంది. స్టోక్స్ అవకాశాలను తగ్గిస్తుంది.
కండరాల కాంట్రాక్షన్ సామర్థ్యాన్ని, రిలాక్సేషన్ను
మెరుగుపరుస్తుంది. పొటాషియం ఎముకపుష్టిని కూడా
మెరుగుపరుస్తుంది. అరటి పండ్లు ఏకాగ్రతను మెరుగు
పరుస్తాయి. తక్షణ శక్తిని ఇవ్వడంలో వాటికవే సాటి.
విటమిన్ 'బి' ఎక్కువగా వుండి ఎనర్జీ మెటాబాలిజమ్,
ప్రోటీన్ ఉపయోగం, జీర్ణక్రియకు సహకరిస్తుంది.
బ్లోటింగ్, నీరుపట్టడంలాంటి ఋతుసంబంధిత
సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం
చికిత్సకు బాగా ఉపయోగపడుతుంది..
పిస్తాపప్పులు
నట్స్ గా పేరొందిన పిస్తా
పప్పులు మిగతా నట్స్
పోల్చితే అత్యంత తక్కువ
క్యాలరీలు కలిగివుంటాయి.
ఒక్క పిస్తాపప్పులో కేవలం
మూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి,
బరువు, క్యాలరీల భయం ఏమాత్రం లేకుండా నిర
అభ్యంతరంగా 30 పప్పులు ఒకేసారి తినేయవచ్చు.
కాపర్, ఫాస్పరస్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీ
కి షియం, విటమిన్ బి6 వంటి పోషకాలు కూడా అధికంగా
లభిస్తాయి. మెదడు పనితీరుకు అవసరమయ్యే ఆరోగ్య
వంతమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఆరోగ్య
వంతమైన దోన్లో లభిస్తాయి.
పిస్తాపప్పుల్లో పీచు బాగా వుంటుంది. భోజనం
నడుమ వీటినితింటే బరువు తగ్గాలనుకునే వారికి ఫలి
తం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వుం
టాయి. క్యాన్సర్, గుండె జబ్బులకి దారితీసే ప్రీ-ర్యాడి
కల్ హానినుంచి కాపాడడంలో సహకరిస్తాయి.

అల్లం: ఏరకమైన గొంతు
నొప్పికయినా ఉత్తమ చికిత్స
కొద్దిగా అల్లం చప్పరించడం.
ఇలా చేయడంవలన తల
నొప్పులు లేదా వికారం కూడా
తగ్గుతాయి. శ్వాసవ్యవస్థలో
ఆ పేరుకున్న కఫాన్ని అల్లం తొలగించడంవల్లే ఇటువంటి
కలుగుతుంది. అల్లం శరీరాన్ని ప్రభావితం
ఇన్ ఫ్లమేషన్లను కూడా తగ్గిస్తుంది.
వెల్లుల్లి, వెల్లుల్లిలో సల్ఫర్
ఉంటుంది. చల్లని వాతావర
ణంలో ఇది శరీరానికి చాలా
అవసరం. వెల్లుల్లిలో యాంటీ
ఇన్ఫ్లమేటరీ గుణాలు వుం
టాయి. యాంటీ బ్యాక్టీరియల్,
యాంటీ వైరల్ లక్షణాలు కూడా వుంటాయి. శీతాకాలా
నికి వెల్లుల్లి వాడకం చాలా నుంచిది.
ప్రూన్స్: మలబద్దకం నివా
రించడంలో ప్రూన్స్ బాగా పని
చేస్తాయి. దీన్లో పీచుపదార్థం
ఎక్కువగా ఉండడమే
దుకు కారణం. సహజ స్టూల్
సాప్టైనర్ గా వుండే సార్బిటాల్
అనే పీచుపదార్థం వీటిలో ఉంటుంది.
రోజుకు కొద్దిగా ప్రూన్స్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పరి
శుభ్రంగా వుంటుంది. రక్తపోటు, రక్తహీనతల్ని అరికట్ట
కడంలో సహకరించే పొటాషియం, ఐరన్ కూడా వీటిలో
- ఎక్కువగా ఉంటాయి. ప్రూన్స్ వార్ధక్య ప్రక్రియను50
నెమ్మదింపజేయడంలోనూ సహకరిస్తాయి. రక్తసర
ఫరాను మెరుగుపరుస్తాయి.
సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
శక్తిని ఇనుమడింపజేయగలవు. గొంతులో మంటను
తగ్గిస్తాయి. క్యాన్సర్ నివారిణిగా పేర్కొనవచ్చు.
రక్తంలో కొలెస్ట్రాల్ ఆక్సిడేషనన్ను అరికట్టడంలో
సాయపడతాయి. దీనివల్ల ఆర్టరీల్లో పాచి పేరుకోకుండా

రక్షించుకోవచ్చు. వీటిలో క్యాలరీలు బాగా తక్కువగా
ఉంటాయి. ఒక్కో ప్రూలో 20 క్యాలరీలు లభిస్తాయి.
కాబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా తింటూ ఆరోగ్యాన్ని పరి
రక్షించుకోవచ్చు లేదా స్వీట్ ట్రీట్ ఇచ్చుకోవచ్చు.
నెయ్యి: శతాబ్దాలుగా భారం
తీయ వంటకాల్లో వాడే నెయ్యిని
సంప్రదాయమైన భారతీయ
మందుగా పేర్కొంటారు.
నెయ్యిలో నయంచేయగల

బహుళ గుణాలున్నాయి. కొద్ది
మోతాదులో తీసుకున్నా శరీరానికి, మనస్సుకు అత్య
ధిక ప్రయోజనాలనిస్తుంది. ఇది శాచ్యురేటెడ్ ఫ్యాట్
అయినప్పటికీ సులువుగా జీర్ణం అవుతుంది.

మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి

అవసరమైన ఆమ్లాల విడుదల కోసం ఉదరాన్ని ఉద్దీపం
చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా వుంటాయి.

కాబట్టి ఆహారం నుంచి వివిధ పోషకాల్ని గ్రహించడానికి
నెయ్యి
సాయపడుతుంది.
ముఖ్యంగా ఎ, డి, ఇ, కె విటమిన్లు గ్రహించడానికి

ఉపకరిస్తుంది. అల్సర్లు, మలబద్దకం, కంటి సంబంధిత
సమస్యల పరిష్కారం కోసం వాడుతున్నారు.
చర్మాన్ని మృదువుగా, కోమలంగా వుంచడంలో
సహకరిస్తుంది. బ్లిస్టర్లు, కాలినగాయాలపై రాస్తే ఉపశ
మనం ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ కాబట్టి క్యాన్స
ర్లను అరికట్టడంలో, రోగనిరోధకవ్యవస్థను బలోపేతం
చేయడంలో ఉపయోగపడుతుందని గుర్తించారు.
పూర్తిస్థాయి ధాన్యాలు:
పూర్తిస్థాయి ధాన్యాలతో
తయారయ్యే పదార్థాలు శక్తికి,
పీచుకు మంచి ఆధారం.
.
తెల్లని మైదా, తెల్లని బియ్యం
వంటి రిఫైన్డ్ ధాన్యాలకంటే
పూర్తిస్థాయి ధాన్యాల్లో పీచుపదార్థం, పోషకాలు ఎక్కు
వగా లభిస్తాయి. రిఫైన్డ్ గ్రెన్స్ ' పొట్టు, జెర్మ్
పూర్తిగా తొలగిస్తారు. కాబట్టి వీటిలో పీచు, హోల్ గ్రెయి
ని' మాదిరి పోషకాలు ఉండవు.
కొన్నిసార్లు రిఫైన్డ్ ధాన్యాల్లో 'బి' విటమిన్లు, ఐరన్
వంటి ప్రాసెసింగ్ తర్వాత తిరిగి కలుపుతుంటారు.
లో అయితే పీచును భర్తీచేయడం కుదరదు.
లో హోల్వేట్ బ్రెడ్ వంటి హోల్ గ్రెయిన్ ఆహారపదా
రాలను మొక్కల నుంచి పూర్తిగింజలతో పొట్టు, జెర్మ్
ఎండో స్పెర్మతో సహా వాడి తయారుచేస్తారు.
దీనివల్ల అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సి
వెంట్స్,ఆరోగ్యవంతమయిన ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్,
రుచు లభిస్తాయి.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...