26, ఫిబ్రవరి 2014, బుధవారం

SOUP / CHARU / RASAM - HEALTH BENEFITS




'సూప్ ప్లీజ్...' అని అడగగానే ఇప్పటికీ చాలామంది
అయిష్టంగానే మొహం పెడుతుంటారు.
గంజిలా ఉంటుందనీ రుచిగా ఉండదనీ రకరకాల
కారణాలు చెబుతుంటారు.
కానీ ఆరోగ్య స్పృహ
ఉన్నవాళ్లూ బరువు తగ్గాలనుకునేవాళ్లూ మాత్రం రోజూ
దీన్ని తాగుతున్నారు. 'సూప్ కి చాలా సీనుంది....
' అన్న
పోషకాహార నిపుణుల సలహానే ఇందుకు కారణం.

ఆధునిక జీవనశైలి పుణ్యమా
అని... పిల్లల నుంచి పెద్దల
వరకూ ఆహారాన్ని కొలుచుకుని
తినాల్సిన పరిస్థితి. ఇష్టమైనవన్నీ
తినేస్తే అంతే వేగంగా భారీ
కాయాన్ని అనారోగ్యాన్ని వెనకేసు
కోవాలి. అందుకే సలాడ్ల
రూపంలో పచ్చికూరగాయల్ని
తీసుకోవడం అయిష్టంగానైనా
అలవాటు చేసుకుంటున్నాం.
ఎంత ఆరోగ్యం కోసమైనా
ఎప్పుడూ వాటినే తినలేం కదా.
అది చలికాలం... సలాడు
బదులు సూప్ బౌల్ను ఆశ్రయి
స్తున్నాం. చల్లని వాతావరణంలో
వేడి సూప్ మెల్లగా గొంతు దిగు
తుంటే వెచ్చగానూ ఉంటుంది,
సలాడ కన్నా రుచిగానూ
ఉంటుంది. పోషకాలు ఎక్కువ,
క్యాలరీలు తక్కువ ఉండే ఆరోగ్య
కరమైన ఆహారమే సూప్.
రకరకాలు
సూప్ అనగానే టొమాటో,
కార్న్, మిక్స్డ్ వెజిటబుల్, చికెన్,
మటన్ సూప్లు మాత్రమే గుర్తు
కొస్తాయి. కానీ ఏ ఆహారాన్న
యినా సూప్ రూపంలో తీసుకో
వచ్చు. నిజానికి బియ్యం లేదా
నూకల్ని జావలా కాచినది లేదా
అన్నం వార్చినదీ మన దగ్గరా
ఒకప్పుడు బాగానే తాగేవారు.
దీన్నే మనం గంజి అంటే, పశ్చిమ
దేశాల్లో సూప్ అని పిలుస్తున్నారు.
ఏ పదార్థాన్నయినా అందులో
ఉండే పోషకాలన్నీ ఆ నీళ్లలోకి
వచ్చేలా మరిగించి లేదా
ఉడికించి ద్రవరూపంలో తీసు
కుంటే అదే సూప్. కాబట్టి మన
గంజి కూడా ఒక రకం సూపే
క్రీ.పూ. 20 వేల సంవత్సరాల
నుంచీ సూప్ తాగడం వాడుకలో
ఉంది. అప్పట్లో దీన్ని కుండల్లోనే
కాచేవారు. సంప్రదాయ పద్ధతిలో
చేసే కూరగాయల సూప్లో
చిక్కదనం కోసం కొద్దిపాళ్లలో
పిండిపదార్థాలనూ కలుపుతుంటారు.
మరింత చిక్కదనం కోసం వెన్న,
మీగడ, ఉడికించిన బీన్స్న కూడా
కలుపుతున్నారిప్పుడు. కేనింగ్
ప్రకియ కనుగొన్న తరవాత
కండెnsed' సూప్స్ తయారీ
మొదలైంది. వీటిని నేరుగా వేడి
చేసుకుని తాగేయవచ్చు. ఎండబెట్టి
పొడిచేసిన ఇన్ స్టెంట్ సూప్స్
కూడా వచ్చాయి. వీటికయితే
నీళ్లు జోడించి మరిగించాలి.
ఈ రెండు రకాల్లో కూడా కూర
గాయల ముక్కల్లాంటివి జోడించి
కావలసిన రుచుల్లో తాగొచ్చు.
ఎందుకు తాగాలి?
భోజనానికి ముందు తక్కువ
క్యాలరీలు ఉండే సూపన్ను తీసుకో
వడంవల్ల కనీసం 20 శాతం
తక్కువ తింటాం. అదేసమ
యంలో కూరగాయలన్నీ కలిపిన
సూప్ ని తీసుకోవడంవల్ల
నీళ్లలోనే కరిగే బి, సి, కె...
వంటి విటమిన్లు, ఖనిజాలు
శరీరానికి నేరుగా అందుతాయి.
ముఖ్యంగా ఉల్లి, సెలెరీ, లీక్...
వంటి సూట్లలో పొటాషియం
ఎక్కువగా ఉంటుంది. ఇది
శరీరంలోని అధిక సోడియంని
తొలగించేందుకు సాయపడు-
తుంది. కాబట్టి రోజూ రాత్రి
భోజనాన్ని తగ్గించి బదులుగా
కూరగాయల సూప్ తీసుకోవడం
వల్ల క్రమపద్ధతిలో బరువు
తగ్గుతారు. ఇంకా వెంటనే
బరువు తగ్గాలనుకునేవాళ్లు
రెండుపూటలా భోజనం మానేసి
వారం రోజులపాటు సూప్
తాగడంవల్ల ఆరోగ్యంమీద
ఎలాంటి దుష్పరిణామాలు
ఉండవన్నది నిపుణుల సలహా,
అయితే ఇన్ స్టెంట్ సూఫీ వల్ల
పెద్దగా ఫలితం ఉండదు.
వీటిల్లో ప్రొటీన్లు తక్కువ, పిండి
పదార్థాలు ఎక్కువ. సోడియం
శాతమూ ఎక్కువే. తాజాగా
చేసుకున్నదే మంచిదన్నది పోషక
నిపుణుల ఉవాచ.
మరో విషయాన్ని దృష్టిలో
పెట్టుకోవాలి. రైస్, నూడుల్స్,
బీన్స్, పాస్టా లాంటి ఆహారాన్ని
సూప్ రూపంలో ఆగ్నేయాసియా
దేశాల్లో ఎక్కువగా తీసుకుంటుం
టారు. బరువు తగ్గేందుకు వీటిని
ఆశ్రయిస్తే పెద్దగా ఫలితం
ఉండదు. అక్కడ వీటిని వాళ్లు
భోజనానికి బదులుగా తాగుతూ
తింటుంటారు. పండ్లని కూడా
గోరువెచ్చని సూప్ రూపంలో
తీసుకుంటుంటారు. సో....
ఏ సూప్ తాగాలన్నది మీ
బరువును బట్టి మీరే నిర్ణయించు
కోండి. అలాగని సూప్ ఏదో
ఊబకాయులకి మాత్రమే అను
కునేరు... ఆరోగ్యంగా సన్నగా
ఉన్నవాళ్లు కూడా నిస్సందేహంగా
అన్నిరకాల సూట్లనూ తీసుకోవచ్చు..
జీర్ణశక్తిని పెంచే వేడి వేడి సూప్
అందరికీ ఆరోగ్యకరమే!
*

మిసా సూపర్! సూప్ లోకెల్లా గొప్పది ఏది? అనగానే అంతా చెప్పే పేరు ఒక్కటే... అదే
'మిసా సూప్", అటు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇటు వృద్ధాప్యాన్ని హరించే
ఈ సూపు చైనా, జపాన్లలో శతాబ్దాల ముందునుంచీ తాగుతున్నారు.
ఇందులో ఉన్న పోషకాలనూ వయసు మీద పడనీయని లక్షణాలనూ
గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీన్ని చప్పరిస్తున్నారు. కొజి అనే ఈస్ట్
సాయంతో ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు పులియబెట్టిన
సోయాబీన్ల ముద్దతో మిసా సూపిని తయారు చేస్తారు. ఇందులో బియ్యం, ముడిబి
య్యం, బార్లీ లేదా గోధుములు కలుపుతుంటారు. దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. దాంతో రోగనిరో
ధక శక్తి పెరిగి రొమ్ము, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్లను నివారిస్తుందనీ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందనీ పరిశోధనలు
చెబుతున్నాయి. ఇందులో 22, బి2, 2 కె విటమిన్యూ కోలిన్, లినోలిక్ ఆమ్లాలూ: పీచూ, ప్రొటీన్లూ
పుష్కలంగా ఉంటాయి. లినోలిక్ ఆమ్లం చర్మ సౌందర్యాన్ని రక్షిస్తుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు
ఈ సూపను రోజూ ఓ కప్పు తీసుకోవడంవల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ శాతం తగ్గదు. జపనీయుల దీర్ఘాయు
సతీ వాళ్లకి క్యాన్సర్లు రాకపోవడానికి ఒక కారణం దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడమే.


టొమేటో, కీరా సూప్
కావాల్సిన పదార్థాలు : ఒక పెద్ద టొమేటో, ఒక క్యారెట్, 300 గ్రాములు కీరా,
ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టీ స్పూన్ వెన్న, అరలీటరు నీరు, తులసి ఆకులు,
తగినంత ఉప్పు, మిరియాలపొడి.
తయారుచేసే పద్ధతి : ఉల్లిపాయలు తరిగి, ప్యాచ్లో వెన్న వేసి వేయించాలి.
క్యారెట్, కీరా, టిమేట్ ముక్కలు వేయాలి.
అరలీటరు నీరు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత
మిక్సర్ లో వేసి బ్లెండ్ చేయాలి. పడకట్టాలి. చిటికెడు ఉప్పు, మిరియాలపొడి,
అర టీస్పూన్ వెన్నకలిపి తిరిగి మరిగించి కొద్దిగా తులసి ఆకులు కలపాలి.
(సర్వ్ చేసేముందు కొన్ని కీరాముక్కలు తరిగి కలుపుకోవచ్చు.


కార్న్ సూప్
కావాల్సిన పదార్థాలు: ఒక స్వీట్‌కార్న్, ఒక బంగాళా దుంప, ఒక టీస్పూన్
| వెన్న, 50 ఎమ్.ఎల్.పాలు, మిరియాలపొడి, తగినంత ఉప్పు,
తయారు చేసే పద్ధతి: మొక్కజొన్న గింజలు ఒలుచుకోవాలి. బంగాళాదుంపలు
చెక్కు తీసి కట్చయాలి. అరలీటరు నీరు పోసి ఐదు లేదా ఏడు నిమిషాలు
మరగనివ్వాలి. చల్లారిన తర్వాత బ్లెండ్ చేయాలి.
వడకట్టి ఉప్పు, మిరియాల పొడి, వెన్నకలిపి మరిగించాలి. పాలుపోసి నిరంతరం
కలుపుతూ కొద్ది సేపుంచాలి. కొన్ని గింజలు వెన్నలో వేయించి కలపాలి.



వెజిటబుల్ సూప్
కావాల్సిన పదార్థాలు : రెండు టేబుల్‌స్పూన్లు పెసరపప్పు, ఒక క్యారెట్, ఒక
కట్ట పాలకూర, ఒక కప్పు క్యాబేజీ ముక్కలు.
మూడు టొమేటోలు, అరగ్లాసు పాలు, రెండు టేబుల్‌ స్పూన్లు నెయ్యి,
రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : కూరగాయ ముక్కలన్నింటినీ రెండు విజిల్స్ వచ్చేదాకా
కుక్కర్ లో ఉడికించాలి. చల్లారాక మెత్తగా బ్లెండ్ చేయాలి.
అందులో
అరగ్లాసు పాలు కలపాలి (దీనికి ప్రత్యామ్నాయంగా నీరుకూడా
వాడుకోవచ్చు). రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిలో ఉల్లిపాయ ముక్కలు వేసి
వేయించి సూప్లో కలిపి ఉప్పు వేసి మరిగించాలి.


క్యాలీఫ్లవర్, పొటాటో సూప్
కావాల్సిన పదార్థాలు : మూడు కప్పులు క్యాలీఫ్లవర్ ముక్కలు, ఒక కప్పు
బంగాళాదుంప ముక్కలు, అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్‌స్పూన్లు
నెయ్యి, ఒక గ్లాసు పాలు, మిరియాల పొడి, తగినంత ఉప్పు,
తయారుచేసే పద్ధతి : బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కట్‌చేసి నేతిలో వేయిం
చాలి. సన్నని సెగపై ఉంచి, అడుగు అంటుకునేంతవరకు వేయించాలి. క్యాలి
ఫ్లవర్ ముక్కలు కలపాలి. మరో ఐదారు నిమిషాలు వేయించాలి. పచ్చివాసన
పోవాలి. కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేదాకా కాని, లేదా నీరుపోసి మూత పెట్టి
కాని ఉడికించాలి. చల్లారాక అరగ్లాసుపాలు పోయాలి. ఉప్పు, మిరియాలపొడి
కలపాలి. ఇష్టపడేవారు పాలకూర కులు కూడా వేసుకోవచ్చు.



DR ONION - AYURVEDAM

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆ సంగతెలా ఉన్నా ఉల్లిపాయ లేకుండా వంటచే
వాళ్లు కొందరయితే, ఉల్లిపాయ కొరకందే ముద్ద దిగనివాళ్లు మరికొందరు. రుచికోసం అయి
ఆరోగ్యం కోసం అయితేనేం... ఉల్లిపాయ మోస్ట్ పవర్ ఫుల్.
కోసేవాళ్లనే కాదు, ప్రభుత్వాలని
నేతలనూ కన్నీళ్లు పెట్టించగల శక్తిమంతమైన కూరగాయ... ఉల్లిపాయ!

ఉలిఘాటు తగలని కూర కూరే కాదంటారు
భారతీయులు. ఎందుకంటే మసాలా పెట్టి
చేసే ఏ కూరకయినా ఉల్లిపాయలు తరగాల్సిందే.
దమ్ బిర్యానీ, ఆలూ సఖీ, గుత్తి వంకాయ, కోడిగుడ్లు
పులుసు... ఏదయినా సరే ఉల్లి ఉంటేనే అదుర్స్అ
పకోడీలూ చాట్లకయితే సరేసరి. ఉల్లిపాయ
లేని బేలూరీని చోట తూరానీ ఊహించగలమా.
చాలా రకాల వంటకాల్లో ఉల్లిపాయలు నేరుగా
కనిపించవు. తెరవెనక పాత్రధారుల్లా రుచి ద్వారా
తమ ఉనికిని చాటుతుంటాయి. అందుకే దాని
ధరల ఘాటు కళ్ల వెంట నీళ్లు పెట్టిస్తున్నా ఒక్క
ఉల్లిపాయ అయినా కూరలో వేయందే రుచించదు
మనవాళ్లకి ఏటా సుమారు 40 లక్షల టన్నుల
ఉల్లిపాయల్ని తినేస్తున్నాం. వీటిలో మూడువేల
టన్నుల్ని ఢిల్లీవాసులు ఒక్క రోజులోనే వాడేస్తున్నా
రట. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,
బీహార్‌లో ఉల్లి ఎక్కువగా పండిస్తున్నప్పటికీ
ఉల్లి మార్కెట్లన్నింటినీ శాసించేది నాసిక్,
దేశంలోకెల్లా అతి పెద్ద ఉల్లిమార్కెట్ అదే.

రంగురంగులు

ఉల్లిపాయరంగు అంటూ మనం వంకాyaరంగుతో కలిసినట్లున్న గులాబీరంగుని చెబుతాల
గానీ తెలుపు, పసుపు, ఎరుపు, పాట్నా రెడ్,
నాసిక్ రెడ్, బళ్లారి రెడ్, అంటూ మనదేశంలోనే
భిన్నరంగుల్లో వీటిని పండిస్తున్నారు. వైట్య
పోర్చుగల్, సిల్వర్ స్కిన్, ఆస్ట్రేలియన్ బ్రౌన్, స్వీట్మ్ము
స్పానిష్, రెడ్ ఇటాలియన్, కాలిఫోర్నియా రెడ్,
ఎల్లో బెర్ముడా... ఇలా విదేశీ రకాలూ మన
మార్కెట్ కి తరలి వస్తున్నాయి. ఎరుపు ఉల్లి
పాయకన్నా తెలుపురంగులో ఉండేవి కాస్త మాటు
తక్కువగా మంచి వాసనతో ఉంటాయి. ఎర్ర
ఉల్లిపాయల తొక్కలో కెటెచోల్, ప్రొటోకెటెచిక్తు
ఆమాలు ఉండటంతో అవి మరింత ఘాటుగా
ఉంటాయి. అలాగే తీపి ఉల్లిపాయలూ ఉన్నాయి.
వీటిలో నీరూ కార్బొహైడ్రేట్లు ఎక్కువ
ఉంటాయి. ఇవి ఎక్కువకాలం నిల్వ ఉండవు.

ఎవరెక్కువ?

ఉల్లిపాయ వాడకంలో రారాజులం మనమే
అనుకుంటాం. కానీ వీటిని ఎక్కువగా వాడేది
లిబియాలోనట. అక్కడ తలకి ఏటా సుమారు
32 కిలోల ఉల్లిపాయలు తినేస్తున్నారట. తరవాత
స్థానం మనదే. అయితే మనదేశంలో ఉల్లి
పాయల్ని కొందరు దూరంగా పెట్టేస్తారు. ఉల్లి
పాయలో తామస, రజో గుణాలను పెంచే
లక్షణాలున్నాయని ఆయుర్వేదం పేర్కొనడమే
ఇందుకు కారణం. వీటిలో శృంగార ప్రేరిత
గుణమూ ఎక్కువేనట. అందుకే సన్యసించిన
వాకు ఉల్లివాసనని దరిదాపుల్లోకి కూడా
రానీయరు. ప్రస్తుతం ఉల్లిపాయలు
తాజాగానే కాదు. ఎండబెట్టిన పొడి, పచ్చడి రూపంలోనూ
వీటి వాడకం ఎక్కువే. వాసనకోసం ఉల్లికాడల్ని
సూళ్లు సలాడ్లో వాడటం తెలిసిందే. పొడిని
మసాలా మాదిరిగా అనేక వంటకాల్లో చల్లుతారు.

ఉల్లిపూజ

ఉల్లిపాయల్ని ప్రాచీనకాలం నుంచీ వాడుతు
న్నారు. ఈజిప్షియన్లయితే ఉల్లిపాయల్ని పూజించే
వారట. ఇది రక్తాన్ని పలుచబారేలా చేస్తుందన్న
కారణంతో ఒకప్పుడు గ్రీకు అథ్లెట్లు వీటిని చాలా
ఎక్కువగా తినేవారు. అలాగే రోమన్లు వీటిని
కండరాలకు రుద్దుకునే వారట. మధ్యయుగంలో
ఉల్లిపాయల్ని కానుకలుగా ఇచ్చిపుచ్చుకునేవారు.
తలనొప్పి, దగ్గు, పాముకాటు, జుట్టు ఊడి
పోవడం, సంతానలేమి... వంటి సమస్యలకు
వైద్యులు ప్రిస్క్రిప్షన్ లో ఉల్లిపాయను రాసేవారు.

ఉల్లి తోడుంటే..

జీర్ణక్రియకీ గుండెకీ కీళ్లకీ కళ్లకీ కూడా
ఉల్లిపాయలు ఎంతో మంచివి. వీటిల్లోని సల్ఫర్,
క్రోమియం, విటమిన్-సిలు అనేక రోగాల్ని
తగ్గిస్తాయి. జలుబు, షుగర్, హృద్రోగాలు,
ఆస్టియోపొరోసిన్లు తగ్గుతాయి.
ఉల్లిపాయల్లోని డై సలైట్లు, ట్రైసల్సైలు,
సెపానె, వినైల్ డైథీన్లు యాంటీ కొలెస్ట్రాల్,
యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల్ని
కలిగి ఉంటాయి. హృద్రోగాల్ని తగ్గించడంలో
ఉల్లిదే పైచేయి. వీటిల్లో పుష్కలంగా ఉండే
క్యుయర్ సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్
కణజాలాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
విటమిన్-ఇ పునరుత్పత్తికి తోడ్పడుతుంది. నేత్ర,హృదయ, రొమ్ము, ఊపిరితిత్తుల వ్యాధుల మీద
పోరాడుతుంది.
• ఎండిన ఉల్లిపాయను రోజూ గ్రాము
చొప్పున నాలుగు వారాలపాటు తీసుకోవడం వల్ల
ఎముకల్లో ఖనిజాల సాంద్రత పెరుగుతుంది.
ఉల్లిపాయలు జ్ఞాపకశక్తిని పెంచి జలుబుని
తగ్గిస్తాయనీ కఫాన్ని నివారిస్తాయనీ వీటిని
తిన్నా రసం తాగినా చివరకు మెడలో
వేసుకున్నా కూడా పులిపిర్లూ, కండరాల
నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం
చెబుతోంది..
చిన్నపిల్లలకు బాగా జలుబు
చేస్తే ఉల్లి ముక్కలను పలుచని ఉల్లి
బట్టలో చుట్టిగానీ ప్లేటులో పెట్టిగానీ మధ్య-
తలగడ పక్కనే రాత్రంతా ఉంచితే
మంచి ఫలితం ఉంటుందట.
ఇప్పు
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉల్లి
ముద్దను ఉడికించి బట్టలో కట్టి
గాయాలమీద పెడుతుంటారు. తేనె
టీగలు కుట్టినచోట పచ్చి ఉల్లిపాయ
ముక్కను పెడితే వాపు తగ్గుతుందట.
గొంతు మంటగా ఉన్నప్పుడు
ఉల్లిపాయలో బెల్లం కలిపి తింటే
తగ్గుతుందట. చూశారుగా... వాసన
అని కొందరూ ఘాటు అని కొందరూ
ఉల్లిపాయను పక్కన పెట్టేస్తుంటారుగానీ
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని
ఆందుకే అంటారు. సో.. ఉల్లి తోడుంటే
అనారోగ్యం దూరమన్నట్లేగా!


ఉల్లికన్నీళ్లు!

ఉల్లిపాయల్ని కోసినా
కొరికినా కన్నీరుమున్నీరవు
తుంటారు. ఎందుకంటే ఉల్లిపాయల్ని
కోసినప్పుడు వాటి నుంచి ఘాటైన ఒక
వాయువు వెలువడుతుంది. దీన్నే లాక్రిమేటరీ
ఫ్యాక్టర్ అంటారు. ఇది గాల్లో కలిసి చాలా త్వరగా కళ్లకు చేరి సున్నితమైన మార్యాన్లను
ప్రేరేపించి గుచ్చినట్లుగా చేస్తుంది. దాంతో కళ్లు ఒకలాంటి మంటకి గురవుతాయి.
అందుకే ఆ మంటని నొప్పిని తగ్గించడంతో
పాటు వాటిని కోస్తుంటే వెలువడే వాయువు
కంటిని చేరకుండా ఉండేందుకే వెంటనే కన్నీటి గ్రంథులు స్పందించి నీటిని స్రవిస్తాయి. అయితే
ఈ బాధంతా లేకుండా ఉండాలంటే ముందుగా ఉల్లిపాయల్ని నీళ్లలో నానబెట్టడం,
కోసేముందు
కాసేపు ఫ్రిజ్ లో పెట్టడం, వేరుదగ్గర ముందే కోయకుండా ఉండటం చేయాలి. ఎందుకంటే
వేరుదగ్గరే ఘాటైన ఎంజైములు ఎక్కువగా ఉంటాయి. లేదంటే గాగుల్స్ ధరించినా మంచిదే.
ఇటీవల వీటికోసం ప్రత్యేక గాగుల్స్ కూడా రూపొందించారు మరి,

ఉlliరింగులు

ఆలూ చిps lagaనే ఆనియన్ లింగ్ కూడా విదేశీ మార్కెట్లో బాగా పాపులర్
వీటిని ఎలా చేస్తారంటే... నాలుగు ఉల్లిపాయలు, 2 కప్పులు మైదా, ఆ ru టేబుల్
స్పూన్ల కార్న్ ఫ్లోర్, అరటీస్పూను మిరియాల పొడి, అరటీస్పూను బేకింగ్ పౌడర్.
వేయించడానికి కలపడానికి సరిపడా నూనె, తగినంత ఉప్పు తీసుకోవాలి.
ఉల్లిపాయల్ని కాస్త మందపాటి చక్రాల్లా తరగాలి. పై చక్రాన్ని మాత్రం ఉంచి
మధ్యలో ఉండేవాటిని తీసేయాలి. మైదాపిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి వేసి కలపాలి.
తరవాత అరకప్పు నూనె, తగినన్ని నీరు పోసి ఐజీలపిండిలా కలుపుకోవాలి. పిండిని చేత్తోనే బాగా గిలకొట్టాలి.
ఇప్పుడు రంగుల్ని పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి తీసి, బిష్యూ పేపర్ తో అదేస్తే సరి. కావాలంటే
పిండిలో ముంచాక ఒడిపొడిలో కూడా దొర్లించి వేయిస్తే కరకరలాడుతూ బాగుంటాయి.

నడిచే ఉల్లిపాయలు

సాధారణంగా ఉల్లిపాయలన్నీ వేరుభాగాలేనని తెలిసిందే. అయితే మొక్కల
కాండాల చివర బల్బుల్లా వచ్చేవి ఉన్నాయి. వీటినే ఈజిప్షియన్ వాకింగ్ ఆనియన్స్
అనీ ట్రీ ఆనియన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ చెట్లు బాగా పెరిగిన తరవాత
కొమ్మలు ముందుకి వంగుతాయి... వాటి చివరనున్న పాయలు భూమిలోకి
పాతుకుని అక్కడ మళ్లీ కొత్త మొక్కలు వస్తాయి. వీటిని వదిలేస్తే ఇలా తోట మొత్తం
అల్లుకుపోతాయి. అందుకే ఈ చెట్టుల్లిని వాకింగ్ ఆనియన్స్ అని పిలుస్తారు.

ఉల్లిముత్యాలు

పెరల్ ఆనియన్ అంటూ మరో రకం ఉంది. దీన్నే కాక్
టెయిల్ ఉల్లి అని కూడా అంటారు. ఇవి కూడా మొక్కలకు
పైభాగంలోనే కాస్తాయి. మాటు తక్కువగా ఉండి
తియ్యగా ఉండే వీటిని నేరుగానే తినేయవచ్చు.

ఉల్లికాడలు

...వీటినే స్ప్రింగ్, గ్రీన్, వెల్త్ ఆనియన్స్
అంటారు. అయితే పాయలుగా మారని
దశలో లేతగా ఉన్నవన్నీ ఉల్లికాడలే
అనుకుంటారు. కానీ నిజానికి గ్రీన్
ఆనియన్స్న మాత్రమే ఉల్లికాడలు అనాలి.
ఎందుకంటే వీటికి పాయలు ఊదవు. పైగా ఆకుల
మధ్యలో ఖాళీ ఉంటుంది. వీటిని అలంకారం
కోసం కూడా పెంచుతుంటారు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...