23, మార్చి 2013, శనివారం

FACE - MOISTURISERS / ఫేస్ మాయిశ్చరైజర్లు

ముఖచర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్లు.


ఎక్కువ శక్తి కలిగిన పదార్థాలతో ముఖాన్ని రుద్దుకోవడం, శుభ్రపరచుకోవడం, మృతకణాలు రాలిపోయేలాగా వెలుపలి పొరలను ఎక్స్ ఫోలియేట్ చేయటం ఇలాంటి ప్రక్రియల తర్వాత చర్మన్ కొద్దిగా బలహీనపడుతుంది. పోషకతత్వాల అవసరం పెరుగుతుంది. నీరు లేని పైరు ఎలా వాడిపోతుందో , వడలిపోతుందో , అలా తేమ తగ్గిన చర్మం వడలిపోతుంది. ఈ లోటును భర్తీ చేయడానికి కొల్పోయిన స్నిగ్ధత్వం, తేమ వంటి వాటిని తిరిగి పొందడానికి మాయిశ్చరైజర్ లు లేదా ఫచెస్ ప్యాక్ వంటివి అవసరమౌతాయి. ఇవి మీ ముఖచర్మాన్ని తాజాగా ఉంచడంతోపాటు , చర్మానికి వెలుపలనుంచి పోషకతత్వాలను అందిస్తాయి. వీటిని మీరు కనీసం రోజుకి రెండుసార్లు ప్రయోగించాల్సి ఉంటుంది. 

1.)   పొడి ముఖచర్మానికి మాయిశ్చరైజర్ --- 

ముఖచర్మం ప్రొటీన్ లతో నిర్మితమౌతుంది.దీనికి పోషకతత్వాలను అందించాలంటే ప్రొటీన్ సంబంధ పదార్థాలు ప్రయోగించాల్సి ఉంటుంది. అలాగే ముఖచర్మాన్ని తేమగా ఉంచటం కోసం చర్మం విడుదల చేసే సహజ రైలం తో సమాన గుణధర్మాలున్న తైలాలను వాడవలసి ఉంటుంది. 

ఇలాంటి ఒక తైలం తయారీ, వడాల్సిన పద్ధతి - 

ఒక బౌల్ లో కోడిగుడ్డు పచ్చసొనని తీసుకుని దీనిలో ఒక పెద్ద చెంచాడు బాదం నూనెను , 5 బాదం గింజలను మెత్తగా పొడి చేసి కలపండి. చివరగా ఒక పెద్ద చెంచాడు తేనె కలిపి అన్నిటిని గిలక్కొట్టి ఒక చిక్కని పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద , మెడ మీద పూసుకుని , కళ్ల మీద మాత్రం వదిలేయండి. పావు గంట పాటు ఉంచితే చర్మం దీనిని విలీనం చేసుకుంటుంది. తర్వాత వేడి నీళ్లతో కడిగేసుకుని వెంటనే చన్నీళ్లతో చిలకరించుకోండి. వేడి నీళ్లవల్ల జిడ్డు వదిలిపోతుంది. చన్నీళ్ల వల్ల ముఖం మీద తేమ పరచుకొని ఒక రక్షక కవచంలాగా పనిచేస్తుంది. 

2.)    ముఖంలో కాంతిని కలిగించే ఫేస్ ప్యాక్...

ముఖచర్మం మీద స్వేద రంధ్రాలు పెద్దగా తయారైనపుదు ముఖంలో తాజాదనం కనిపించదు. అలాగే పోషక పదార్థాల కోపం వంటి కారణాల వల్ల పోషకతత్వాలు నిలిచిపోతాయి. దీనిలో ముఖచర్మం కాంతివిహీనంగా, నిస్తేజంగా , జీవరహితంగా కనిపిస్తుంది. ఈ సమస్యలను ఏకకాలం లో తగ్గించగలిగే ఒక శక్తివంతమైన ఔషధాన్ని గురించి తెలుసుకుందాం. 

తయారీ పద్ధతి , వాడాల్సిన విధానం... 

రెండు పెద్ద చెంచాల ముల్తాని మట్టిలో ఒక పెద్ద చెంచాడు తేనె,ఒక పెద్ద చెంచాడు పాలను కలిపి గిలక్కొట్టి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. దీనిని ముఖం మీద, మెడ మీద పూసుకుని , పావు గంట పాటు వదిలేసి, చన్నీళ్లతో కడిగేసుకోండి. ముల్తాని మట్టిలోని ఖనిజ సంబంధ పదార్థాలు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే దీనిలోని ప్రత్యేకతత్వాలు ముఖచర్మం మీద ఉండే పెద్దవిగా కనిపించే రంధ్రాలను మూసివేస్తాయి. 
ఇక తేనె ,పాలు చర్మానికి వెలుపలనుంచి పోషణనిస్తాయి. దీనిలో చర్మం , అందంగా , సజీవంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

3.)    ముఖంలో ముడతల్ని,ముసలితనాన్ని తగ్గించే ఫేస్ ప్యాక్...

చర్మం సాగిపోయి చిన్నతనంలోనే ముసలితనపు లక్షణాలు కనిపిస్తున్నపుడు చర్మాన్ని తిరిగి బిగుతుగా నునుపుగా , తేమగా మార్చే ఔషధం ఇది.

తయారీ పద్ధతి, వాడాల్సిన విధానం...

తాజా బంతిపువ్వుల రేకలను విడదీసి 2 కప్పులు ఒక బౌల్ నీళ్లలో వేసి రెండు, మూడు గంటల పాటు నాన పెట్టండి. తర్వాత వీటిని బాగా కలియతిప్పి , పిసికి పేస్ట్ లాగా తయారు చేసి , పెద్ద చెంచాడు గ్లిజరిన్ వేసి గిలక్కొట్టి కలపండి. తర్వాత దీనిని మీ ముఖం మీద, మెడ మీద పూసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోండి. చాలా మందికి బంతిపువ్వులను ఫేస్ ప్యాక్ కోసం వాడవచ్చు అని తెలియదు. కానీ దీని పనితీరు అమోఘం . ఈది ముఖ చర్మానికి పోషక తత్వాలను అందిస్తుంది. స్కిన్ టానిక్ లాగా పనిచేస్తుంది. 

4.)    ఎండలతో కమిలిన ముఖచర్మానికి ఫేస్ ప్యాక్...

ఎండకు గురైన చర్మానికి మంటగా అందిస్తుంది,మచ్చలు కూడా తయారౌతాయి.వీటిని సరైన సమయంలో తగ్గించుకోకపోతే ఇవి దీర్ఘ కాల సమస్యగా మారుతాయి. ఎండలు చర్మం మీద దాడి చేయకుండా రక్షించడంతోపాటు మంటను తగ్గించే తేలికైన, సమర్థవంతమైన ఔషధం ఇది.

తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...

తాజా పుచ్చకాయను స్లైసులుగా కోసి , ఎర్రటి గుజ్జు భాగం మీద నిమ్మ చెక్కను పిండి, దానిని నేరుగా ముఖం మీద ఒత్తిడి కలిగిస్తూ ప్రయోగించి , వలయాకారంగా రుద్దుకుంటూ ప్రయోగించుకోండి,మసాజ్ చేసుకోండి. దీనిని ప్రయోగించి అ తర్వాత, 20 నిమిషాలు ఆగి ముఖచర్మాన్ని చన్నీళ్లతో కడిగేసుకోండి. మీ ముఖం శుభ్రపడి, తాజాగా, కడిగిన ముత్యం లాగా , కొత్త కాంతితో మెరిసిపోతుంది. పుచ్చకాయ ఎండబేడిమినుంచి కాపాడటమే కాకుండా , చర్మానికి మెరుపును, తేమను, బిగువును , సౌకుమార్యాన్ని కలిగిస్తుంది. ఒక నిమ్మరసం సూర్య కిరణాలను అడ్డుకొని చర్మానికి రక్షణనిస్తుంది. 

5.)    ముఖం మీద జిడ్డును తగ్గించే ఫేస్ ప్యాక్...

ముఖచర్మం మీద జిడ్డు పేరుకుపోవడం వల్ల ఎంతబాగా కనిపించాలని ప్రయత్నించినా నిరాశే మిగులుగుతుంది. జిడ్డువల్ల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చర్మం కాంతివిహీనంగా కనిపిస్తుంది. మొటిమలకు ఆస్కారం ఏర్పడుతుంది. అన్నిటికి మించి ఫ్రెష్ నెస్ దూరమౌతుంది. పైగా వెలుపలి పొరమీద తైలం పేరుకుపోవడం వల్ల లోపలి పొరలను పోషక తత్వాలు అందవు. జిడ్డు చర్మానికి పోషక తత్వాలు అందిచటంతో పాటు అదనపు నూనె పదార్థాన్ని పీల్చుకొని చర్మాన్ని తాజాగా మార్చే మహత్తరమైన ఔషధ లేపనం ఇది.

తయారీ పద్ధతి వాడాల్సిన విధానం...

ఒక గుప్పెడు స్త్రాబెర్రీలను ముక్కలుగా తరిగి , గ్రైండర్లో వేసి పేస్ట్ గా మారేంతవరకు గ్రైండ్ చేసి దీనిలో ఒక నిమ్మ కాయను, పెరుగును కలిపి గిలక్కొట్టి ఒక పాత్రలోపోసి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచండి. తర్వాత తీసి ముఖం మీద మెడ మీద పూసుకుని పేస్ట్ గట్టిపడటం మొదలెట్టిన తర్వాత తిరిగి కొద్దిగా తీసుకుని మరొక పొరలాగా ప్రయోగించి 20 నిమిషాలపాటు వదిలేయండి. తర్వాత రుద్దుకొని నీళ్లతో కడిగేసుకోండి. దీనితో మీ ముఖం కోమలంగా కనిపిస్తుంది. 

మొటిమలను ఎప్పుడూ వేళ్లతో గిల్లవద్దు, అలా చేస్తే మొటిమలను తగ్గించుకోవడానికు బదులు, ఇన్ ఫెక్షన్ తగ్గించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. 


20, మార్చి 2013, బుధవారం

MAMIDI ( MANGO ) - AYURVEDAM




MENTHULU - AYURVEDAM




DIABETES - SYMPTOMS, PREVENTION , AND TREATMENT













TOMATO - AYURVEDAM


MOKALI NOPPI ,KEELLA NOPPULU - AYURVEDAM





19, మార్చి 2013, మంగళవారం

మొటిమలు - ఆయుర్వేద చికిత్స / PIMPLES - AYURVEDAM

చర్మ సౌందర్యాన్ని పెంచే ఔషధాలు.

1. మొటిమలను తగ్గించే ఔషదం

అర టీ స్పూన్ ఉడు కులాం ( మగవాళ్ళు వాడే జర్మన్  పర్ఫ్యూమ్ )
అర టీ స్పూన్ కాచి చల్లార్చిన నిమ్మరసం
ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలను కలపండి. సొల్యూషన్ తయారవుతుంది .దీనిని దూది ఉండతో మొటిమల మీద రు ద్దు కోండి . ఆరి పోయిన తర్వాత మళ్లీ పూసుకోండి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకోండి .ఇలా రోజూ ప్రతి రాత్రి  పడుకునే ముందుచేస్తూ ఉండండి. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. దీని లో ని ఆల్కహాల్ కొవ్వును కరిగిస్తుంది .నిమ్మరసం చర్మాన్ని మరమ్మతు చేస్తుంది.

2 . మొటిమలను తగ్గించే ఔషదం

రెండు టేబుల్ స్పూన్ల కమలాపండు తొక్కల చూర్ణం
నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు

ఒక బౌల్లో పైన తెలిపిన పదార్ధాలు చక్కగా కలపండి చిక్కని పేస్టు తయారవుతుంది. దీనిని చేతివేళ్ళతో కాని బ్రష్ తో కానీ ముఖం మీద మొటిమలు మీద పూసుకోండి. వలయాకారంలో లో రుద్దు కోండి. ఆరిపోయిన తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి . దీంతో  చర్మం మీద  రంధ్రాల పూడిక తొలగిపోతుంది. కమలాపండు తొక్కల చూర్ణం చర్మం మీద  రక్తప్రసరణ పెంచుతుంది .సన్ ట్యా న్ ని తగ్గిస్తుంది. పెరుగు చర్మం మీద ఫంగస్  పెరగ నివ్వదు.

3 . కాంతి కోల్పోయిన చర్మాన్ని అందంగా మార్చే ఔషధం

ఒక టీ స్పూన్ కమలా పండు తొక్కలు చూర్ణం
ఒక టీస్పూన్ నిమ్మ పండు తొక్కలు చూర్ణం
ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి
 ఒక టీ స్పూన్ బాదం గింజల పొడి
ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె 
తగినంత రోజ్ వాటర్ పేస్టులాగా చేయడానికి

ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పేస్టులాగా తయారుచేయండి. దీనిని చర్మం మీద పూసుకుని బాగా రుద్ది పావుగంట పాటు అలా వదిలేయండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. దీనితో మీ చర్మం కొత్త కాంతితో, తేజస్సుతో మెరిసిపోతుంది.





FAT AND WEIGHT REDUCTION - AYURVEDAM








సన్నగా మారడానికి ఆయుర్వేద సూచనలు

సన్నగా ,నాజూకుగా మారాలనే కోరిక కల్గిన వారు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటిస్తే సరైన ఫలితం ఉంటుంది.

1 . అన్ని రుచులూ కలిగిన ఆహార పదార్థాలను తినడం,వేపుడు కూరలకు బదులు పులుసు కూరలు వాడడం,ఆహారాన్ని నెమ్మదిగా తినడం చేయాలి.

2 . సమయానికి తక్కువ మొత్తాల్లో తినాలి.

3 . వ్యాయామానికి ముందు కనీసం ఏడాది పాటు పాత తేనెను 2 చెంచాలు ,గ్లాసెడు గోరు వెచ్చని నీటికి కలిపి తాగాలి.

4 . ఆహారంగా పీచు కలిగిన ఓట్స్ ,బార్లీ వంటి శూక ధాన్యం / సిరియల్స్ తినాలి.బియ్యం తినే వాళ్ళు ఏడాది పాతబడిన  బియ్యం వాడాలి. 

5 . వేడి నీళ్ళు తాగుతుండడం,వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి.

6 . మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.

7 . శరీరానికి ,మనసుకు ఎప్పుడూ ఏదో వ్యాపకం కలిగించుకుంటుండాలి.క్రమం తప్పకుండా అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి.

8 . స్నానానికి ముందు అగరు,పెసర్లు,చిరుశనగలు మొదలైన పదార్థాలతో చేసిన సున్ని పిండితో వేడి పుట్టేలా నలుగు పెట్టుకోవాలి.

9 . మెత్తటి సోఫాలూ,పరుపూ వాడకూడదు.

10 . పగటి పూట నిద్ర మంచిది కాదు.

ఇంటివద్ద చేసుకునే చికిత్సలు - 

1 . ముల్లంగి రసం మోతాదుకు 3 చెంచాల చొప్పున రోజుకి 3 సార్లు తీసుకోవాలి.

2 . కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అర చెంచా చొప్పున 2 పూటలా తేనెతో గాని లేదా వేడి నీటితో గాని తీసుకోవాలి.

3 . రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకి కలిపి తీసుకోవాలి.

4 . ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియం గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి.

5 . ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి.

6 . కటుక రోహిణి చూర్ణం 3 భాగాలు,చిత్రమూలం వేరు బెరడు చూర్ణం 3 భాగాలు ,శిలాజిత్ చూర్ణం 2 భాగాలు ,గలిజేరు / పునర్నవ పంచాంగ చూర్ణం 5 భాగాలు చొప్పున కలిపి మోతాదుకు అరచెంచాడు చొప్పున తేనెతో ఆహారం ముందు 2 పూటలా తీసుకోవాలి.

7 . తిప్పసత్తు / గుడూచి సత్వం ,తుంగముస్తల చూర్ణాన్ని 2 పూతలా తేనె అనుపానంగా మోతాదుకు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.

8 . అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

9 . శొంఠి ,వాయువిడంగాలు,యవక్షారం ,కాంత లోహ భస్మాల సమ మిశ్రమాన్ని 2 పూటలా పూటకు 1 గ్రాము మోతాదుగా తేనె అనుపానంగా తీసుకోవాలి.

10 . త్రికటు / శొంఠి,పిప్పళ్ళు,మిరియాలు ,త్రిఫలాలు / కరక్కాయ,తాని కాయ,ఉసిరి కాయ , వాయు విడంగాలు,చిత్రమూలం ,తుంగ ముస్తలను ఒక్కో దానిని రెండేసి భాగాలుగా తీసుకొని అందులో ఒక భాగం శుద్ధ గుగ్గిలాన్ని కలపాలి.ఈ మిశ్రమాన్ని మోతాదుకు 3 - 6 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.

HING ( INGUVA ) - AYURVEDAM


KANUGA ( INDIAN BEECH ) - AYURVEDAM





Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...