Sunday 16 December 2018

చలికాలంలో చర్మం పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి నుంచి కాచుకోవడానికి స్వెట్టర్లు ధరించడమే కాకుండా చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

1.గులాబి నీరు,తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం ,మెడకు రాసుకోవాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.తేనె చర్మానికి తేమనందిస్తుంది.పొడి చర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

2.పెదవులు పొడిబారి పగిలినట్లు అవూంటే తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి.ఇలా రోజులో రెండు ,మూడు సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

3.చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది.ఇలాంటివారు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెకు అరచెంచా నిమ్మ రసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి.ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.

4.పెద్ద చెంచా వంతున నిమ్మ రసం,తేనె కలిపి ముఖానికీ,చేతులకూ రాసుకోవాలి.కాసేపయ్యాక కడిగెయ్యాలి.దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా దురద,ఎలర్జీలాంటి సమస్యలు రావు.

5.స్నానాకి ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారదు.అలాగే చెంచా శనగ పిండికి చిటికెడు పసుపు,అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం ,మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి.ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.

No comments:

Post a Comment