Sunday, 30 December 2018

శరీర దుర్వాసన,నోటి దుర్వాసన రాకుండా ఆహార పరిష్కారం. / SHAREERA DURVAASANA,NOTI DURVASANA RAKUNDA AHARA PARISHKARAM


ఈ దుర్వాసనలు పోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.నోటి దుర్వాసన పోవడానికి రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవడమొక్కటే కాకుండా పీచుపదార్థం ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల పళ్లు శుభ్రంగా ఉండి చెడు బ్యాక్టీరియా ఫాం కాకుండా చేస్తుంది.పీచుపదార్థం అరుగుదలకు ఉపయోగపడుతుంది.మలబద్ధకం నివారిస్తుంది.దీనివల్ల జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుంది.అరుగుదల సవ్యంగా లేనప్పుడు ,ఆలస్యమైనప్పుడు పొట్ట నుంచి నోటిలోకి దుర్వాసన వెలువడుతుంది.అందువల్ల మన ఆహారం పీచుపదార్థంతో పాటు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువ నూనె ఉండే ఆహారపదార్థాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఎప్పుడు కూడా తాజాగా ఉండే ఆహారం భుజించడం ఆరోగ్యానికి మేలు.

శరీర దుర్గంధం అపొక్రైన్ అనే గ్రంధుల ద్వారా వెలువడుతుంది.ఈ గ్రంధులు ప్రత్యేకమైన సెంట్ ను విడుదల చేస్తాయి.చెమటకు బ్యాక్టీరియా తోడై శరీర దుర్గంధం వస్తుంది.సాధారణంగా చెమట వాసన అనేది అందరికీ ఉంటుంది.ఐతే ఇది మన శుభ్రతపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.మనం తీసుకునే ఆహారం కూడా ఈ వాసనలకు కారణం అవుతుంది.అపొక్రైన్ గ్రంధులు కళ్లు,చంకలు,వక్షోజాలు,నాభి,చెవులు,విస్ర్జన భాగాల్లో ఉంటాయి.అందువల్ల శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.అల్లగే తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి.తగినంత పీచుపదార్థం ఉండాలి.రోజుకు కనీసం 8 నుండి 12 గ్లాసుల నీరు తాగాలి.పళ్లు,కూరగాయలు ప్రతి పూటా తీసుకోవాలి.దంత సమస్యలు,చిగుళ్ల సంస్యలున్నవారు దంత వైద్యుడిని సంప్రదించాలి.చూయింగ్ గం నమలడం వల్ల దంతాలు శుభ్రపడతాయి.

Saturday, 29 December 2018

డిప్రెషన్ లో 8 కోట్ల మంది భారతీయులు .

డిప్రెషన్ - చిన్న చిన్న పిల్ల నుంచే వేధిస్తున్న సమస్య ఇది.అల్ల డిప్రెషన్ బారిన పడిన దేశాల్లో మొదటి స్థానంలో మన భారతదేశమే ఉండడం ఇప్పుడు కలవరపరుస్తున్న అంశం.ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది.భారత్ తర్వాత చైనా,అమెరికాలున్నాయి.మారుతున్న జీవన విధానాలు కావచ్చు,ఉద్యోగ కుటుంబ బాధ్యతలు కావచ్చు,మనిషి మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని తన నివేదికలో తెలిపింది.మానసిక సమస్యలకు చికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండడమూ పరిస్థితి తీవ్రమవడానికి కారణమౌతోందని హెచ్చరించింది.

సగం మంది కార్పొరేట్ ఉద్యోగులు డిప్రెషన్ బాధితులు - కాలంతో పాటు జీవితం ఉరుకులు పరుగులు పెడుతోంది.డబ్బు సంపాదించాలి,పేరు తెచ్చుకోవాలి,గుర్తింపు పొందాలి,ఎక్కువ మందిలో ఇదే తపన.ఐతే ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో సమయం లేకుండా వారిలో 42.5 శాతం మందికి డిప్రెషన్ ఉంది.గత సంవత్సరం అసోచాం చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే వారిపైనే డిప్రెషన్ ఎక్కువగా దాడి చేస్తోందని తేలింది.తక్కువ జీతంతో ఎక్కువ సేపు పని చేయించుకోవడం వల్ల ,ఉద్యోగుల్లో అలసట చాయలు కనిపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది.అదే ఒత్తిడి,ఫ్రస్ట్రేషన్ వరకు వెళుతున్నాయని ,చివరకు డిప్రెషన్ బారిన పడుతున్నారని స్పష్టమైంది.బ్రిటన్ ( 33 గంటలు ),అమెరికా ( 40 గంటలు ) తో పోలిస్తే భారత్ లో సగటు వేతన జీవి ఎక్కువగా పని చేస్తున్నాడు.వారానికి 48 నుంచి 50 గంటలు పని చేయాల్సివస్తోంది.జీతం విషయంలో మాత్రం ఆ దేశాలకన్నా చాలా తక్కువలోనే ఉంది భారత్.లివింగ్ కాస్ట్,ఇండెక్ష్ ప్రైసింగ్ లను తీసేసిన తర్వాత కూడా 6 రెట్లు ఎక్కువగా ఆ దేశాలు జీతాలిస్తున్నాయి.భారత్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.ఫలితంగా మానసిక వత్తిడి పెరిగి పోతోంది.పని ఒత్తిడి ఎక్కువవడంతో నిద్ర కూడా సరిగ్గా పోలేని స్థితి ఉంది.

టీనేజ్ నుంచే ఒత్తిడి - 14 యేళ్ళ ప్రాయం వయసంటే ఆడుతూ పాడుతూ గెంతే వయసు.చదువులు,ఫ్రెండ్స్ తో సరదాలు ఇలా ఉంటూ ఉంటాయి.కానీ ,బలవంతంగా రుద్దుతున్న చదువులు ఒత్తిడిని పెంచేస్తున్నాయి.పెరిగిన టెక్నాలజీ వారి అలవాట్లను మార్చేస్తోంది.సెల్ ఫోన్ కు బానిసై పోవడం,అశ్లీల కంటెంట్ వైపు మొగ్గు చూపడం వంటివి పెరుగుతున్నాయి.మందు కొట్టడం,సిగరెట్లు తాగడం,డ్రగ్స్ వాడడం వంటి వాటితో డిప్రెషన్ తాలూకు చాయలు పెరిగిపోతున్నాయి.మానసికంగా సతమతం చేస్తున్నాయి.తల్లి దండ్రులు నిఘా పెట్టకపోవడమూ పరిస్థితిని తీవ్రతరం చేస్తోంది.

డిప్రెషన్ లో టాప్ లో ఉన్న దేశాలు -

1. భారత్ - మన జనాభాలో 6.5 శాతం డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.గ్రామాలు,పట్టణాలు,నగరాలు అన్న తేడా లేకుండా అందరినీ అది వేధిస్తోంది.దానిని నయం చేసేందుకు ప్రభావ వంతమైన పద్ధతులు ,చికితసలున్నా ,చేసేవారే కరువయ్యారని సంస్థ పేర్కొంది.సైకాలజిస్టులు,సైకియాట్రిస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపింది.లక్షకు ఒకరు మాత్రమే ఉన్నారని పేర్కొంది.మానసిక సంస్యలతో సగటున ప్రతి లక్షమందిలో 11 మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

2. చైనా - డిప్రెషన్ తో బాధపడేవారిలో 91.8 శాతం మంది దాకా చికిత్సలు చేయించుకోవడం లేదు.చైనాలోనూ భారత్ లాంటి పరిస్థితే ఉంది.మానసిక ఆరోగ్యం పై వాళ్లు బడ్జెట్ లో కెటాయిస్తోంది కేవలం 2.35 శాతం మాత్రమే.

3. అమెరికా - ప్రతి 5 మందిలో ఒకరు మానసిక రోగాల బారిన పడుతున్నారు.అందులో కేవలం 41 శాతం మంది చికిత్స తీసుకుంటున్నారు.అంత అభివృద్ధి చెందిన అమేరికాలోనూ మానసిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువే.చికిత్స లేకుండానే దాని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ ప్రజలు చెప్పడం విశేషం.

4. బ్రెజిల్ - లాటిన్ అమెరికాలో డిప్రెషన్ తో బాధపడేవాళ్లు ఎక్కువున్న దేశం బ్రెజిలే.హింస ,వలసలు,నిలువ నీడ లేకపోవడం వంటి కారణాలు డిప్రెషన్ లోకి తోసేస్తున్నాయి.

5. ఇండొనేషియా - జనాభాలో 90 లక్షల మంది ( 3.7 % ) డిప్రెషన్ బారిన పడ్డారు.యాంగ్జైటీ / మానసిక ఆందోళన కలుపుకుంటే మరింత పెరుగుతుంది.6% మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు.

6. రష్యా - ఆ దేశ జనాభాలో 5.5% మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు.2012 ప్రకారం చూస్తే ప్రపంచ సగటు కన్నా మూడింతలు ఎక్కువగా టీనేజర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Thursday, 27 December 2018

పార్శ్వ నొప్పి తగ్గుటకు ఆయుర్వేద పరిష్కారం ./ AYURVEDIC SOLUTION FOR MAIGRAIN.


ఆయుర్వేద మందుల షాపులలో దొరికే మహా చందనాది తైలమును తలకు మర్దనా చేస్తుంటే శరీరానికి చలువ చేస్తుంది,మెదడుకు వేడిని తగ్గిస్తూ,బాగా నిద్ర పట్టేలా చేస్తుంది.దీనిని తలకు మర్దనా చేయడం వలన హిస్టీరియా,ఫిట్స్,మూర్చ వంటి వ్యాధులు నివారిస్తుంది.తలకు మర్దనా చేసి ,ఉదయం,సాయంత్రం, ముక్కుల్లోనూ,చెవుల్లోనూ కొంచెం చుక్కలు వేస్తుంటే పార్శ్వనొప్పి తగ్గుతుంది.

కొన్ని సాధారణ చెవి రోగములు - ఆయుర్వేద పరిష్కారాలు.


చెవులలో గుబిలి వలన మంట,కురుపులు,దురద,చెవి పోటు,చీము కారుట వంటి అనారోగ్యములు చాలా కలుగవచ్చు.వీటికి ఆయుర్వేడములో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి.

1. పండు జిల్లేడు ఆకును నిప్పు సెగలో వేడి చేసి ,వాటిని బాగా నలిపి ,రసాన్ని పిండాలి.దీనిని బాధ ఉన్న చెవిలో కొచెం వేయాలి.ఇలా 8 గంటలకొకసారి వేయాలి.గంజాయి ఆకుల రసమును చెవిలో పిండినా అన్ని రకముల చెవి వ్యాధులు నయమౌతాయి.

2. గోరు వెచ్చని అల్లపు రసమును లేకపోతే వెల్లుల్లి పాయల రసమును కొంచెం చెవిలో వేయాలి.ఇలా ప్రతి 8 గంటలకొకసారి వేస్తుండాలి.

3. అన్ని రకాల చెవి రోగాలకు నిర్గుండి తైలం చాలా బాగా పని చేస్తుంది.ప్రతి 8 గంటలకొకసారి చెవిలో 4 చుక్కలను వేయాలి.కర్పూర శిలాజిత్తు,అమృతారిష్టము,మృత్యుంజయ రసములలో ఏదైనా వాడవచ్చు.

Wednesday, 26 December 2018

సైనసైటిస్ కి నస్య ఔషధం - లవణ ద్రావణ చికిత్స


ఇది సైనసైటిస్,ఎలర్జీలు,ముక్కు కారటం,జలుబు,ఫ్లూ సమస్యలు ఉన్నవారికి అనువైనది.చెవుల సమస్యలు కలిగినవారికి మంచిది కాదు.

సైనస్ లు విడుదల చేసే స్రావాలు ముక్కులోపలకు స్రవించడానికి అడ్డు ఏర్పడడంతో బ్యాక్టీరియా దాడి చేసి సైనసైటిస్ ఇంఫెక్షన్ ను కలిగిస్తాయి.ఇలా సైనస్ లు మూసుకుపోతాయి.
దీనికి లవణ ద్రావణ చికిత్స బాగా ఉపయోగపడుతుంది.ద్రావణం సాంద్రత ఎక్కువ కనుక మ్యూకస్ పొరల్లోని అదనపు ద్రవాంశాన్ని వెలుపలకు లాగేస్తుంది.దీనితోపాటు లోపల స్నిగ్ధత్వం పెరగటమే కాకుండా,శోధ వంటివి తగ్గుతాయి.

లవణ ద్రావణ తయారీ విధానం-

1-2 కప్పుల గోరు వెచ్చటి నీళ్లు తీసుకొని 1/4 నుండి 1/2 టీ స్పూన్ ఉప్పు పలుకులను ( అయోడిన్ కలపని సముద్రపు ఉప్పు ),చిటికెడు వంటసోడా లను కలపాలి.

వాష్బేసిన్ వద్దకు వెళ్లి 45 డిగ్రీల కోణంలో వంగి నిలబడాలి.తలను ఒక పక్కకు వంచాలి.లవణ ద్రావణాన్ని నాసిక లోపలకు పోయలి.
నాజిల్ ను ముక్కు రంధ్రం లోపలకు ఒక అంగులం లోపలకు మాత్రమే చొప్పించాలి.ఈ సమయంలో నోటితో గాలి పీలుస్తుండాలి.ఉప్పునీళ్లు ముక్కు అంతర్భాగం నుండి ,నోటి నుంచి ధారగా కారతాయి.ఈ నీళ్లను మింగకపోవడం మంచిది. రెండవ నాసికతో కూడా ఇదే విధంగా రిపేట్ చేయాలి.ముక్కును శుభ్రం చేసుకొని రెండవ నాసికతో ఇదే క్రమాన్ని తిరిగి చేయాలి.తరువాత మిగిలిన ద్రవాన్ని పారబోసి,సామాగ్రిని ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి.

మండుతున్నా,నొప్పిగా అంపిస్తున్నా ఉప్పు మోతాదును తగ్గించండి,తలను వెనక్కి వంచవద్దు.నోరు తెరచి ఉంచి కేవలం నోటితో మాత్రమే శ్వాస తీసుకోండి.
ఒకటి రెండు సార్లు చేసిన వెంటనే మీకు ఫలితాలు కనిపిస్తాయి.చికిత్సను కొనసాగిస్తున్న కొద్దీ ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉంటాయి.
ఈ చికిత్సను రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే సరిపోతుంది.లక్షణాలన్నీ పూర్తిగా సమసిపోయిన తర్వాత వారానికి మూడుసార్ల చొప్పున తీసుకుంటూ ఉంటే లక్షణాలు తిరగబెట్టకుండా ఉంటాయి.

పండంటి ఆరోగ్యానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 సూత్రాలు.

పంచ ప్రాణాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 5 సూత్రాలు.

పండంటి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం ఖచ్చితంగా సూత్రాలు పాటించాలని తాజాగా పిలుపిచ్చింది.ఏ వయసు వారైనా ,ఆహారపరంగా ఈ సూత్రాలను పాటిస్తే జబ్బుల బారిన పడకుండా జీవించటానికి అవకాశం ఉంటుందని తెలిపింది.

1. రక రకాల ఆహార పదార్థాలను తినడం.

2. ఉప్పు తగ్గించడం.

3. కొవ్వులు,నూనెలు తగ్గించడం.

4. తీపి కూడా తగ్గించడం.

5. మద్యం మానుకోవడం / మద్యానికి సురక్షిత స్థాయి లేదు .

Saturday, 22 December 2018

పెంపుడు జంతువులతో వచ్చే జబ్బులు - ఆయుర్వేద చికిత్స


ఈ రోజులలో ప్రతి ఇంట్లోనూ పెంపుడు జంతువులు ఉండడం సర్వసాధారణం అయిపోయింది.ఐతే వీటితో ఎక్కువగా గడపడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.వీటి వల్ల నోరు,కడుపు,పేగులు మండుట వంటివి వచ్చే అవకాశన్మ్ కలదు.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు ఎంతో ఉపయోగపడతాయి.

1. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల తేనెను కలిపి తాగుతుండాలి.

2. 10 చుక్కల వెల్లుల్లి రసమును నీటిలో కలిపి తాగుతూఉండాలి.రోజుకు 2 సార్లు వ్యాధి తగ్గేవరకు తాగాలి.

3. శీతాంశురసము,పైత్యాంతక రసములను కలిపి వాడాలి.

ఎముకలు మెత్తబడుట - ఆయుర్వేద చికిత్స


మనం తినే ఆహారంలో ఫాస్ఫరస్,సున్నము,డి విటమిన్ లోపించినపుడు ఎముకలు మెత్తబడడం జరుగుతుంది.స్త్రీలలో డెలివరీ అయిన తర్వాత ఈ వ్యాధి ఎక్కువగా రావచ్చు.కింది చికిత్సలు రోగాన్ని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడగలవు.

1. క్షీర బలా తైలము,సువర్ణము,అమ్ర్తప్రాశ ఘృతము కలిపిన చ్యవన ప్రాశ వాడవచ్చు.

2. ఆక్రోట్ చెట్టు ఆకుల కషాయమును ఉదయం , సాయంత్రం ఒక కప్పు చొప్పున తీసుకోవాలి.

3. రోజూ పాలను తాగాలి.

4. ప్రతి రోజూ తాంబూలం వేసుకోవాలి.

కండరముల క్షీణత - ఆయుర్వేద చికిత్స



కొన్ని వ్యాధులు బాగా ముదిరినప్పుడు ,ముదిరి తగ్గినపుడూ కండరములు క్షీణించి ,శరీరం ఎండిపోవడం జరుగుతుంది.దీని వల్ల ఎక్కువగా నీరసమూ,మూత్రం స్వాధీనం తప్పుట,శరీరం తూలిపోవుట,జరుగుతుంది.అలాంటప్పుడు ఈ కింది చికిత్సలు బాగా ఉపకరిస్తాయి.

1. చ్యవనప్రాశ,మకరధ్వజము,అశ్వగంధ లేహ్యము,వసంత కుసుమాకరము బాగా పని చేస్తాయి.

2. ఒక కప్పు నీటిలో 3 స్పూన్ ల తేనె ను,ఒక నిమ్మ కాయ రసమును కలుపుకొని ప్రతి రోజూ తాగుతుండాలి.కొంత కాలానికి వ్యాధి తగ్గగలదు.

3. రత్న పురుష ఆకులు,అల్లపు రసము,ఎండు ద్రాక్షలను వాడుతూ ఉండాలి.

Wednesday, 19 December 2018

పచ్చి మిరపకాయలు రోజూ తింటే కలిగే లాభాలు.

పచ్చి మిరప కాయలను మనం అనేక రకాలుగా ఆహరంలో వాడుకుంటుంటము.ఎండు కారం కు బదులుగా చాలా మంది కూరల్లో వేస్తారు.చక్కని రుచి వస్తుంది.కొందరు వీటిని అలాగే తినేస్తారు.కొందరు మజ్జొగలో కలుపుకుని తింటారు.రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి.

1. విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ బి6,ఏ,ఐరన్,కాపర్,పొటాషియం,నియాసిన్,ఫైబర్,ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

2. వీటిని విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.ఆహారం సరిగా జీర్ణం అవుతుంది.ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

3. విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.పేగుల నుండి కొలెస్టరాల్ రక్తంలోకి కలవకుండా చూస్తుంది.రక్తంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది.దీనితో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

4. వీటిలో ఉండే క్యాప్సిసిన్ శరీర జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.దీనితో క్యాలొరీలు అధికంగా ఖర్చవుతాయి.ఫలితంగా అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.అలాగే గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుంది.

5. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలను పోగొడతాయి.

6. దగ్గు , జలుబు , ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చి మిరపను బాగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి గాలి బాగా పీల్చుకోవచ్చు.

విటమిన్ ఈ లభించే పదార్థాలు - పరిష్కరించే సమస్యలు.


1. ఇది ప్రధానంగా బాదం,అవిశ గింజలు,పాలకూర,చిలగడ దుంప,పొద్దు తిరుగుడు గింజలు,ఆలివ్ నూనె వంటి వాటి నుంచి అధిక మోతాదులో లభిస్తుంది.నేరుగా దీనిని ఉపయోఇంచాలనుకుంటే మార్కెట్ లో ఈ నూనె దొరుకుతుంది,దానిని వాడుకోవచ్చు.

2. కాలం ఏదైనా కొందరి చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది.విటమిన్ ఈ అందే పదార్థాలను రోజువారె ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.రోజూ ఉదయాన్నే కాస్త విటమిన్ ఈ నూనెను తీసుకుని ముఖం,చేతులు,కాళ్ళకు రాసుకుంటే మంచిది.దీనివల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగి చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.స్నానం చేసే ముందు కూడా దీనిని రాసుకోవచ్చు.ఐతే కొబ్బరి నూనె,లేదా ఆలివ్ నూనెతో కలిపి వాడుకోవచ్చు.ముఖ్యంగా కళ్ళ కింద నలుపుదనం,ముడతలు తగ్గుతాయి.ఇలా కనీసం వారానికి రెండు ,మూడు సార్లు రాసుకున్నా చాలు.

3. విటమిన్ ఈ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.అతినీల లోహిత కిరణాలవల్ల దెబ్బ తిన్న చర్మానికి ఉపశమనం అందిస్తాయి.జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుతాయి.బలంగా,ఆరోగ్యంగానూ కనిపించేలా చేస్తాయి.శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

Tuesday, 18 December 2018

ఇన్ ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధ ఆహార యాంటీ బయోటిక్స్/ INFECTION LA TO PORADE SAHAJA SIDDHA AHARA ANTI BIOTICS

మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు బ్యక్టీరియా,వైరస్ ఇన్ ఫెక్షన్ ల వల్ల కలుగుతాయి.వీటితో శరీరంలోరోగనిరోధక శక్తి తగ్గిపోయి పలు రకాల సమస్యలు ఎదుర్కొంటుంటాము.మనకు అందుబాటులోనే ఉండే పదార్థాలతో ఈ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా ఎదుర్కొనవచ్చు.

1. క్రాన్ బెర్రీ జ్యూస్ ఇన్ ఫెక్షన్ లను సమర్థంగా తగ్గిస్తుంది.మూత్రాశయ , వెజైనల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.తాజా జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవాలి.రోజుకి రెండు , మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఇది హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది.ఇన్ ఫెక్షన్స్ తో బాధపడే గర్భిణీ స్త్రీలు కూడా తాగవచ్చు.

2. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ వైరల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.ఇవి బ్యాక్టీరియా,వైరస్లను సమర్థంగా నిర్మూలిస్తాయి.టీ ట్రీ ఆయిలో కలబంద గుజ్జును బాగా కలిపి చర్మం మీద రాస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.

3. కలబందలో యాంటీ ఇంఫమ్మేటరీ ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి.ఇన్ ఫెక్షన్ లను తగ్గించి,చర్మం పాడవకుండా చూసి,వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

4. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్,యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్ ఫెక్షన్ లనుండి సమర్థంగా రక్షిస్తుంది.రోజూ ఏదో విధంగా 4 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను తింటుంటే మంచి ఫలితం కనబడుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

5. తేనెలో కూడా యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలు అధికంగానే ఉన్నాయి.ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ తేనెను కలిపి రోజూ తీసుకుంటే ఇన్ ఫెక్షన్ లను దూరం చేసుకోవచ్చు.తేనెను నేరుగా చర్మం పై రాసినా చర్మ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.తేనెవల్ల చెడు బ్యాక్టీరియా,చెడు వైరస్ లు శరీరంలోకి చేరకుండా ఉంటాయి.

6. జీర్ణాశయం,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను అల్లం మెరుగ్గా తగ్గిస్తుంది.ఆయా సమస్యలు ఉన్నపుడు కొద్దిగా అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది.శరీరంలోని వేడిని ఇట్టే తగ్గిస్తుంది.రక్త సరఫరా మెరుగు పరుస్తుంది.శరీరంలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.

7. బేకింగ్ సోడాలో యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు బాగా కలవు.జీర్ణాశయం,పేగులు,శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ లను బేకింగ్ సోడా తగ్గిస్తుంది.ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.

8. సహజ్ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ గుణాలకు నిమ్మ రసం పెట్టింది పేరు.శ్వాస కోశ ఇన్ ఫెక్షన్ లను మెరుగ్గా నయం చేస్తుంది.చెడు వైరస్,బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.విటమిన్ సి ఉండడం వల్ల ఇవి నశిస్తాయి.ఉబ్బసం / ఆస్త్మా వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది.కాలేయం శుభ్రపడుతుంది.

9. రోజూ మనం వంటలో వాడే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.యాంటీ వైరల్,యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇంఫ్లమ్మేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలకు పసుపు పెట్టింది పేరు.గాయాలపై పసుపు రాస్తే వెంటనే తగ్గిపోతాయి.యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల గాయం త్వరగా మానుతుంది.శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు పసుపును పాలలో కలిపి తీసుకోవాలి.జీర్ణాశయ సమస్యలు ఉంటే గోరువెచ్చని నీటితో కలిపి దీనిని తీసుకోవాలి.ఆయా సమస్యల నుండి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.

10. యాపిల్ సిడార్ వెనిగర్ లో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఇన్ ఫెక్టివ్ గుణాలు అధికంగా ఉన్నాయి.శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా ,వైరస్ లను ఇది నిర్మూలిస్తుంది.చర్మాన్ని రక్షిస్తుంది.జీర్త్ణాశయ ఇన్ ఫెక్షన్ లను పోగొడుతుంది.

Monday, 17 December 2018

మలబద్ధకం - అహార ,ఆయుర్వేద పరిష్కారాలు./ MALA BADDHAKAM - AHARA ,AYURVEDA PARISHKARALU.


ప్రస్తుత రోజుల్లో మలబద్ధకం చాలా మందికి ఒక సమస్యగా మారింది.దీనిని వెంటనే పరిష్కరించుకోకపోతే ఇది ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది .ఐతే ఆహారంలో కొన్ని మార్పులు ,ఇంకా కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించి చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

1. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 12 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి.పేగు వ్యవస్థలో కదలిక వస్తుంది.శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.

2. రెండు ఖర్జూర పండ్లు గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.ఆ నీటిని చల్లార్చిన తర్వాత తాగొచ్చు.

3. రాత్రి పడుకునే ముందు 5 నల్లని ఎండు ద్రాక్షలను 5-6 గంటలు నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తినాలి.దీనిఒతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

4. రెండు బొప్పాయి ముక్కలను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.

5. రెండు అంజీర పండ్లను గ్లాసుడు వేడి నీటిలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తినాలి.,

6. 30 మి.లీ. అలోవెరా జ్యూస్ ను గ్లాసుడు నీటిలో కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగాలి.

7. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు,కూరగాయల జ్యూస్ లు వీటితో పాటు తీసుకోవాలి.

8. ఈ సమస్య ఉన్నవారు చిప్స్,ఫాస్ట్ ఫుడ్ ,మాంసానికి దూరంగా ఉండాలి.

9. ఖచ్చితంగా ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.సమయానికి భోజనం చేయాలి.

Sunday, 16 December 2018

చలికాలంలో చర్మం పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి నుంచి కాచుకోవడానికి స్వెట్టర్లు ధరించడమే కాకుండా చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

1.గులాబి నీరు,తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం ,మెడకు రాసుకోవాలి.పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.తేనె చర్మానికి తేమనందిస్తుంది.పొడి చర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

2.పెదవులు పొడిబారి పగిలినట్లు అవూంటే తేనెలో కాస్త గ్లిజరిన్ కలిపి రాసుకోవాలి.ఇలా రోజులో రెండు ,మూడు సార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

3.చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది.ఇలాంటివారు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెకు అరచెంచా నిమ్మ రసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి.ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.

4.పెద్ద చెంచా వంతున నిమ్మ రసం,తేనె కలిపి ముఖానికీ,చేతులకూ రాసుకోవాలి.కాసేపయ్యాక కడిగెయ్యాలి.దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాకుండా దురద,ఎలర్జీలాంటి సమస్యలు రావు.

5.స్నానాకి ముందు కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడి బారదు.అలాగే చెంచా శనగ పిండికి చిటికెడు పసుపు,అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం ,మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి.ఆ తర్వాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.

ఉల్లి కాడలతో ఆయుర్వేద ,ఆరోగ్య ప్రయోజనాలు./ ULLIKADALATO AYURVEDA,AROGYA PRAYOJANALU.

1 . ఉల్లి కాడల్లోని అల్లిసిన్ చర్మం ముదతలు పడకుండా కాపాడుతుంది.

2. వీటిలోని కెరోటినాయిడ్ లుకంటి చూపును మెరుగు పరుస్తాయి.అలాగే ఎముకలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి.

3. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ,బి,సి,కె ,యాంటి బాక్టీరియల్,యాంటి ఫంగల్ సుగుణాలు,సల్ఫర్,రాగి,మెగ్నీషియం,పొటాషియం,క్రోమియం,మాంగనీస్ లాంటివి చాలా ఉన్నాయి.

4.చక్కెర వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.

5. వీటితో దగ్గు,జలుబు,అజీర్తి నయమౌతాయి.

6.కెలొరీలు,కొవ్వు,తక్కువగా ,పీచు పదార్థం ఎకువగా ఉండడంతో అధిక బరువు తగ్గిస్తాయి.

7.గర్భిణీలు తొలి మూడు నెలల్లో తరచుగా తింటే కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అందుతుంది.శిశువుకు వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి.

8. ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలకు చాలా మంచిది.కొలెస్టరాల్ ఆక్సీకరణను తగ్గించి ,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

9.వీటిలోని సల్ఫర్ కాంపౌండ్ బిపి స్థాయులను నియంత్రించడానికి సహాయపడుతుంది.కొలెస్టరాల్ స్థాయిలు తగ్గిస్తాయి.

10.వీటిలోని క్రోమియం కంటెంట్ మధుమేహాన్ని తగ్గిస్తుంది.ఘ్లూకోజ్ శక్తిని అందిస్తాయి.

11. జలుబు , జ్వరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

12. అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తాయి.

13.వీటిలోని పెక్టిన్ పెద్దపేగును క్యాన్సర్కు గురికాకుండా చేస్తుంది.

14.కీళ్ళ నొప్పులు ,ఉబ్బసం తగ్గిస్తాయి.కాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయి.