ప్రతి ఆహార ద్రవ్యంలోనూ దేని పోషకాలు దానికి
ఉంటాయి కదా? కొన్నింటి గురించే ఎక్కువ
మంది వైద్యులు చెప్తున్నారు. ఆహారం ఎందుకు, ఎలా
తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆహార లక్ష్యాలు వివరి
స్తారా?
ఆహారాన్ని దేశ, కాలమాన పరిస్థితులకు అను
గుణంగా ఒక పథకం ప్రకారం తీసుకోవటం విజ్ఞత.
శరీర ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచటం, శరీర బరువు
సమస్థితిలో ఉండేలా చూడటం, పోషకాలన్నీ తగుపా
ళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవటం పోషక లోపాల
వలన కలిగే వ్యాధులకు ఆస్కారం లేకుండా జాగ్రత్త
పడటం, ఆహారంవల్ల కలిగే వ్యాధులు దీర్ఘ వ్యాధు
లుగా మారకుండా జాగ్రత్త పడటం, ముంచుకొచ్చే
వృద్ధాప్యాన్ని నివారించి జీవనప్రమాణాన్ని పెంపొం
దించుకోవటం గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు,
స్త్రీబాల వృద్ధులకు తగినంత పోషకాలు అందేలా
చూడటం, పుట్టే బిడ్డ తగినంత బరువు, ఎదుగుదల
ఉండేలా చూడటం ఇవీ ఆహార లక్ష్యాలు. శరీర
తత్వాన్ని తెలుసుకుని తగినట్టుగా ఆహార పదార్థాలను
ఎంపిక చేసుకోవాలి. ఏవి తింటే శరీరానికి సౌక
ర్యంగా ఉంటుందో అవి తినాలి. వేటివలన అసౌ
కర్యం, అనారోగ్యం అనిపిస్తుందో వాటిని తగ్గిం
చటం, మానేయటం కూడా అవసరం.
మన ఆహారంలో తగినంత పోషకాలున్నాయా?
సామాన్యుడు వాటిని కొనగలడా? వైద్యశాస్త్రం ఆహా
రాన్ని పోషకాల పేరుతో మరింత ఖరీదు చేస్తోందం
వారా?
* పోషకాలు రోజువారీ మనం తినే ఆహారంలోనే
ఉన్నాయి. బజార్లో అమ్మే పదార్థాల మీద విటమిన్లు
ఆ
వగైరా ఎంతెంత ఉంటాయో రాసి ఉంటుంది కాబట్టి
అనే పోషకాలని, ఇంట్లో వండుకునేవి బలకరమైనవి
కావనే అపోహ చాలా మందిలో ఉంది. పోషకాలనే
రుతో వ్యాపార పరంగా అమ్మే పాలపిండి డబ్బాల
ప్రకటనల్ని, వాటి ఖరీదుల్ని చూసి, పోషకాలు సామా
న్యుడుకి అందుబాటులో లేవంటున్నారు. ఆ డబ్బాల్లో
నిజంగా పోషకాలు ఎంత ఉన్నాయో దేవుడికెరుక.
పోషకాల కోసం మార్కెట్లో వెదకద్దు. వంటిం
బ్లోనే వెదకండి! రాగి,
జొన్న, సజ్జ, గోధుమ
ల్లాంటి ధాన్యాలు, కంది
పప్పు, వేరుశనగ,
నువ్వులు, ఆవాల్లాంటి
నూనె గింజలు, పంచ
దార, బెల్లం ఇవన్నీ పోష
కాలే! మన ఆహారంలో
పోషక విలువలు లేని పదార్ధామే లేదు.
నిజానికి ఆకుపచ్చని ఆకుకూరలు బాగానే దొరు
కుతున్నాయి. కానీ, వాటిని ఫథ్యం కూరలని తన
దించే వాళ్ళు ఎక్కువ. విందుభోజనాల్లో సాధార
-జంగా ఆకుకూరలు వడ్డించకపోవడానికి ఎక్కువ
- మంది తినరనే అభిప్రాయమే కారణం.
బాగా మసా
లాలు దట్టించి, నూనె పోసి వండితేనే అది వంటకం
అనే వాళ్ళు ఎక్కువ. వీళ్ళవలన తక్కిన వాళ్ళక్కూడా
పోషకాలు అందకుండా పోతున్నాయి. ఆకుకూరలు
- పెడితే నీళ్ళ విరేచనాలు అవుతాయని కొందరు ఆకు
-కూరల్ని వండరు. ఆకు కూరల్లో ఉండే పీచు పదా
-ర్థాలు (డైటరీ ఫైబర్స్) విరేచనం ఫ్రీగా కావడానికి
-కారణం అవుతాయి. ఈ ఫైబరు తగినంత మోతా
దులో పేగులకు అందితేనే జీర్ణకోశ వ్యవస్థ బలసంప
-న్నంగా ఉంటుంది. దీనివలన కొందరు పిల్లలకు
5 కొంచెం ఎక్కువ విరేచనాలు కావచ్చు. కొద్దికొద్దిగా
తినిపిస్తూ అలవాటు చేయటమే మంచిదికాని,
మాన్పించటం సరికాదు.
పిల్లలకు పసినాటి నుండే
రకరకాల కూరగా
యలు, ఆకు కూరలు,
షకాలు
పప్పు ధాన్యాలను కొద్ది
కొద్దిగా తినిపిస్తూ శరీ
రానికి అలవాటు
చేయాలి. అందువ
లన జీర్ణాశయ వ్యవ
స్థకూ, కూరలకూ,
పండ్లకూ మధ్య
స్నేహం కలుస్తుంది.
జీర్ణశక్తి బలపడు
తుంది.
వైద్యశాస్త్రం
వంటింట్లో దొరికే
పోషకాలను చక్కగా
ఉపయోగించుకోవా
లనే చెప్తోంది. మనమే
వాటిని బజార్లో వెదు
క్కునే ప్రయత్నం
చేస్తున్నాం. డబ్బు తగ
లేని ఆరోగ్యానికి బదు
లుగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం.
-