గర్భవతులకు ఎక్కువ అన్నం పెట్టాలా?
మామూలుగా తింటే కడుపులో బిడ్డకు
సరిపోదా?
గర్భం దాల్చిన సమయంలో గర్భవతులకు
అదనపు ఆహారం అవసరమే! ఇద్దరు మనుషుల
తిండి తినాలని దీని భావం కాదు. బిడ్డ ఎదుగుద
లకు కావలసిన పోషకాలు అందేందుకు, పోషక
విలువలు కలిగిన అదనపు ఆహారం అవసరమే!
అట్టడుగు ప్రజలే కాదు, మన సమాజంలో
మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి స్త్రీలక్కూడా
పోషకాహార లోపం ఎక్కువగానే ఉంటోంది. చదువు
కున్నవారు, స్థితిమంతులు కూడా అనాలోచిత
వ్యామోహాలతో పోషక విలువలు లేని జంక్ ఫుడ్స్
మీద యావ వదులుకోలేకపోతున్నారు. పిజ్జాలు,
రోటీ కర్రీలే కాదు, ఇంట్లో తినే బజ్జీలు, పునుగులు
కూడా జంక్ ఫుడ్స్! గర్భం దాల్చిన సమయంలోనూ,
బిడ్డకు పాలిచ్చే సమయంలోనూ ఇలాంటి ఆహా
రాన్ని ఎక్కువగా తింటే స్థితిమంతులక్కూడా పోష
కాహార లోపం కలిగే ఆవకాశం ఉంది.
బిడ్డ తక్కవ బరువుతో అరకొర ఎదుగుదలతో
పుట్టాడంటే తల్లి ఆహార లోపం కూడా ఒక కారణం
కావచ్చునని అర్ధం చేసుకోవాలి. నిండు చూలాలు
గనక 10 కిలోల బరువు పెరిగితే కడుపులో బిడ్డ 3
కిలోల వరకూ బరువు పెరగటం అనేది ఆరోగ్యదా
యకంగా జరగాలి. మొదటి 3నెలల్లో ఒక అర
గ్రాము ప్రోటీను, నాలుగోనెల నుండీ 6వనెల వరకూ
7గ్రాముల ప్రోటీను 6వనెల నుండి ప్రసవించే
వరకూ 23 గ్రాముల ప్రోటీను అవసరం అవుతా
యని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండి
యన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సూచన.
ఐరన్, కాల్షియం, ఎ విటమిన్, అయోడిన్ ఇతర ఖని
జాలు కూడా తగుపాళ్ళలో గర్భవతులకు అందాలి.
ఇందువలన బిడ్డలకు పుట్టుకతోనే వచ్చే వ్యాధులు,
తక్కువ బరువుతో పుట్టటం, అవయవ లోపాల్లాంటి
సమస్యలన్నీ నివారించవచ్చు.
ఆర్థిక స్తోమత లేకపోవటం, వాంతులు, గ్యాస్,
తినబుద్ధి కాకపోవటం, వండుకునే ఓపిక లేకపోవ
దాల వలన కూడా గర్భ
వతులు పోషకాహారం
తీసుకోలేకపోతున్నారు.
అతిగా మసాలాలు,
కారాలు, అమిత పులుపు
తిన్నప్పుడూ కడుపులో
పెరిగే బిడ్డ ఎక్కువ కదిలి
పడతాడు.
ఇబ్బంది
.
ఇబ్బంది పెడతాడు కూడా!
గర్భవతుల ఆహారం అంటూ ప్రత్యేకంగా ఏది
వ ఉండదు.
రోజు వారి తీసుకునే ఆహారంలోనే కూర
గాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు తగినంతగా
ఉండేలా చూసుకోవాలి. తేలికగా అరిగే పద్ధతిలో
వండుకుంటే కడుపులో గ్యాసు ఏర్పడదు. అన్నం
-తక్కువ, కూర పప్పు ఎక్కువగా తినేట్లు వండుకో
వాలి. మంచి నెయ్యి వాడకం కూడా మంచిదే! తేలి
త కపాటి మాంసం, గ్రుడ్లు తీసుకోవచ్చు. ఆహార పదా
ర్ధాల ద్వారా సహజంగా వచ్చే పోషకాలు వంటబట్టి
-, నట్టు ఔషధ రూపంలో తీసుకునే విటమిన్లు వగైరా
- వంటబట్టవని గుర్తించాలి. పొట్టు తీయాల్సిన అవ
సరం లేని గోధమ, జొన్న, రాగి, సజ్జ వీటితో
తరుచూ చేతనైన వంటకాలు చేసుకు తినటం వలన
ఎక్కువ విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజాలు శరీరా
నికి అందుతాయి.
పాలు, పెరుగు, చల్ల ఎక్కువగా తీసుకోవటం
వలన క్యాల్షియం తగినంత అందుతుంది. పొట్టలో
మృదుత్వం ఏర్పడుతుంది. ఉపయోగపడే బా!
రియా పేగులకు తగినంత అందుతుంది. గ్యాసు,
ఎసిడిటీ తగ్గుతాయి. మజ్జిగ లేదా పెరుగు తగినంత
తీసుకున్నప్పుడు మొత్తం ఆహారంలోని పోషకాలు
సమత్వాన్ని పొందుతాయి. మజ్జిగ మీద తేరిన నీటిని
తాగటం మంచిది. గర్భవతులు ఉప్పు తగినంత
తీసుకోవాలి. అకారణ ఉప్పు ద్వేషాన్ని కొందరు పని
గట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఉప్పు నిషేధాన్ని
లోకం మొత్తానికి వర్తింప చేయటం సరికాదు.
తరచూ బీవీ చూపించుకోవటం, బిడ్డ ఎదుగు
దల బాగా ఉందని నిర్ధారించుకోవటం, బరువుచూ
సుకోవటం, ధనుర్వాతం ఇంజెక్షను వగైరా తీసుకో
వటం ఇలా వైద్యుల పర్యవేక్షణలో ఉండటం
మంచిది. శరీరానికి కొంతలో కొంత వ్యాయామం
ఇవ్వటం అవసరం. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయిం
చుకోదలుచుకున్నారో ఆ వైద్యురాలిని మొదట్లో
లిసి ఆమె పర్యవేక్షణలో ఉండటం మంచిది. వైద్యు
లకు తెలియకుండా స్వంతంగానో, వారు వీరు
- చెప్పారనో ఏ మందులు వాడవద్దు. పోషక ఔష
ధాలు కొద్ది తప్ప సాధ్యమైనంతవరకూ ఆహారబలం
మీదే ఆధార పడటం అవసరం.
గర్భవతులకు, బాలింతలకు వాతపు నొప్పులు
సహజంగా వస్తుంటాయి. అజీర్తి చేసి ఆహార పదా
రైలు తిన్నప్పుడు వాతపు నొప్పులు పెరుగుతాయి.
ఒక క్యారట్, ఒక ముల్లంగి, ఒక యాపిల్ ఈ
మూడింటిని సమపాళ్ళలో తీసుకుని ఒక గ్లాసు
- జ్యూసు రోజు తాగితే గర్భవతులకు కావలసిన పోష
కాలు సమున్నతంగా అందుతాయి. ప్రసవించిన,
బిడ్డకు పాలిస్తున్నంత వరకూ రోజూ ఈ జ్యూసు
క తాగటం మంచిది. కాఫీ, టీలు, అడ్డపొగ ఇలాంటికి
- గర్భవతులుకు హాని చేస్తాయి. గుట్కాలు, పాన్ మసా
లాలు కడుపులో బిడ్డ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
-వాటికి గర్భవతులు దూరంగా ఉండాలి.