5, సెప్టెంబర్ 2026, శనివారం

గనేరియా ,కడుపులో బల్ల సమస్యలు - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1. సెగ రోగ / గనేరియా సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

ముందే సెగ రోగం ఉన్న పురుషునితో స్త్రీలు కలవడం కానీ , అదే రోగం ఉన్న స్త్రీతో పురుషుడు కలవడం వల్ల కానీ ఈ రోగం అంటుకుని వారి శరీరంలో జీర్ణించుకు పోయి వదలకుండా దీర్ఘ కాల వ్యాధి లాగా పట్టి పీడిస్తుంది. దీనిని అశ్రద్ధ చేస్తే ఈ వ్యాధి ఉన్నవారికి పుట్టే బిడ్డలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వారి జీవితాన్ని కూడా నరక ప్రాయం చేస్తుంది. 

దీనికి ఈ వర్షా కాలంలో ప్రతి చోట లభ్యమయ్యే దూసరి చెట్టు / సిబ్బి తీగ ఆకులు దివ్యమైన ఔషధంగా పని చేస్తాయి. చెట్టును పూజించి , రోజూ ఉదయం పూట దాని ఆకులు తెచ్చి దంచి తీసిన రసం 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి పరగడుపున తాగుతుంటే మూడు, నాలుగు వారాల్లో ఎంత దీర్ఘ కాలం నుంచి బాధిస్తున్న సెగ రోగమైనా తగ్గిపోతుంది. 


2. ) కడుపులో బల్ల రోగం - ఆయుర్వేద పరిష్కారం 

ఉన్న ఊరు కన్న తల్లి అని మన పెద్దలు చెప్పిన మాట ఈ నాడు మనం మరచిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కడుపులో బల్ల సమస్యకు దేశవాళీ ఆవు ఉదయం పూట పోసే మూత్రం మొదటి మరియు చివరి మూత్రాన్ని విడిచిపెట్టి మధ్యలో మూత్రాన్ని ఒక గ్లాసులో పట్టుకొని ఏడు సార్లు బట్టలో వడపోసి అందులో చిటికెడు ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట పరగడుపున సేవించాలి. ఇలా వరుసగా రెండు లేదా మూడు వారాల పాటు తాగుతుంటే తిరిగి కాలేయ ప్లీహాలు బాగా పని చేసి బల్ల హరించి పోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే సేవించాలి. 

పిల్లల కడుపులో క్రిముల సమస్య, బుడ్డ సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

  1. ) పిల్లలకు కడుపులో క్రిముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

పిల్లలకు చాక్లెట్లు, బజారు తిండ్లు అలవాటు చేయడం వల్ల, అకాల భోజనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీని పరిష్కారం కోసం దేవదారు చెక్క, మునగ చెక్క , కరక్కాయ బెరడు, తానికాయ బెరడు, ఉసిరి కాయ బెరడు,పిప్పళ్లు, వాయు విడంగాలు సమాన భాగాలుగా తీసుకుని దంచి పొడి చేసుకుని, అన్నీ కలిపి నిలువ చేసుకోవాలి. రోజూ అరగ్లాసు నీటిలో అరచెంచా పొడి వేసి, పావు గ్లాసు కషాయానికి మరిగించి వడపోసి రెండు పూటలా పూటకు ఒక చెంచా కషాయాన్ని ఆహారానికి  ముందుగా తాగిస్తుంటే కడుపులోని పురుగులన్నీ మలం ద్వారా పూర్తిగా బయటకు పడి పోయి , పిల్లలకు చక్కటి ఆరోగ్యం కలుగుతుంది . 

2.) బుడ్డ దిగిన సమస్య - ఆయుర్వేద పరిష్కారం 

 A .) ఇంతకు ముందు చెప్పినట్లుగా దేశవాళీ ఆవు మూత్రం ఏడు సార్లు వడపోసి రోజూ పరగడుపున ఒక కప్పు మోతాదుగా తీసుకుని అందులో పావు టీ స్పూన్ మాను పసుపు పొడి కలిపి తాగించాలి. 

B.) కరక్కాయ పొడి, శొంఠి పొడి, గసగసాల పొడి , తెగడ పొడి ఒక్కొక్కటి 50 గ్రాములు చొప్పున తీసుకుని కలిపి ఆ మొత్తాన్ని స్వచ్ఛమైన వంటాముదంతో నూరి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు మోతాదుగా తినాలి. 

C.) కానుగ గింజల పప్పు, ఆముదపు గింజల పప్పు గచ్చ కాయలలోని పప్పు సమాన భాగాలుగా తీసుకుని వంటాముదంతో నూరి నిలువ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ లేపనాన్ని వాచిన వృషణం పైన పట్టు లాగా వేసి పైన దూది అంటించి అది ఊడిపోకుండా గోచి పెట్టుకుని పడుకోవాలి. 

ఇలా ఆచరిస్తూ, వాతం చేసే పదార్థాలు,మాంసాహారం తినడం మానివేస్తే అతి త్వరగా సమస్య ఆపరేషన్ తో పని లేకుండా పరిష్కారమవుతుంది. 

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

రక్త స్రావం ఆగకపోవడం, భగంధరం - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు.

 1.) రక్త స్రావం ఆగని సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారం. 

అడ్డసరం మొక్కను సంపాదించుకోవాలి. దాని కొమ్మ దొరికినా, తెచ్చి నాటితే మొక్కగా బతుకుతుంది. దాని ఆకులు తీసుకుని నీళ్ళు కలపకుండా దంచి ఆ ముద్దను బట్టలో వేసి పిండితే వచ్చే రసాన్ని గిన్నెలో పోసి చిన్న మంట పైన రసం విరిగే వరకు మరిగించాలి. తర్వాత వడపోసి, ఆ విరిగిన అడ్డసరం నీటిని 50 గ్రాముల మోతాదుగా తాగాలి. తాగిన మరుక్షణమే శరీరంలో ఏ భాగం నుండి కారే రక్తమైనా తప్పకుండా ఆగుతుంది. 

2.) భగంధరం సమస్య.. ఆయుర్వేద పరిష్కారాలు.. 

ఆవు నెయ్యి 20 గ్రాములు తీసుకుని ఇనుప కళాయి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి, అది మరిగేటప్పుడు అతి మెత్తని తెల్ల గుగ్గిలం పొడి 10 గ్రాములు వేసి కలిపి వెంటనే పాత్రను కిందికి దింపి ఆ పదార్థాన్ని ఒక కంచు గిన్నెలో కానీ లేక పళ్ళెంలో కానీ పోయాలి. తర్వాత ఆ పదార్థంలో నీళ్ళు పోసి ఆ మిశ్రమాన్ని కడిగి నీటిని వంచి వేయాలి. మరలా నీళ్ళు పోసి మరలా కడిగి నీటిని తీసివేయాలి. ఇలా ఓపికతో ఆ పదార్థాన్ని వంద సార్లు కడిగితే అద్భుతమైన ఔషధం తయారవుతుంది. 

దాన్ని ఒక గాజు సీసాలో నిలువ చేసుకొని రోజూ రాత్రి పడుకునే ముందు తగినంత పదార్థాన్ని దూదికి రాసి ఒత్తిలాగా తీసుకోవడం చేసి ఆ వత్తిని భగంధర రంధ్రంలో లోపలి దాకా పెట్టి పైన దూది అంటించి కదలకుండా ప్లాస్టర్ అంటించాలి. ఇలా రోజూ ఒక సారి ఒక ఒత్తిని నలభై రోజుల పాటు భగంధరంలో ఎక్కిస్తూ ఉంటే ఆ వ్యాధి సమూలంగా నిర్మూలనము అవుతుంది. 

రేచీకటి, వాత రోగపు నొప్పుల సమస్య - డా. ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 1.) రేచీకటి సమస్య - ఆయుర్వేద పరిష్కారం

తెల్ల మిరియాలు 20 గ్రాములు తెచ్చుకుని వాటిని చింతాకు రసంతో మెత్తగా గుజ్జులా నూరి శనగ గింజంత గోళీలు చేసి నీడకు ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక మాత్రను సాన రాయిపై కొంచెం నీళ్ళు చల్లి గంధం తీయండి. ఈ గంధాన్ని నిద్రించే ముందు పెసర బద్దంత మోతాదుగా కంటి కొసలలో పెట్టుకుంటూ ఉంటే రేచీకటి హరించిపోయి కళ్ళకు మంచి దృష్టి కలుగుతుంది. 

2.) ఊరంతా వాత రోగపు నొప్పుల సమస్యలు.. ఆయుర్వేద పరిష్కారాలు..

ఒక ఆదివారం నాడు వావిలి చెట్టు కు పూజ చేసి అడుగున తవ్వి ఆ వేళ్ళ మీద ఉండే వేరు బెరడును కొడవలితో గీకి తీసుకోవాలి. గీకిన చోట వేరుకు హాని కలుగకుండా ఆవు పేడ పూసి పూర్తిగా మట్టి కప్పి నీరు పోసి చెట్టుకు నమస్కరించి రావాలి. అలా తెచ్చిన వావిలి వేరును కడిగి ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. అలాగే దానితో పాటు శొంఠి, పిప్పళ్లు, మిరియాలు , పిప్పలి కట్టె వీటిని కూడా కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకోవాలి. అన్ని పదార్థాలను సమ భాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు అర చెంచా మోతాదుగా ఒక చెంచా తేనె తో కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు గానీ, గంట తర్వాత కానీ సేవించాలి. దీని వల్ల ఎంతో కాలం నుంచి మంచాన పడ్డ పక్షవాత రోగులు , కీళ్ల వాత రోగులు, అలాగే మిగిలిన దీర్ఘ కాలం వాత వ్యాధులతో బాధ పడే వారంతా పూర్తి స్వస్థతను పొందగలుగుతారు. 

సంతాన సమస్య, పాముల సమస్య - డా ఏల్చూరి ఆయుర్వేద పరిష్కారాలు

 సంతాన లేమి సమస్య - ఆయుర్వేద పరిష్కారం.


గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఎంత చింతించినా లాభం ఉండదు. ప్రస్తుతం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మనం నివసించే ప్రాంతంలో ఉన్న నల్ల తుమ్మ చెట్టు ను పూజించి సమస్యను మనసులోనే తెలిపి , దాని నుండి తుమ్మ చిగుర్లు సేకరించి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. అలాగే అప్పుడప్పుడే గింజ పడుతున్న పచ్చి తుమ్మ కాయలను గ్రహించి చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నలగ గొట్టి నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టి ఎండిన తర్వాత నిలువ చేసుకోవాలి. అలాగే తుమ్మ చెట్టు నుండి సహజంగా దొరికే తుమ్మ బంక దొరికినంత తెచ్చుకొని చిన్న ముక్కలుగా నలగ గొట్టి కొంచెం నేతితో దోరగా వేయించి నిలువ చేసుకోవాలి. ఈ మూడు పదార్థాలను రెండు మూడు నెలలకు ఒకసారి కావలసి నంత మోతాదుగా తీసుకుని విడి విడిగా దంచి జల్లించి అన్నింటిని కలపాలి. ఆ మిశ్రమ చూర్ణం ఎంత ఉంటే అంత మోతాదుగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ముందుగా పావు చెంచా నుండి అర చెంచా వరకు అరచేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా నాలుకతో అద్దుకొని తిని అనుపానంగా గోరు వెచ్చని పాలు తాగుతుండాలి. ఇలా రెండు పూటలా ఆహారానికి రెండు గంటల ముందు సేవిస్తుంటే క్రమంగా కోల్పోయిన వీర్య శక్తి, అంగ దృఢత్వం , శారీరక పునరుజ్జీవనం అన్నీ ప్రాప్తిస్తాయి. దీని వల్ల వీర్యంలో జీవ కణాల సంఖ్య కూడా సమృద్ధిగా ఉత్పన్నమై సంతానం కలుగుతుంది. 

పాముల సమస్య - ఆయుర్వేద పరిష్కారం.

దూసరి ( సిబ్బి తీగ) చెట్లను పూజించి తవ్వి ఆ వేరును తీసుకొచ్చి కడిగి పసుపు కుంకుమ పూసి దేవుని వద్ద పెట్టి పూజించండి. ఆ తర్వాత వాటిని ఇంటి ప్రధాన గుమ్మాలకు వేలాడ దియాలి. దీనినే పాతాళ గరుడి అంటారు. దీని ప్రభావానికి ఎంతో దూరం నుండే పాములు వెనక్కి తిరిగి పోతాయి. దాని పరిసర ప్రాంతాలలోకి రాలేవు. దాంతో పాటు ఆవాలు, నవసాగరం సమ భాగాలుగా కలిపి దంచి ఆ మిశ్రమాన్ని పాములు సంచరించే చోట చల్లాలి. వాటి వాసన పడక ఆ ప్రాంతంలో ఉండే పాములు దూరంగా పారిపోతాయి. అంతే కాక మట్టి మూకుడులో పిడకలు అంటించి , ఆ నిప్పుల మీద వస కొమ్ముల పొడి చల్లి పాములున్న ప్రాంతంలో ఆ పొగ వేస్తుండాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముల భయం నుండి నివారణ పొందవచ్చు. 

మారేడు పూల హల్వా.. ఆయుర్వేద ఉపయోగాలు..

 నిహన్యాద్బిల్వజం పుష్పమతీ సారం తృషాం వమీం.. మారేడు చెట్టును శివుడిపై భక్తితో పెంచుకునే వారే ఎక్కువ.కానీ దాని పూలు, ఆకులు, కాయలు అన్నీ ఔషధ ప్రయోజనాలు కలిగించేవే.. 

మారేడు,మర్రి, రావి ఇవన్నీ వాతావరణం నుంచి ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని ఎక్కువ ఆక్సీజన్ ఇచ్చే చెట్లు. భోజన కుతూహలం గ్రంథంలో ఆహార యోగ్యమైన పువ్వుల గురించిన ప్రకరణం ప్రారంభిస్తూ మారేడు పూలను మొదటగా ప్రస్తావించారు. భక్తి ప్రాధాన్యత కాదు అది .. ఆరోగ్య ప్రాధాన్యత. మారేడు పూలు ( మారేడు - ఇండియన్ బేల్ ) విరేచనాలను తగ్గిస్తాయి. దప్పిక తీరుస్తాయి. వాంతుల్ని ఆపుతాయి అని భోజన కుతూహలం గ్రంథంలో తెలిపారు. 

మారేడు కాయ గుజ్జు అమీబియాసిస్ వ్యాధి నియంత్రణకు పని చేస్తుంది కానీ మారేడు పూలు అతిసార వ్యాధిని కూడా అరికట్టగలదని దీని తాత్పర్యం. బ్యాక్టీరియా కారణంగా పేగులలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి మారేడు పువ్వులు ఉపయోగపడతాయి. మనం అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కు గురవుతుంటాము. బయట ఆహారం తినడం తప్పనిసరి అయిన వారు తరచూ మారేడు పూలు, కాయలు లేదా ఆకులు .. వీటిలో ఏది దొరికినా వాడుకుంటూ ఉండాలి. దీని వల్ల పొట్ట మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. 

ఇవి తాజాగానే ఉండాలని లేదు .. ఎండించి,దంచి , భద్రపరచుకొని రోజూ ఒక చెంచా పొడిని నీళ్లలో వేసి మరిగించి టీ లాగా తాగవచ్చు. మారేడును వాత వ్యాధులను తగ్గించే ఔషధమని చరకుడు ప్రముఖంగా పేర్కొన్నాడు. 

మారేడు వేరు దశ మూలాలలో ఒకటి. దశ మూలాలు వాత వ్యాధులను హరించేవిగా ప్రసిద్ధి. మారేడు పూలు చలవ నిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి, అందువల్ల ఎసిడిటీ కారణంగా వచ్చే సమస్యలన్నిటిపైనా చక్కగా పని చేస్తాయి. మారేడు పూలను నెయ్యితో వేయించి , హల్వా తయారు చేసుకుని, ఫ్రిజ్ లో భద్ర పరచుకొని రోజూ ఒక చెంచా మోతాదులో తీసుకోవచ్చు. 

తీసుకున్న ఆహారం వంట బట్టక పోవడం,తినగానే విరేచనానికి వెళ్ళాల్సి రావడం , మల బద్ధకం, గ్యాసు, పేగు పూత, , కడుపులో నొప్పి, నీరసం , నిస్సత్తువ లాంటి లక్షణాలన్నీ ఇరిటబుల్ బెవెల్ సిండ్రోమ్ IBS అనే వ్యాధిని సూచిస్తాయి. దీని పైన మారేడు ఆకులు, పూలు, కాయ లోపలి గుజ్జు ఔషధంగా పని చేస్తాయి. ఇది చిట్కా వైద్యం కాదు. ఆయుర్వేదంలో బిల్వారిష్ట, బిల్వాది గుళిక లాంటి ఔషధాలు దీని పైన పని చేసేవి మార్కెట్ లో దొరుకుతున్నాయి. వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. 

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...