1, జనవరి 2013, మంగళవారం

HAPPY NEW YEAR 2013 - నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సర శుభాకాంక్షలు - I WISH YOU A VERY HAPPY NEW YEAR 2013

కర్పూరం.. ఆయుర్వేద ఉపయోగాలు..

తెల్లటి కర్పూరానికి హిందూ సంప్రదాయంలో గొప్ప విశిష్టత ఉంది. కర్పూర హారతిని అందుకుని, భగవంతుడిని స్మరించుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పవిత్రతకు చిహ్నం.. అంతే కాదు కర్పూరం.. ఔషధ గుణాల పెన్నిధి. మనం ఏ ఆలయంలోకి వెళ్ళినా కర్పూర హారతి ఇవ్వడం మనకు కనిపిస్తుంది .ఇళ్లల్లో చేసుకునే పూజలు, వివాహాలు, పండుగల సందర్భంగా కర్పూరం వెలిగించి హారతులు అందుకోవడం మనకు తెలుసు .ఇంత పవిత్రంగా పరిగణించే కర్పూరానికి గొప్ప వైద్య చికిత్స విలువలు ఉన్నాయని అంశం అంత విస్తృతంగా తెలియదు. అంతేకాదు కర్పూరం పదం మూలం, అది పరివ్యాప్తమైన విధానం ఎంతో ఆసక్తిదాయకం. ఇంగ్లీషులో కర్పూరాన్ని క్యాంఫర్ అంటారు. ఈ పదం ఫ్రెంచ్ పదం క్యాంఫ్రీ నుండి స్వీకరించబడింది. అలాగే క్యాంపర్ నామం స్పెయిన్ భాష స్పానిష్ నుండి గ్రహించినట్లుగా చరిత్రలో ఉన్న అవగాహన. అంతేకాదు స్పానిష్ లోకి కూడా అరబ్ పదం ఆల్ కఫర్ నుండి వచ్చినట్లుగా చరిత్ర కారులు రూడీగా నిర్ధారించారు .తెల్లటి స్పటికం లా ఉండే కర్పూర పరిమళం అమోఘం ,అద్భుతం. తూర్పు ఆసియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నిరంతరం పచ్చగా ఆరోగ్యంగా ఉండే క్యాంఫర్ లారెల్ చెట్టు నుండి కర్పూరాన్ని తయారు చేయడం జరుగుతుంది .

శ్వాస కోశ సమస్యలకు..

 ప్రపంచవ్యాప్తంగా మానవాళి కర్పూరంతో ఎంతో ప్రయోజనం పొందుతోంది .బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. క్రిమి కీటకాలను ధ్వంసం చేసే గుణం ఉంది. దోమల సంహారిని కూడా. వేలాది సంవత్సరాలుగా కర్పూరం ఈ సుగుణాలతో మనకు ఎంతో మేలు కలుగజేస్తోంది. బ్యాక్టీరియాను నాశనం చేసేదిగా కర్పూరమును ఆయుర్వేద నిపుణులు గత 5000 సంవత్సరాలుగా పరిగణించి వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో కర్పూరం చెట్టు బెరడును జ్వరం, మలేరియాలను నయం చేసేందుకు వినియోగిస్తారు. ఆంటీ సెప్టిక్ వస్తువుగా కూడా ఉపయోగిస్తున్నారు .18వ శతాబ్దంలో అమెరికా ,ఐరోపా ఖండాలలో కర్పూరాన్ని ప్రజలు విరివిగా వినియోగించినట్లు వినికిడి .
 శ్వాసకోశ సంబంధ సమస్యల పరిష్కారానికి, అలాగే ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే వ్యాధులు నయం కావడానికి, కర్పూరపు బిల్లను అక్కడి ప్రజలు మెడ చుట్టూ ధరించేవారు .అక్కడ ఇప్పటికీ జలుబు నయం కావడానికి ప్రజలు కర్పూరాన్ని వినియోగిస్తున్నారు అన్నది వాస్తవం.

 కర్పూర తైలం సమర్థమైన ఉత్తేజ పూరిత ద్రవ్యం. రక్తప్రసరణ, మెటబాలిజం, జీర్ణశక్తి రసాల స్రావం, శరీర వ్యర్థాలను బయటికి పంపడం లాంటి విషయంలో కర్పూర తైలం బాగా పనిచేస్తుంది. రక్తప్రసరణ సమస్యలు ,జీర్ణశక్తి, జీవక్రియ సమస్యలు ఉన్నప్పుడు కర్పూరాన్ని నిపుణులు వినియోగిస్తారు .

యాంటీ సెప్టిక్ వస్తువుగా..

 కర్పూర తైలం యాంటీసెప్టిక్ గా, ఇన్ఫెక్షన్ల పైన ,క్రిమి కీటక సంహారిణిగా, సూక్ష్మజీవుల నాశకారిగా, సహజ రక్షణ కారిగా పనిచేస్తుంది. మనం తాగే నీటిలోనూ కర్పూరాన్ని ప్రత్యేకించి వేసవి, వర్షాకాలంలో కలిపి తీసుకుంటారు. ఎందుకంటే ఈ కాలాల్లో నీటిలో సూక్ష్మజీవులు చేరి ఇన్ఫెక్షన్లు కలగజేసే అవకాశం ఉంది. వాటిని నివారించడం కోసం కర్పూరం కలుపుతారు. ఒక సీసాలో లేదా ఏదైనా పాత్రలో కర్పూరం తైలం పోసి మూత పెట్టకుండా ఉంచినా లేదా కొంచెం గుడ్లను తైలంలో కాసేపు నానబెట్టి దాన్ని బయటకు తీసి అలా ఉంచినా క్రిమి కీటకాలు పారిపోతాయి .అలాగే సూక్ష్మజీవులు కూడా చచ్చిపోతాయి. ఒకటి రెండు చుక్కలు ఎక్కువ మొత్తం ధాన్యంలో వేసినట్లయితే పురుగులు చనిపోయి ధాన్యం సురక్షితంగా ఉంటుంది. అనేక రకాల ఔషధాల తయారీలోనూ కర్పూరాన్ని వాడుతారు. 
చర్మవ్యాధులకు.. చర్మం పైన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారణకు అవసరమైన మందులు తయారీలో కర్పూరం వాడుతారు. ఇక స్నానం చేసే నీటిలో కర్పూర తైలం లేదా కర్పూరం కలిపినట్లయితే శరీరం అంతటినీ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. అలాగే పేలను కర్పూరం చంపుతుంది. తెల్ల కర్పూరం నుండి విషతుల్యమైన రసాయనాలు తొలగించిన తర్వాత దగ్గు కోసం ఉపయోగించే సిరప్ లు, చాక్లెట్లు, తీపి పదార్థాలలోనూ వాడుతారు. దగ్గు ని నియంత్రించడంలో తెల్ల కర్పూరం చక్కగా పనిచేస్తుంది. శ్వాసనాలం పై భాగంలో కర్పూరం లో ఉండే పదార్థాలు పూతగా ఏర్పడి దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హాయిని కలిగిస్తాయి. బ్రాంకైల్ / సూక్ష్మ శ్వాస నాళం , లారింక్స్/ స్వర పేటికలో గల నాళం ..ఫారింక్స్/ స్వర పేటికలో కళ్ళెకు సంబంధించిన పొర వాపు.  నాసిక నాళాలు, ఊపిరితిత్తుల్లో గల ఆటంకాలను తొలగించడంలో కర్పూర తైలం నుండి వెలువడే ప్రగాఢమైన సువాసనలు బాగా దోహదం చేస్తాయి. అందువల్ల శ్వాసకోశ నాలాల్లో ఆటంకాలను తొలగించడానికి ఉపయోగించే బామ్ లు/
 నొప్పినుండి ఉపశమనం కల్పించే లేపనాలు, జలుబు తగ్గ డానికి ఉపయోగించే రబ్ ల/ లేపనాలు లో కూడా కర్పూర తైలం ఉపయోగిస్తారు. అస్తమా చికిత్సలో కూడా కర్పూర తైలం వాడతారు. ఇక ఆయుర్వేదంలో రోగాలకు ప్రధాన కారణంగా నిర్వచించే వాత, పిత్త, కఫ దోషాలను సరిచేసి రోగాలను నయం చేయడానికి కర్పూర తైలం సిఫారస్ చేస్తారు. 
కింద పడడం వల్ల మనికట్టు, చీలమండ లాంటివి వాపులు వస్తే వాటి ఉపశమనానికి ,కండరాల నొప్పులు తగ్గడానికి, కీళ్ల నొప్పులకు, కర్పూర తైలం మర్దన చేయడం  పరిపాటి. ఈ ప్రక్రియలకు కర్పూర  తైలం  మంచి ఔషధం అని ఆధునిక మూలికా వైద్యులు అంగీకరిస్తున్నారు .

మత్తు మందుగా..

అనస్తీషియా గా ప్రత్యేకించి లోకల్ అనస్తీసియా కోసం కర్పూర తైలం సమర్థంగా పనిచేస్తుంది. ప్రత్యక్ష ప్రేరణ గల నరాలను ఇది సుషుప్తావస్థ లో ఉంచుతుంది. అలాగే నరాల వ్యవస్థ అపసవ్యతను సరి చేస్తుంది. వణుకు, మూర్ఛ కలిగినప్పుడు నరాల బలహీనత మొదలగు వాటిలో కర్పూర తైలం వాడుతారు.

 ఆంటీ స్పెస్మాడిక్ అంటే కండరాలు సడలడానికి సమర్థంగా పనిచేస్తుంది. తక్షణం కండరాలు సడలుతాయి .తిమ్మిర్లు తగ్గుతాయి . స్పాస్మాడిక్ కలరాను నయం చేయడంలోనూ బాగా పనిచేస్తుంది .అలాగే మంటలు  తగ్గడానికి, మత్తు కలిగించడానికి ఉపయోగ పడుతుంది. శరీర బాహ్య, లోపలి మంటలు తగ్గడానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. శరీరం, మనసు విశ్రాంతి పొంది, ప్రశాంతతను తాజాదనాన్ని ,హాయిని కలిగిస్తుంది. కర్పూర తైలం మింగడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ కాలం దీన్ని మింగ రాదు. నిపుణుల సలహా పైనే వాడాల్సి ఉంది.

30, డిసెంబర్ 2012, ఆదివారం

ORU ROOBAYI ORU UYAR ( ONE RUPEE FOR A LIFE ) - KHAJA MOHIYUDDIN - COIMBATORE


పనస పండు.. ఆయుర్వేద ఉపయోగాలు..

పనస పండు.. రక్త పోటును నియంత్రిస్తుంది, ఆస్తమా ను అదుపు చేస్తుంది, చర్మ వ్యాధులను నివారిస్తుంది,మలబద్ధకాన్ని పోగొడుతుంది.

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అని ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానం అని ప్రకృతి వైద్యులు ప్రచారం చేస్తున్నారు.పండ్లు, కూరగాయలు లో ఉండే పోషక విలువలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి.

పండ్లలో పనస పండు లో మనకు గరిష్ట స్థాయిలో ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పనస పండు ను బంగ్లాదేశ్ జాతీయ ఫలంగా ప్రకటించింది. అక్కడి ప్రజలు ఈ ఫలాన్ని ఇష్టంగా ఆరగిస్తారు. ఇది వేలాది సంవత్సరాలుగా అలరారుతూ మానవాళికి ఉపయోగ పడుతోంది. పనస ప్రపంచంలో అత్యంత భారీ ఫలం. పనస చెట్టును సరిగా పోషిస్తే అది దాదాపు వంద సంవత్సరాల పాటు మధుర ఫలాలను ఇస్తుంది. బంగ్లాదేశ్ లో పనస చెట్లు పెరగడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ ఎక్కువగా ఈ తోటలు పెంచుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా అటవీ ప్రాంతంలో కూడా పనస చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడు విరివిగా పనస పండ్లు లభిస్తున్నాయి.పనసలో ఎన్నో పోషక విలువలు ఉండడమే కాదు.దీని పెంపకానికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.అందువల్ల పంట పొలాల్లో ఒక మూల ఈ చెట్లను పెంచడం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది.
పనసలో ఏదీ వృథాగా పారవేసేది ఉండదు. పనస తొనలు, లోపలుండే గింజలు , దళసరిగా ఉండే పై తొక్క ఇలా అన్నీ మనం తిని ఆనందించగలిగినవే.పనసలో ఎక్కువగా శ్యాచరేటెడ్ ఫ్యాట్,కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి.అదే సమయంలో విటమిన్ ఎ, సీ, థయామిన్, రిబోఫ్లావిన్, కాల్షియం,పొటాషియం, ఐరన్, సోడియం,జింక్ , నియాసిన్ తదితర అనేక విటమిన్లు, పోషకాలు ఉండి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాయి. అలాగే తక్కువ కేలరీలు ఉన్నందున ఇది ఎంతో ప్రయోజనం కలుగచేస్తుంది. వంద గ్రాముల పనసలో కేవలం 94 కేలరీలు మాత్రమే ఉంటాయి.అందువల్ల శరీర బరువు పెరగకుండా ఉంటుంది. కొందరు వీటి వాసన పడదని భావించే వారు సైతం ఇందులో గల విలువైన పోషకాలను తెలుసుకుని ఇష్టం పెంచుకుంటారు. 

ఇక పనస తొనల్లో ఉండే గింజలు ఎంతో ఉపయోగ కరమైనవి. గింజల్లో విటమిన్ బి 1,బి2 ఎక్కువగా ఉంటాయి. గింజల్లో స్టార్చ్ ఎక్కువగా, ఐరన్, కాల్షియం తక్కువగా ఉంటాయి. పనస పండు లో దాదాపు వంద నుండి 500 వరకు పనస తొనలుంటాయి. సాధారణంగా ఇవి కొంచెం బంకగా ఉంటాయి. కొంతమంది గింజలను ఎండించి దాచుకుని వాడుకుంటారు. వీటిని నూనెలు, సిరప్ లలో కూడా కలపడం జరుగుతుంది.

తొక్క.. 

పనస పండు పైన దళసరిగా ఉండే తొక్క కాస్త ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది. పళ్ళు కోసేవారు ముందుగా చేతులకు ,కత్తికి వేరుశనగ నూనె రాసుకుని కోసి పనస పండ్లను బయటకు తీయడం
 మనకు కనిపిస్తుంది .ఫిలిప్పీన్స్ లో చెక్కలపై చిత్రాలు , నగిషీలు చెక్కే వారిలో సృజనాత్మకతకు, ఊహలకు పనస మంచి వనరుగా ప్రసిద్ధి. అక్కడ పనసపండు బొమ్మను చూసి బౌల్స్ తయారు చేస్తారు. బౌల్స్ ను మరింత అందంగా తయారు చేయడానికి పండ్ల పైన ముళ్లగా ఉండే తొక్కపొడిని ఉపయోగిస్తారు.

కండ.. 

పనస పండు లో బాగా రుచికరమైనది. సువాసన వెదజల్లేది. ఇష్టంగా తినేది కండ. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ గా ఉంటుంది. మల బద్ధకం తో బాధ పడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది.గింజలు.. పనస గింజలు సైతం ఎక్కువ ఫైబర్ ను అందిస్తాయి. వీటిని వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఐతే గింజలను పొడి చేసి తిన్నట్లయితే ఫైబర్ శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియ చేస్తున్నాయి.

పొటాషియం సమృద్ధిగా లభించడం వల్ల అధిక రక్త పోటును తగ్గిస్తుంది. పనస చెట్టు వేరు జ్వరం,డయేరియా రుగ్మతలకు పని చేస్తుందని విశ్వసిస్తారు. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్ నుండి హైపర్ టెన్షన్ లను తగ్గించడంలో ఉపకరిస్తాయి. అలాగే ఉబ్బసం తో బాధ పడే వారికి పనస వేరు ప్రయోజనం కలిగిస్తుంది. వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. అలాగే పనస వేరు, చర్మ వ్యాధులలో కూడా చక్కగా పనిచేస్తుంది.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ అల్సర్ గుణాలున్నాయి. పనసలో సి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. మన శరీరంలో సహజంగా సీ విటమిన్ తయారు కాదు. అందువల్ల మనం తప్పని సరిగా సీ విటమిన్ లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.

 కణజాలాన్ని కలిపి ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ,దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కలిగించగల కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్ళే లక్షణాలను  తగ్గించే గుణాలున్నాయి. ఇన్ని విశేష గుణాలు ఉన్న పనస పండు ను మనం విశేషంగా ఆదరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...