AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
5, మార్చి 2012, సోమవారం
3, మార్చి 2012, శనివారం
25, ఫిబ్రవరి 2012, శనివారం
గాఢ నిద్రకు ఆయుర్వేద పరిష్కారాలు - డా. పెద్ది రమాదేవి.
నిద్రలేమికి డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ గారి సూచనలు.
నిద్రలేమికి శారీరక ,మానసిక రుగ్మతలు, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు ,మధ్యాహ్న నిద్ర ,ఆహార అలవాట్లలో మార్పులు, ఎక్కువగా భోంచేయడం, ఉపవాసం ఉండడం, అతిగా టీ ,కాఫీలు తీసుకోవడం, కీళ్ళ నొప్పులు ,మధుమేహం వంటి కారణాలు ఎన్నో. శరీరంలో నీటి శాతం బాగా తగ్గినప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలికంగా బాధపడాల్సి వస్తుంది. నిద్రాల్పత వల్ల కలిగిన లక్షణాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా దూరమవుతాయి. వేసవిలో తప్ప, ఇతర కాలాల్లో మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు. గర్భిణులు, పెద్దలు, అనారోగ్యంతో ఉన్నవారు తప్పనిసరిగా పడుకోవాలి. అలానే వ్యాయామం చేసిన తర్వాత వెంటనే కాకుండా, గంట తర్వాత తిని నిద్రకు ఉపక్రమిస్తే సరిపోతుంది. నిద్రలేమితో బాధపడేవారు పాలు ,పెరుగు ,చెరుకు రసం, అరటి ,ఆపిల్ ,నారింజ, దానిమ్మ ,తీయటి పదార్థాలు వంటివి
తీసుకుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది. నలుగు పెట్టుకోవడం, గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, నూనెతో తలకు మర్దన చేసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది . అరిపాదాలను ,లావెండర్ నూనె లేదా తేనెతో గానీ మర్దన చేసినా చక్కగా నిద్ర పడుతుంది.
గోరువెచ్చటి పాలను అరచెంచా అశ్వగంధ చూర్ణం కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. రాత్రి భోజనానంతరం పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదంపప్పు ,దాల్చిన చెక్క ,యాలకుల పొడి వేసి తాగాలి .గసగసాలను వస్త్రంలో కట్టి వాసన పీల్చినా ప్రయోజనం ఉంటుంది. జాజిపూలను దిండు కింద పెట్టుకొని
పడుకుంటే నిద్ర పడుతుంది. తరచూ ఈ తైలం లేదా బాదం నూనెతో తలకు మర్దన చేసినా ఫలితం ఉంటుంది. ఎన్ని నియమాలు పాటించినా సమస్య తగ్గకపోతే వైద్యుల్ని సంప్రదించాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Featured post
NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
మనం తినే ఆహార పదార్థాలలో మహా ఔషధ శక్తులు నుండి ఉన్న ముల్లంగి కూర కూడా ఒకటి. ఈ ముల్లంగి తల నుండి పాదాల వరకు వచ్చే సమస్త రోగాలను సర్వనాశనం...