5, నవంబర్ 2011, శనివారం

USES OF CAMPHOR ( KARPOORAM ) ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ANAEMIA - CAUSES AND REMEDIES ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

REMEDIES FOR VULVODYNIA ( VEGINAL PAIN / YONI SHOOLA ) ( IN TELUGU ) - DR . RAMAKRISHNA

ఆయుర్వేదంలో.. సయాటికా కు పరిష్కారాలు

అమ్మాయీ.. నా ఎడం కాలు లాగేస్తోందమ్మా.. తుంటి నుండి అరి కాలి వరకు విపరీతమైన నొప్పి.ఆయన ఇచ్చిన మందులు వేసుకుంటున్నాను కూడా. అయినా బాధ తగ్గడం లేదు.. ఇది ఒక నడి వయసు తల్లి ఆవేదన. తుంటి నుండి వెనుక వైపు, పక్కల విపరీతమైన నొప్పి, తిమ్మిరిగా ఉండటం, రెండు కాళ్ళ కండరాలు బలహీన పడటం,సూదులు పొడిచినట్లుండటం,అశాంతి.. ఇవి సయాటికా నొప్పిని సూచిస్తాయి. అసలు సయాటికా అంటే ఏమిటి..ఇది మన శరీరంలో అతి పెద్ద నరం. ఇది మన నడుం నుండి పిరుదుల వెనుక వరకు ఉంటుంది. ఇది మన వెన్ను పూసలలో చివర ఉన్న నాలుగైదు లంబారు పూసలు మొదటి సెక్రల్ పూసల మధ్య నుండి వెలువడి సేక్రల్ ప్లేగ్జేస్ అనే నరాల కూటమి నుంచి వచ్చి మన నడుం కింద భాగాలను,తొడలు, కాళ్ళు,అరికాళ్ళు,వీటిలో కదలికను,స్పర్శను కలుగ చేస్తుంది.
ఇది మన శరీరంలో అత్యంత బలమైన నరం. దీనికి రెండు ఉప నరాలు అను సంధానంగా ఉంటాయి.. అవి కామన్ పెరోనియల్, టిబియల్ అనేవి. ఇవి మోకాలు కింద కండరాలను, పాదాలు, కాలి వేళ్ల కండరాలకు స్పర్శను,కదలికను కలుగ చేస్తుంది.
ఆధునిక వైద్య శాస్త్రం రీత్యా సయాటికా అంటేనే సయాటికా నరానికి వచ్చిన లోపాల వల్ల వచ్చే నొప్పి అని నిర్వచించ వచ్చు. ఈ నరం చుట్టూ ఉన్న పొరవాయటం వల్ల కాని నరాల మూలం పై ఏదైనా ఒత్తిడి కానీ కారణం కావచ్చు. నిజానికి ఈ నొప్పికి మందులంటూ ఏమీ లేవు. పూర్తి విశ్రాంతి తప్ప సంపూర్ణ చికిత్స అనేది  లేదని తెలుసుకోండి.

సయాటికా నొప్పి లక్షణాలు..
సయాటికాను ఆయుర్వేదంలో " గృధ్ర శీ వాతం" అంటారు. వాతం అంటే మన కదలికలకు కారణమైన నరాల శక్తి.. అది గ్రుధ్ర శీ నరాన్ని దెబ్బ తీస్తే దాని వల్ల వచ్చే నొప్పి కనుక గ్రుధ్ర శీ వాతం అంటారు. నాటి శాస్త్రజ్ఞులు శరీరాన్ని నడిపించే మూడు శక్తుల కారణంగా శరీరం,మనస్సు,ఆత్మ ఏ బాధ లేకుండా ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యమనీ,అందులో ఏ శక్తిలో నైనా మార్పులోస్తే వ్యాధి అనీ అంటారు. అలాగే ఎక్కువగా ఎండిపోయిన నిలవ ఉన్న ఆహారం తినడం వల్ల, ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు చరించడం వల్ల, మానసికంగా ఎప్పుడూ ఎక్కువగా చింతించడం వల్ల, దెబ్బలు తగలడం వల్ల ఈ గ్రుధ్ర శీ నరం పాడు అయ్యి , విపరీతమైన నొప్పి, తిమ్మిరి ఎక్కడం, గట్టిగా నొక్కి పట్టుకుంటే కాస్త తగ్గినట్లుండటం, వంటివి కనిపిస్తాయి. సాధారణంగా నొప్పి నడుం చివర భాగంలో ఆరంభమై తొడల లోపలి భాగంలో కి పాకి మోకాళ్ళ కిందికి జారి పిక్కలకు చేరి మొత్తం కాలుతో ఆరంభమై విపరీతంగా లాగినట్లు బాధ ఉంటుంది.. కాళ్లు కదపడం కష్టం అవుతుంది.. మొత్తానికి ఈ వ్యాధి తిమ్మిరితో సూదులు పొడిచినట్లు ఉండి ఒక్కొక్కప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.. నిజానికి ఎటు వైపు ఉంచినా నొప్పి తగ్గినట్లు అనిపించదు. దీని నివారణ ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్ప బడింది.


ఒకటి.. కారణాన్ని సరి చేయడం,రెండు.. వచ్చిన స్థితిని క్రమ పరచడం. మొదట శరీరమంతా నువ్వుల నూనె తో కానీ, ధన్వంతరి తైలంతో కానీ ముఖ్యంగా నడుం నుండి కిందికి బాగా రాసి సున్నితంగా మర్దన చేసిన తర్వాత చెమట పట్టేలా స్వేదన క్రియ చేసి లోపలి దోషాలను బయటకు పంపాలి. అలాగే వారానికి ఒక్కసారి ఎనిమా చేసుకోవడం, కూడా అవసరం. దీన్ని ఆయుర్వేద చికిత్సలలో " వస్తి" అంటారు. సాధారణంగా, మాంస రసం, ఉసిరిక రసం చాలా ఉపయుక్తంగా ఉంటాయి.వెల్లుల్లి, నిర్గుండి, త్రిఫలా చూర్ణం, రాస్నా వంటివి చాలా ఉప యుక్తంగా ఉంటాయి.
త్రయో దశాంగ గుగ్గులు, వాతగజాంకుశ రసం, బృహత్ వాత చింతామణి, రాస్నాది కషాయం, ఏరండ స్నేహం వంటివి చక్కటి మందులు.
నీరుల్లి పాయల రసం, ఆవ నూనె సమ భాగాలుగా తీసుకుని కలిపి పైన మర్దన చేసుకుంటే చాలా శాంతిగా ఉంటుంది.
నీరుల్లి పాయల రసం, అల్లపు రసం,తేనె .. సమ భాగాలుగా తీసుకుని పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఈ వాత వ్యాధులలో మనం ఆవాతాన్ని అంటే ఆ నరం లో మారిన శక్తిని సమ పరిచే ఆహారాన్ని తీసుకుంటే తొందరగా మందు పని చేసి నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఆ వ్యాధిని పెంచే పదార్థాలు తినకుండా ఉంటే వ్యాధి తొందరగా తగ్గుతుంది.
వేడి నీళ్ల స్నానం మంచిది..
బూడిద గుమ్మడి కాయ,మినుములు, వంకాయ , ములగ కాయ, కాకర కాయ, చక్ర వర్తి కూర, నల్ల ఉలవలు,గోధుమలు, చేమ, పొట్ల, ముల్లంగి, జీలకర్ర, ఇంగువ, కంద వేడి నీటితో అభ్యంగ స్నానం పత్యం. అలాగే చల్లటి నీళ్ళు,దోసకాయ, ఆనప కాయ, సొర కాయ, పెసలు, అమం , ఆవాలు, వేప పండ్లు, కొత్త ధాన్యం, ఉప వాసం, బీరకాయ, చల్లటి ప్రదేశాలకు వెళ్లడం అపత్యం.
విష ఇష్ట తైలం, బలా తైలం, క్షార బలా తైలం, శృగంధ తైలం, ధన్వంతరి తైలం, కర్పూర తైలం.. వీటిలో దేనితో నైనా సాయంత్రం మర్దన చేసుకుని వేడి నీటితో స్నానం చేయడం హిత కరం. విడంగాసవం ఉదయం, సాయంత్రం మూడు చెంచాల మందు, మూడు చెంచాల నీరు కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న క్రిములన్నీ వెళ్ళి పోతాయి.
అల్లం 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు కలిపి నూరి రోజూ రెండు సార్లు గోరు వెచ్చని నీటి తో తీసుకుంటే చాలా హిత కరం. వేరు శనగ నూనె, తీపి పదార్థాలు, వేడి చేయని ఎండిన పదార్థాలు తిన కూడదు.

Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...