4, ఏప్రిల్ 2013, గురువారం

KANNU ( EYE ) - AYURVEDAM





రావి చెట్టు / RAVI CHETTU ( PIPAL TREE ) - ఆయుర్వేద ఉపయోగాలు. / AYURVEDAM

రావిచెట్టు ప్రస్తావన మన పురాణాలలో అనేకచోట్ల కనిపిస్తుంది.విష్ణువు ఇచ్చిన వరం తో జ్యేష్టా దేవి రావిచెట్టు మొదలులో నివాసం ఏర్పరచుకుందని ఆదివారాలనాడు రావి చెట్టును తాకరాదని ఇలా రావిచెట్టు గురించిన ఆధ్యాత్మికమైన విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి.అధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదపరంగా కూడా ఈ చెట్టు విశిష్ట స్థానం సంపాదించుకుంది.అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు రావిచెట్టు నుంచి సేకరించిన వస్తువులతో అమోఘమైన వైద్యం చేయవచ్చని తెలుస్తోంది.

1. జీర్ణాశయ వ్యాధులు తగ్గడానికి - 

వాంతులు తగ్గడానికి 

7 ఎండి రాలిన రావి ఆకులు తెచ్చి ,కాల్చి ,నీళ్ళలో వేసి కొంతసేపు ఉంచి వడగట్టి తాగినచో ఏ మందుకూ తగ్గని వాంతులు తగ్గిపోతాయి.

వాంతులు,ఎక్కిళ్ళు తగ్గడానికి.

రావి పట్ట కాల్చి చేసిన బూడిదను నీళ్ళలో వేసి తాగించినచో వాంతులు,ఎక్కిళ్ళు తగ్గును.

కడుపు నొప్పి తగ్గడానికి -

2 రావి ఆకులను ,బెల్లముతో ఇచ్చినచో కడుపు నొప్పి తగ్గును.దీని పండ్లు జీర్ణ శక్తి కలిగించును.దాహమును అణచును,రుచి కలిగించును.తాజా పండ్లు తినినా,లేక నీడలో ఎండించి చేసిన చూర్ణమును అరచేతి గుంటలో పట్టినంత ఉదయాన్నే పుచ్చుకుని నీళ్ళు తాగినచో పై గుణము కనిపించును.

కలరా వాంతులు తగ్గడానికి - 

రావి ఆకులు 2, మిరియాలు 5,లవంగాలు 7,అన్నింటిని కలిపి నీటితో నూరి వడకట్టి ప్రధమమున ప్రతి 15 నిమిషాలకు ,తర్వాత ప్రతి 2 గంటలకొకసారి ఇచ్చినచో కలరా వాంతులు ఆపి కలరా విషమును హరించును.

2. కాలేయ , ప్లీహ వ్యాధులు తగ్గడానికి - 

రావి చెక్క లోపలి మెత్తని భాగము 40 గ్రాములు ,నీటిలో ఒక రాత్రి నానపెట్టి ,దానికి సమభాగం సురేకారం కలిపి అరటి పండు పైన 2 గ్రాములు చల్లి ఉదయం పూట తినిన కొలది పై వ్యాధులు తగ్గును.దీనిని సేవించునప్పుడు పెసర పప్పు పొంగలి మాత్రమే తినాలి.పసరికలలొ ప్రత్యేక గుణం కనిపించును.

ప్లీహోదరము తగ్గడానికి -

రావి ఆకును నీడలో ఎండించి చూర్ణం చేసి బెల్లం కలిపి శనగ గింజంత మాత్రలు చేసి ఉదయం ,సాయంత్రం 4,5 మాత్రలు పుచ్చుకుని వెంటనే సోంపు కషాయం తాగినచో వ్యాధి తగ్గును.

కడుపులో బల్లలు తగ్గడానికి - 

రాగి కొమ్మతో గిన్నె చేసి దానితో నీZటిని తాగుచున్నచో వ్యాధి తగ్గును.

3 . ప్రేగుల వ్యాధులు తగ్గడానికి - 

మలబద్ధకం తగ్గడానికి -

రావి పండ్ల గింజలను నీడలో ఎండబెట్టి చేసిన చూర్ణమును రాత్రులలో పడుకోవడానికి ముందు గుల్కంద్ తో చేర్చి 10 గ్రాముల మోతాదులో సేవించి కాచిన పాలు తాగిన యెడల మలబద్ధకం తగ్గును.

విరేచనం కావడానికి -

రావి చిగుళ్ళను,ఆకులను కషాయం కాచి తాగినచో విరేచనమగును.

కడుపులోని క్రిములు నశించుటకు -

రావి ఆకులను నీడలో ఎండబెట్టి చేసిన చూర్ణమును బెల్లం తో కలిపి 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు రాత్రి పడుకునే ముందు సోంపు ద్రావకం తో ఇచ్చినచో కడుపులోని క్రిములు చనిపోవును.

మొలల బాధ తగ్గుటకు - 

రావి ఆకులను,వేప ఆకులను కలిపి నూరి మొలలపై లేపనం చేసినచో బాధ తగ్గును.

4 . చర్మ వ్యాధులు తగ్గుటకు -

గడ్డలు తగ్గటానికి ,నొప్పులు,పైత్యపు నీరు,వాపు,తీట,గజ్జి,జిల,దురదఒడిసె అడ్డలు,పుండ్లు,తగ్గుటకు-

రావి ఆకులను ఉడికించి వేడి వేడిగా కట్టినచో ,లేక దీని పట్టను నీటితో నూరి పట్టు వేసినచో గడ్డలు కరుగును లేదా పగులును.దీని గంధం పట్టు వేసినచో నొప్పి పాతది ఐనా లేక కొత్తదైనా తగ్గును.దీనిని నూరి లేపనం చేసినచో పైత్యపు నీరు,వాపు తగ్గును.దీని కషాయం తాగించుచూ,కడుగుచూ వచ్చినచో తీట,గజ్జి,జిల ,దురద మొదలగునవి నశించును.ఆకు వెచ్చచేసి కట్టినచో ఒడిసె గడ్డలు నశించును.రావి పట్ట చూర్ణమును పుండ్లపై చల్లినచో మానని వ్రనములు కూడా మానును.రావి ఆకును వెచ్చచేసి కట్టినచో శరీరమందు ముడిపడిన కురుపులు హరించును.రావి ఆకుల కషాయం తీసుకుంటూ ,దానితో పై పైన కడుగుతూ వచ్చినచో చర్మవ్యాధులు నెమ్మదించును.కుష్తువ్యాధి సైతం నెమ్మదించునని తెలుస్తోంది. 

రక్త శుద్ధి కొరకు -

రావి పట్ట,ఆకుల రసం తీసి సేవించినచో రక్తం శుభ్రమగును.గింజలు మెత్తగా నూరి తేనెతో కలిపి  నిత్యము 10 గ్రాములు సేవించినచో సవామేహము,కుష్టు వ్యాధి తగ్గును.

5 .దంత వ్యాధులు తగ్గటానికి -

రావి పుల్లతో పండ్లు తోమినను ,వేరుతో రుద్దినను దంతములు శుభ్రపడి గట్టిగానుండును.రావి పట్టను మెత్తగా నూరి దానితో పండ్లు తోమినచో కదులుచున్న పండ్లు గట్టిపడును.

6 . మూత్రవ్యాధులు తగ్గడానికి -

రావి పట్టను నానబెట్టిన నీటిని గాని కాచి చేసిన కషాయం గాని సేవించినచో సెగరోగము ,మూత్రములోని మంట నివారణ అగును.లేత రావి ఆకులు 7 నూరి నీటిలో కలిపి శుభ్రపరచి ,కలకండ కలిపి తాగినచో మూత్రనాళమంట తగ్గును.రావిచెట్టు పైబెరడు చూర్ణము చేసుకొని నిత్యం 8 గురిగింజల మోతాదులో తినుచూ వచ్చిన మూత్రం ఎక్కువగా వచ్చుట తగ్గును.

7 . మెదడు వ్యాధులు తగ్గటానికి -

రావి చెట్టుకు కొత్తగా పుట్టిన కొమ్మల యొక్క తలలు 10 
,ఆవు పాలలో వేసి ఉడికించి పరగడుపున సేవించుచున్న ఉన్మాదము,అపస్మారం తగ్గును.రావి చిగుర్లు 10 పాలలో ఉడికించి నిత్యం ఉదయం సేవించినచో లేదా రావి ఆకులు లేతవి నీడలో ఎండబెట్టి 5 గ్రాములు నీతిలో వేసి తేనీటివలె కాచి పాలు ,చక్కెర వేసి తాగుచున్నచో మెదడుకు మంచి బలం కలుగును.

జ్ఞాపక శక్తి కొరకు -

పచ్చి రావి పట్టను నీడన ఎండబెట్టి మెత్తగా నూరి చెక్కర ,నెయ్యి కలిపి హల్వాలాగా చేసుకుని సేవించాలి.

స్పృహ తప్పిన వారికి -

రావి పాలు కొన్ని చుక్కలు ముక్కులో వేయాలి.

రావి పాలు,తేనె సమాన భాగాలలో కలిపి నొసటిపై లేపనం చేయాలి.

8 . రొమ్ము వ్యాధులు -

గుండె మంట తగ్గడానికి -

రావి పండ్లు తిన్నచో గుండెలో మంట తగ్గును.తాజావి దొరకనప్పుడు ఎండినవి తినవచ్చు.

దగ్గు తగ్గడానికి -

రావి ఆకులను పెనంపై వేసి దాని మీద గిన్నెను బోర్లించి చుట్టు అంచును పిండిని అతికించి కింద సన్నని మంట చేసి ఆకులు కాలిన తదుపరి తీసి నూరి కొద్దిగా ఉప్పు పొడి కలిపి పెట్టుకోవాలి.దగ్గు వచ్చినప్పుడు కొంచెం కొంచెం గా నాకించాలి.

ఆకులను నీడలో ఎండబెట్టి నూరి కొంచెం శుద్ధి చేసిన తుమ్మ బంక వేసి మాత్రలు చేసి వీటిని నోటిలో వేసుకుని రసం మింగిన దగ్గు నయమగును.

ఉబ్బసపు దగ్గు,ఉబ్బసం తగ్గడానికి -

రావి పట్టను కాల్చి బూడిద చేసి దానిని నీటిలో కలిపి 7 రోజుల తర్వాత ఆ నీటిని శుభ్రపరచి సీసాలోకి తీసుకుని 20 నుంచి 50 గ్రాములవరకు ఉదయం వాడిన ఉబ్బసపు దగ్గు తగ్గును.

రావి పండ్లను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి నిత్యం ఉదయం అరచేతి గుంటలో పట్టినంత తిని నీళ్ళు తాగినచో పురాతన ఉబ్బసం కూడా నయమగును.

9 .జ్వరం తగ్గడానికి -

రావి ఆకుపై యంత్రమును రాసి నాకించిన జ్వరం తగ్గును.యంత్రం వలన గుణం లేకపోయినను ఆకును నాకుటవలన వ్యాధి తగ్గునని వైద్యుల అభిప్రాయము.

10 . పురుష వ్యాధులు - 

రావి పట్ట కషాయం సేవించినచో మూత్రం వెంట పోయే వీర్యమును అరికట్టును.

పచ్చి రావి పట్టను 4 జాములు / 12 గంటలు నీళ్ళలో నాననిచ్చి శుభ్రపరచి దానిలో కలకండ చేర్చి తాగినచో మూత్రంలో వీర్యం పోవుట ,శీఘ్రస్ఖలనము మొదలగు ఇంద్రియ నష్టాలను ఆపి వీర్యాన్ని వృద్ధి చేసి స్థంభన శక్తిని ఇచ్చును.నడుము నొప్పి పోగొట్టి నడుముకు శక్తి కలిగించును.

వెదురు పప్పు మెత్తగా నూరి దానిపై 10 చుక్కలు రావిపాలు వేసి తిని వెంటనే పాలు తాగిన ఇంద్రియ నష్టాన్ని పోగొట్టును.

రావి పండ్లను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ,దానికి సమానంగా చక్కెర చేర్చి ఉదయం ,సాయంత్రం 5 గ్రాముల చొప్పున తీసుకుని పాలు తాగిన యెడల ఇంద్రియ నష్టాన్ని ఆపి వీర్య వృద్ధి చేసి పుంసత్వాన్ని హెచ్చించును.

11 . స్త్రీల వ్యాధులు - 

రావి పండ్లు నీడలో ఎండబెట్టి నూరి పెట్టుకుని స్త్రీలకు ఋతు స్నానమైనది మొదలు 14 రోజులు ఉదయం పూట వారి వారి అరచేతిలో పట్టినంత తిని వెంటనే పాలు తాగినచో గొడ్రాలు తనం పోయి బిడ్డలు కలుగును.

రావి ఊడలు 200 గ్రాములు ,చక్కెర 200 గ్రాములు చూర్ణం చేసుకుని నిలువచేసుకుని నిత్యం 20 గ్రాములు పాలతో 10 రోజులు బిడ్డలు కలగని దంపతులు సేవించినచో సంతానవంతులు అయ్యెదరు.

పధ్యం - 
ఈ 10 రోజులు అయిన తర్వాత దంపతులు సంభోగం చేయాలి.

రావి పట్ట,రావి ఆకు దంచి రసం తీసి ఉపయోగించినచో స్త్రీలకు కలుగు వివిధ స్రావాలు ఆపును.ఒకవేళ రసం రాని యెడల కషాయం కాచి సేవింపవచ్చు.







VEDURU BIYYAM ( BAMBOO RICE ) - AYURVEDAM





NOONELU ( OILS ) - AYURVEDAM




JWARAM ( FEVER ) - AYURVEDAM




REGU PANDLU - AYURVEDAM



NALLA CHARMAM ( BLACK SKIN ) - AYURVEDAM


GULABI FACE PACK - SKIN BEAUTY


CHINTHA CHETTU ( TAMARIND ) - AYURVEDAM



VASA KOMMU ( VACHA ) - AYURVEDAM

వసకొమ్మును లాటిన్ లో అకోరస్ కలమస్ అని ,సంస్కృతంలో వచ అని అంటారు.దీని చూర్ణాన్ని 250 - 500 మి.గ్రా మోతాదులో మాత్రమే వాడాలి.ఇది నీటి వనరులకు దగ్గరగా పెరుగుతుంది.దీని ఆకులు 60 సె.మీ పొడవుంటాయి.ఆకులు బాకుల మాదిరిగా కనిపిస్తాయి.వేరు దుంప పొడవుగా ఉంటుంది.పూవులు లేత అకుపచ్చ రంగులో గుత్తులుగా వస్తాయి.పండ్లు పసుపు రంగులో ఉంటాయి.దుంప లేదా వేరులో ఔషధ గుణాలుంటాయి.

1.అతిసారం / నీళ్ళవిరేచనాలు తగ్గడానికి - వసకొమ్ములు,తుంగముస్తల గడ్డలు,పసుపు,శొంఠి కొమ్ములు కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకు కలిపి మరిగించి కషాయం కాచి తీసుకోవాలి. ( అష్టాంగ హృదయం,చరక సమ్హిత చికిత్సా స్థానం,అష్టాంగ సంగ్రహ చికిత్సా స్థానం )

2. a . )మూర్చలు / ఎపిలెప్సీ తగ్గడానికి - బ్రాహ్మీ రసం , వసకొమ్ము ,చెంగల్వ కోష్టు వేరు ,శంఖ పుష్పి ( వేరు,ఆకులను ) పాత నెయ్యికి కలిపి ఘృతపాకం విధానంలో  ఘృతం తయారుచేసి వాడితే ఉన్మాదం,మూర్చలు ,తదితర రుగ్మతలు తగ్గుతాయి. ( బృంద మాధవ ,చరకసమ్హిత చికిత్సా స్థానం,వంగసేన సమ్హిత అపస్మార అధికరణం ,సిద్ధభేషజ మణిమాల )

b.) వసకొమ్ములను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని బాండీలో వేసి నల్లగా మాడేంత వరకు అట్లకాడతో కలదిప్పి దించి ,మెత్తగా దంచి జల్లెడపట్టి నిలువ చేసుకోవాలి.రోగుల వయసును బట్టి , వ్యాధి తీవ్రతను బట్టి పిల్లలకు 1 నుంచి 3 చిటికెల మోతాదుగా పెద్దలకు 1 గ్రాము నుంచి 3 గ్రాముల మోతాదుగా మంచి నీటితో కలిపి తాగుతుంటే మూర్చ వ్యాధి హరించి పోతుంది.

3. ఎసిడిటీ తగ్గడానికి - వస చూర్ణాన్ని తేనె,బెల్లంతో కలిపి తీసుకుంటే అసిడిటీలో హితకరంగా ఉంటుంది.

4.శరీరపు వాపు , వృషణాల వాపు తగ్గడానికి - వసకొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే వాపు తగ్గుతుంది.

5.చర్మ వ్యాధులు / కుష్టం తగ్గడానికి - వసకొమ్ములు , చెంగల్వ కోష్టు వేరు ,విడంగాలను మెత్తగా నూరి నీళ్ళు కలిపి ముద్ద చేసి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.( వంగసేన సమ్హిత , కుష్టధికారం )

6.మొటిమలు తగ్గడానికి - వసకొమ్ముల గంధం,లొద్దుగ చెక్కల గంధం ,ధనియాల పొడిని కలిపి మొహం మీద ప్రయోగిస్తే యవ్వనంలో వచ్చే మొటిమలు తగ్గుతాయి. ( వంగ సేన , క్షుద్రరోగాధికారం )

7.తలనొప్పి / అర్థశిరో వేదన తగ్గడానికి - పచ్చి వసకొమ్మును దంచి రసం పిండి ,పిప్పళ్ళ పొడిని గాని ,ఇప్పపువ్వుల రసాన్ని గాని కలిపి తేనె కూడా చేర్చి ముక్కులో నస్యం రూపంలో బిందువులుగా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.ముఖ్యంగా సూర్యావర్తం ,అర్థావభేదం వంటి తలనొప్పుల్లో ఇది అమితమైన ఫలితం చూపిస్తుంది. (సుశృత సమ్హిత ఉత్తర స్థానం, బృందమాధవ )

8.జుట్టు ఊడటం / ఎలోపేషియా తగ్గడానికి - వసకొమ్మును ,దేవదారు వేరు  పట్ట లేదా గురివింద గింజలను ముద్దగా నూరి ,జుట్టు ఊడిన చోట లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.దీనికి ముందు సిరా వ్యధనం ద్వారా రక్త మోక్షణం చేయాల్సి ఉంటుంది.( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )

9.  a.) గాయాలు,అభిఘాతాలు,దుష్ట వ్రణాలు తగ్గడానికి - వసకొమ్ము వేసి కాచిన నీళ్ళతో వ్రణాన్ని కడిగి శుభ్రం చేస్తే తొందరగా మానుతుంది. ( సుశృత సమ్హిత సూత్ర స్థానం ).

b.) .వసకొమ్ము,పసుపు ,వాము వీటిని సమంగా తీసుకొని నీటితో నూరి తర్వాత కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఉడకబెట్టి ఆ ముద్దను గోరు వెచ్చగా దెబ్బలపైన ,గాయాలపైన కట్టు కడుతూ ఉంటే అవి త్వరగా మానిపోతాయి.

10.పసిపిల్లల్లో కళ్ళు అతుక్కుపోవడం - వసకొమ్ముపొడిని తేనెతో కలిపి గాని లేదా మదన ఫలాన్ని ఇప్పపువ్వులతో కలిపి ముద్దగా నూరి గాని పిల్లలకు నాకించి వాంతిని కలిగిస్తే కళ్లు పుసులు కట్టి అతుక్కుపోవడం తగ్గుతుంది. ( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )

11.రసాయనంగా - వసకొమ్ములను వేసి ఘృతపాక విధానంలో నెయ్యిని తయారుచేసి వందసార్లు ఆవర్తం చేసి దీర్ఘకాలం పాటు వాడితే శరీరం వజ్రసమానంగా తయారవుతుంది.వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.( సుశృతసమ్హిత చికిత్సా స్థానం )

12.మంచి జ్ఞాపక శక్తి,చక్కని కంఠ స్వరం కోసం - వసకొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెలపాటు తీసుకుంటే చక్కటి జ్ఞాపక శక్తి ,కోకిల లాంటి కంఠ స్వరం ,మంచి శరీర కాంతి సిద్ధిస్తాయి.సూక్ష్మ జీవులు దాడిచేయకుందా ఉంటాయి.వసకొమ్ములను ఆవునెయ్యికి కలిపి ఘృతపాక విధానంలొ నెయ్యిని తయారుచేసి వాడుకోవచ్చు ( అష్టాంగ హృదయం ఉత్తర స్థానం )

13.కడుపునొప్పి - వసకొమ్ములు ,సౌవర్చ లవణము ,ఇంగువ ,చెంగల్వ కోష్టు వేరు ,అతివిష వేరు ,కరక్కాయలు ,కొడిశపాల గింజలు ( ఇంద్రయవ బీజాలు )వీటిని కలిపి తీసుకుంటే ఉదర శూల వెంటనే తగ్గుతుంది.( సుశృతసమ్హిత ఉత్తర స్థానం )

14.అర్శమొలలు / పైల్స్ తగ్గడానికి - వసకొమ్ములను ,సోంపు గింజలను కలిపి నూరి ముద్దగా చేసి అర్శమొలలమీద ప్రయోగించాలి.దీనికి ముందు నువ్వుల నూనెను వేడిచేసి బాహ్యంగా ప్రయోగించాల్సి ఉంటుంది.( చరకసమ్హిత చికిత్సా స్థానం )

15.అజీర్ణం తగ్గడానికి - వసకొమ్ములతో తయారుచేసిన కషాయానికి సైంధవ లవణం కలిపి వాంతిని ప్రేరేపిస్తే అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది .

16.మూత్ర విసర్జనను ఆపుకోవడం వల్ల వచ్చే నొప్పి తగ్గడానికి - పాలను బాగా మరిగించి ,నీల్లు , వసకొమ్ముల చూర్ణం కలిపి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది ( భావ ప్రకాశం )

17.గుందె జబ్బులు తగ్గడానికి - వసకొమ్ములు , వేపచెట్టు బెరడుతో కషాయం తయారుచేసి ఇచ్చి వాంతిని కలిగిస్తే కఫప్రకోపం వల్ల వచ్చే గుండె జబ్బులు తగ్గుతాయి ( వంగసేన )

18.ఎలుక విషం విరుగుటకు - ఎలుక కాటువల్ల విష లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వసకొమ్ముల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో 3 నుంచి 7 రోజులపాటు ప్రతి రోజూ ఉదయం పూట తీసుకోవాలి.ఈ చికిత్సా కాలంలో ప్థ్యాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.( గదనిగ్రహం )

19.చెవి వ్యాధులు తగ్గడానికి -

వసకొమ్ములపొడిని వెలగ పండ్ల గుజ్జుతో కలిపి వేడి చేసి చెవి తమ్మె చుట్టూ పట్టుగా వేసుకుంటే చెవిపోటు,నొప్పి,ఇతర చెవి సమస్యలు తగ్గుతాయి ( గదనిగ్రహం )

20.తలనొప్పి తగ్గడానికి - వసకొమ్మును మెత్తని ముద్దగా నూరి నుదుటి మీద పట్టు వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

21.కీళ్ళనొప్పి ,వాపు తగ్గడానికి - వసకొమ్మును నీళ్లతో సహా మెత్తగా నూరి వాపులు,నొప్పుల మీద పట్టు వేసుకుంటే నొప్పి,వాపులనుంచి ఉపశమనం లభిస్తుంది.

22.బ్రాంఖైటిస్,న్యుమోనియా తగ్గడానికి - వసకొమ్మును నీటితో మెత్తగా నూరి చాతీ మీద పట్టు వేసుకుంటే నిమ్ము లాగేస్తుంది.

23.కలరా తగ్గడానికి - వసకొమ్మును నలగ్గొట్టి 4 గ్లాసుల నీళ్ళకు కలిపి మరిగించి వడపోసి ప్రతి పావు గంటకూ పావు గ్లాసు చొప్పున రోజుకు 3 - 4 సార్లు తాగితే కలరా వ్యాధిలో మంచి ఫలితం కనిపిస్తుంది.

24.కడుపునొప్పి,గ్యాస్ తగ్గుటకు - వసకొమ్మును నల్లగా మారేంతవరకు నిప్పుల మీద మాడ్చి కొద్దిగా ఆముదంతో గాని లేదా కొబ్బరి నూనెతో గాని కలిపి ఉదరభాగం మీద ప్రయోగిస్తే కడుపు నొప్పి ,గ్యాస్ ,ఉబ్బరింపు,గడబిడ వంటివి తగ్గుతాయి.

25.దగ్గు ,జ్వరం తగ్గడానికి - వసకొమ్ము , అతిమధురం వేరుల చూర్ణాలను ఒక్కోటి పావు చెంచా చొప్పున తీసుకొని 2 గ్లాసుల నీళ్ళకు కలిపి కషాయం మాదిరిగా మరిగించి కొద్దిగా చల్లారిన తర్వాత పూటకు పావు కప్పు మోతాదుగా మూడు పూటలా తాగితే దగ్గు,జ్వరం,కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి.

26.చిన్న పిల్లల్లో దగ్గు తగ్గడానికి - ముందుగా వసకొమ్ముకు ఆముదం పూసి ,ఎండబెట్టి ,నిప్పుల మీద నల్లని బొగ్గుగా మారేంతవరకు మండించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని 2 చిటికెల మోతాదుగా ,చెంచాడు తేనెతో కలిపి పిల్లల చేత 3 పూటలా తినిపించాలి.

27. పిల్లల ఉబ్బసపు కడుపు నొప్పి తగ్గడానికి - వస కొమ్మును నీళ్ళతో అరగదీసి ఆ గంధాన్ని పొత్తి కడుపు పైన లేపనం చేస్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది.

28. పక్షవాతం తగ్గడానికి - 1 కె.జి. వసకొమ్ములను 24 గంటల పాటు మంచి నీటిలో నానబెట్టి నీటిని తీసివేసి కొమ్ములను పొడి గుడ్డతో శుభ్రంగా తుడచి కొంచెం చితగ్గొట్టి పరిశుభ్రమైన కొత్తకుండలో వేసి ఆ ముక్కలు మునిగి పైన 2 , 3 అంగుళాల ఎత్తు వరకు మేలురకమైన పట్టు తేనె పోసి కుండకు మూత పెట్టి బట్టవేసి తాడుతో గట్టిగా గాలిపోకుండా బిగించాలి.ఆ పాత్రను గాలి తగలని చోట నెలరోజుల పాటు ఉంచాలి.
తర్వాత మూత తీసి ఊరిన వసకొమ్ములను రెండు పూటలా పూటకు 2 అంగుళాల ముక్కను బుగ్గన పెట్టుకొని కొనెం చప్పరిస్తూ ఆ రసం మింగుతుండాలి.ఇలా చేస్తూ ఉంటే పక్షవాతం ఇతర వాత రోగాలు హరించి పోతాయి.అంతే గాకుండా జ్వరాలు వచ్చే రుతువులో ముందుగానే రోజూ ఒక పూట ఈ ముక్కను చప్పరిస్తూ ఉంటే మశూచికం,అంటు జ్వరాలు,కలరా,అతిసారం సోకదు.అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి.

29.పిల్లల రొమ్ము పడిశం హరించుటకు - వసకొమ్మును నీటితో అరగదీసి ముక్కుపైన రాస్తుంటే పడిశం తగ్గుతుంది.

30.మాటలు రాని పిల్లలకు - పైన తెలిపిన విధంగా మంచినీటిలో శుద్ధిచేసిన కొమ్ములను సానరాయిపైన నీటితో అరగదీసి చిటికెడు గంధం 2,3 బొట్లు తేనె కలిపి పిల్లల చేత నాకిస్తుంటే మాటలు త్వరగా వస్తాయి.

31.మొలల బాధ వెంటనే తగ్గుటకు - వసకొమ్ములను నిప్పులపైన వేసి ఆ పొగను మొలల పిలకలకు తగిలేలా చేస్తుంటే మొలల పోటు ,తీపు వెంటనే తగ్గుతుంది.

32.కడుపులో నులి పురుగులు హరించుటకు - శుద్ధి చేసిన వసకొమ్మును మెత్తగా దంచి జల్లెడ పట్టి 1 గ్రాము పొడి 1 చెంచా తేనెతో కలిపి రెండు పూటలా తింటుంటే ఉదరములోని , ప్రేవులలోని వివిధ రకాల క్రిములు హరించిపోతాయి.

33. మొటిమలు హరించుటకు - వసకొమ్ము,ధనియాలు,లొద్దుగ చెక్క వీటిని సమభాగాలుగా తీసుకుని కలిపి పొడి చేసుకుని రాత్రివేళ తగినంత పొడిలో నీరు కలిపి మెత్తగా నూరి మొటిమలపైన లేపనం చేసి ఉదయం చల్లని నీటితో కడుగుతుంటే మొటిమలు తగ్గుతాయి.
34.పిల్లలకు ఆయుర్మాత చూర్ణం - నీటిలో ఒకరోజు నానబెట్టి ఎండబెట్టిన వసకొమ్ములు , అడ్డసరపు ఆకు,సరస్వతి ఆకు,దోరగా వేయించిన శొంఠి ,వేయించిన పిప్పళ్ళూ,చెంగల్వ కోష్టు,అతిమధురం,సైంధవ లవణం,వీటిని సమంగా తీసుకోవాలి.విడివిడిగా దంచి జల్లెడపట్టి మొత్తం కలిపి పలుచని బట్టలో వస్త్రగాళితం చేసి నిలువ ఉంచుకోవాలి.

పిల్లలకు పూటకు చిటికెడు పొడి మోతాదుగా పావుచెంచా తేనె కలిపి తినిపిస్తుంటే క్రమంగా ప్రతిభాపాటవాలు,జ్ఞాపక శక్తి ,ధారణ,ప్రజ్ఞ ,దేహ సౌందర్యం పెరుగుతాయి.

35. గుండె జబ్బులు తగ్గడానికి - శుద్ధి చేసిన వస,కరక్కాయల బెరడు ,సన్నరాష్ట్రం,పిప్పళ్ళు,శొంఠి,కచూరాలు,పుష్కరమూలం,సమభాగాలుగా తీసుకోవాలి.సన్నరాష్ట్రం,పిప్పళ్ళూ,శొంఠి లను దోరగా వేయించి పొడిచేసుకోవాలి.మిగిలినవి కూడా దంచి పొడి చేసుకొని అన్నింటినీ కలుపుకోవాలి.పూటకు 2 గ్రాముల మోతాదుగా ఒక కప్పు మంచినీటితో కలిపి రెండుపూటలా సేవిస్తుంటే గుండె జబ్బులు తగ్గిపోతాయి.

36 . పిచ్చి,అపస్మారం తగ్గుటకు - శుద్ధి చేసిన వసకొమ్ములను దంచి పొడి చేసుకొని రోజూ పూటకు 1 నుంచి 2 గ్రాముల పొడిలో 1 చెంచా తేనె కలుపుకొని కొద్దికొద్దిగా తింటూ ఆహారంగా అన్నం,పెసరపప్పు,మాత్రమే సేవిస్తుంటే ఎంతఒ కాలం నుంచి ఉన్న ఫిట్స్ ,పిచ్చి తగ్గిపోతాయి.





DANIMMA ( POME GRANATE ) - AYURVEDAM



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...