AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
20, మార్చి 2013, బుధవారం
19, మార్చి 2013, మంగళవారం
మొటిమలు - ఆయుర్వేద చికిత్స / PIMPLES - AYURVEDAM
చర్మ సౌందర్యాన్ని పెంచే ఔషధాలు.
1. మొటిమలను తగ్గించే ఔషదం
అర టీ స్పూన్ ఉడు కులాం ( మగవాళ్ళు వాడే జర్మన్ పర్ఫ్యూమ్ )
అర టీ స్పూన్ కాచి చల్లార్చిన నిమ్మరసం
ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలను కలపండి. సొల్యూషన్ తయారవుతుంది .దీనిని దూది ఉండతో మొటిమల మీద రు ద్దు కోండి . ఆరి పోయిన తర్వాత మళ్లీ పూసుకోండి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకోండి .ఇలా రోజూ ప్రతి రాత్రి పడుకునే ముందుచేస్తూ ఉండండి. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి. దీని లో ని ఆల్కహాల్ కొవ్వును కరిగిస్తుంది .నిమ్మరసం చర్మాన్ని మరమ్మతు చేస్తుంది.
2 . మొటిమలను తగ్గించే ఔషదం
రెండు టేబుల్ స్పూన్ల కమలాపండు తొక్కల చూర్ణం
నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు
ఒక బౌల్లో పైన తెలిపిన పదార్ధాలు చక్కగా కలపండి చిక్కని పేస్టు తయారవుతుంది. దీనిని చేతివేళ్ళతో కాని బ్రష్ తో కానీ ముఖం మీద మొటిమలు మీద పూసుకోండి. వలయాకారంలో లో రుద్దు కోండి. ఆరిపోయిన తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి . దీంతో చర్మం మీద రంధ్రాల పూడిక తొలగిపోతుంది. కమలాపండు తొక్కల చూర్ణం చర్మం మీద రక్తప్రసరణ పెంచుతుంది .సన్ ట్యా న్ ని తగ్గిస్తుంది. పెరుగు చర్మం మీద ఫంగస్ పెరగ నివ్వదు.
3 . కాంతి కోల్పోయిన చర్మాన్ని అందంగా మార్చే ఔషధం
ఒక టీ స్పూన్ కమలా పండు తొక్కలు చూర్ణం
ఒక టీస్పూన్ నిమ్మ పండు తొక్కలు చూర్ణం
ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి
ఒక టీ స్పూన్ బాదం గింజల పొడి
ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె
తగినంత రోజ్ వాటర్ పేస్టులాగా చేయడానికి
ఒక బౌల్లో పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పేస్టులాగా తయారుచేయండి. దీనిని చర్మం మీద పూసుకుని బాగా రుద్ది పావుగంట పాటు అలా వదిలేయండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. దీనితో మీ చర్మం కొత్త కాంతితో, తేజస్సుతో మెరిసిపోతుంది.
సన్నగా మారడానికి ఆయుర్వేద సూచనలు
సన్నగా ,నాజూకుగా మారాలనే కోరిక కల్గిన వారు కొన్ని ముఖ్యమైన సూచనలను పాటిస్తే సరైన ఫలితం ఉంటుంది.
1 . అన్ని రుచులూ కలిగిన ఆహార పదార్థాలను తినడం,వేపుడు కూరలకు బదులు పులుసు కూరలు వాడడం,ఆహారాన్ని నెమ్మదిగా తినడం చేయాలి.
2 . సమయానికి తక్కువ మొత్తాల్లో తినాలి.
3 . వ్యాయామానికి ముందు కనీసం ఏడాది పాటు పాత తేనెను 2 చెంచాలు ,గ్లాసెడు గోరు వెచ్చని నీటికి కలిపి తాగాలి.
4 . ఆహారంగా పీచు కలిగిన ఓట్స్ ,బార్లీ వంటి శూక ధాన్యం / సిరియల్స్ తినాలి.బియ్యం తినే వాళ్ళు ఏడాది పాతబడిన బియ్యం వాడాలి.
5 . వేడి నీళ్ళు తాగుతుండడం,వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి.
6 . మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.
7 . శరీరానికి ,మనసుకు ఎప్పుడూ ఏదో వ్యాపకం కలిగించుకుంటుండాలి.క్రమం తప్పకుండా అర్ధ శక్తిగా వ్యాయామం చేయాలి.
8 . స్నానానికి ముందు అగరు,పెసర్లు,చిరుశనగలు మొదలైన పదార్థాలతో చేసిన సున్ని పిండితో వేడి పుట్టేలా నలుగు పెట్టుకోవాలి.
9 . మెత్తటి సోఫాలూ,పరుపూ వాడకూడదు.
10 . పగటి పూట నిద్ర మంచిది కాదు.
ఇంటివద్ద చేసుకునే చికిత్సలు -
1 . ముల్లంగి రసం మోతాదుకు 3 చెంచాల చొప్పున రోజుకి 3 సార్లు తీసుకోవాలి.
2 . కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని మోతాదుకు అర చెంచా చొప్పున 2 పూటలా తేనెతో గాని లేదా వేడి నీటితో గాని తీసుకోవాలి.
3 . రేగు ఆకుల ముద్దను ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుకి కలిపి తీసుకోవాలి.
4 . ప్రతి రోజూ ఉదయం ఒక తమలపాకులో 10 మిరియం గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు చన్నీళ్లు తాగాలి.
5 . ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి.దీనిని మోతాదుకు చిటికెడు చొప్పున చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి.
6 . కటుక రోహిణి చూర్ణం 3 భాగాలు,చిత్రమూలం వేరు బెరడు చూర్ణం 3 భాగాలు ,శిలాజిత్ చూర్ణం 2 భాగాలు ,గలిజేరు / పునర్నవ పంచాంగ చూర్ణం 5 భాగాలు చొప్పున కలిపి మోతాదుకు అరచెంచాడు చొప్పున తేనెతో ఆహారం ముందు 2 పూటలా తీసుకోవాలి.
7 . తిప్పసత్తు / గుడూచి సత్వం ,తుంగముస్తల చూర్ణాన్ని 2 పూతలా తేనె అనుపానంగా మోతాదుకు 3 గ్రాముల చొప్పున తీసుకోవాలి.
8 . అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.
9 . శొంఠి ,వాయువిడంగాలు,యవక్షారం ,కాంత లోహ భస్మాల సమ మిశ్రమాన్ని 2 పూటలా పూటకు 1 గ్రాము మోతాదుగా తేనె అనుపానంగా తీసుకోవాలి.
10 . త్రికటు / శొంఠి,పిప్పళ్ళు,మిరియాలు ,త్రిఫలాలు / కరక్కాయ,తాని కాయ,ఉసిరి కాయ , వాయు విడంగాలు,చిత్రమూలం ,తుంగ ముస్తలను ఒక్కో దానిని రెండేసి భాగాలుగా తీసుకొని అందులో ఒక భాగం శుద్ధ గుగ్గిలాన్ని కలపాలి.ఈ మిశ్రమాన్ని మోతాదుకు 3 - 6 గ్రాముల చొప్పున తేనెతో కలిపి 2 పూటలా వాడాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Featured post
NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
telugu - thumma chettu english - indian gum arabic tree hindi - babul sanskrit - barbara 1 . ATHISARA VIRECHANAMULU THAGGUTAKU ( F...