Tuesday, 3 July 2018

తానికాయ తో కంటికి బలం.


1.) తానికాయ పెచ్చుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి 1 స్పూను మోతాదులో ప్రతి రోజూ తీసుకుంటే కంటికి బలం చేకూరడంతో పాటు ,కంటి చూపు వ్రుద్ధి చెందుతుంది.
2.) 1 స్పూను తానికాయ చూర్ణానికి తగినంత తేనె కలిపి,చప్పరించి మింగుతూ ఉంటే బొంగురు గొంతు సమస్య పోవడంతో పాటు , గొంతు నొప్పి,దగ్గు తగ్గుతాయి.
3.)  అర స్పూను గింజల పప్పును,రాత్రివేళ నిద్రకు ముందు నమిలి తింటే చక్కటి నిద్ర పడుతుంది.
4.) 10 గ్రాముల చూర్ణానికి రెట్టింపు తేనె కలిపి ,రోజుకు రెండు పూటలా సేవిస్తుంటే వుబ్బసం వ్యాధి త్వరగా తగ్గేందుకు తోడ్పడుతుంది.
5.) తాని గింజల పప్పును నూరి నిలువెల్లా పూసుకుంటే శరీరపు మంటలు తగ్గుతాయి.
6.) 3 గ్రాముల తానికాయల,7 గ్రాముల పాత బెల్లం కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే లైంగిక శక్తి పెరుగుతుంది.
7.) తానికాయ పెచ్చులు , అశ్వగంధ సమపాళ్ళలొ తీసుకుని చేసిన చూర్ణానికి సమానంగా పాత బెల్లం కలిపి సేవిస్తూ ఉంటే , వాతం వల్ల వచ్చే గుండె జబ్బులు తగ్గి పోతాయి.

No comments:

Post a Comment