3, ఏప్రిల్ 2013, బుధవారం

KADAMBA VRUKSHAM - AYURVEDAM



తెల్ల వెంట్రుకల సమస్య /THELLA VENTRUKALU ( WHITE HAIR ) - AYURVEDAM

తెల్ల జుట్టు అనారోగ్యానికి సూచన కాకపోయినప్పటికీ ఆందోళనను మాత్రం కలిగిస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో తెల్లజుట్టు వస్తుంటే అనేకమంది డీలా పడిపోతారు. అయితే సరైన అవగాహన కలిగి ఉంటే ఈ సమస్యను తేలికగా ఎదుర్కోవచ్చు. మన తల మీద పెరిగే ప్రతి వెంట్రుక కు నల్లని రూపంలో ఉన్న కాండం ఉంటుందిి. అలాగే వెంట్రుకలను స్థిరంగా ఉంచడం కోసం  అడుగున ఒక మూలం ఉంటుంది .ఈ మూలం లో ఉండే గ్రంధులు నల్ల రంగు కు కారణమైన  మెలనిన్ అనే ఒక వర్ణ విశేషాన్ని విడుదల చేస్తుంటాయి. ఎక్కువ మంది భారతీయులు జుట్టు రంగు నలుపు లో ఉంటే కొంతమందికి రాగి రంగులో ఉంటుంది. వెంట్రుకల్లో ని వర్ణ వశేషాల సాంద్రతల్లో తేడాల వలన రంగులో మార్పులు కనిపిస్తుంటాయి.
 వెంట్రుకల అడుగు భాగంలో ఉండే సెబేసియస్ అనే గ్రంధులు  సెబం అనే ఒక నూనె లాంటి పదార్థాన్ని వెంట్రుకల కుదుళ్ల లోనికి విడుదల చేస్తూ ఉంటాయి. దీనివల్ల వెంట్రుకలు మృదువుగా ,స్నిగ్ధంగ మెరుస్తూ ఉంటాయి.
 ఈ గ్రంథుల పనితీరు లోపం ఏర్పడితే వెంట్రుకలు బిరుసుగా పొడిగా మారుతాయి. వయసు మీదపడుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం సహజ0. దీనికి కారణం వెంట్రుకల కణజాలాలు లోనికి గాలి చేరడమే. అలాగే వెంట్రుకల రంగుకు కారణమైన మెలనోసైట్స్ కణజాలాలు క్రమంగా అంతరించిపతున్న డం వలన మెలనిన్ సరిగా విడుదల కాకపోవడం జరిగి జుట్టు తెల్లబడుతుంది. అయితే యుక్త వయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటే మాత్రం దాని గురించి ఆలోచించ వలసి ఉంటుంది. ఆయుర్వేదం అకాల వార్థక్యం చిహ్నాలను  వలీ ఫలితాల పేరుతో వర్ణించింది .యుక్త వయసులో జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం జన్యుపరమైన మార్పులు అయినప్పటికీ ఇతర శారీరక రుగ్మతలను ఆహారపరమైన సమస్యలను విస్మరించకూడదు. బి విటమిన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, రక్తాల్పత, ధూమపానం ఇలాంటివన్నీ జుట్టును త్వరగా నిలబడలా చేస్తాయి కాబట్టి
 తెల్లజుట్టు సమస్యను కాస్మొటిక్ సమస్యగా కాకుండా వైద్యపరంగా కూడా చూడవలసి ఉంటుంది.

నెరిసే జుట్టుకు కొన్ని నివారణ ఉపాయాలు

తిప్పతీగ ,ఉసిరి ,పల్లేరు కాయ ,వీటి చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని తేనెతో కలిపి మూడు పూటలా పూటకు ఒక చెంచా చొప్పున తీసుకోవాలి.

 లేదా 

ఎండిన గుంటగలగరాకు రెండు భాగాలు, నల్ల నువ్వులు ఒక భాగం ,ఉసిరి ఒక భాగం కలిపి వీటి చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా చక్కెర కలిపిన పాలతో తీసుకోవాలి. అలాగే స్వర్ణ మోక్ష భస్మం అని ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది దీనిని 240  మిల్లీగ్రాముల చొప్పున  తేనెతో కలిపి తీసుకోవాలి.

వెంట్రుకల నలుపుదనాన్ని కాపాడే కొన్ని ఆయుర్వేద బాహ్యప్రయోగాలు.


ఒక రాత్రి అంతా కొన్ని ఉసిరికాయలను నీళ్లలో నానేసి నీళ్లను సిద్ధం చేసుకోవాలి .అలాగే మండూరి భస్మం, ఉసిరికాయ, మందార పువ్వు వీటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా రుబ్బిి పేస్టులాగా చేయాలి .దీనిని తలకు పట్టించి గాలికి ఆరనివ్వాలి.
జుట్టు బాగా ఆరిన తర్వాత ఉసిరి నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవలసి ఉంటుంది. దీనికి మరో పద్ధతి -  ఉసిరికాయ రెండు భాగాలు ,తానికాయ ఒక భాగం ,కరక్కాయ  రెండు భాగాలు,  కా వి రాయి ఐదు భాగాలు, మండూర ము అనగా  భూమిలో పాతి ఏసిన ఇనుమును  చూర్నించగ వచ్చేది ,వీటిని మెత్తని పొడిగా దంచాలి. ఉసిరికాయలను నానేసిన నీళ్లలో ఈ పొడిని కలిపి ఒక ఇనుప పాత్రలో ఒక రాత్రంతా ఉంచాలి. దీనిని ఉదయాన్నే తలకు పట్టించాలి .కొంతసేపయిన తర్వాత శుభ్రంగా కడిగి వేయాలి. ప్రతిరోజు  నీలి భృంగా ది తైలమును తలకు రాసుకోవాలి. అలాగే ఏలాది తైలం అనే మందు నూనెతో తలకు మర్దన చేయించుకోవాలి.


 
ఊడుుుగ పువ్వు, గుంటగలగరాకు, కలువ దుంపలు సమాాాన భాగాలుగా తీసుకుుుని మెత్తగాముద్దగా నూరాలి. ఈ ముద్దకుుుు నాలుగు భాగాలు నువ్వుల నూనెనుు కలిపి నూనెకు 16 రెట్లు మంచి నీళ్లను చేర్చి, నీరంతా ఇంకిపోోయి అంతవరకు చిన్నమంటమీద కాచి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనినిి తలకు మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలుు నల్లబడతాయి.

 కామంచి గింజలు నల్ల నువ్వులు సమానంగా తీసుకుని గానుగ లో వేసి తైలాన్ని తీయాల.
 దీనిని రోజువారిగా తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. అంతే కాకుండా అన్ని రకాల తలనొప్పులు తగ్గిపోతాయి.

1,2 గ్రాముల కరక్కాయ చూర్ణం లో తేనెను కలిపి ప్రతిరోజూ తింటుంటే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. 

 కరక్కాయ, తానికాయ ,ఉసిరికాయలను గింజలు తీసి వేసి ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుని, మామిడి జీడి కూడా కలిపి చూర్ణం లాగా దంచాలి. దీనికి పావు కిలో నువ్వుల నూనెను కలిపి ఒక ఇనుప మూకుడు లో ఉంచి మూత పెట్టి వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి .దీనిని వడపోసుకుని తల నూనెగా వాడుకోవాలి.

ఆహారంలో తాజా పండ్లు ,కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి .మరీ వెచ్చగా కాకుండా ,గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. అలాగే రక్తాల్పత ,థైరాయిడ్ వంటి సమస్యలుంటే వైద్య చికిత్స చేయించుకోవాలి.

MIRIYALU - AYURVEDAM



CHINNA PILLALU - AYURVEDAM




MAREDU ( BILVA ) - AYURVEDAM



MOORCHA ( FITS ) - AYURVEDAM



GIRIJANS - AYURVEDAM


THALLULU - AYURVEDAM



Featured post

NARAYANA HRUDAYALAYA ANSWERS FOR HEART PATIENTS ( IN TELUGU )

రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...