AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
Monday, 27 December 2021
Friday, 24 September 2021
Wednesday, 14 July 2021
పుండు మచ్చలకు తేనె
గాయాలు , డోకుడు పుళ్ళు,కాలిన పుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు పుండు మాడిన తర్వాత రోజూ ఆ ప్రాంతం మీద తేనె రాయండి.చర్మం మీద పొరలు త్వరగా వచ్చి చర్మం రంగులో మచ్చలు కలిసిపోతాయి.లేకపోతే తెల్ల మచ్చలు మచలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.
పేగు పూత - చేమంతి పూల మందు.
గ్యాస్ ట్రబుల్ ,కడుపులో మంట, కడుపులో నొప్పి ఇలా ప్రారంభమై నెమ్మదిగా పేగు పూత వ్యాధిగా పరిణమించే పెప్టిక్ అల్సర్ జబ్బుకు విమోచనం లేదు .ఎందుకంటే మనం ఈ వ్యాధిని అనునిత్యం ఏదో ఒక విధంగా పెంచి పోషిస్తూ నే ఉంటాం కాబట్టి. కడుపు మండ ని వారు ,కడుపులో మంట లేనివారు ఈ లోకంలో ఎవరు ఉంటారు చెప్పండి. అల్సర్ వ్యాధి కి ఇదే కదా కారణం - కడుపుమంట!
చేమంతి పూలను ఎండించి చూర్ణం చేసి మంచి తేనెతో తీసుకుంటే పేగులకు బలం !అన్నం తినగానే కడుపునొ ప్పి వస్తున్న వారు ,నొప్పి వచ్చినప్పుడు ఏదైనా ఆహారం తీసుకుంటే తగ్గిపోతున్న వారు ఇద్దరికీ ఇది మంచి మందు.కడుపులో పాములు కూడా దీంతో చచ్చి పడిపోతాయి.
తలలో పేలు పోవడానికి సీతాఫలం గింజలు
సీతాఫలం గింజలను సేకరించుకుని శుభ్రంగా కడిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచుకోండిి. వీలైతే వీలైతే సీతాఫలం సీతాఫలం లేత ఆకులను కూడా ఎండించి దంచి ,ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో తీసుకుని ,కాసింత నీరు పోసి తడిపి తలకి పట్టించండి.ఒక అరగంట తర్వాత తలంటు పోసుకొండి.తలలో పేలు పోతాయి.తలలో పుళ్ళు తగ్గు తాయి.శరీరం మీద పుళ్లకు కూడా ఈ పొడిని రాయవచ్చు.
శ్రావ్యమైన స్వరం కోసం - మామిడి చిగురు
మావి చిగురు తినగానే కోయిల కూసేనా అని పాట ఉంది, మామిడి చిగురు తిన్నంత మాత్రాన కోయిల కూస్తుందా? కోయిలే కాదు మామిడి చెట్టు లేత చిగుళ్ళు తింటే మనం కూడా శ్రావ్యంగా పాడగలుగుతాం.గొంతు శుద్ధి అవుతుంది.
ఈ లేత చిగుళ్ళు మెత్తగా దంచి ,నీళ్లలో కలిపి బాగా మరిగించి ,చిక్కటి కషాయం తీసి వడగట్టి పంచదార కలుపుకొని తాగితే మంచిది.
ఈ కషాయాన్ని పంచదార వేయకుండా ,నోట్లో పోసుకుని పుక్కిలిస్తే గొంతు,నోరు వ్యాధులన్నీ తగ్గి ,గొంతు శుద్ధి అవుతుంది.
Tuesday, 13 July 2021
మానసిక వ్యాధులకు గులాబీల మందు
గులాబీ పువ్వులు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .ఆ పువ్వులను వాసన చూస్తేనే ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రశాంతత ,మానసిక శాంతి కావాలనుకునే వారికి గులాబీ పూలను ఔషధంగా సేవించడం మంచి మందు .
గులాబీ పువ్వులు ఎండించి మెత్తగా దంచి పంచదార కలుపుకుని రోజూ ఉదయం సాయంత్రం 1-2 చెంచాలు తినండి.
విరేచనం సాఫీగా అయ్యేలా చేసే గుణం కూడా ఉంది. కాబట్టి ఎంత మోతాదులో తీసుకుంటే ఒక్క విరేచనంంసాఫీ గా అవుతుందో అంత మోతాదులో ఈ గులాబీ రేకుల పొడిని తీసుకోండి.మానసిక వ్యాధులు అలజడులు మనోవికారాలున్నవారికి ఇది క్విక్ రెమెడీ గా పనిచేస్తుంది.బీపీ వ్యాధి ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన మందు.
నీరసానికి కిస్మిస్ మందు
ఎండిన కిస్మిస్ పండ్లు బజార్ లో దొరుకుతాయి.ఈ ద్రాక్ష పండ్లకు సమానంగా పంచదార ,తేనె కలిపి ఒక సీసా లో పోసుకుని రోజూ రెండు చెంచాల మందు ఉదయం,సాయంత్రం తాగండి.కడుపులో వేడి తగ్గుతుంది.అజీర్తి పోతుంది, పైత్యం తగ్గుతుంది. అమీబియాసిస్ వ్యాధి వలన కలిగిన ఉడుకు తగ్గుతుంది.గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది.ప్రయత్నించి చూడండి. మీకు షుగర్ వ్యాది లేకపోతేనే ఈ ప్రయోగం చేయాలి సుమా!
Tuesday, 18 May 2021
సహజ వైరస్ సంహారకాలు... / NATURAL VIRUS KILLERS.
సహజ వైరస్ సంహారకాలు...
1.) తులసి -
ఇది అద్భుతమైన వైరస్ సంహారిణి. రోజూ ఉదయాన్నే 10,15 తులసి ఆకుల్ని నమిలి తినేయాలి.
2.) పుట్టగొడుగులు -
వైరస్ ను సమర్థంగా నిరోధించే గుణం పుట్టగొడుగులకు ఉంటుంది . వీటితో రుచికరమైన సూప్ తయారుచేసుకొని తాగొచ్చు. దీంట్లో మిరియాలు, కొత్తిమీర, ధనియాలు వేసుకుంటే ఆరోగ్యం , రుచి రెండూ సొంతన్ చేసుకొవచ్చు. సూప్ తాగలేము అనుకుంటే హాయిగా కూర వండుకొని తినొచ్చు.
3.) గ్రీన్ టీ ,బ్లాక్ టీ -
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఈ పాలీఫినాల్స్ , వైరస్ లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి. బ్లాక్ టీ లో అల్లం లేదా దాల్చిన చెక్క వేసుకుని తాగితే మరింత ఫలితం ఉంటుంది.
4.) పెరుగు -
తాజా పెరుగు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. అలాగని పులిసింది వాడకూడదు.
5.) బ్రకోలీ -
దీనికి ఫ్లూ ను తగ్గించే గుణం ఉంది. ఇందులో విటమిన్ సి, ఇ ,పుష్కలంగా ఉంటాయి.
6.) శొంఠి -
అల్లాన్ని సున్నపు నీటిలో ఉడికించి ఎండబెట్టి శొంఠి తయారు చేస్తారు. టీ లో వేసుకుని లేద కషాయంగా చేసుకుని తాగొచ్చు. ఆల్లం కంటే శొంఠి తీసుకోవడం మంచిది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది. దగ్గుని నియంత్రిస్తుంది. దగ్గినప్పుడు కఫం బయటకు వెళ్లేలా లేదా ఆరిపోయేలా చేస్తుంది. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను త్రికటుకాలు అంటారు. ఈ మూడింటినీ కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి.
7.) దాల్చిన చెక్క .-
శరీరంలో వైరస్ వృద్ధిని నియంత్రిస్తుంది. విరేచనాలు అవ్వకుండా చూస్తుంది. టీలో చేసుకుని తాగితే మంచిది జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
8.) పసుపు -
వేడిపాలల్లో పసుపు వేసుకుని రాత్రి పడుకునేముందు తాగితే తెల్లారేసరికి ఫలితం కనిపిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Sunday, 16 May 2021
వాము వాసన పీలిస్తే ముక్కు దిబ్బడ ( NASAL CONGESTION )వదిలేస్తుంది.
వాముని కొద్దిగా తీసుకుని మెత్తగా దంచి పలుచటి గుడ్డలో ఒంటి పొర మీద మూటగట్టి గట్టిగా వాసన పీల్చండి. పదే పదే ఇలా పీలుస్తుంటే తుమ్ములు, ముక్కు దిబ్బడ వేయడం, జలుబు భారం తగ్గుతాయి. తలనొప్పి నెమ్మదిస్తుంది. ఇన్ హేలర్ల వాడకం మంచిది కాదు, అతిగా వాడితే నెత్తురు కారడం ముక్కు లోపలి పొరల్లో ఇరిటేషన్ రావడం జరుగుతోంది.
హారతికర్పూరాన్ని కూడా ఇదే విధంగా వాసన చూడవచ్చు, కానీ ఇదికూడా వాములాగా సౌమ్యంగా పనిచేయదు, అతిగా పీలిస్తే ఇరిటేషన్ కలిగిస్తుంది. వాము పొడితో వాసన పీల్చడం సున్నితంగా ఉంటుంది.
చిక్కిపోతున్నవారికి ఆయుర్వేద చికిత్స
చిక్కిపోవడానికి శరీరంలోపల ఏదైనా వ్యాధు కారణంగా ఉందేమో ముందుగా పరీక్ష చేయించాలి. ఈ కింది ఉపాయాలు పాటించాలి.
1.ఆకలి బాగా పెరిగేందుకు ఆల్లం, శొంఠి లాంటివాతిని వాడుతుండాలి.
2.రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంతో సహా తోడుపెట్టి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే చిక్కిపొతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ఢనియాలు, జిలుకర, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఈ తోడు అన్నంలో నంజుకొంటూ తింటే తేలికగ అరుగుతుంది. ఇంకా బాగ ఉపయోగపడ్తుంది.
3.పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి, వీటిని దంచిన పొడిని చెంచా మోతాదులో తీసుకొని పాలలోవేసి పంచదార కలిపి తాగాలి.
4.బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, దూలగొండి విత్తులు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, శుగంధి పల లోపల పుల్ల తీసేసిన బెరడు వీటిని సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి , చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. చెంచా పొడిని పాలలో కలిపి తాగిస్తే చిక్కిపోతున్నవారు శక్తిమంతులౌతారు. రోజూ రెండు పూటలా తాగించండి.
5.శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకొంటుంటే వివిధ దోషాలు తగ్గి రక్త పుష్టి కలుగుతుంది. రోగి బలసంపన్నుడౌతాడు.
6. ముఖం ఎండుకుని పోయినట్లు ,పిక్కు పోయినట్లు ఉంటుందా నలుగురు మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏంటోయ్ ఇలా ఎండి పోతున్నావ్ అని పలకరిస్తున్నా రా, బాగా ఎండిన దాల్చిన చెక్కని మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరుచు కోండి .గుమ్మపాలు దొరికితే మంచిది లేకపోతే మామూలు పాలు పచ్చివి గాని కాచినది గాని తీసుకొని ,ఒక గ్లాసు పాలలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని కలిపి పంచదార వేసుకొని రోజు ఉదయం పూట తాగండి, ఉత్సాహం వస్తుంది. ఒంట్లో వాతము ,వేడి తగ్గుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది .జీర్ణశక్తిని పెంచుతుంది .శరీరం కండపట్టి పుష్టిగా ఉంటుంది. అసలైన విషయం, శుక్రా న్ని వృద్ధి చేసి లైంగిక శక్తిని పెంపొందింప చేసే అద్భుతమైన ద్రవ్యాలలో దాల్చిన చెక్క కూడా ఒకటి..
Saturday, 15 May 2021
ఊపిరితిత్తుల్లో శ్లేష్మం తొలగించుట (SPUTUM EXPECTORATION ) - ఆయుర్వేద చికిత్స
ఊపిరితిత్తుల్లో శ్లేష్మం - ఆయుర్వేద చికిత్స
1.ఆవాలు,ఆవ నూనె, వాము, ఇంగువ, లేత శనగలు, ఉత్తరేణి, శొంఠి, ఉలవలు, ఖర్జూరాలు, వేప జిగురు, కరివేపాకు, కలబంద, రావి చిగుర్లు, ముల్లంగి, మెంతులు, కుక్కపొగాకు, మారేడు ఆకులు, బూడిద గుమ్మడి కాయ, జాజి కాయ, జాపత్రి, జిలకర, తుంగముస్తలు, చేమంతి పూలు, తులసి, తెల్ల ంఅద్ది చెట్టు బెరడు,పుదీనా, పసుపు ఇవన్నీ ఊపిరి తిత్తుల్ని బలసంపన్నం చేసుకునేందుకు ఎవరికి వారు కఫ వ్యాధుల్లో వాడుకోదగిన మూలికలు. ఆఅయుర్వేద వైద్యుని సంప్రదించి వాడుకుంటే మంచిది.
2.కఫాన్ని బయటకు వెళ్ళగొట్టడంలో అపామార్గ క్షారం అనే మందు అద్భుతంగా పని చేస్తుంది. అతితక్కువ మోతాదులో 500మిగ్రా వరకు తేనెతో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. ఇది దగ్గు, జలుబు, వాపులు, జలోదరం, కఫం ఇతర శ్లేష్మ వ్యాధుల్లో బాగా పని చేస్తుంది. శ్లేష్మాన్ని బయటకు వెళ్ళగొట్టడమే దీని ముఖ్యమైన విధి.
3.తాళిసాది చూర్ణం పొడిని తేనెతో కలిపి పావు చెంచా మోతాదులో తీసుకుంటే కఫం త్వరగా తగ్గుతుంది. ఖళ్ళె తెగకపోవడం వలన వచ్చే ఎడతెగని దగ్గు ఆగుతుంది. నొప్పిలో ఉపశమనం కంపిస్తుంది.
4.శ్వాసానంద వంటి మాత్రలు పూటకు 1 చొప్పున రెండు లేక మూడు సార్లు తాళిసాది చూర్ణం తో గాని, వాసారిష్టతో గాని తీసుకొంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో వ్యాధులు త్వరగా తగ్గుతాయి.
5.శృంగ భస్మ, ప్రవాళ భస్మ, తాళక భస్మ, తామ్ర భస్మ, రస భస్మ ఇవన్నీ తగిన మోతాదులో కలిపి అనుపానంగా తాళిసాది చూర్ణం తీసుకుంటూ ఉంటర్ త్వరగ న్యుమోనియా కూడా తగ్గుతుంది, కఫం ఆగుతుంది.
6.వాసా కంటకారి లేహ్యం 1 చెంచా మోతాదులో తీసుకొంటూ వాసారిష్ట గాని, కనకావసం గానెర్ నాలుగైదు చెంచాల ఔషధాన్ని నీళ్ళతో కలిపి తాగుతే ఈ వ్యాధు లక్షణాల్లో మంచి ఫలితం కంపిస్తుంది.
7.విజయ భైరవి, రసేంద్రవటి అనే రెండు ఔషధాలు ఈ కఫ వ్యాధులు , క్షయ, న్యుమోనియా లలో అద్భుతమైన ఫలితాలిస్తున్నాయి. ఈ రెండు ఔషధాలతో ఊపిరితిత్తుల్లో కలిగే చాలా వ్యాధుల్ని , దీర్ఘ వ్యాధుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు.