Wednesday, 9 December 2020

శొంఠి / SHONTI -AYURVEDIC USES

 

శుద్ధమయిన అల్లాన్ని పాలతో ఉడికించి ఎండబెట్టినట్లయితే శొంఠి తయారవుతుంది.

ఎండిన పిమ్మట అల్లంలోని గుణాలు విచిత్రంగా మారిపోతాయి.

అల్లానికి, శొంఠికి గల తేడా, వేడి చేయుటములో ఉన్నది. శొంఠి రుచి కరమయినది.

అజీర్తి దోషాలను నిర్మూలిస్తుంది. ఆహారాన్ని శరీరానికి వంటబట్టేటట్లు చేస్తుంది. కఫాన్ని

నిలుపుదల చేస్తుంది. కంఠాన్ని శుద్ధి చేసి శ్రావ్య పరుస్తుంది. వాంతులను అరికడుతుంది.

ఆయాసం, ఉబ్బసం వ్యాధులలో అల్లం కన్నా శొంఠి శ్రేష్టమయినది. కడుపునొప్పి,

దగ్గు, ఆయాసం, గుండె జబ్బుకు శొంఠి పథ్యం.

బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివరు సంబంధిత వ్యాధులు, వాత

రోగముల కన్నింటికి శాంఠిని వాడవచ్చు.

నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే విరేచనంలో నీటి శాతాన్ని

తగ్గిస్తుంది. అందువలన శోష రాకుండా నివారించవచ్చు. కడుపులో మంటను ప్రజ్వనిల్వ

జేసి, విరేచనాలకు కారణమయిన దోషాలను ఎదుర్కుంటుంది.

ప్రేగుల లోపలి పొరను మ్యూకస్ పొర అని పిలుస్తారు. జిగట విరేచనాలలో ఈ

మ్యూకన్ పొర బయటకు వచ్చేస్తుంది. దాన్నే జిగురు పడటం అంటారు. అమీబియాసిన్

అనే జిగట విరేచనాలు తరచుగా అయ్యేటప్పుడు శొంఠిని క్రమం తప్పక ఉపయోగిస్తుంటే

అది మ్యూకస్ పొరను సంరక్షించి, ప్రేగును శిధిలం గాకుండా కాపాడుతుంది.

వాము, కరక్కాయ, శొంఠి ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం

తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. అదే విధంగా ఆముదం పప్పు, శొంఠి,

పంచదార వీటిని సమపాళ్ళలో కలిపి తీసుకున్నా, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

వస 5 భాగాలు, శొంఠి, నల్ల జీలకర్ర, రెండేసి భాగాలు కలిపి బాగా నూరి మెత్తగా

పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు

కూడా ఉపశమనం కలుగుతుంది.

No comments:

Post a Comment