1.ఒక గ్లాసెడు నీటిలో రెండు నిమ్మకాయల రసం పిండి తగినంత పంచదార వేసుకొని రోజూ రాత్రిపూట 4 రోజుల పాటు తాగితే జలుబు తగ్గుతుంది.
2.మిరియాల చారు వుదయం , రాత్రి తాగితే తీవ్రమైన జలుబు కూడా తగ్గుతుంది.
3.అల్లం టీ , తులసి ఆకుల డికాక్షన్ ( 3 సార్లు రోజుకి ) కూడా
జలుబుని తగ్గిస్తాయి.
4.1 కప్పు నీటిలో అర చెంచా మిరియాల పొడి,1 చెంచా బెల్లం పొడి కలిపి మరిగించి కొద్దిగా వేడిగా వుండగానే సేవించాలి.
5.1 గ్లాస్ నీటిలో 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి ఆ నీటిని తాగాలి .
6.1 గ్లాస్ వేడి పాలలో చిటికెడు నాణ్యమైన పసుపు వేసుకొని రోజుకు 2, 3 సార్లు తాగండి.
7.కూరగాయలతో సూప్ చేసుకుని ,మిరియాలు,వుప్పు కలిపి రోజుకి 2 సార్లు సేవించండి.
8.ముక్కు దిబ్బడ వున్నట్లైతే 100 గ్రాముల బెండకాయ ముక్కలను , అర లీటరు నీతిలో బాగ మరగనిచ్చి ఆ ఆవిరిని పీల్చండి.
9.పసుపు కొమ్ముని కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
10.పావు చెంచా దాల్చిన చెక్క పొడిని , అర గ్లాస్ నీటిలో వేసి వుడికించి,కొంచెం మిరియాల పొడి, చెంచా తేనె వేసి రోజుకి 2,3 సార్లు తాగండి.11.యూకలిప్టస్ ఆయిల్ ని నుదు , చాతి, వీపు ,ముక్కు పై రుద్దుకొని , దుప్పటి కప్పుకొని నిద్రించండి.
12.2 కప్పుల గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నిమ్మరసం , తేనె కలిపి రోజుకి 2,3 సార్లు సేవించండి.
13.1 స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి వేసి రోజుకి 4,5 సార్లు తీసుకోండి.
14.మాంసాహారులైతే చికెన్ సూప్ తాగితే జలుబు సులభంగా తగ్గుతుంది.
15.జలుబుతో దగ్గు కూడా వేధిస్తుంటే ద్రాక్షరసంలో స్పూన్ తేనె వేసుకొని తాగండి.16. నిమ్మకాయ బద్ద పై మిరియాల పొడి, ఉప్పు చల్లి చప్పరిస్తుంటే దగ్గు తగ్గుతుంది.
17.రొజూ రెండు పూటలా ద్రాక్ష పండ్లు తిన్నా దగ్గు తగ్గుతుంది.
18.1 స్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి, చితికెడు శొంఠి పొడి కలిపి రోజుకి 4, 5 సార్లు తీసుకున్న దగ్గు తగ్గుతుంది.
19.పాల కూరను రసంగా చేసి వేడి చేసి తీసుకుంటే దగ్గు, గొంతులో గరగర తగ్గుతుంది.
20.పాలలో 6 తులసాకులు, చెంచా సోంపు వేసి మరిగించి రోజుకి 2 సార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
21.బాదం పప్పు నాన బెత్టి తోలు తీసి ,చక్కెర , వెన్న కలిపి పేస్ట్ లాగా చేసి ఒక వారం రోజులు తీసుంటే దగ్గు తగ్గుతుంది.
22.క్యారెట్ జ్యూస్ ని వేడి చేసి గోరు వెచ్చగా తాగాలి.
23.తులసి ఆకులు , 2 మిరియాలు నొట్లో వేసుకొని నములుతూ రసం పీల్చేయాలి.
24.2 గ్లాసుల నీటిలో 4 వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా మరిగించి , రెబ్బలను తీసివేసి ఆ నీటిని తాగాలి.
25.దాల్చిన చెక్కను పాలలో వేసి మరిగించి తాగాలి.
26.నీటిలో ఉప్పు వేసి మరిగించి 1 స్పూన్ నీరుల్లి రసం, 1 స్పూన్ తేనె కలిపి రోజుకి 2 సార్లు తాగండి.
27.సోంపు తో టీ పెట్టుకుని తాగండి.
No comments:
Post a Comment