AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
Monday, 31 March 2014
Sunday, 30 March 2014
Friday, 28 March 2014
Thursday, 20 March 2014
Wednesday, 19 March 2014
Monday, 17 March 2014
Friday, 14 March 2014
Sunday, 9 March 2014
Wednesday, 5 March 2014
Tuesday, 4 March 2014
Monday, 3 March 2014
గచ్చ కాయ / GACHA KAYA / NICKERNUTS / CAESALPINIA BONDUC / LATHA KARANJ / KAT KARANJ - ఆయుర్వేద ఉపయోగాలు / AYURVEDA UPAYOGALU
గచ్చకాయ చెట్టు భారతదేశమంతటా వ్యాపించి ఉంది.దీని గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాయవచ్చు.చిన్నప్పుడు పిల్లలు గచ్చకాయలతో ఆడుకునే వారు.రాయి మీద ఇలా రాసి పెడితే చుర్రుమని మంటపెడుతుంది.అదే గచ్చకాయ ఆకు ప్రారంభ దశలో ఉన్న వరి బీజానికి అమోఘంగా పని చేస్తుంది.ఆకును ఆముదంలో వేయించి వృషణాలకు కడితే చాలు మూడు పూటల్లో వ్యాధి తగ్గుతుంది.
బంజరు భూములు ,తీరప్రాంతాలు,ఆకులు రాలే చెట్లున్న అడవులలో కూడా ఏదో ఒక చెట్టును పట్టుకుని గచ్చమొక్క పాకుతుంది.ఇది పైకి పాకుడు మొక్క.గట్టి ముళ్ళు,కొక్కేలు కలిగి ఏదొ ఒక చెట్టును ,ఆధారాన్ని ఆలంబనగా చేసుకుని విస్తరిస్తుంది.సిసాల్పినేసి కుటుంబానికి చెందిన దీని శాస్త్రీయనామం సిసాల్పినియా బొండక్, సన్స్కృతంలో లతా కరంజ్ ,కంటకి కరంజ్, హిందిలో కట్ కరంజ్ అని అంటారు.
గచ్చకాయ గింజల్లో పసుపు పచ్చని చిక్కని ద్రవం ఉంటుంది.ఇది కాకుండా , సిసాల్పిన్,అయోడిన్ , సాపోవిన్,నాన్ గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి.
గచ్చకాయ కఫాన్ని,వాతాన్ని అణచివేస్తుంది.పిత్తాన్ని పెంచుతుంది.రక్త దోషాలను, వాపులను తొలగిస్తుంది.జీర్ణశక్తిని పెంచుతుంది.గింజలు ఉష్ణతత్వం గలవి.చేదుగా ఉంటాయి.రక్త వృద్ధికి తోడ్పడతాయి.మెదడుకు , కళ్ళకు,చర్మకాంతికి గచ్చకాయ వినియోగం మంచిది.దీని గింజల తైలం వాడడం వల్ల గౌట్,కంటి,చర్మ వ్యాధులు తగ్గుతాయి.దగ్గు,పైల్స్,వాతం,కడుపులో పురుగులు,వాపులు పోవడానికి గచ్చ ఆకులు వాడటం మంచిది.కాయలకు,పైల్స్ ను ,మూత్రసమస్యలను నయం చేసే శక్తి ఉంది.
1. బట్టతలపై జుట్టు రావడానికి - గచ్చకాయ తైలాన్ని తల మాడుకు రాసుకోవాలి.లేదా గచ్చమొక్క పూలు 6 నుంచి 12 గ్రాములు మెత్తగా నూరి దాన్ని తలకు పట్టించాలి.ఇలా కొంతకాలం చేస్తే బట్టతలపై జుట్టూ రాబట్టవచ్చు.
2. మైగ్రేన్ , తలనొప్పి తగ్గడానికి -
ఎ.) 1, 2 గచ్చకాయ గింజలు , దానికి సమంగా ములక్కాయ గింజలు,దాల్చిని,చక్కెర కలిపి మెత్తగా పొడి చేసి నస్యం మాదిరిగా ముక్కుతో పీల్చాలి.దీనివల్ల ఎక్కువగా తుమ్ములు వచ్చి లోపలి నుంచి శ్లేష్మం వచ్చి తలనొప్పి తగ్గిపోతుంది.
బి.) గచ్చకాయ గింజలను నీటితో తడిపి మెత్తగా నూరి దానికి కాస్త బెల్లం కలపాలి.దీన్ని కాస్త వెచ్చచేసి ముక్కురంధ్రంలో వేయాలి.తలనొప్పి కుడివైపున ఉంటే ఎడమ రంధ్రం లో, ఎడమవైపు ఉంటే కుడి రంధ్రం లో వేయాలి.ఒక రంధ్రంలో మందు వేస్తే రెండు గంటల తర్వాత ఇంకో రంధ్రంలో వేయాలి.ఇలా కొన్ని రోజులు చేస్తే తలనొప్పి, మైగ్రేన్ అన్నీ నయమౌతాయి.
3. మూర్చ వ్యాధి తగ్గడానికి - గచ్చ ఆకుల రసం 10 - 12 గ్రాములు రోజూ మూడు పూటలా కొంతకాలం తాగాలి.
4. కంటి జబ్బులు తగ్గడానికి - కళ్ళు ఎర్రబడటం,కళ్ళ చివర వెంట్రుకలు లేకపోవడం జరిగితే గచ్చకాయల గింజలు 1,2 గ్రాములు,తులసి ,మల్లెమొగ్గలు సమంగా తీసుకుని వాటిని కలిపి మెత్తగా నూరి దానికి 8 రెట్లు నీరు కలిపి మరిగించాలి.నీరు మూడు వంతులు ఆవిరి కాగానే దాన్ని వడగట్టి మళ్ళీ మరిగించాలి.ద్రవం చిక్కబడగానే కాటుకలా తయారవుతుంది.దాన్ని కళ్ళకు రాస్తుండాలి.
5. దంత రోగాలు తగ్గడానికి - పయోరియా ఉంటే గచ్చమొక్క పుల్లతో పళ్ళు తోముకోవాలి.పళ్ళ చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటే 7 గ్రాముల గచ్చ గింజల పప్పుకు 7 గ్రాముల చక్కెర కలిపి తినాలి.దీనివల్ల రక్తం కారడం ఆగిపోతుంది.
6 . దగ్గు తగ్గడానికి -
ఎ.) 15 మి.గ్రా - 750 మి.గ్రా గచ్చకాయల పొడి ,125 మి.గ్రా వేయించిన బోరాక్స్ పొడి తేనెతో కలిపి తినాలి.ఇలా రోజుకు మూడు,నాలుగు సార్లు తీసుకోవాలి.చిన్నపిల్లలకు గచ్చకాయలను దండగా గుచ్చి మెడలో వేయాలి.ఇలా చేస్తే దగ్గు నాలుగైదు రోజులలో నయమౌతుంది.
బి. ) 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,250 - 500 మి.గ్రా . మిరియాల పొడి కలిపి రోజూ మూడు పూటలా తాగాలి.ఇలా నాలుగు రోజులు చేస్తే దగ్గు నుంచి విముక్తి లభిస్తుంది.
7 . కోరింత దగ్గు తగ్గడానికి - మెడలో గచ్చకాయ మొక్క పూల దండను వేయాలి.లేదా గచ్చకాయ గింజలను 1 - 2 గ్రాములు మెత్తగా నూరి నీటిలో వేసి మరిగించాలి.తయారైన కషాయాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.
8.. ఆకలి లేమి తగ్గడానికి - 10 - 12 గ్రాముల గచ్చ ఆకుల రసం ,అంతే పరిమాణంలో చిత్రమూలం ఆకుల రసం కలిపి దానికి కాస్త మిరియాల పొడి,ఉప్పు కలిపి తాగాలి.ఆకలి లేమి,పొట్టలో గ్యాస్,డయేరియా తగ్గిపోతాయి.అజీర్ణం సమస్య తగ్గుతుంది.
9. పొట్టలో నులి పురుగులు పోవడానికి - కడుపులో పేగులలో పురుగులు నశించడానికి గచ్చ కాయల తైలం 10 - 15 గ్రాముల వరకు 3 రోజులు తాగాలి.
10 - 12 గ్రాముల గచ్చమొక్క ఆకుల రసానికి 125 మి.గ్రా వాయువిడంగాల చూర్ణాన్ని ,కొద్దిగా మిరియాల పొడిని కలిపి రోజూ 2 పూటలా భోజనం తర్వాత తీసుకోవాలి.ఇలా వారం రోజులు తీసుకుంటే ప్రేవులలో పురుగులు నశిస్తాయి.
10. గ్యాస్ వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గడానికి - గచ్చ ఆకులను ఏదైనా యవాగులో మరిగించి అవసరమైన మోతాదులో సేవించాలి.నొప్పి తగ్గి జీర్ణ శక్తి పెరుగుతుంది.
11. ఉదరవ్యాధులు తగ్గడానికి - అధికంగా మలబద్ధకం ఉంటే 1 - 3 గ్రాముల గచ్చ ఆకులను నేతిలో లేదా నువ్వుల నూనెలో వేయించి దాన్ని సత్తుపిండి / బార్లీ తో కలిపి సేవించాలి.దీనివల్ల పొట్ట ఉబ్బరం కూడా తగ్గుతుంది.
12. పైల్స్ తగ్గడానికి - గచ్చ ఆకులను మెత్తగా నూరి పైల్స్ గడ్డలపై పూయాలి.గచ్చ ఆకులు 1 - 3 గ్రాములు మెత్తగా నూరి పైల్స్ తగ్గే వరకు నీటితో కలిపి సేవించాలి.
గచ్చకాయ మొక్క వేరు పొడి 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు తీసుకుని,దానికి సమంగా చిత్రమూలం పొడి ,సైంధవ లవణం ,కొడిశపాల బెరడు పొడి కలిపి ఈ మిశ్రమం 1 - 3 గ్రాములు రోజూ 2 పూటలా తగ్గేవరకు సేవించాలి.
13. మధుమేహం తగ్గడానికి - గచ్చకాయ మొక్క పూల రసం / చూర్ణం సేవించవచ్చు.దీనివల్ల మూత్ర సమస్యలు కూడా నయమౌతాయి.
14. వాంతులు తగ్గడానికి - వాంతులు , దగ్గు వస్తుంటే గచ్చకాయల గింజల చూర్ణం 2 - 3 గ్రాములు,చక్కెర , తేనె కలిపి రోజూ 2 పూటలా తీసుకోవాలి.
వాంతులు ఆగిపోవడానికి గచ్చకాయల గింజలను వేయించి వాటికి కాస్త చక్కెర కలిపి మెత్తగా నూరి చిన్న మాత్రలుగా చేయాలి.ప్రతీ 10 నిమిషాలకు ఒక మాత్రను మింగాలి.వాంతులు ఆగిపోతాయి.ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 - 2 ముక్కలను ప్రతి పావుగంటకు తినాలి.
15. సిఫిలిస్ / సుఖవ్యాధి తగ్గడానికి - గచ్చకాయ మొక్క వేరు రసం 1 - 3 గ్రాములు తీసి దానికి కొబ్బరి నీరు , నిమ్మ రసం కలిపి రోజూ 2 పూటలా తాగాలి.మూత్రంలో మంట , చీము కారడం తగ్గుతుంది.
16. కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి - గచ్చకాయల గింజల పొడి 1 గ్రాము,3 గ్రాముల తేనె కలిపి మొదటి రోజు తాగాలి.మరునాడు 2 గ్రాముల గచ్చకాయల గింజల పొడి ,తేనె తీసుకోవాలి.ఇలా రోజూ 1 గ్రాము పొడి పరిమాణం పెంచుకుని తినాలి.తర్వాత రోజు 1 గ్రాము పొడి తగ్గించి తినాలి.దీనినే వర్ధమాన యోగం అంటారు.చివరగా 3 గ్రాముల పొడి,తేనె తీసుకోవాలి.దీనితో కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి.
17.రక్తం కారే పైల్స్ తగ్గడానికి - గచ్చకాయ మొక్క వేరు బెరడు 2 గ్రాములు , గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి తీసుకోవాలి.3 రోజులపాటు కేవలం మజ్జిగ మాత్రం తాగాలి.ఇంకే ఆహారం తీసుకోరాదు.రక్త పైల్స్ తగ్గిపోతాయి.
18. ఫిస్టులా తగ్గడానికి - 500 మి.గ్రా నుంచి 2 గ్రాముల వరకు గచ్చకాయ మొక్క వేరు రసానికి ఆకు జెముడు రసం కలిపి దాన్ని ఫిస్టులా ఉన్న చోట ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాలి.ఇలా తగ్గే దాకా చేయాలి.
19. ఫిస్టులా అల్సర్లలో ఇంఫెక్షన్ వచ్చి ఉంటే గచ్చ ఆకులను నీటిలో ఉడికించి వాటిని ఫిస్టులా ఉన్నచోట ఉంచి కట్టు కట్టాలి.లేదా గచ్చాకుల రసం,వేపాకుల రసం కలిపి దానిలో దూది ముంచి ఫిస్టులా పై రాస్తుందాలి.
గచ్చ మొక్క ఆకులను , నిర్గుండి లేదా వేప ఆకులతో కలిపి మెత్తగా నూరి దాన్ని ఫిస్టులా వచ్చిన చోట ఉంచి కట్టు కట్టాలి.లేదా ఈ ఆకులకు గంజి కలిపి మెత్తగా చిక్కగా నూరి ఫిస్టులా పై రాయాలి.
20 . చర్మ వ్యాధులు తగ్గడానికి - 10 - 12 గ్రాముల చిత్రమూలం,మిరియాలు,సైంధవ లవణం కలిపి చూర్ణం చేసి దానికి రెట్టింపు పెరుగు కలిపి దాన్ని రోజూ 3 , 4 సార్లు తాగాలి.ఇలా 3,4 నెలల వరకు చికిత్స జరగాలి.దీని వల్ల అన్ని రకాల చర్మ వ్యాధులు,ఇన్ ఫెక్షన్స్ తగ్గిపోతాయి.
1 - 2 గ్రాముల గచ్చ కాయల ఫలాలను లేదా వాటి గింజలను తీసుకుని 1 - 2 గ్రాముల కొడిశపాల గింజలతో కలిపి మెత్తగా నూరి దాని చర్మవ్యాధి ఉన్నచోట రాయాలి.
గచ్చ కాయ మొక్క ఆకులు,వేపాకులు,ఖదిర ఆకులు కలిపి మెత్తగా నూరి చర్మ వ్యాధిపై రాయాలి.ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయం తో స్నానం చేయాలి.ఇలా కొంత కాలం చేస్తే చర్మవ్యాధులు నయమౌతాయి.
1 - 2 గ్రాముల గచ్చకాయ గింజలు ,కాస్త పసుపు,కరక్కాయ,ఆవాలు,కలిపి మెత్తగా నూరి వంటికి రాసుకోవాలి.ఇలా 10 రోజులపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
గచ్చకాయల గింజలను తెల్ల గన్నేరు వేరుతో కలిపి మెత్తగా నూరి వంటికి పూసుకోవాలి.
10 - 20 మి.లీ గచ్చ ఆకుల రసం ,వాటి కషాయంతో చర్మవ్యాధి ఉన్నచోట పూసి కడగాలి.గచ్చకాయల తైలంలో నిమ్మ రసం ,గంధకం కలిపి చర్మవ్యాధి ఉన్నచోట పూయాలి.దీనివల్ల గడ్డలు,కురుపులు,ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు నయమౌతాయి.
గచ్చకాయల తైలంలో నిమ్మ రసం కలిపి ,అది పసుపు రంగులోకి మారగానే చర్మంపై పూయాలి.
4 గ్రాముల యషధ భస్మం,25 గ్రాముల గచ్చగింజల తైలంలో కలిపి చర్మంపై రాయాలి.దీనిని పుండ్లపై,అల్సర్లపైనా రాయవచ్చు.
కాకనాక అనే చర్మవ్యాధి నయం కావడానికి చిత్రమూలం చూర్ణం,సైంధవ లవణం,గచ్చకాయల గింజల తైలంలో కలిపి చర్మంపై రాయాలి.
గచ్చకాయల ఫలాలను మెత్తగా నూరి 1 - 2 గ్రాముల మేర తినడం కూడా మంచిది.దీనివల్ల కూడా చర్మ వ్యాధులు నయమౌతాయి.
21 .గాయాలు తగ్గడానికి - గాయాలను గచ్చకాయల మొక్క వేరు రసంతో కడగాలి.
సమపాళ్ళలో కానుగ ఆకులు , కాడ జెముడు ,రేల ఆకులు ,మల్లెను తీసుకుని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి అల్సర్లు,పుండ్లు,పైల్స్ గడ్డలపైనా పూయాలి.త్వరగా నయమౌతాయి.
22 . అల్సర్ల వల్ల వాపులు వస్తే గచ్చకాయ మొక్క ఆకులు 1 - 3 గ్రాములు ,అంతే పరిమాణంలో వావిలి ఆకులు కలిపి మెత్తగా నూరి అల్సర్లపై ఉంచి కట్టు కట్టాలి.
23 . బొబ్బలు తగ్గడానికి గచ్చకాయల గింజలు,నువ్వులు ,ఆవాలు కలిపి మెత్తగా నూరి వాటిపై పూయాలి.
24 . కీళ్ళనొప్పులు తగ్గడానికి - సమపాళ్ళలో గచ్చ కాయ గింజలు ,ఉప్పు,అల్లం,ఇంగువ కలిపి మెత్తగా చూర్ణం చేయాలి.దానిని 500 మి.గ్రా నుంచి 1 గ్రాము వరకు చల్లని నీటితో కలిపి తాగాలి.
గచ్చకాయ గింజలను 125 మి.గ్రా తామ్రభస్మంతో కలిపి నూరి ఆవగింజలవలె చిన్న మాత్రలు చేసి వాటిని రోజుకి ఒక మాత్ర చొప్పున మింగాలి.లేదా 10 - 20 గ్రాముల గచ్చకాయ మొక్క ఆకులను నువ్వుల నూనెలో వేయించి తినాలి.
25 . జ్వరం తగ్గడానికి - గచ్చ కాయ గింజలను నీటితో కలిపి నూరి ఆ నీటిని పొట్టపై చుక్కలు చుక్కలుగా వేసి పూయాలి.లేదా ఈ మొక్క మొగ్గలు 3 , 2 మిరియాలు కలిపి మెత్తగా నూరి పొట్టపై పూయాలి.జ్వరం తగ్గుతుంది.
గచ్చకాయ గింజలు అన్న చోట గింజలోపలి పప్పును తీసుకోవాలి.
Subscribe to:
Posts (Atom)